Karthika deepam september 11th episode: కార్తీక్ ని బతికించిన శౌర్య- దీపను ఇంట్లో నుంచి పంపించేయమన్న జ్యోత్స్న
Karthika deepam september 11th:కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ కోమాలోకి వెళ్తున్నాడని డాక్టర్ చెప్పడంతో అందరూ ఏడుస్తారు. మీరు వచ్చి పిలిస్తే స్పృహలోకి వస్తాడేమో పిలవమని సుమిత్ర వాళ్ళకు చెప్తాడు. శౌర్య కార్తీక్ కోసం పరుగున వచ్చి తనని పిలుస్తూ ఉంటుంది.
Karthika deepam 2 serial today september 11th episode: దీప శౌర్యను తీసుకుని హాస్పిటల్ కు వెళ్తుంది. హాస్పిటల్ కి వెళ్తే శౌర్యకు ఏమవుతుందోనని అనసూయ కంగారుపడుతుంది. కార్తీక్ బాబుకు ఏం కాకూడదని దేవుడికి దణ్ణం పెట్టుకుంటుంది. కార్తీక్ స్పృహలోకి రావడం లేదని డాక్టర్ చెప్తాడు. మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి మీ గొంతు వింటే స్పృహలోకి వస్తాడని అంటారు.
కోమాలోకి కార్తీక్
అందరూ కార్తీక్ ని పిలుస్తారు. కాంచన కళ్ళు తెరువు కార్తీక్ అంటూ ఏడుస్తూ పిలుస్తుంది. జ్యోత్స్న కూడా బావ కళ్ళు తెరువు అని అంటుంది. ప్రతి ఒక్కరూ తమ వంతుగా కార్తీక్ ని పిలుస్తూ ఉంటారు. పేషెంట్ కోమాలోకి వెళ్లిపోతున్నాడని డాక్టర్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.
మీరు పిలిచినా ఇక వినిపించదు కోమాలోకి వెళ్లిపోయాడు. ఇక ఇతను స్పృహలోకి వచ్చే ఛాన్స్ లేదని డాక్టర్ చేతులు ఎత్తేస్తాడు. జ్యోత్స్న బయటకు వచ్చి కూర్చుని ఏడుస్తుంది. ఇదంతా నీ చేతులారా నువ్వు చేసుకున్నది. ఒకప్పుడు స్వార్థంతో నేను చేసిన పాపం నీకు శాపం అయ్యింది.
కార్తీక్ కోసం శౌర్య
చాలా కలలు కన్నాను. అవి అన్నీ కలలుగానే మిగిలిపోయాయని పారిజాతం అంటుంది. దీప మీద నాకున్న కోపం ఎంత నిజమో బావ మీద నాకున్న ప్రేమ అంతే నిజం. బావకు ఏదైనా జరిగితే అంతకంటే ముందు నేను చచ్చిపోతానని జ్యోత్స్న ఏడుస్తుంది. ఏదో ఒక అద్భుతం జరిగి కార్తీక్ బతుకుతాడని అనుకుంటారు.
అప్పుడే శౌర్య పరిగెత్తుకుంటూ కార్తీక్ దగ్గరకు వస్తుంది. ఏడుస్తూ కార్తీక్ కార్తీక్ అని పిలుస్తుంది. నీ పిలుపు వినగానే అతనిలో కదలిక వచ్చిందని డాక్టర్ అంటాడు. ఆపకుండా పిలుస్తూనే ఉండు కళ్ళు తెరిస్తే ప్రమాదం నుంచి బయటపడినట్టేనని డాక్టర్ చెప్తాడు. శౌర్య ఏడుస్తూ నేను వచ్చాను నాతో మాట్లాడు మనం ఇంటికి వెళ్లిపోదాం లే అని పిలుస్తుంది.
కళ్ళు తెరిచిన కార్తీక్
దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ మా ఫ్రెండ్ కి ఏం కాకూడదు నాతో మాట్లాడాలని కోరుకుంటుంది. శౌర్య మాటలకు కార్తీక్ కళ్ళు తెరుస్తాడు. మీ అబ్బాయి ప్రమాదం నుంచి బయటపడినట్టేనని డాక్టర్ చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. మీరు కళ్ళు తెరిస్తే నేను బతికినట్టు అయ్యిందని దీప అనుకుంటుంది.
కార్తీక్ ని ఇంటికి తీసుకొస్తారు. అందరూ ఏడుపు మొహాలతో ఉంటే తనకు బాగోలేదని కార్తీక్ అంటాడు. నేను తొందరగా కొలుకోవాలి అంటే మీరందరూ ఇంటికి వెళ్లిపోండి. నన్ను చూడటానికి ఎవరూ రావొద్దు. కోలుకున్నాక నేనే వస్తానని చెప్తాడు. నీకు దగ్గే వరకు ఇక్కడే ఉంటామని సుమిత్ర అంటుంది.
అలా అయితే తగ్గినట్టే మీరందరూ వెళ్తే తనకు తగ్గుతుందని చెప్తాడు. నీ కండిషన్స్ మిగతా వాళ్ళకు వర్తిస్తాయి నాకు కాదు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తానని జ్యోత్స్న చెప్తుంది. మీరంతా నాతో ఉంటే ఏం మాట్లాడతారో నాకు తెలుసు అందుకే వెళ్లిపొమ్మని అన్నానని అనుకుంటాడు.
దీపను ఇంట్లో ఎందుకు ఉంచారు?
స్వప్న ఫోన్ చేసి మీకు యాక్సిడెంట్ అయ్యింది అంట కదా నేను ఇంటికి వస్తానని అంటుంది. పూర్తిగా కోలుకున్న తర్వాత తానే వచ్చి కలుస్తానని చెప్తాడు. దీంతో స్వప్న సరేనని అంటుంది. నిజం తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని అనుకుంటాడు. జ్యోత్స్న ఒంటరిగా ఆలోచిస్తుంది.
బావ నువ్వు అడ్డుపడకపోయి ఉంటే ఈపాటికి నా అడ్డు తొలగిపోయేదని అనుకుంటుంది. జ్యోత్స్న ఆవేశంగా సుమిత్ర దగ్గరకు వెళ్ళి దీపను ఇంట్లో ఎందుకు ఉంచారని అడుగుతుంది. బావ దీప కోసం వెళ్ళాడు, దీప లేకపోతే ఈపాటికి ఇంట్లో పెళ్లి పనులు జరుగుతూ ఉండేవని అంటుంది.
దీప వల్లే అన్నీ సమస్యలు
అర్థం లేకుండా మాట్లాడొద్దని దశరథ అంటాడు. నీ మేనల్లుడు చావు అంచుల వరకు వెళ్ళి వస్తే నీకు బాధలేదు, వాడి మీద ప్రాణాలు పెట్టుకుని జ్యోత్స్న బతుకుతుంది. వాడికి ఏదైనా అయితే నీ కూతురు దక్కేది కాదు. దీప ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎవరికీ మనశ్శాంతి లేదని పారిజాతం అరుస్తుంది.
ఎందుకు ఇప్పుడు గొడవ చేస్తున్నారని సుమిత్ర అంటుంది. దీప చెప్పిన సాక్ష్యం వల్లే నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నా ఎంగేజ్ మెంట్ ఆగింది దీప వల్లే అంటుంది. నరసింహ కార్తీక్ ని చంపాలని అనుకుంది దీప కోసమే కదాని పారిజాతం అడుగుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్