Karthika deepam september 17th episode: జ్యోత్స్న మీదకు చెయ్యి ఎత్తిన దీప- కాశీని చంపేస్తానని స్వప్నకు శ్రీధర్ వార్నింగ్
Karthika deepam 2 serial today september 17th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శ్రీకాంత్ తోనే పెళ్లి జరుగుతుందని కాదని కాశీని కలిస్తే అతడిని చంపేస్తానని శ్రీధర్ కూతురికి వార్నింగ్ ఇస్తాడు. శుభవార్త చెప్తాడనుకున్న తండ్రి అలా మాట్లాడటంతో స్వప్న గుండె ముక్కలవుతుంది.
Karthika deepam 2 serial today september 17th episode: పారిజాతం అనసూయ దగ్గరకు వెళ్ళి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. శౌర్య అవేమీ పట్టించుకోవద్దని పిచ్చి అని తన నానమ్మకు సైగ చేసి చూపిస్తుంది. అప్పుడే దీప వస్తుంది. కార్తీక్ కి ఎలా ఉంది నన్ను తీసుకురమ్మన్నాడా? అని శౌర్య అడుగుతుంది.
పారిజాతం గాలి తీసేసిన శౌర్య
కార్తీక్ నా సొంత మనవడు నన్నే రావొద్దు అన్నాడు నిన్ను ఎందుకు అడుగుతాడని పారిజాతం అంటుంది. అప్పుడే దీపకు కాంచన ఫోన్ చేసి శౌర్యను తీసుకుని ఇంటికి రా కార్తీక్ చూడాలని ఉందని చెప్పాడని చెప్తుంది. ఎవరు ఫోన్ చేశారని శౌర్య అడుగుతుంది. కార్తీక్ బాబు అమ్మ నిన్ను తీసుకురమ్మని చెప్పిందని చెప్తుంది.
శౌర్య పారిజాతం గాలి తీసేస్తుంది. అనసూయ జరిగిన గొడవ మొత్తం దీపకు చెప్తుంది. ఆవిడ అంతే పట్టించుకోవద్దని సర్ది చెప్తుంది. స్వప్న ఇంటి దగ్గర తండ్రి కోసం ఎదురుచూస్తుంది. కాశీతో తన జీవితం చాలా బాగుంటుందని స్వప్న అంటుంది. కాశీ ఎవరో కాదు మా బాస్ కు రిలేటివ్ వరుసకు బావ అవుతాడని కావేరీకి చెప్తుంది.
కాశీకి శ్రీధర్ వార్నింగ్
నచ్చిన వాడితో పెళ్లి జరగబోతుందని తెగ సంతోషపడుతుంది. అప్పుడే శ్రీధర్ ఇంటికి వస్తాడు. కాశీని కలిశావా వాళ్ళ నాన్నతో మాట్లాడావా? నువ్వు గుడ్ న్యూస్ చెప్తావని నాకు తెలుసు అని స్వప్న ఆత్రంగా అడుగుతుంది. మీ డాడీ నీ గురించి ఆలోచిస్తాడని అంటాడు.
డాడీ పెళ్ళికి ఒప్పుకున్నాడని స్వప్న సంతోషిస్తుంది. కాశీకి ఫోన్ చేయి మాట్లాడాలని అంటాడు. నువ్వు హైదరాబాద్ లో ఉండాలంటే బుద్ధిగా ఉద్యోగం చేసుకో. ప్రేమ, పెళ్లి అని నా కూతురు వెంట పడితే నువ్వు ఇక ఎవరికీ కనిపించవు. నీలాంటి స్థాయి లేని వాడిని అనామకుడిని అల్లుడిగా చేసుకోలేను. ఇక నా కూతురు జోలికి రావొద్దు అని వార్నింగ్ ఇస్తాడు.
కాశీని చంపేస్తా
ఏం జరిగిందని కావేరీ, స్వప్న అడుగుతారు. ముందు అనుకున్నట్టుగా స్వప్న పెళ్లి శ్రీకాంత్ తోనే జరుగుతుంది. ఇక నీ జీవితంలో కాశీ అనే వాడు లేడు. వీలైతే వెంటనే మర్చిపో అని కూతురికి వార్నింగ్ ఇస్తాడు. కాశీ ఎందుకు నచ్చలేదని అడుగుతుంది. కాశీ వాళ్లది చాలా పెద్ద ఫ్యామిలీ.
మా బాస్ కు బావ అవుతాడని చెప్తుంది. సంబంధం వద్దని అనడానికి కారణం ఏంటని కావేరీ కూడా నిలదీస్తుంది. స్వప్న పెళ్లి శ్రీకాంత్ తోనే జరుగుతుందని ఖరాఖండిగా చెప్తాడు. పెళ్లి ఆపడానికి తన దగ్గర వంద కారణాలు ఉన్నాయని స్వప్న అంటుంది. అప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి కాశీ ఉండాలి కదా అని శ్రీధర్ అంటాడు.
గుండెలు పగిలేలా ఏడుస్తున్న స్వప్న
కాశీతో పెళ్లి తప్ప నా కూతురు కోసం ఏమైనా చేస్తానని చెప్తాడు. నువ్వు గడప దాటి బయటకు వెళ్తే వాడిని జీవితంలో కనిపించకుండా చేస్తానని హెచ్చరిస్తాడు. తండ్రి మాటలకు స్వప్న గుండె ముక్కలవుతుంది. కూతురు ఫోన్ కూడా తీసేసుకుంటాడు. నువ్వు నా మాట కాదని ఇల్లు దాటి వెళ్తే వాడు ఉండదు, నేను ఉండనని గట్టిగా చెప్తాడు.
స్వప్న ఫోన్ చేయలేదు ఏంటని కార్తీక్ ఎదురుచూస్తూ ఉంటాడు. జ్యోత్స్న ఖాళీగా కూర్చుని ఫోన్ చూసుకుంటుంటే కాంచన వచ్చి నైట్ కు ఫుడ్ ఏం ప్రిపేర్ చేస్తున్నావ్ అని అడుగుతుంది. కార్తీక్ నవ్వుతాడు. నీకు ఏం కావాలి చెప్పు అత్త ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తానని అంటుంది.
దీపలా ఉండు జ్యోత్స్న
దీపను రమ్మన్నాను తను వచ్చాక వండుతుందిలే అని కాంచన చెప్పడంతో జ్యోత్స్నకు కోపం వస్తుంది. నాకు వంట రాదని బావ ముందు మాట్లాడటం అవసరమా అని కాంచనను అడుగుతుంది. ఫోన్ చూసుకుంటూ ఉండకపోతే మీ బావతో కబుర్లు చెప్పొచ్చు కదా అని అంటుంది.
శౌర్యను తీసుకుని దీప ఇంటికి వస్తుంది. శౌర్య పరిగెత్తుకుంటూ కార్తీక్ దగ్గరకు వెళ్ళి హగ్ చేసుకుంటుంది. అది చూసి జ్యోత్స్న కోప్పడుతుంది. దీపను చూపించి నువ్వు ఇలా ఉండాలని కాంచన అంటుంది. దీంతో జ్యోత్స్న ఆవేశంగా దీప దగ్గరకు వెళ్ళి మళ్ళీ ఎందుకు వచ్చావని అడుగుతుంది.
జ్యోత్స్న మీదకు చెయ్యి ఎత్తిన దీప
అవకాశం దొరికిందని సేవలు చేసి బావకు దగ్గర అవుదామని అనుకుంటున్నావా? అని నిలదీస్తుంది. ఇలా మాట్లాడటం తప్పని దీప వారిస్తుంది. ఏమి తెలియని నంగనాచిలా నటిస్తున్నావ్ కానీ నువ్వు పెద్ద జానవని నాకు తెలుసు అనేసరికి దీప కోపంగా జ్యోత్స్న అని అరిచి కొట్టేందుకు చెయ్యి ఎత్తుతుంది.
జ్యోత్స్న షాక్ అవుతుంది. నా మీద చెయ్యి ఎత్తుతావా అంటుంది. హద్దు దాటి మాట్లాడితే చెంప పగలగొడతానని దీప వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.