Karthika deepam 2 july 26th: నిశ్చితార్థంలో నరసింహ రచ్చ.. బూచోడే తన తండ్రని తెలుసుకున్న శౌర్య
Karthika deepam 2 serial today july 26th episode: కార్తీక్, జ్యోత్స్న నిశ్చితార్థంలో నరసింహ రచ్చ రచ్చ చేస్తాడు. కార్తీక్ హాస్పిటల్ లో శౌర్యకు తండ్రిని నేనే అని చెప్పిన మాట ఇంట్లో అందరికీ చెప్పేస్తాడు. అలాగే బూచోడే తన కన్న తండ్రి అని శౌర్యకు నిజం తెలిసిపోతుంది.
Karthika deepam 2 serial today july 26th episode: కార్తీక్, జ్యోత్స్న నిశ్చితార్థం వేడుకలు మొదలవుతాయి. ఆ జంటను చూసి అందరూ మురిసిపోతారు. మా అన్నయ్య దగ్గర తీసుకున్న మాట ఇన్నాళ్ళకు నిజం అవుతుందని కాంచన తెగ సంతోషపడిపోతుంది. శౌర్య వెళ్ళి కార్తీక్, జ్యోత్స్న మధ్య కూర్చుంటానని అడుగుతుంది.

నిశ్చితార్థం వేడుక
జ్యోత్స్న మాత్రం ఇది మన ఎంగేజ్ మెంట్ నువ్వు వెళ్ళి మీ అమ్మ దగ్గర కూర్చో అంటుంది. సుమిత్ర శౌర్యను పిలుస్తుంది. కాంచన, దశరథ దంపతులను తాంబూలాలు మార్చుకోమని పంతులు చెప్తాడు. జ్యోత్స్న పట్టరాని ఆనందంతో ఉంటుంది. కార్తీక్ మాత్రం జ్యోత్స్న వైపు కాకుండా దీప వైపు చూడటం జ్యోత్స్న గమనిస్తుంది.
మనిషివి నా పక్కన ఉన్న కూడా మనసు ఎక్కడో ఉందని అంటే కార్తీక్ మనిషి ఉంటే చాలని అంటాడు. కానీ నాకు రెండూ కావాలని చెప్తుంది. నీ ఆలోచనల్లో నేను ఉండాలి. ఇప్పుడు నేను ఉన్నంత ఆనందంగా ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఇది నా జీవితానికి ఉన్న ఒకే ఒక్క కల. అది నెరవేరే క్షణం.
మనకు ఇది రెండో పెళ్లి
తాంబూలాలు మార్చుకుంటే మనకు సగం పెళ్లి అయిపోయినట్టే. కానీ నాకు మాత్రమే తెలుసు నీకు ఇది రెండో పెళ్లి అనేసరికి కార్తీక్ టెన్షన్ గా ఏం మాట్లాడుతున్నావ్ అంటాడు. నన్ను పుట్టకముందే పెళ్ళాన్ని చేసుకున్నావ్ కదా అదే చెప్తున్నా. మనకి రెండో సారి పెళ్లి జరుగుతుంది.
ఇంత అదృష్టం ఏ ఆడపిల్లకు రాదని సంతోషంగా చెప్తుంది. అటు దీప కూడా చాలా హ్యపీగా ఉంటుంది. అక్కడ తాంబూలాలు మారుతున్నాయంటే మనం కలుస్తున్నామని జ్యోత్స్న అంటుంది. ఖచ్చితంగా తాంబూలాలు మార్చుకునే టైమ్ కి నరసింహ వస్తాడు.
శౌర్య కోసం వచ్చిన నరసింహ
తనని చూసి శౌర్య షాక్ అయి గట్టిగా అమ్మా అని అరిచి దీపను కౌగలించుకుంటుంది. ఏమైందని అంటే బూచోడు వచ్చాడని చెప్తుంది. నరసింహను చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. శౌర్య లోపలికి పరిగెడుతుంది. నరసింహ వెంటే అనసూయ కూడా ఉంటుంది.
నరసింహ కార్తీక్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఎందుకు వచ్చావని దీప అడుగుతుంది. మేం వచ్చింది మీతో గొడవ పెట్టుకోవడానికి కాదు. మేం వచ్చింది మా మనవరాలి కోసమని అనసూయ చెప్తుంది. దాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చామని చెప్పడంతో దీప షాక్ అవుతుంది.
నా బతుకు ఏదో నేను బతుకుతున్నాను కదా వదిలేయండని దీప అత్తను అడుగుతుంది. నరసింహ వాగుతుంటే శివనారాయణ గట్టిగా తిడతాడు. శౌర్యని తీసుకుని రా ఇంటికి వెళ్లిపోదామని అనసూయ అంటుంది. తన కూతురిని వదిలేయమని దీప అంటుంది. నాకున్న ఒకే ఒక బంధం నేను దాన్ని ఇవ్వను అంటుంది.
కార్తీక్ గురించి చెప్పేసిన నరసింహ
నీకు బిడ్డను ఎందుకు ఇవ్వాలని సుమిత్ర నిలదీస్తుంది. భార్య, ఉయ్యాలలో ఉన్న కూతురిని వదిలేసి పోయిన వాడికి ఇప్పుడు బంధం గుర్తుకు వచ్చిందా? ఈ ఆరేళ్ళలో ఏమైపోయావు. ఇప్పుడు ఏం ప్రేమ ముంచుకొచ్చిందని తపించిపోతున్నారని అడుగుతుంది.
మిమ్మల్ని చూస్తుంటే మీకు కాబోయే అల్లుడు చెప్పిన మాటను నిజం చేసేటట్టు ఉన్నారు కదా అనేసరికి ఏంటి అదని శివనారాయణ అడుగుతాడు. శౌర్యకు తండ్రి నేను కాదంట మీ మనవడు అంట అనేసరికి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఏం కూశావ్ అని శివనారాయణ నరసింహ మీదకు చెయ్యి ఎత్తుతాడు.
అన్నాడో లేదో నీ మనవడిని అడుగు అనేసరికి కార్తీక్ తలదించుకుంటాడు. ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. శౌర్య హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఈ దీప ముందే అన్నాడని నరసింహ ఇరికించేస్తాడు. కాంచన కొడుకును నిలదీస్తుంది. అనసూయ ఆపుతుంటే నరసింహ ఆగడు.
నిజం ఒప్పుకున్న కార్తీక్
కార్తీక్ అన్నాను అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. అది నీ బిడ్డ అని చెప్తున్నా కదా మళ్ళీ ఎందుకు ఇదంతా అని అనసూయ తిడుతుంది. దానికి తండ్రి ఎవరో తెలియదు ఎలాంటి వాడో తెలిస్తే తట్టుకోలేదని దీప బతిమలాడుతుంది. నరసింహ దీపను పట్టుకుంటే కార్తీక్ వెళ్లబోతాడు.
అది వాళ్ళ గోల మనకు అనవసరం. నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెయ్యి పట్టుకుని ఆపుతుంది. అనసూయ శౌర్యను తీసుకుని కిందకు వెళ్తుంది. నువ్వు మీ నాన్న ఎప్పుడు వస్తారని మీ అమ్మను అడుగుతావు కదా నేను మీ నాన్నను తీసుకొచ్చాను అనేసరికి శౌర్య సంతోషంగా పరిగెత్తుకుంటూ వస్తుంది.
బూచోడు కాదు మీ నాన్న
నాన్న ఎక్కడని గుమ్మం వైపు చూస్తుంది. బూచోడు ఇక్కడే ఉన్నాడని శౌర్య పారిపోతుంటే ఆపి వాడు బూచోడు కాదు వీడే మీ నాన్న అని అనసూయ చెప్పేస్తుంది. ఇన్ని రోజులు మీ అమ్మ నీకు అబద్ధం చెప్పింది. వీడే నా కొడుకు వీడే మీ నాన్న అంటుంది. బూచోడు మా నాన్న కాదని శౌర్య ఏడుస్తుంది.
శౌర్య దీపను కౌగలించుకుని ఈ బూచోడు మా నాన్న కాదు అంటుంది. ఈ బూచోడు మీ నాన్న అని చెప్పు దీప అని నరసింహ అంటాడు. బూచోడు మా నాన్న కాదు కదమ్మ అని శౌర్య అడుగుతుంది. సమాధానం చెప్పమని శ్రీధర్, పారిజాతం, నరసింహ, అనసూయ నిలదీస్తారు.
వీడే మీ నాన్న అని దీప గట్టిగా అరుస్తుంది. దీంతో శౌర్య షాక్ అయిపోతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్