Karthika deepam august 28th episode: శౌర్య ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న అనసూయ, శ్రీధర్ కంటపడిన కాశీ, స్వప్న
Karthika deepam 2 august 28th: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్యకు మందులు తీసుకురావడానికి వెళ్ళిన అనసూయ వాటిని ఎందుకు వేసుకుంటారని ఆరా తీస్తుంది. తర్వాత అసలు శౌర్యకు ఏమైందని కార్తీక్ ని నిలదీస్తుంది. దేనినైనా చూసి భయపడితే శౌర్య గుండె ఆగిపోతుందని చెప్పడంతో అనసూయ ఏడుస్తుంది.
Karthika deepam 2 serial today august 28th episode: శౌర్య మందులు తీసుకురావడానికి అనసూయ వెళ్తుంది. అనుమానం వచ్చి మందుల గురించి షాపు అతన్ను ఆరా తీస్తుంది. చిన్న పిల్లలకు గుండెకు సంబంధించిన సమస్య ఉంటే వీటిని వాడతారని తెలుసుకుంటుంది. అనసూయ రోడ్డు మీద వెళ్తుంటే నరసింహ ఎదురుపడతాడు.
నరసింహ చెంప పగలగొట్టిన కార్తీక్
ఊరికి వెళ్దాం పద అర్జెంట్ గా డబ్బులతో పని ఉంది. ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేసి నీకు కొద్దిగా డబ్బు ఇచ్చి మిగతాది నేను తీసుకుంటానని చెప్తాడు. అది నా తమ్ముడు కట్టిన ఇల్లు దీపకు మాత్రమే దక్కాలి. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఇల్లు నీకు దక్కనివ్వను అంటుంది.
ఇల్లు రాసివ్వకపోతే ఊరుకుంటానా? ఏ అర్థరాత్రో వచ్చి నా కూతురిని ఎత్తుకుపోతా అనేసరికి కార్తీక్ నరసింహ చెంప పగలగొడతాడు. శౌర్య జోలికి వస్తే మర్యాదగా చెప్పడానికి నేను దీపను కాదని కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. నరసింహ దీప గురించి చెడుగా మాట్లాడుతుంటే అనసూయ అడ్డుపడుతుంది.
చంటి దాని గుండెకు ఏమైంది?
దీపకు సపోర్ట్ గా మాట్లాడటంతో నువ్వు నీ కోడలు దగ్గరకు చేరిపోయావా? అని అంటే అవును తన దగ్గరే ఉన్నాను. ఇల్లు మాత్రం నీకు రాదు అది దీపదని ఖరాఖండిగా చెప్తుంది. ఆ ఇల్లు నన్ను దాటి మీరు ఎలా కాపాడుకుంటారోనని నరసింహ హెచ్చరించి వెళ్ళిపోతాడు.
అనసూయ చంటి దాని గుండెకు ఏమైంది? మీరు సమస్య దీపకు కూడా చెప్పలేదని అర్థం అయ్యిందని కార్తీక్ ని అడుగుతుంది. కార్తీక్ శౌర్య పరిస్థితి గురించి చెప్పడంతో అనసూయ షాక్ అవుతుంది. శౌర్య అతిగా భయపడితే తన గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే తను పరిగెత్తే ఆటలు ఆడకూడదు, దేనికి ఎక్కువగా భయపడకూడదు. ఎక్కువగా ఏడ్వకూడదు. దీనికి పరిష్కారం మందులు వాడటమేనని చెప్తాడు.
కూతురి ప్రేమ తెలుసుకున్న శ్రీధర్
అది విని అనసూయ ఏడుస్తుంది. కాశీ, స్వప్న రోడ్డు మీద వెళ్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అటుగా శ్రీధర్ వెళ్తూ వాళ్ళను చూస్తాడు. వెనుకే ఫాలో అవడంతో వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు అర్థం చేసుకుంటాడు. శౌర్య గురించి దీపతో చెప్పొద్దని అనసూయను అడుగుతాడు.
దీప బతకడానికి ఒకే ఒక్క కారణం శౌర్య. తన జీవితం నుంచి దేవుడు అన్నీ లాగేసుకున్నాడు. తట్టుకుంది కానీ తను మిగిలింది మాత్రం శౌర్య కోసమే. అలాంటి శౌర్యకు గుండె సమస్య ఉందని తెలిస్తే ముందు దీప గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. తెలియకుండా ఎన్నాళ్ళు దాస్తారు అని మీరు నన్ను అడిగితే దానికి సమాధానం నా దగ్గర లేదు.
దీప మీకు ఏమవుతుంది?
కానీ నేను ఉన్నంత కాలం శౌర్యను జాగ్రత్తగా నేను చూసుకుంటానని చెప్తాడు. ఇంత అపేక్ష చూపించడానికి మీరు ఏమవుతారు. దీపను నేను పెంచిన కూతురు, నా మేనకోడలు నేనే ఇంత ప్రేమ చూపించడం లేదు. దీప ఏమవుతుందని మీరు దాని కోసం ఇంత మథనపడుతున్నారు.
అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీలాంటి చెట్టు అండ దొరికిందని అంటాడు. మీరు ఇంతగా ఎందుకు చేస్తున్నారని అంటే శౌర్య కోసం తనను చూస్తే నాకు చాలా దగ్గర మనిషిగా అనిపిస్తుంది. అది నవ్వితే మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. శౌర్య మంచి స్థాయికి ఎదిగే వరకు అండగా ఉండాలని అనిపిస్తుందని చెప్తాడు.
దీపకు తెలియకూడదు
అదే ఎందుకని మళ్ళీ నిలదీస్తుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. దీప మంచితనం, నిజాయతీ చూసి వారికి శ్రేయోభిలాషిలా ఉన్నాను. ఒకానొక సమయంలో నేను మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్తుంది. చంటి దాని గురించి ఇంకేమైనా దాస్తున్నారా అంటే లేదు కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితిలోనూ దీపకు తెలియకూడదు అంటాడు కార్తీక్.
అప్పుడే దీప వచ్చి ఏ విషయం అని ప్రశ్నిస్తుంది. ఏముంది చంటి దాని గురించి అని అనసూయ చెప్పబోతుంటే కార్తీక్ కంగారుగా అడ్డుపడతాడు. అనసూయ దార్లో నరసింహ కనిపించి గొడవ చేశాడని చెప్తుంది. ఊర్లో ఉన్న ఇల్లు కావాలంట అది నా తమ్ముడు కష్టపడి కట్టుకున్న ఇల్లు న్యాయంగా అది నీకే దక్కాలి.
ఇల్లు దీప పేరు మీద పెట్టండి
వాడు మళ్ళీ ఆ ఇంటి మీద అప్పు తీసుకుంటాడేమో అంటుంది. అది జరగకుండా ఉండాలంటే దీపను తీసుకెళ్ళి ఇల్లు తన పేరు మీద రిజిస్టర్ చేసుకుని రమ్మని కార్తీక్ సలహా ఇస్తాడు. అదంతా వద్దని దీప చెప్పినా కూడా అనసూయ మాత్రం వినిపించుకోదు. అది మీ నాన్న ఆస్తి అది నీ పేరున ఉంటే పిల్ల ఖర్చులకు ఉంటుందని నోరు జారి మళ్ళీ కవర్ చేస్తుంది.
శౌర్య వచ్చి ట్యాబ్లెట్ వేసుకున్నానని అబద్ధం చెప్తుంది. వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకోవడం చూసి జ్యోత్స్న రగిలిపోతుంది. మీరు రేపు ఊరు వెళ్తే శౌర్యను అత్త ఇంట్లో దింపమని కార్తీక్ చెప్తాడు. దీపకు మంచి సలహా ఇచ్చావని సుమిత్ర మెచ్చుకుంటుంది. శౌర్యను ఇంట్లోనే ఉంచమని చెప్తాడు. అక్కడితే నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.