Karthika deepam september 9th episode: దీప మీద దాడి, కార్తీక్ ని కత్తితో పొడిచిన నరసింహ- షాక్ లో జ్యోత్స్న ఫ్యామిలీ-karthika deepam 2 serial today september 9th episode karthik is stabbed while saving deepa from narasimha attack ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam September 9th Episode: దీప మీద దాడి, కార్తీక్ ని కత్తితో పొడిచిన నరసింహ- షాక్ లో జ్యోత్స్న ఫ్యామిలీ

Karthika deepam september 9th episode: దీప మీద దాడి, కార్తీక్ ని కత్తితో పొడిచిన నరసింహ- షాక్ లో జ్యోత్స్న ఫ్యామిలీ

Gunti Soundarya HT Telugu
Sep 09, 2024 07:27 AM IST

Karthika deepam 2 serial today september 9th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీపను నరసింహ కత్తితో పొడవబోతుంటే కార్తీక్ అడ్డుపడతాడు. దీంతో నరసింహ కార్తీక్ ని పొడిచేస్తాడు. విషయం తెలుసుకున్న జ్యోత్స్న షాక్ అవుతుంది. కార్తీక్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని చెప్తాడు.

కార్తీకదీపం 2 సీరియల్ సెప్టెంబర్ 9వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ సెప్టెంబర్ 9వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today september 9th episode: దీప ఒంటరిగా కూర్చుని కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా ఎవరూ ఉండరని తెలిస్తే అత్తయ్య, శౌర్యను కూడా తీసుకొచ్చే దాన్ని అని అనుకుంటుంది. వాళ్ళంతా వస్తే నా పని ఎలా అవుతుందని నరసింహ అనడంతో దీప షాక్ అవుతుంది.

నిన్ను చంపడానికి ఈ స్కెచ్ 

వంట చేసుకోవడానికి వచ్చాను వచ్చే నాలుగు డబ్బులు రాకుండా చేయకు. ఎదురుగా కత్తి పీట కూడా ఉంది గొడవ చేయకుండా వెళ్లిపొమ్మని దీప చక్కగా వార్నింగ్ ఇస్తుంది. ఇల్లు, డబ్బు తనకు ఇవ్వమని నరసింహ మరోసారి అడుగుతాడు. అది తన తండ్రి కట్టిన ఇల్లు ఇవ్వనని తెగేసి చెప్తుంది.

దేవుడు ఇచ్చిన చివరి అవకాశం కూడా వదిలేసుకున్నావ్ ఇక నిన్ను చంపడం తప్ప వేరే దారి లేదని నరసింహ కత్తి తీస్తాడు. ఇక్కడ వంట లేదు ఇదంతా నేను నిన్ను చంపడానికి వేసిన స్కెచ్ అని చెప్తాడు. ఆ పెద్దావిడను పంపించింది నేనే. నువ్వు కార్తీక్ గాడితో కలిసి నా బతుకు రోడ్డుకు లాగావు.

దీప మీద దాడి 

నిన్ను చంపేస్తే ఇల్లు, డబ్బు, నీ కూతురు నావే. నన్ను చంపితే జైలుకు పోతానని అనుకుంటున్నావ్ ఏమో నా జాగ్రత్తలో నేను ఉన్నానని అంటాడు. దీప జరిగినవన్నీ మర్చిపో లేదంటే పోలీస్ కేసు పెడతానని అంటుంది. కానీ నరసింహ మాత్రం భయపడేది లేదని ఇవాళ చంపడం ఖాయమని అంటాడు.

నిన్నే కాదు వాడిని కూడా చంపేస్తానని చెప్తాడు. నరసింహ పొడవబోతుంటే దీప పక్కకి తోసేసి కత్తిపీట తీసుకుంటుంది. అడుగు ముందుకు వేస్తే చంపేస్తానని అంటుంది. కానీ నరసింహ మాత్రం వెనుకడుగు వేయకుండా మళ్ళీ దీప మీద దాడి చేయబోతుంటే ఆపుతుంది.

కార్తీక్ ని పొడిచిన నరసింహ 

కానీ నరసింహ పొడిచేస్తాడు. కానీ దీపను కాపాడటం కోసం కార్తీక్ అడ్డుఉంటాడు. దీంతో కత్తి కార్తీక్ పొట్టలో దిగుతుంది. తర్వాత అయిన నిన్ను చంపాల్సిందేనని కార్తీక్ ని మళ్ళీ కత్తితో పొడుస్తాడు. దీప నరసింహను పక్కకు తోసేస్తుంది. నువ్వు ఇక్కడ నునహీ వెళ్లిపో లేదంటే వాడు చంపేస్తాడని అంటాడు.

దీప వెంటనే కత్తి పీట ఎత్తి నరసింహ వెంట పడుతుంది. మీరు మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చారని దీప ఏడుస్తుంది. ఫోన్ చూపించడంతో నన్ను కాపాడటం కోసం వచ్చి మీరు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని దీప ఏడుస్తుంది. సుమిత్ర ఇంట్లో అందరూ సంతోషంగా కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు.

హాస్పిటల్ లో కార్తీక్ 

దీప కార్తీక్ ని హాస్పిటల్ కు తీసుకొస్తుంది. రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని మీకు ఈ పరిస్థితి వచ్చింది ఏంటి అంతా నా వల్లే. నేను మీకారు ఎక్కకపోయి ఉంటే నేను ఎక్కడ ఉన్నానో తెలిసేది కాదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకు ఎలా చెప్పాలో ఏంటోనని ఏడుస్తుంది. కార్తీక్ పార్టీకి వెళ్లాడో లేదోనని కాంచన ఫోన్ చేస్తుంది.

పార్టీకి వెళ్ళావా ఎక్కడ ఉన్నావ్ అని కాంచన అడుగుతుంది. దీప ఏడుస్తూ మాట్లాడుతుంది. సుమిత్ర ఫోన్ తీసుకుని ఏమైందని అంటే కార్తీక్ బాబును తీసుకుని హాస్పిటల్ కు వచ్చాను. కార్తీక్ బాబును నరసింహ కత్తితో పొడిచేశాడని దీప ఏడుస్తూ చెప్తుంది. అది విని ఇంట్లో అందరూ షాక్ అవుతారు.

జ్యోత్స్న ఫోన్ విషయం చెప్పిన దీప 

అందరూ కంగారుగా హాస్పిటల్ కు వెళతారు. జ్యోత్స్న ఫ్రెండ్స్ మీ బావ ఇంకా రాలేదు ఏంటని అడుగుతారు. మీ బావకు ఇంకా నీ మీద ఇంట్రెస్ట్ లేదని నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. జ్యోత్స్న మళ్ళీ కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. దీప లిఫ్ట్ చేయడంతో జ్యోత్స్న రగిలిపోతుంది.

నువ్వు వెంటనే బయల్దేరి హాస్పిటల్ కి రా, కార్తీక్ బాబు హాస్పిటల్ లో ఉన్నారు. నరసింహ కార్తీక్ బాబును కత్తితో పొడిచేశాడని చెప్పడంతో జ్యోత్స్న జరిగింది గుర్తు చేసుకుంటుంది. నన్ను కాపాడబోయి కార్తీక్ బాబు గాయపడ్డారని చెప్తుంది. కాంచన ఏడుస్తూ కార్తీక్ కి ఏమైందని అడుగుతుంది.

అసలు ఏం జరిగింది?

బ్యాచిలర్ పార్టీకి వెళ్లాల్సిన వాడు నీ దగ్గరకు ఎందుకు వచ్చాడు. నీ మొగుడు దాన్ని ఎందుకు పొడిచాడని పారిజాతం అడుగుతుంది. జ్యోత్స్న పరుగులు పెడుతూ వస్తుంది. నరసింహ కార్తీక్ ని ఎందుకు పొడిచాడు అసలు ఏం జరిగిందని శ్రీధర్ నిలదీస్తాడు.

దీప ఏడుస్తుంది. ఒకావిడ వంట చేయడానికి రమ్మంటే కూరగాయలు తీసుకుని వెళ్తుంటే కార్తీక్ బాబు అటుగా వెళ్తూ నన్ను తీసుకెళ్లారు. నన్ను దింపేసి కార్తీక్ బాబు వెళ్ళిపోయాడు. అప్పుడే నరసింహ వచ్చాడు. ఇల్లు డబ్బు కోసం నన్ను చంపి నా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు.

నన్ను చంపబోతుంటే కాపాడటానికి వచ్చిన కార్తీక్ బాబును పొడిచేశాడని చెప్తాడు. వెంటనే ఏసీపీకి ఫోన్ చేసి నరసింహను వదలకూడదని దశరథ అంటాడు. డాక్టర్ కార్తీక్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని చెప్పడంతో అందరూ భయపడతారు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.