Karthika deepam august 23rd episode:స్వప్న ప్రేమ గురించి తెలుసుకున్న కార్తీక్, కాశీ ఎవరో తెలుసుకుని షాకైన పారిజాతం
Karthika deepam 2 serial today episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. స్వప్న, కాశీ ప్రేమించుకుంటున్న విషయం దీప కార్తీక్ తో చెప్తుంది. అటు దీప కాపాడింది తన మనవడు కాశీ అనే విషయం పారిజాతానికి తెలిసి షాక్ అవుతుంది.
Karthika deepam 2 serial today episode: జ్యోత్స్న చేసిన పనికి ఇంట్లో అందరి ముందు తనని కడిగేస్తాడు. కార్తీక్ మాటలను దశరథ సమర్థిస్తాడు. తండ్రి కూడా కూతురికి క్లాస్ పీకుతాడు. శివనారాయణ పారిజాతాన్ని అరుస్తాడు. నువ్వు పక్కనే ఉన్నావ్ కదా నువ్వైనా చెప్పొచ్చు కదా అని సీరియస్ అవుతాడు.
కాశీ నేను ప్రేమించుకున్నాం
సుమిత్ర కూడా తిడుతుంది. పారిజాతాన్ని కూడా కలిపి గడ్డి పెడుతుంది. మీరు పక్కన ఉంటే దాని పెళ్లి అవుతుందో లేదోనని భయంగా ఉందని సుమిత్ర కోపంగా అంటుంది. జ్యోత్స్న ప్రవర్తన మీద పారిజాతం కూడా కోప్పడుతుంది.
నిన్ను ఇలా తయారు చేసి నేను తప్పు చేశానని అంటుంది. మీ బావ మనసులో నీ గురించి మంచి అభిప్రాయం లేదు. ఇలా అయితే నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడని పారిజాతం అంటుంది.
కాశీ స్పృహలోకి వచ్చాడని నర్స్ దీపకు చెప్తుంది. అప్పుడే స్వప్న వచ్చి కాశీ ఎలా ఉన్నాడని ఏడుస్తూ అడుగుతుంది. వెంటనే నేను తనని చూడాలని అంటుంది. తనకు నువ్వు ఏమవుతావని దీప అడుగుతుంది. నేను కాశీ ప్రేమించుకున్నాం. నా కోసమే తను ఇక్కడికి వచ్చాడని చెప్తుంది.
స్వప్న ప్రేమ గురించి తెలుసుకున్న కార్తీక్
చెల్లెలి ప్రేమ గురించి కార్తీక్ బాబుకు తెలిస్తే ఏమవుతుందోనని దీప అనుకుంటుంది. కార్తీక్ మాటలను గుర్తు చేసుకుంటూ జ్యోత్స్న రగిలిపోతుంది. ఆవేశంగా వెళ్లబోతుంటే పారిజాతం ఆపుతుంది. బావ మనసులో నాకు మంచి అభిప్రాయం లేదు కదా తన మనసులో ఎలా చోటు సంపాదించుకోవాలో తనకు తెలుసని హాస్పిటల్ కు వెళ్తుంది.
తాను ఎదురు రావడం వల్లే ఇలా యాక్సిడెంట్ జరిగిందని స్వప్న ఏడుస్తుంది. కార్తీక్ దీప దగ్గరకు వచ్చి కాశీ గురించి అడుగుతాడు. కాశీ దగ్గర ఉన్న స్వప్నను కార్తీక్ చూస్తాడు. నువ్వు ఇక్కడ ఉన్నావ్ ఏంటని అంటే దీప ఏం చెప్పలేదా అని అంటుంది.
నువ్వే పెళ్లి చేయాలి బాస్
అతను ఎవరో కాదు స్వప్న ప్రేమించి వ్యక్తి అని దీప చెప్తుంది. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరం ప్రాణం బాస్ అని అంటుంది. మీ నాన్నకు ఈ విషయం తెలుసా అని అడుగుతాడు. తెలియదు కాశీకి ఉద్యోగం వచ్చిన తర్వాత చెప్పాలని అనుకున్నాను. ఇంటర్వ్యూకు వెళ్తుంటే ఇలా జరిగిందని చెప్పి ఏడుస్తుంది.
చెల్లి కన్నీళ్ళు తుడిచి ధైర్యం చెప్తాడు. ఇంట్లో తెలిస్తే పెళ్లికి ఒప్పుకుంటారని నమ్మకం లేదు నువ్వే హెల్ప్ చేయాలని స్వప్న కార్తీక్ ను అడుగుతుంది. దీప నీ ప్రాణాలు కాపాడిందని స్వప్న కాశీకి చెప్తుంది. దీంతో దీపను అక్కా అని పిలుస్తూ కృతజ్ఞతలు చెప్తాడు. స్వప్న దీపకు సారి చెప్తుంది. నీ గురించి తెలియక తప్పుగా అర్థం చేసుకున్నానని అంటుంది.
దాసు మాటలు విని పారిజాతం షాక్
కాశీకి తగ్గి ఉద్యోగం చూసుకునే వరకు ఇంట్లో లవ్ మ్యాటర్ చెప్పకూడదని స్వప్న అనుకుంటుంది. జ్యోత్స్న పారిజాతం హాస్పిటల్ కు వస్తారు. నేను చెప్పినప్పుడు కారు ఆపితే ఇలా పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్ళం కాదని తిడుతుంది. ఇంతకముందు జ్యోత్స్న ఏం చేసిన రైట్ అనేదానివి ఇప్పుడు నేను ఏం చేసిన రాంగ్ అంటున్నావని జ్యోత్స్న అరుస్తుంది.
హాస్పిటల్ లో దాసును చూసి ఇక్కడ ఉన్నాడు ఏంటని అనుకుంటుంది. తెలిసిన వాళ్ళు కనిపించారని మాట్లాడి వస్తానని జ్యోత్స్నను పంపించేసి దాసు దగ్గరకు వెళ్తుంది. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావని అడుగుతుంది. దాసు వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో ఉన్నది నా కొడుకు అని చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.