Karthika deepam september7th episode: కాశీని పెళ్లి చేసుకుంటానన్న స్వప్న, ఎంతకైనా తెగిస్తానన్న శ్రీధర్- ప్రమాదంలో దీప?-karthika deepam 2 serial today september 7th episode swapna argues sridhar for refusing to allow her to marry kasi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam September7th Episode: కాశీని పెళ్లి చేసుకుంటానన్న స్వప్న, ఎంతకైనా తెగిస్తానన్న శ్రీధర్- ప్రమాదంలో దీప?

Karthika deepam september7th episode: కాశీని పెళ్లి చేసుకుంటానన్న స్వప్న, ఎంతకైనా తెగిస్తానన్న శ్రీధర్- ప్రమాదంలో దీప?

Gunti Soundarya HT Telugu
Sep 07, 2024 07:21 AM IST

Karthika deepam 2 september 7th: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కాశీని పెళ్లి చేసుకోవడానికి తాను ఒప్పుకొనని శ్రీధర్ అంటాడు. కానీ స్వప్న మాత్రం తనని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకొనని తెగేసి చెప్తుంది. తాను చూసిన సంబంధం చేసుకునేలా చేసేందుకు ఎంతకైనా తెగిస్తానని శ్రీధర్ అంటాడు.

కార్తీకదీపం 2 సీరియల్ సెప్టెంబర్ 7వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ సెప్టెంబర్ 7వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

Karthika deepam 2 serial today september 7th episode: దీప పంతులు మా పెళ్ళికి ముహూర్తాలు పెట్టారు. రెండు రోజుల్లోనే మా పెళ్లి అని జ్యోత్స్న సంతోషంగా చెప్తుంది. చాలా మంచి మాట చెప్పావని దీప అంటుంది. పెళ్లి ఎల్లుండే కదా రావడానికి నీకు కుదురుతుందో లేదో ముఖ్యమైన పనులు ఏమైనా ఉన్నాయేమోనని వెటకారంగా మాట్లాడుతుంది.

నువ్వు బతికి ఉండవు 

నీ పెళ్ళికి వంటలు నేనే చేస్తానని దీప చెప్తుంది. అన్నీ పనులు నువ్వే చూసుకోవాలని జ్యోత్స్న అంటుంది. తను వంట మనిషి కాదు మన అతిథి అని కార్తీక్ అంటాడు. నువ్వు ఈ పెళ్ళిని ఆపడానికి ప్రయత్నిస్తావ్ కానీ నువ్వు అప్పటి వరకు బతికి ఉండవని జ్యోత్స్న అనుకుంటుంది.

మీ పెళ్లి అయితే నేను నా కూతురిని తీసుకుని వెళ్లిపోతానని దీప అనుకుంటుంది. వచ్చే బుధవారమే శ్రీకాంత్ కి స్వప్నకు పెళ్లి అని శ్రీధర్ కావేరితో చెప్తాడు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను కాశీని ప్రేమించాను అతన్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకొనని స్వప్న తెగేసి చెప్తుంది.

కాశీతో పెళ్ళికి ఒప్పుకోను 

తాను చూసిన సంబంధం చేసుకుంటే జీవితం బాగుంటుందని శ్రీధర్ అంటాడు. పెళ్లి చేస్తే కాశీతో చేయండి లేదంటే పెళ్లి గురించే మర్చిపొమ్మని స్వప్న కోపంగా చెప్తుంది. కానీ శ్రీధర్ మాత్రం వినిపించుకోడు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కానీ నేను చేసుకోకూడదా అని స్వప్న నిలదీస్తుంది.

నువ్వు ప్రేమించిన అబ్బాయి వివరాలు నీకు తెలుసా? కనీసం సొంత ఇల్లు అయినా ఉందా? అంటే ఏమిలేదని చెప్తుంది. ఏమి లేదు కానీ స్వప్న గారు ప్రేమించారంట.. నీకోసం జాగ్రత్తలు తీసుకునే నేను నీకు ఎలాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేయాలో నాకు తెలియదా? ఉద్యోగం లేని వాడిని పెళ్లి చేసుకుని ఇద్దరూ కలిసి అడుక్కుతింటారా అని అవమానిస్తాడు.

ఎంతకైనా తెగిస్తా 

స్వప్న మాత్రం ఎదురు చెప్తుంది. ఆ వెధవకు ఇచ్చి నేను పెళ్లి చేయను. వాడు నాకు నచ్చలేదని శ్రీధర్ చెప్తాడు. నేను కాశీనే చేసుకుంటానని స్వప్న వాదిస్తుంది. శ్రీకాంత్ తో పెళ్లి చేయడం కోసం ఎంతకైనా తెగిస్తానని శ్రీధర్ అరిస్తే అంతే గట్టిగా స్వప్న కూడా ఎదురుతిరిగి మాట్లాడుతుంది.

కావేరీ కూడా స్వప్నకు సపోర్ట్ గానే మాట్లాడుతుంది. స్వప్న పెళ్లి శ్రీకాంత్ తోనే జరుగుతుంది, ఎలా పెళ్లి చేసుకోదో నేను చూస్తానని అనుకుంటాడు. నరసింహ ఒంటికి కాపడం పెట్టుకోవడం చూసి ఎవరు తన్నారని శోభ అడుగుతుంది. దీప జోలికి వెళ్ళినందుకు ఆ కార్తీక్ కొట్టాడని తెలిస్తే చేతకాని వాడిలా చూస్తుందని మనసులో అనుకుంటాడు.

మీ బావకు పెళ్లి ఇష్టం లేదేమో 

శోభ మాత్రం నోరు మూయదు. దీంతో నరసింహ ఎదురుతిరుగుతాడు. నేను ఇలా అవడానికి కారణమైన వాళ్ళ అంతు తేల్చడానికి వెళ్తున్నానని ఆవేశంగా మాట్లాడతాడు. జ్యోత్స్న పెళ్లి ఫిక్స్ అయినందుకు తన ఫ్రెండ్స్ కి బ్యాచిలర్ పార్టీ ఇస్తుంది. అందరూ మందు తాగుతుంటారు.

మీ బావ పార్టీకి ఎందుకు రాలేదని కావాలని ఫ్రెండ్స్ రెచ్చగొడతారు. ఇంట్లో ఫోర్స్ చేయడం వల్ల పెళ్ళికి ఒప్పుకున్నాడని అంటారు. శౌర్య తన ఫ్రెండ్ కార్తీక్ పెళ్లి అని బట్టలు కొనివ్వమని అడుగుతుంది. దీప ఇంటికి ఒకావిడ వస్తుంది. మీరు వంటలు బాగా చేస్తారని తెలిసింది. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది వంటలు చేయమని అడుగుతుంది.

దీపకు ఫుడ్ కాంట్రాక్ట్ 

మీకు దీప ఇక్కడ ఉంటుందని ఎవరు చెప్పారు అంటే కడియం బాబాయ్ చెప్పాడని ఆవిడ చెప్తుంది. అనసూయ మాత్రం డౌట్ పడుతుంది.ఆవిడ వంట చేసేందుకు డబ్బులు అడ్వాన్స్ గా కూడా ఇస్తుంది. వచ్చిన ఆవిడ దీపను తన వెంట రమ్మని పిలుస్తుంది. కానీ దీప పని ఉందని కాసేపాగి వస్తానని చెప్తుంది. నరసింహ ఆరెంజ్ చేసిన మనిషి అని అర్థం అవుతుంది.

వంట చేయడానికి తాను కూడా వస్తానని అనసూయ అంటే దీప మాత్రం వద్దని చెప్తుంది. శ్రీధర్ కాంచన దగ్గరకు వస్తాడు. క్యాంప్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఉంటాడని కార్తీక్ మనసులో అనుకుంటాడు. రాఖీ పండుగ రాలేదని అత్త బాధపడింది, ముహూర్తాలు పెట్టేటప్పుడు నువ్వు లేవని తాతయ్య బాధపడ్డారని కార్తీక్ అంటాడు.

ప్రమాదంలో దీప? 

జ్యోత్స్న ఫోన్ చేసిందని బ్యాచిలర్ పార్టీకి వెళ్తున్నానని చెప్తాడు. కార్తీక్ వెళ్తుండగా దారిలో దీప కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతాడు. ఒకరు ఇంటి దగ్గర వంటలు చేయడానికి రమ్మన్నారని వెళ్తున్నట్టు చెప్తుంది. దీప అడ్రస్ చెప్తే తాను అటే వెళ్తున్నానని కారు ఎక్కించుకుంటాడు.

జ్యోత్స్న పార్టీ ఇస్తుందని వెళ్తున్నానని చెప్తాడు. చివర వరకు ఉంటాను అంటే వెళ్ళమని లేదంటే ఇప్పుడే ఆగిపొమ్మని చెప్తుంది. అర్థం చేసుకున్న కార్తీక్ సరే అంటాడు. ఈ పెళ్లి నేను మా అత్త, అమ్మ, మీకోసం చేసుకుంటున్నానని కార్తీక్ మనసులో అనుకుంటాడు.

కార్తీక్ దీప చెప్పిన దగ్గరకు తీసుకుని వస్తాడు. డబ్బులిచ్చిన ఆవిడ దీపను ఇంట్లోకి తీసుకెళ్తుంది. మీ బావ ఎక్కడ ఇంకా రాలేదని ఫ్రెండ్స్ ఎగతాళిగా మాట్లాడతారు. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావ్ అంటే వస్తున్నానని అంటాడు. అప్పుడే కార్తీక్ కారులో ఉన్న దీప ఫోన్ రింగ్ అవుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.