Karthika deepam september 10th episode: జ్యోత్స్న చెంప పగలగొట్టిన పారిజాతం- దీపకు వార్నింగ్ ఇస్తూ ఉతికి ఆరేసిన శ్రీధర్-karthika deepam 2 serial today september 10th episode sridhar argues with deepa for involving karthik in her issues ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam September 10th Episode: జ్యోత్స్న చెంప పగలగొట్టిన పారిజాతం- దీపకు వార్నింగ్ ఇస్తూ ఉతికి ఆరేసిన శ్రీధర్

Karthika deepam september 10th episode: జ్యోత్స్న చెంప పగలగొట్టిన పారిజాతం- దీపకు వార్నింగ్ ఇస్తూ ఉతికి ఆరేసిన శ్రీధర్

Gunti Soundarya HT Telugu
Sep 10, 2024 07:45 AM IST

Karthika deepam 2 serial today september 10th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ ఈ పరిస్థితికి రావడానికి కారణం దీప అంటూ శ్రీధర్ చిందులు వేస్తాడు. తనని నోటికొచ్చినట్టు తిడతాడు. కార్తీక్ ఏమైనా అయితే ఎవరిని వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తాడు.

కార్తీకదీపం 2 సీరియల్ సెప్టెంబర్ 10వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ సెప్టెంబర్ 10వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today september 10th episode: కార్తీక్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని అర్జెంట్ గా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని డాక్టర్ అడుగుతాడు. జ్యోత్స్నది అదే బ్లడ్ గ్రూప్ తనని ఇవ్వమని అడుగుతారు. కానీ నేను మందు తాగాను కదా ఇవ్వకూడదు ఆ విషయం చెప్తే ఛీ కొడతారని అనుకుని వారం క్రితమే తన ఫ్రెండ్ కి బ్లడ్ ఇచ్చానని అబద్ధం చెప్తుంది.

మీ బావ ఇలా అవడానికి కారణం నువ్వే 

దీప తనది అదే బ్లడ్ గ్రూప్ అని చెప్పి ఇచ్చేందుకు ముందుకు వస్తుంది. కాంచన కొడుకు పరిస్థితి గురించి ఏడుస్తుంది. రెండు రోజుల్లో పెళ్లి కొడుకుగా చూడాల్సిన నా కొడుకును ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు వాడిని వదలనని అంటుంది. పారిజాతం జ్యోత్స్నను పక్కకు తీసుకొచ్చి నీ ఫ్రెండ్ కి బ్లడ్ ఇచ్చాను అనేది అబద్ధం కదాని అడుగుతుంది.

నేను పార్టీలో తాగాను అని చెప్పేసరికి పారిజాతం మనవరాలి చెంప పగలగొడుతుంది. నీ అంత నష్టజాతకురాలిని, దరిద్రపు దాన్ని నేను ఎక్కడ చూడలేదు. మీ బావ ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం నువ్వు అని నాకు తెలుసు అని పారిజాతం నిలదీస్తుంది. మీ బావ ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం నువ్వే.

దీప దేవత అయ్యింది 

ఇంటి దగ్గర ఉన్న కార్తీక్ ని పార్టీకి పిలవకపోయి ఉంటే వాడు బయటకు వచ్చే వాడు కాదు, నరసింహ పొడిచే వాడే కాదు. అలా జరిగి ఉంటే దీప చచ్చేది మనకు సగం దరిద్రం వదిలేది. రెండు రోజుల్లో పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నావా? జరగదు ఆగిపోయినట్టే. నువ్వు అసలైన వారసురాలు కాదని నీకు తెలుసు.

నిజమైన వారసురాలు బతికే ఉందని తెలుసు. ఇప్పుడు కార్తీక్ ని పెళ్లి చేసుకుంటే తప్ప ఆస్తికి నువ్వు వారసురాలివి కాలేవు. నువ్వు ఆస్తి, కార్తీక్ కావాలని అనుకున్నావ్ కదా. కార్తీక్ కి నువ్వు బ్లడ్ ఇచ్చి ఉంటే సింపథీ వచ్చి ఉండేది కానీ ఇప్పుడు దీప దేవత అయ్యిందని అంటుంది.

థాంక్స్ దీప 

దీపను ఇక్కడ నుంచి పంపించేయమని జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ మాట అంటే ఛీ కొడతారు, పైగా నువ్వు తాగావని తెలిస్తే చెంపలు పగలగొడుతారని తిడుతుంది. బావకు ఇలా జరగడానికి కారణం నేనే, దీపను చంపుతానని చెప్పి బావను చంపాడు.

సేమ్ కత్తి పోట్లు వాడికి దిగాలని జ్యోత్స్న అనుకుంటుంది. ఇంటి దగ్గర శౌర్య దీప కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. అమ్మ రాగానే షాపింగ్ కి వెళ్ళి బట్టలు కొనుక్కోవాలని ఆనందంగా చెప్తుంది. సమయానికి నా కొడుక్కి రక్తం ఇచ్చావ్ థాంక్స్ దీప అని కాంచన అంటుంది.

తనకు ఎందుకు థాంక్స్ చెప్పడమని శ్రీధర్ అరుస్తాడు. కోర్టుకు ఎక్కి కొడుకు పరువు తీసింది. ఇప్పుడు మొగుడితో పొడిపించి ప్రాణం తీసిందనా? నా కొడుక్కి ఎందుకు ఈ గతి పట్టించాలి? వాడు దీపకు సాయం చేసి పాపం చేశాడు. వద్దు వాళ్ళ విషయాల్లో కలుగజేసుకోవద్దని నచ్చజెప్పాను.

అవుట్ హౌస్ దగ్గర ఆఫీసు పెట్టాడు 

నా మాట వినకుండా ఈవిడకు సాయం చేశాడు. సుమిత్ర వారించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ శ్రీధర్ మాత్రం ఆగడు. దీప ఎవరు? నరసింహ ఎవరు? ఏంటి వీళ్ళకు మనకు సంబంధం? దీప ఏమైనా నీ కూతురా? నా మేనకోడలా? ఏ సంబంధం ఉందని ఈ మనిషి కోసం నా కొడుకు చావాలి?

ఇదంతా జరగడానికి కారణం దీప అని అరుస్తాడు. ఒంటరి ఆడది ఏం చేయగలదు అని సుమిత్ర బాధగా అంటుంది. తన దగ్గరకు రావొద్దని చెప్పలేదా? ఏదైనా జరిగితే కూతురితో ఫోన్ చేయించి రప్పించడం. ఈవిడ వచ్చిన దగ్గర నుంచి రెస్టారెంట్ కూడా వదిలేసి అవుట్ హౌస్ దగ్గర ఆఫీసు పెట్టాడు అంటూ చాలా నీచంగా మాట్లాడతాడు.

దీప చస్తే నాకేంటి 

పెళ్లి చేస్తే గొడవలు ఉండవని నిశ్చితార్థం పెట్టుకుంటే అది చెడగొట్టాడు. అక్కడ దీప లేకపోయి ఉంటే నిశ్చితార్థం బాగా జరిగేది. కోర్టులో పరువు తీశారు. ఆ చేతకాని వెధవ పెళ్ళాన్ని ఏమి చేయలేక నా కొడుకును చంపాలని అనుకున్నాడు. వాడిని ఊరికే వదిలిపెట్టను.

వాడిని పోలీసులు వెతుకుతున్నారు. వాడు దొరికితే ఏం చేయాలో అది చేస్తానని అంటాడు. ఇప్పుడు దీపకు వాడికి ఏం సంబంధం లేదు కదా. వాడి వల్ల దీపకు కూడా అన్యాయం జరుగుతుందని దశరథ సపోర్ట్ గా మాట్లాడబోతే శ్రీధర్ మాత్రం వినిపించుకోడు. కార్తీక్ కాపాడకపోయి ఉంటే దీప చచ్చిపోయేది కదాని సుమిత్ర అంటుంది.

నాకు నా కొడుకు ముఖ్యం మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం అంటాడు. డాక్టర్ బయటకు వచ్చి కండిషన్ ఇంకా సీరియస్ గా ఉందని, స్పృహలోకి వస్తేనే పరిస్థితి ఏంటని చెప్పగలము. కొన్ని సార్లు కోమాలోకి వెళ్లిపోతాడని డాక్టర్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.

కోమాలోకి కార్తీక్?

కోమాలోకి వెళ్తే మనిషి మనకు దక్కనట్టేనని అనడంతో కాంచన కుమిలికుమిలి ఏడుస్తుంది. దీప ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? కార్తీక్ కి ఏమైనా జరగాలి మిమ్మల్ని ఎవరినీ వదిలిపెట్టనని శ్రీధర్ వార్నింగ్ ఇస్తాడు. దీపను ఇంటికి వెళ్ళమని సుమిత్ర చెప్తుంది.

కార్తీక్ బాబు కళ్ళు తెరిచే వరకు వెళ్లనని అంటుంది. కానీ సుమిత్ర నచ్చజెప్పి పంపించేస్తుంది. దీప ఇంటికి వచ్చి అనసూయకు జరిగినది మొత్తం చెప్తుంది. శౌర్య అది విని ఏడుస్తూ కార్తీక్ కి ఏమైందని అడుగుతుంది. ఏం కాలేదని దీప కవర్ చేసేందుకు చూస్తుంది కానీ శౌర్య మాత్రం కాదు పద హాస్పిటల్ కు వెళ్దామని అడుగుతుంది.

ఇది ఏడిస్తే గుండె జబ్బు ఎక్కువ అవుతుందని అనసూయ అనుకుంటుంది. కార్తీక్ ని చూడాలని శౌర్య పట్టుబడుతుంది. పాపను తీసుకెళ్లవద్దని అనసూయ చెప్తుంది కానీ దీప మాత్రం ఇక తప్పదు మన మాటలు విన్నదని తీసుకెళ్తుంది. కార్తీక్ బాబుకు ఏం కాకుండా చూడమని అనసూయ దేవుడిని వేడుకుంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner