Congress manifesto : ‘కుల గణన, పేదరికం, ఎంఎస్​పీ'- కాంగ్రెస్​ మేనిఫెస్టో ఇదే..-congress releases manifesto for 2024 lok sabha elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Congress Manifesto : ‘కుల గణన, పేదరికం, ఎంఎస్​పీ'- కాంగ్రెస్​ మేనిఫెస్టో ఇదే..

Congress manifesto : ‘కుల గణన, పేదరికం, ఎంఎస్​పీ'- కాంగ్రెస్​ మేనిఫెస్టో ఇదే..

Sharath Chitturi HT Telugu
Apr 05, 2024 01:00 PM IST

Congress manifesto : ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్​. కుల గణనతో పాటు కీలక హామీలను ఇచ్చింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

కాంగ్రెస్​ మేనిఫెస్టోను విడుదల చేసిన పార్టీ సీనియర్​ నేతలు..
కాంగ్రెస్​ మేనిఫెస్టోను విడుదల చేసిన పార్టీ సీనియర్​ నేతలు..

Congress manifesto for 2024 Lok Sabha elections : 2024 లోక్​సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్​డీఏని గద్దె దించడమే లక్ష్యంగా పోరాటం చేస్తోంది కాంగ్రెస్​ పార్టీ. తాజా.. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్​. ఉగ్యోగాలు, మౌలికల వసతుల అభివృద్ధి, జాతీయస్థాయిలో కుల గణన వంటి అంశాలపై ప్రధానంగా ఫోకస్​ చేసినట్టు కనిపిస్తోంది.

దిల్లీలో జరిగిన ఈవెంట్​లో కాంగ్రెస్​ మేనిఫెస్టోను విడుదల చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. ఈ వెంట్​లో సీనియర్​ నేతలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ, పీ చిదంబరం పాల్గొన్నారు.

"ఈ మేనిఫెస్టో.. దేశ చరిత్రలో న్యాయానికి ఒక డాక్యుమెంట్​గా ఉంటుంది. భారత్​ జోడా యాత్రకు చెందిన 5 స్తంభాలైన యువ (యువత), కిసాన్ (రైతు)​, నారీ (మహిళ), శ్రామిక్ (కార్మికులు)​, హిస్సేదారీ (ఈక్విటీ)ల స్ఫూర్తితో ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించాము," అని మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్​ మేనిఫెస్టోలోని కీలక అంశాలు..

Congress manifesto highlights : కుల గణన:- మేనిఫెస్టోలో ఉన్న ముఖ్యమైన హామీల్లో ప్రధానమైనది ఈ కుల గణన. ఈ వ్యవహారంపై గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. బిహార్​ ప్రభుత్వం కుల గణను అమలు కూడా చేసింది. ఇక ఇప్పుడు.. దేశవ్యాప్తంగా కుల గణనను అమలు చేస్తామని కాంగ్రెస్​ హామీనిచ్చింది. ఎస్​సీ, ఎస్​టీ, ఓబీసీల అభ్యున్నతి కోసం, వారికి 50శాతం కోటా ఇవ్వడం కోసం రాజ్యాంగాన్ని సవరించేందుకు కుల గణన ఉపయోగపడుతుందని కాంగ్రెస్​ చెబుతోంది.

రైతులకు ఎంఎస్​పీ:- దేశంలో ఇప్పుడున్న హాట్​ టాపిక్స్​లో ఎంఎస్​పీ ఒకటి. 2020 నుంచి ఇది దేశ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ప్రస్తుతం దిల్లీకి సమీపంలో ఆందోళన చేస్తున్న రైతుల ప్రధాన డిమాండ్​ అయిన.. 'ఎంఎస్​పీకి న్యాయపరమైన హామీ'ని నెరవేరుస్తామని కాంగ్రెస్​ మేనిఫెస్టో చెబుతోంది. స్వామినాథన్​ కమిషన్​ సిఫార్సుల ప్రకారం ఎంఎస్​పీకి శాశ్వత న్యాయపరమైన హామీ ఇస్తామని కాంగ్రెస్​ స్పష్టం చేసింది.

2024 Lok Sabha elections : పేదరికం:- 23కోట్ల భారతీయుల భవితవ్యాన్ని మార్చి, దేశంలో పేదరికాన్ని తొలగిస్తామని తన మేనిఫెస్టోలో చెప్పింది కాంగ్రెస్​. బీజేపీ కేవలం ధనవంతులను మాత్రమే పట్టించుకుంటుందని, తాము మాత్రం పేదల అభ్యున్నతికి కృషి చేస్తామని కాంగ్రెస్​ సీనియర్​ నేత పీ. చిదంబరం చెప్పారు.

జాతీయ భద్రత, చైనా:- జాతీయ భద్రత విషయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తామని కాంగ్రెస్​ పేర్కొంది. సరిహద్దుపై తీవ్రంగా ఫోకస్​ చేస్తామని, చైనాతో సరిహద్దులో యథాతథ స్థితిని నెలకొల్పుతామని హామీనిచ్చింది.

"గతంలో మన సైనికులు ఎక్కడివరకు పెట్రోలింగ్​ చేశారో.. అక్కడి వరకు మళ్లీ పొందేందుకు కృషి చేస్తాము," అని కాంగ్రెస్​ పేర్కొంది.

2024 లోక్​సభ ఎన్నికలు ఏప్రిల్​ 19న మొదలై.. జూన్​ 1తో ముగుస్తాయి. జూన్​ 4న ఫలితాలు వెలువడతాయి. మరి కాంగ్రెస్​ తీసుకొచ్చిన ఈ మేనిఫెస్టో.. ప్రజలను ఆకర్షించిందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే.. ఫలితాలు వెలువడే జూన్​ 4 వరకు వేచి చూడాల్సిందే.

Whats_app_banner

సంబంధిత కథనం