Karthika Deepam 2 Today Episode: దీప ఇంట్లోకి అనసూయ- నర్సింహ కారు లాక్కున్న శోభ- తండ్రి రెండో పెళ్లిపై స్వప్నకు డౌట్-karthika deepam 2 serial august 27th episode a relief for deepa over anasuya came home karthika deepam 2 today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Today Episode: దీప ఇంట్లోకి అనసూయ- నర్సింహ కారు లాక్కున్న శోభ- తండ్రి రెండో పెళ్లిపై స్వప్నకు డౌట్

Karthika Deepam 2 Today Episode: దీప ఇంట్లోకి అనసూయ- నర్సింహ కారు లాక్కున్న శోభ- తండ్రి రెండో పెళ్లిపై స్వప్నకు డౌట్

Sanjiv Kumar HT Telugu
Aug 27, 2024 01:13 PM IST

Karthika Deepam 2 Serial August 27th Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 27వ తేది ఎపిసోడ్‌లో అనసూయ కూలి పని చేస్తుంటే చలించిపోతుంది దీప. దాంతో తనతో పాటే తన ఇంట్లో ఉండమని బతిమిలాడుకుంటుంది. ముందు వద్దని వారించిన అనసూయ తర్వాత వెళ్లేందుకు ఒప్పుకుంటుంది.

కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 27వ తేది ఎపిసోడ్‌
కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 27వ తేది ఎపిసోడ్‌

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో ఎవర్రా అమ్మాయి అని కాంచన అడుగుతుంది. ఇది ఇప్పటి కథ కాదు. నా పదేళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగిన కథ అని కార్తీక్ అంటాడు. ప్రేమకథ అని కాంచన అడిగితే.. కాదు. ప్రాణం పోసిన కథ. చిన్నప్పుడు నేను కోనోట్లే మునిగిపోతుంటే ఓ అమ్మాయి కాపాడింది నీకు తెలుసు కదా అని కార్తీక్ అంటాడు.

దీపలాంటి పరిస్థితుల్లో

అవును అని కాంచన అంటుంది. ఈ చైన్ ఆ అమ్మాయిది అని కార్తీక్ అంటాడు. మరి ఎందుకు దాచుకున్నావ్ ఈ చైన్‌ను అని అడుగుతుంది కాంచన. నా ప్రాణాలు కాపాడిన తన రుణం ఎప్పటికైనా తీర్చుకోవాలి. నాకు సాయం చేసినట్లే నేను కూడా తనకు సహాయం చేయాలి అని కార్తీక్ అంటాడు. అంత మంచి మనసు ఉన్న అమ్మాయి జీవితం బాగానే ఉంటుందని కాంచన అంటుంది. బాగోకపోతే.. ఆమె కూడా దీపలాంటి పరిస్థితుల్లో ఉంటే అని కార్తీక్ అంటాడు.

అందరిజీవితం ఎందుకు అలా ఉంటుంది. సమాజంలో అందరూ ఉన్నారు. నర్సింహంలాంటి చెడ్డవాళ్లు ఉన్నాట్లే నా భర్తలాంటి మంచివాళ్లు కూడా ఉన్నారు అని కాంచన అంటుంది. నిజం తెలిస్తే లోకంలో ఎక్కువగా నువ్ అసహ్యించుకునేది నాన్ననే అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. నీ ప్రాణం కాపాడింది అంటే.. నా ప్రాణం కాపాడినట్లే. తను ఏదో ఒకరోజు ఎదురుపడాలని కోరుకుంటున్నా అని కాంచన అంటుంది. ఆ అమ్మాయి ఎక్కడుందో ఏంటో అని కార్తీక్ అనుకుంటాడు.

మరోవైపు దీపకు మట్టి మోస్తూ కనిపిస్తుంది అనసూయ. అత్తయ్య ఇక్కడ పనిచేయడం ఏంటీ అని వెళ్లి అడుగుతుంది. దాంతో జరిగింది మొత్తం చెబుతుంది అనసూయ. మరి నా దగ్గరికి ఎందుకు రాలేదు. అది నా ఇల్లు కాకుంటే రావా అని దీప అంటుంది. నువ్ ఒంటరిగానే బతుకుతున్నావ్‌గా. నీకు వచ్చిన నువ్ చేస్తావ్. నాకు వచ్చిన పని నేన చేస్తాను. దీనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని అనసూయ అంటుంది. ఇలాంటిది జరుగుతుందనే కోర్ట్ దగ్గర నిన్నురమ్మన్నాను. పద ఇంటికి వెళ్దాం అని దీప అంటుంది.

కన్నీళ్లు పెట్టుకున్న దీప

ముందు రానని వారిస్తుంది అనసూయ. కానీ, దీప మాత్రం తను వచ్చేవరకు అక్కడే ఉంటానని, ఏం చెప్పాలనుకుంటున్నావో ఇంటికి వచ్చి చెప్పు. నాకు తండ్రి లేడు. నా మంచి కోరుకునే మనిషి నాతో ఉండాలని కోరుకుంటున్నాను. నాకోసం నీ కొడుకును కాదన్నావ్. నీకంటే మంచి మనిషి ఎవరున్నారు. పనే కావాలంటే చేయడానికి నా దగ్గర పని ఉంది అని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. దాంతో కరిగి పని పూర్తయ్యకా వస్తానని చెబుతుంది అనసూయ. దీప వెళ్లిపోతుంది.

మరోవైపు నర్సింహ చేతిలో ఓ లిస్ట్ పెడుతుంది శోభ. ఇన్నాళ్లు మీ అమ్మని మేపిన ఖర్చు, నిన్ను మేపిన ఖర్చు అంతా కలిపి ఐదు లక్షలు అయింది. ఆ డబ్బులు కట్టు అని శోభ అంటుంది. ఖర్చు పెట్టిన డబ్బు గోడకు కొట్టిన సున్నం తిరిగి రాదు అని నర్సింహ అంటాడు. దాంతో కారు తాళాలు తీసుకుని అమ్మ కారుకు ఇచ్చిన ఫైనాన్స్ పది లక్షలు. ఈ ఐదు లక్్షలు ఇచ్చేవరకు నేను నీకు కారు ఇవ్వను అని శోభ అంటుంది.

నేను ఊరుకుని చూస్తుంటే దీపకన్న దరిద్రంగా తయారు అవుతుంది నా పరిస్థితి అని శోభ అంటుంది. డబ్బుకోసం మొగుడుని నీచంగా మాట్లాడతావ. పది కాదు 20 లక్షలు నీ చేతిలో పెట్టి అప్పుడు మాట్లాడుతాను. అందుకు ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేస్తాను. అది దీపదో ఎవరిది అయితే నీకెందుకు ఎలాగోలా ఇల్లు అమ్మి డబ్బు తీసుకొస్తా అని నర్హింహ వెళ్లిపోతాడు. నాకు తెలిసి నీ అమ్మ దీప ఆ ఇల్లు అమ్మనివ్వరు. నువ్ ఏం చేసి డబ్బు తీసుకొస్తావో నేను చూస్తాను అని శోభ అనుకుంటుంది.

రెండో పెళ్లి చేసుకున్నాడేమో

మరోవైపు ప్రేమ పెళ్లి అని తొందరపడొద్దు. ముందు నువ్ జీవితంలో స్థిరపడు మంచి ఉద్యోగం చూసుకో. మీ ప్రేమ విషయం మీ నాన్నకు తెలిసిందా అని స్వప్నతో కార్తీక్ అంటాడు. అమ్మకు తెలుసు. కానీ నాన్నకు తెలిసినా ఒప్పుకోడు. ఏదో ఎప్పుడు భయంతో బతుకుతుంటాడు. మా డాడీ మమ్మీని మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడేమో అనిపిస్తుంది అని స్వప్న అంటుంది. మరి చేసుకుంటే నువ్వేం చేస్తావ్ అని కార్తీక్ అడుగుతాడు.

నమ్మకం బ్రేక్ అయితే లైఫ్ లాంగ్ క్షమించను. నేను లేచిపోయి పెళ్లి చేసుకోవట్లేదు. అలాంటప్పుడు మా అమ్మనాన్నల నమ్మకం ఎలా బ్రేక్ చేసినట్లు అవుతుంది. మా అమ్మను మా నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నా లవ్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ముందు కాశీకీ జాబ్ రావాలి అని స్వప్న అంటుంది. ఎంతమందిని ప్రేమిస్తావ్ నాన్న అని మనసులో అనుకుంటాడు కార్తీక్. కొద్దిరోజులు జాగ్రత్తగా ఉండండి అని కార్తీక్ అంటాడు.

నీ దగ్గర మంచి ఐడియా ఉంటే చెప్పు బిజినెస్‌కు నేను ఇన్వెస్ట్ చేస్తాను అని కార్తీక్ అంటాడు. దాంతో థ్యాంక్యూ చెప్పి స్వప్న వెళ్లిపోతుంది. మరోవైపు ఆడుకుంటున్న శౌర్య బూచాడు వచ్చాడంటూ దీపకు చెబుతుంది. నర్సింహ మళ్లీ ఎందుకు వచ్చాడు అనుకుని బయటకు వెళ్తుంది దీప. చూస్తే అక్కడ అనసూయ ఉంటుంది. శౌర్య నానమ్మ వచ్చింది అని దీప చెబితే.. తను బూచోడిని కూడా తీసుకొస్తుంది కదా అని శౌర్య అంటుంది.

ఎలా వద్దని అంటాను

బూచోడు రాడని దీప నచ్చజెబుతుంది. తర్వాత సుమిత్ర దగ్గరికి వెళ్లి తమ అత్తయ్యను తనతోపాటే ఉండడానికి పర్మిషన్ అడుగుతుంది దీప. తర్వాత వేరే ఇల్లు చూసుకుని వెళ్లిపోతాం అని దీప అంటే.. తర్వాత ఎందుకు ఇప్పుడే పోండి. ఆ మనిషి సరిగా పరిచయం లేనప్పుడే నీతో ఉండమన్నదాన్ని. నీకు ఇప్పుడు ఇంతపెద్ద సాయం చేశాక ఎలా వద్దని అంటాను అని సుమిత్ర అంటుంది. అనసూయ దగ్గరికి వెళ్లి మీరు కూడా మా ఆత్మీయులే అని సుమిత్ర అంటుంది.

నేను ఇప్పుడు వచ్చింది దీని కష్టంలో సగం పంచుకోవడం కోసం. మీరు నాపై జాలి చూపకండి. మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే చెప్పండి అని అనసూయ అంటుంది. జరిగిందంతా మర్చిపోయి ఇక్కడే హాయిగా ఉండండి అని చెప్పి సుమిత్ర వెళ్లిపోతుంది. తర్వాత ఇంట్లోకి అనసూయ వెళ్లిపోతుంది. శౌర్యను బాగా చదువుకోవాలని చెబుతుంది. టాబ్లెట్స్ వేసుకుని కార్తీక్‌కు ఫోన్ చేస్తాను అని శౌర్య అంటుంది. టాబ్లెట్స్ అయిపోయేసరికి నేను తీసుకొస్తాను అనసూయ అంటుంది.

మారిన అనసూయ

డబ్బులిస్తానని దీప అంటే.. నా దగ్గర ఉన్నాయిలేవే అని వెళ్లిపోతుంది అనసూయ. దాంతో అంతకుముందు అనసూయ తనదగ్గరనుంచి డబ్బులు లాక్కోవడం గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు నీ పరిస్థితి మారలేదు. నువ్ బాధ్యత తీసుకున్నావ్. మనసుకు సంతోషంగా ఉంది అని దీప అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.