Karthika deepam august 24th episode: దీపను మెచ్చుకున్న పారిజాతం, కావేరీ ఫోన్ కాల్ తో కాంచనకు దొరికిపోయిన శ్రీధర్-karthika deepam 2 serial today august 24th episode parijatham thanks deepa for saving her grand son ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam August 24th Episode: దీపను మెచ్చుకున్న పారిజాతం, కావేరీ ఫోన్ కాల్ తో కాంచనకు దొరికిపోయిన శ్రీధర్

Karthika deepam august 24th episode: దీపను మెచ్చుకున్న పారిజాతం, కావేరీ ఫోన్ కాల్ తో కాంచనకు దొరికిపోయిన శ్రీధర్

Gunti Soundarya HT Telugu
Aug 24, 2024 07:02 AM IST

Karthika deepam 2 serial today august 24th episode: దీప కాపాడింది తన మనవడు కాశీని అని పారిజాతం తెలుసుకుంటుంది. హాస్పిటల్ లో మనవడిని చూసి ఎమోషనల్ అవుతుంది. అది చూసి కార్తీక్ పారు ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుందని అంటాడు. కాశీని కాపాడినందుకు మంచి పని చేసావంటూ మెచ్చుకుంటుంది.

కార్తీకదీపం 2 సీరియల్ ఆగస్ట్ 24వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ ఆగస్ట్ 24వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today august 24th episode: దాసు కొడుకు యాక్సిడెంట్ వీడియో పారిజాతానికి చూపిస్తాడు. ఆ వీడియోలో ఉన్నది తన కొడుకని చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది. జ్యోత్స్న దీప దగ్గరకు వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది. యాక్సిడెంట్ అయిన కాశీను చూస్తుంది. యాక్సిడెంట్ అయిన వీడు ప్రశాంతంగా ఉన్నాడు.

దీపతో గొడవపడిన జ్యోత్స్న 

వీడిని కాపాడినట్టు బిల్డప్ ఇచ్చిన నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు. కారు ఆపకుండా వెళ్లిపోయానని వాడు ఎవడో వీడియో తీసి సోషల్ మీడియాలో నన్ను ఛీ అనిపించాడని ఆవేశంగా తిడుతుంది. ఇప్పుడు నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చావా అని దీప అంటుంది.

నీతో గొడవ పెట్టుకుంటే ఊరుకుంటారా? ఇక్కడ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. ఈ వీడియో కూడా ఎవడో ఒకడు ఎడిట్ చేసి మానవత్వంతో యాక్సిడెంట్ అయిన అబ్బాయిని కాపాడిన మహిళ మీద మిస్ హైదరాబాద్ దౌర్జన్యం అని రాస్తారు అని అంటుంది. యాక్సిడెంట్ అయ్యింది వీడికి కానీ డ్యామేజ్ జరిగింది నాకు అంటుంది.

జ్యోత్స్నను ఇలా పెంచారు ఏంటి?

అప్పుడే కార్తీక్ రావడం గమనించి చాలా జాలిగా ఇప్పుడు ఇతనికి ఎలా ఉంది దీప అని మాట మార్చేస్తుంది. దీంతో దీప బిత్తరపోతుంది. దారి తప్పి వచ్చావా ఏంటని కార్తీక్ అంటే ఏదో కంగారులో అలా చేశాను ఇప్పటికే గిల్టీగా ఫీల్ అవుతున్నానని తెగ నటించేస్తుంది.

మంచిదానిలా మాట్లాడుతుంది. తనని తప్పుగా అర్థం చేసుకుంటారేమోనని కవర్ చేసుకోవడానికి వచ్చిందని కార్తీక్ కనిపెట్టేస్తాడు. పారిజాతం మనవడిని తలుచుకుని బాధపడుతుంది. తల్లి చేసిన పనికి దాసు బాధపడతాడు. మనిషి ప్రాణం పోయిన పర్వాలేదా తనను ఇలా పెంచారు ఏంటని దాసు అడుగుతాడు.

జ్యోత్స్న ఆవేశంగా వస్తుంటే పారిజాతం ఎదురుపడుతుంది. యాక్సిడెంట్ అయిన అబ్బాయిని చూసి వస్తానని చెప్తుంది. వాడిని చూడాల్సిన అవసరం ఏంటని అంటే వాడు నీ తమ్ముడు అని చెప్పబోయి ఆగిపోతుంది. కాశీని చూసి పారిజాతం ఎమోషనల్ అవుతుంది.

దీపను మెచ్చుకున్న పారు 

నన్ను క్షమించురా మనవడా, యాక్సిడెంట్ అయింది నీకని తెలిస్తే రోడ్డు మీద అలా వదిలేసి వెళ్లిపోయే దాన్ని కాదని మనసులో అనుకుంటుంది. ఏంటి పారు ఏదో సొంత మనవడిని చూసినట్టు చూస్తున్నావ్ నా మీద కూడా నువ్వు ఇంత ప్రేమ ఎప్పుడూ చూపించలేదు. ఏదో తేడాగా ఉన్నావని కార్తీక్ అడుగుతాడు.

దగ్గరుండి వీడిని సొంత మనిషిలా చూసుకుంటున్నావ్ అని కార్తీక్ ని మెచ్చుకుంటుంది. నేను కాదు చూసుకుంటుంది దీప అంటే చాలా మంచి పని చేశావ్ దీప అని పాజిటివ్ గా మాట్లాడుతుంది. దాసు కూతురిని చూసి ఎమోషనల్ అవుతాడు. పారిజాతం లేట్ గా వచ్చినందుకు జ్యోత్స్న తన మీద ఫైర్ అవుతుంది.

పళ్ళు రాలిపోతాయి ఎక్కువ మాట్లాడితే అని తిడుతుంది. కావేరీ స్వప్న గురించి ఆలోచిస్తుంది. తన ప్రవర్తన చూస్తుంటే ఏదో అనుమానంగా ఉందని వెంటనే విషయం చెప్పాలని శ్రీధర్ కు ఫోన్ చేస్తుంది. కాంచన ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కావేరీ కంగారుగా బేబీ ఎక్కడ ఉన్నావని అడుగుతుంది.

దొరికిపోయిన శ్రీధర్ 

బేబీ ఎవరు అని కాంచన బిత్తరపోతూ అడుగుతుంది. భయంతో కావేరీ కాల్ కట్ చేస్తుంది. అప్పుడే శ్రీధర్ వస్తే బేబీ ఎవరు అనేసరికి టెన్షన్ పడిపోతాడు. మీకు ఒక ఫోన్ వచ్చింది నేను లిఫ్ట్ చేశాను బేబీ ఎక్కడ ఉన్నావ్ అని ఒకావిడ అడిగిందని చెప్తుంది. ఇంతకీ బేబీ ఎవరని అడుగుతుంది.

బేబీ ఎవరో నాకేం తెలుసు అంటాడు. ఎవరో అర్థం పర్థం లేని వాళ్ళు ఇలా ఫోన్ చేస్తారు. భార్యాభర్తల మధ్య అపార్థాలు సృష్టిస్తారని కవర్ చేస్తాడు. కానీ కాంచన మాత్రం భర్తను అనుమానంగా చూస్తుంది. రాంగ్ కాల్ అయి ఉంటుంది వాళ్ళకు ఫోన్ చేసి తిడతానని అంటాడు.

మీరు నెంబర్ సేవ్ చేశారు కదా మీకు తెలిసిన వాళ్ళు కాకపోతే ఎందుకు సేవ్ చేశారని అడుగుతుంది. దొరికిపోయానని అనుకుని ఆఫీసులో అమ్మాయి అందరినీ అలాగే బేబీ అని పిలుస్తుందని కవర్ చేస్తాడు. కానీ కాంచన మాత్రం భర్తను అనుమానిస్తుంది. దీప ఇంటికి వస్తే యాక్సిడెంట్ అయిన వ్యక్తిని కాపాడి మంచి పని చేసిందని సుమిత్ర మెచ్చుకుంటుంది.

నువ్వే ఆ వీడియో తీయించి ఉంటావ్ 

దీప ఎప్పుడు మంచి పనులే చేస్తుంది. అతడిని ఇంటికి తీసుకొచ్చి అవుట్ హౌస్ లో పెట్టుకుందాం. దీపను మన ఇంట్లో పెట్టుకుందాం. అప్పుడు నీకు ఇంకా మంచి పేరు వస్తుంది. దీప లాంటి వాళ్ళు ఎవరు ఉండరని మా బావ లాంటి వాళ్ళు నీ భజన చేస్తూ ఉంటారని జ్యోత్స్న వెటకారంగా మాట్లాడుతుంది.

సుమిత్ర కూతురి నోరు మూయిస్తుంది. చదువుకున్న మూర్ఖురాలు అయ్యిందని తిడుతుంది. కానీ జ్యోత్స్న మాత్రం తన నోటికి అడ్డు లేకుండా దీపను మాటలు అంటూనే ఉంటుంది. నువ్వు వెళ్తున్న దారిలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. నాకు తెలిసి నువ్వు ఎవరి దృష్టిలోనే మంచి అవడం కోసం ఆ వీడియో నువ్వే తీయించి ఉంటావని అంటుంది. అక్కడితో నేటి కార్తీకయదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.