Karthika deepam september 5th episode: ఇల్లు రాయమని గొడవ చేసిన నరసింహ- దీప, కార్తీక్ పెళ్లి? మొత్తం వినేసిన జ్యోత్స్న
Karthika deepam 2 september 5th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. స్వప్న పెళ్లి గురించి దీప, కార్తీక్ మాట్లాడుకోవడం విని జ్యోత్స్న తప్పుగా అర్థం చేసుకుంటుంది. దీప, కార్తీక్ పెళ్లి చేసుకోబోతున్నారని అనుకుంటుంది. కానీ అక్కడ స్వప్న ఉందనే విషయం జ్యోత్స్నకు తెలియదు.
Karthika deepam 2 serial today september 5th episode: జ్యోత్స్న ఇల్లు అంతా చూసుకుంటూ ఏం జరిగినా సరే ఈ ఇంటికి వారసురాలిని నేనే అనుకుంటూ దీపను చూసుకోకుండా ఢీ కొడుతుంది. ఏమైంది జ్యోత్స్న ఎందుకు టెన్షన్ పడుతున్నావని అడుగుతుంది. కార్తీక్ బాబు ఇంకా ముహూర్తాలు పెట్టించలేదని టెన్షన్ పడుతున్నావా అని దీప అంటుంది.
నువ్వు నా అన్నవి
చాలా మంచి విషయం గుర్తు చేశావని జ్యోత్స్న అనుకుంటుంది. స్వప్న దీప ఇంటికి వస్తుంది. కార్తీక్ కూడా హడావుడిగా దీప ఇంటి వైపు వెళ్ళడం జ్యోత్స్న చూస్తుంది. ఈరోజు ఏదో ఒకటి తెలిపోవాలని స్వప్న అంటే ఏం తెలిపోవాలని కార్తీక్ అంటాడు. నువ్వు ఇప్పుడు నిజంగా నాకు అన్నయ్యవి, కాశీకి బావ అయితే నాకు అన్నవే కదా అంటుంది.
కాశీ ఎవరు అని అడిగితే చెప్పడానికి నా దగ్గర సమాధానం ఉంది. మీరిద్దరూ వచ్చి డాడీతో మాట్లాడండి, కాశీకి జాబ్ కావాలంటే మీ రెస్టారెంట్ లో జాబ్ ఇవ్వు అని చెప్తుంది. కాశీ మా బంధువు అనే విషయం మీ నాన్నకు చెప్పకని కార్తీక్ అనడంతో ఎందుకని అడుగుతుంది.
పెళ్లి చేయడం అంత తేలిక కాదు
మీరు ఇంకా లేట్ చేస్తే మేం లేచిపోయి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అంటుంది. కార్తీక్, దీప ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని జ్యోత్స్న అక్కడికి వెళ్తుంది. అప్పుడే కార్తీక్ నువ్వు అనుకున్నంత తేలికగా ఈ పెళ్లి జరగదు. ఆల్రెడీ పెద్ద వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది జరగాలని అనుకుంటారు.
కానీ అది జరగదు. నువ్వు కోరుకున్నట్టే పెళ్లి జరుగుతుంది. కానీ నువ్వు నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఏం చేయాలో ఆలోచించుకోవడానికి టైమ్ ఇవ్వమని అంటాడు. అంత టైమ్ లేదు కదాని దీప అంటే పెళ్లి జరుగుతుంది కానీ టైమ్ పడుతుందని కార్తీక్ అంటాడు.
శౌర్య సైకిల్ బ్రేక్ బోల్ట్ తీసిన పారు
జ్యోత్స్న వాళ్ళ మాటలు తప్పుగా అర్థం చేసుకుని షాక్ అవుతుంది. ఇన్నాళ్ళూ మన మధ్య దూరం ఎంత అనేది తెలియదు కానీ ఇప్పుడు నువ్వు నా సొంత మనిషివి. నువ్వు అనుకున్నట్టే పెళ్లి జరుగుతుందని కార్తీక్ మాట ఇస్తాడు. దీంతో స్వప్న సైలెంట్ అవుతుంది. నాకున్న హోప్ మీరిద్దరే. ఒకటి కాశీతో పెళ్లి రెండు చావు ఇవి తప్ప నాకు వేరే ఆప్షన్స్ లేవని స్వప్న ఎమోషనల్ అవుతుంది.
పారిజాతం చేతికి ఆయిల్ మరకలు చూసి ఏంటి అవి అని శివనారాయణ అడుగుతాడు. అప్పుడే పారిజాతం చేసిన పని గుర్తు చేసుకుంటుంది. శౌర్య వచ్చి ఆడుకోవడానికి రమ్మని పిలుస్తుంది. దీంతో పారిజాతం కోపంగా శౌర్య సైకిల్ బ్రేక్ బోల్ట్ తీసేస్తుంది. కాఫీ తాగుతూ బయట నిలబడుతుంది.
నేను తీసిన గోతిలో నేనే పడ్డానా
సరిగా అప్పుడే శౌర్య సైకిల్ తొక్కుకుంటూ అటుగా వచ్చి పారిజాతాన్ని ఢీ కొడుతుంది. వేడి కాఫీ తగిలి తన మూతి కాలిపోయిందని సైకిల్ బ్రేక్ నొక్కొచ్చు కదా అంటుంది. వేశాను కానీ పడలేదని శౌర్య అనడంతో బ్రేక్ బోల్ట్ తీసిన విషయం గుర్తు చేసుకుని నేను తీసిన గోతిలో నేనే పడ్డానా అనుకుంటుంది.
శివనారాయణ వచ్చి ఏమైందని అంటాడు. నా సైకిల్ కి బ్రేక్ పడకపోయే సరికి జ్యో గ్రానిని గుద్దేశానని శౌర్య చెప్తుంది. శివనారాయణ చూసి బ్రేక్ దగ్గర బోల్ట్ లేదని గమనిస్తాడు. ఎవరో బోల్ట్ తీసేశారని అర్థం చేసుకుని శౌర్యను పంపించేస్తాడు. తీసిన బోల్ట్ దానికి పెట్టమని చెప్తాడు.
బోల్ట్ తీసేసి పసిదాన్ని పడేద్దామని అనుకుంటావా అని తెగ తిట్టేస్తాడు. బోల్ట్ ఎక్కడ పడేశానో అనుకుని గార్డెన్ మొత్తం వెతుకుతుంది. బోల్ట్ తీసుకుని సైకిల్ కి పెట్టేస్తుంది. కాసేపు గడ్డి పెట్టి ఛీ కొట్టి పోతాడు. జ్యోత్స్న జరిగినవన్నీ తలుచుకుని రగిలిపోతుంది.
ఇల్లు రాసివ్వమన్న నరసింహ
బావ దీపను పెళ్లి చేసుకోవడం ఏంటి? పెళ్ళికి దీప తొందర పెట్టడం ఏంటి? ఏం చేయాలో అర్థం కావడం లేదని అనుకుంటుంది. నేను నిజమైన వారసురాలు కాకపోయిన ఈ అస్తి అనుభవించాలంటే బావను పెళ్లి చేసుకోవాలి. అలా జరగాలి అంటే దీపను పెళ్లి చేసుకోవాలి కానీ ఎలా అనుకుంటుంది.
అప్పుడే నరసింహ ఎంట్రీ ఇస్తాడు. అనసూయ దీపకు సేవలు చేస్తుంటే వచ్చి వెటకారంగా మాట్లాడతాడు. ఎందుకు వచ్చావని అనసూయ అడుగుతుంది. నరసింహ నీకు నాకు ఏ సంబంధం లేదు నువ్వు ఇక్కడ నుంచి బయల్దేరమని దీప అంటుంది. పిల్ల వచ్చే టైమ్ అయ్యింది అది చూస్తే భయపడుతుంది వెళ్లిపొమ్మని అనసూయ కూడా తిడుతుంది.
ఎందుకు వచ్చావని దీప అడుగుతుంది. ఇల్లు రాయించుకున్నావట కదా. ఎవరిని అడిగి దానికి ఇల్లు రాయించావని నరసింహ అంటాడు. అది దాని తండ్రి అస్తి అంటుంది. దీన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నేను నష్టపోయాను పరిహారం కింద ఇల్లు రాయించమని నరసింహ అనడంతో అనసూయ తిడుతుంది.
ఇల్లు తన పేరు మీద రాసి పోస్టాఫీసు డబ్బులు చేతిలో పెట్టండి. లేదంటే మీ ఇద్దరినీ చంపి అయినా తీసుకుంటానని అంటాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.