Karthika deepam august 19th: తండ్రిని అసహ్యించుకున్న జ్యోత్స్న, షాక్ లో పారిజాతం, దీపకు ఉద్యోగం ఇస్తానన్న దశరథ
Karthika deepam 2 serial today august 19th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న ద్వారా దాసును ఇంటికి తీసుకురావాలని పారిజాతం అనుకుంటుంది. కానీ జ్యోత్స్న మాత్రం దాసు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. తండ్రిని అసహ్యించుకుంటుంది.
Karthika deepam 2 serial today august 19th episode: శౌర్య బూచోడు వచ్చాడని ఏడుస్తూ దీపను కౌగలించుకుని భయపడుతుంది. కాసేపు దీప కూడా కంగారుపడుతుంది. బూచోడు రాడని దీప సర్ది చెప్తుంది. నాన్నకు నేనంటే చాలా ఇష్టమని చెప్పావు కదా. నాలాగే ఉంటాడని చెప్పావు. కానీ నేను నాన్న నువ్వు చెప్పినట్టు లేడు.
శౌర్యకు ఏమైంది?
బూచోడి దగ్గరకు నేను వెళ్లను అన్నాను అని బలవంతంగా మళ్ళీ తీసుకెళ్లడానికి వస్తాడా? అంటుంది. ఎవరూ రారు కోర్టు విడాకులు ఇచ్చింది. మీ నాన్న మన జోలికి వస్తే పోలీసులు పట్టుకుపోతారని చెప్తుంది. అప్పుడే కార్తీక్ ఫోన్ చేస్తాడు. ట్యాబ్లెట్స్ వేసుకున్నావా, తిన్నావా అని సీరియస్ గా మాట్లాడతాడు.
పాపకు బాగానే ఉంది కదా ట్యాబ్లెట్స్ ఎందుకని అడుగుతుంది. ఏం లేదు పాప కళ్ళు తిరిగిపడిపోయింది కదా అందుకే కోర్స్ ఇచ్చాడని వాటిని వేసుకోవాలని చెప్పి కవర్ చేస్తాడు. శౌర్య ఆరోగ్యం గురించి దీప కంగారుపడుతుంటే కార్తీక్ సర్ది చెప్తాడు. కోర్టులో జరిగిన దాని గురించి మీ నాన్న ఏమైనా అన్నారా అని దీప కార్తీక్ ని అడుగుతుంది.
లేదని అబద్ధం చెప్తాడు. అక్కడ జ్యోత్స్న ఏదైనా గొడవ చేసిందా అంటే దీప మాట దాటేస్తుంది. కార్తీక్ బాబు శౌర్య మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. ఏదైనా దాస్తున్నారా అని అనుకుంటుంది. అటు కార్తీక్ కూడా శౌర్య గురించి ఆలోచిస్తాడు.
జ్యోత్స్నకు బుద్ధి చెప్పాలి
తన ఆరోగ్యం గురించి నీకు తెలియకూడదు. రౌడీ పరిగెత్తకూడదు భయపడకూడదు. కానీ తన ఆరోగ్యం కుదుట పడేవరకు నిజం తెలియకూడదని అనుకుంటాడు. రేపటి నుంచి నువ్వు కొత్త జీవితం మొదలుపెట్టు నీలా నువ్వు ఉండు దీప అని అనుకుంటాడు. అటు దీప కూడా కార్తీక్ చేస్తున్న సాయాన్ని తలుచుకుని కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
పారిజాతం దాసు గురించి ఆలోచిస్తుంది. జ్యోత్స్నకు బుద్ధి చెప్పి ఎలాగైనా సారి చెప్పించాలని అనుకుంటుంది. అప్పుడే ఎదురుగా జ్యోత్స్న ఉంటుంది. తాతకు నువ్వు రెండో భార్య అని తెలుసు మరి దాసు ఎక్కడ నుంచి వచ్చాడని అడుగుతుంది. ఇది మీ తాతయ్యకే కాదు నాకు రెండో పెళ్లి.
మీ తాతయ్యను పెళ్లి చేసుకోవడానికి ముందే నాకు దాసు కొడుకు. మీ నాన్న చెప్పాడు కదా బాబాయ్ అవుతాడని ఇంకోసారి కనిపిస్తే అలాగే పిలవమని చెప్తుంది. నువ్వే చెప్పావ్ కదా మనిషిని బట్టి విలువ ఇవ్వాలని. రెస్టారెంట్ లో నేను కొట్టింది నీ కొడుకునే అని నీకు తెలుసు నాకు అక్కడే ఎందుకు చెప్పలేదు.
నీ కొడుకు అయినా విలువ లేదు
ఇంటికి వచ్చిన మనిషిని డాడీ సోఫాలో కూర్చోమంటే పని వాడిలా కింద కూర్చున్నాడు. అంటే ఆ మనిషికి విలువ లేదని అర్థం. తాతయ్య కూడా అదే చెప్పారు. తప్పు చేసిన వాళ్ళకి విలువ లేదని నువ్వే చెప్పావు. అంటే అతను తప్పు చేశాడు. అందుకే నీ కొడుకు అయినా విలువ లేదు.
ఓ కుటుంబమే దూరం పెట్టిన మనిషి గురించి మాట్లాడటమే టైమ్ వెస్ట్ అంటుంది. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావ్ వాడు ఎవడో తెలుసా అని పారిజాతం ఆవేశంగా అంటుంది. ఏదో తప్పు చేశాడు అందుకే అందరూ దూరం పెట్టారు అలాంటి వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదని జ్యోత్స్న అంటుంది.
నువ్వు తప్పు చేశావా?
నువ్వు కొట్టింది నా కొడుకును అని తెలిసిన తర్వాత సారి చెప్తావ్ అనుకున్నానని పారిజాతం అంటుంది. నేనేం తప్పు చేయలేదు వయసులో పెద్దవాడిని కొట్టానని కొద్దిగా గిల్టీ ఉండేది. కానీ అతను ఎలాంటి వాడో తాత చెప్పిన తర్వాత అసలు ఫీల్ అవడం లేదు. నువ్వు కూడా అతని గురించి ఆలోచించకు. ఇంట్లోకి రానివ్వకని చెప్తుంది.
నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని పారిజాతం అంటుంది. వాడు వీడు అంటావ్ ఏంటని పారిజాతం సీరియస్ అవుతుంది. నేను ఇలా మాట్లాడటానికి కారణం నువ్వే. అలాంటి వాళ్ళకు విలువ ఇవ్వకూడదని చెప్పింది నువ్వే. ఇప్పుడు నువ్వే ఇవ్వమని అంటున్నావ్ అంటే నువ్వు చేసింది తప్పే మమ్మీ నీ విషయంలో చెప్పింది కూడా నిజమే అవుతుంది.
కన్నతండ్రిని అసహ్యించుకున్న జ్యోత్స్న
నన్ను చెడగొడుతుంది నువ్వే అని మమ్మీ అంటుంది. అది నిజం కాదని అంటే నేను చేసింది రైట్ అని నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకుంటావా? మరోసారి అతన్ని ఇంకెప్పుడు ఇంటికి రానివ్వకు అనేసి వెళ్ళిపోతుంది. పెంచిన పాము కాటేసినట్టు నా పెంపకమే నాకు శత్రువు అయ్యింది.
శివనారాయణ చేసిన పనికి కోపంతో వాడి కూతురైన నిన్ను ఇంటికి వారసురాలిని చేశాను. కన్నతండ్రి దాసును కొట్టావ్, అసహ్యించుకుంటున్నావ్. మీ ఇద్దరినీ దగ్గర చేసి నీ ద్వారా వాడిని ఇంటికి తీసుకురావాలని అనుకున్నాను. అదంతా నాశనం చేశావ్.
నిన్ను ఎంత ప్రమాదంగా పెంచానో నాకు ఇప్పుడు అర్థం అవుతుందని బాధపడుతుంది. దీపతో దశరథ సుమిత్ర మాట్లాడతారు. మా ఇంటికి వచ్చినప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూనే ఉన్నావ్. ఇప్పుడు నీ జీవితం, నీ కూతురు జీవితం నీ చేతుల్లోనే ఉంది. నీకేం సాయం కావాలో చెప్పు చేస్తాం.
దీపకు ఉద్యోగం ఇస్తానన్న దశరథ
సొంతంగా వ్యాపారం పెట్టుకుంటానంటే చెప్పు సాయం చేస్తాం. లేదంటే మా రెస్టారెంట్ లో పని చేస్తావా అందులో వంట మనిషి అవకాశం ఉందని ఉద్యోగం ఆఫర్ చేస్తాడు. నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావ్ మా నుంచి ఏం సాయం కావాలని అనుకుంటున్నావని దశరథ అడుగుతాడు.
దీప మౌనంగా ఉంటుంది. ఇదే మీ అమ్మానాన్న అడిగితే ఇలాగే ఆలోచిస్తావా అని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న వచ్చి వెటకారంగా మాట్లాడటం మొదలుపెడుతుంది. తనకేం కావాలో తను అడుగుతుంది నువ్వు తనని ఇబ్బంది పెట్టకు అనేసి దశరథ అంటాడు. చెప్పు దీప నీకేం సాయం కావాలి అని జ్యోత్స్న కూడా అడుగుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.