Karthika deepam serial august 16th: కార్తీక్ ని అనుమానించిన శ్రీధర్.. దాసు రాకతో దీప జీవితం ఏ మలుపు తిరగబోతుంది?
Karthika deepam serial august 16th: రెస్టారెంట్ లో తీసిన ఫోటో జ్యోత్స్న శ్రీధర్ కు పంపిస్తుంది. దీంతో శ్రీధర్ కొడుకును అనుమానిస్తాడు. ఇదంతా ఆగిపోవాలంటే అవుట్ హౌస్ నుంచి దీప అనే దరిద్రం వదిలించుకోవాలని అనుకుంటాడు. అటు పారిజాతం కొడుకు దాసు ఇంటికి వస్తాడు. తన కూతురిని చూడాలని పట్టుబడతాడు.
Karthika deepam serial august 16th: జ్యోత్స్న దీప గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. దీంతో కోపం పట్టలేక సుమిత్ర కొట్టబోతూ దీపను చూసి ఆగిపోతుంది. ఎందుకు అనవసరంగా గొడవ చేస్తావని పారిజాతం అంటే ఇది ఇలా తయారు అవడానికి కారణం మీరేనని సుమిత్ర అంటుంది.
తప్పు ఒప్పుకున్న పారిజాతం
అవును నీ కూతురు విషయంలో నేను తప్పు చేశానని అంటుంది. గ్రాని నువ్వు ఎందుకు తప్పు ఒప్పుకుంటున్నావని అంటే పారిజాతం కోపంగా నువ్వు ఇక మాట్లాడకు అని గట్టిగా అరుస్తుంది. ఇంటికి తాళం చూసి దీప బాధపడుతుంది. నువ్వు తాళం వేయకుండా వెళ్లిపోయావని నేనే వేయమన్నానని సుమిత్ర కవర్ చేస్తుంది.
నేను అంతా చూశానని దీప అంటుంది. విడాకులు వచ్చిన తర్వాత నా తల మీద ఉన్న బరువు మొత్తం దిగిపోయింది. కానీ జ్యోత్స్న ఇంకా మోస్తూనే ఉంది. తొందర్లోనే తను అర్థం చేసుకుంటుందని అంటుంది. శౌర్య ఏది అంటే అడిగింది కొనివ్వలేదని అలిగి బయట కూర్చుందని అంటుంది.
పాపకు తినిపించడానికి నువ్వు ఎవరు?
ఇక అంతా మంచే జరుగుతుందని సుమిత్ర నచ్చజెప్తుంది. కార్తీక్ ఫోటోను జ్యోత్స్న శ్రీధర్ కు కూడా పంపిస్తుంది. శ్రీధర్ ఆవేశంగా కొడుకును తిడతాడు. ఫోటో చూపించి దీనికి ఏం సమాధానం చెప్తావని అడుగుతాడు. ఫోటో జ్యోత్స్న పంపించిందని తెలుస్తుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత కూడా ఇంత అనుమానం ఉండకూడదని అంటాడు.
జ్యోత్స్న చిన్న పిల్ల అన్ని తెలిసిన నేనే నిన్ను అనుమానిస్తున్నాను. దీప కేసు కోర్టుకు వెళ్ళిన దగ్గర నుంచి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నాను. నలుగురు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. నువ్వు ఎవరు ఆ పాపకు తినిపించడానికి అంటాడు.
పాపకు ఆకలేస్తుంది అంటే సుమిత్ర అత్త తీసుకెళ్లమన్నది అందుకే తీసుకెళ్ళానని చెప్తాడు. పాప మీద జాలి చూపించడానికి నువ్వు ఎవరు అంటాడు. మనిషిని నేను గుడిలో జరిగిన ప్రమాదంలో అత్త చనిపోయి ఉంటే ఇప్పుడు మన కుటుంబం ఇలా ఉండేది కాదు. అత్తను కాపాడేందుకు దీపలో ఏ మానవత్వం ఉందో శౌర్యను నరసింహ నుంచి కాపాడేందుకు నాలోనూ అదే మానవత్వం ఉంది.
స్వప్న జోడీ ఎంట్రీ
ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కోర్టు తీర్పు ఇచ్చింది ఇక ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఫోటో పంపించిన వాళ్ళకు చెప్పు మనసుతో ఆలోచించమని అంటాడు. నువ్వు చేసినట్టు నీ కొడుకు తప్పు చేయడని మనసులో అనుకుంటాడు. దీపతో ముందు అవుట్ హౌస్ ఖాళీ చేయిస్తే కానీ దరిద్రం వదిలిపోదని శ్రీధర్ అనుకుంటాడు.
స్వప్నకు జోడీ కాశీ ఎంట్రీ ఇస్తాడు. ఇద్దరూ కాసేపు సరదాగా గొడవ పడతారు. దీప తండ్రి ఫోటో ముందు దీపం వెలిగించి తన బాధను చెప్పుకుంటుంది. నీ అక్క కొడుకు అని నాకు ఇచ్చి పెళ్లి చేశావు కానీ వాడు చేసిన పనులు చూస్తే నువ్వే చంపేసి ఉండే వాడివని అంటుంది.
దాసు రాకతో దీప జీవితం మారుతుందా?
కార్తీక్ నా ఫ్రెండ్ అతను ఎప్పుడూ నాతోనే ఉండాలి. బూచోడు మా నాన్న అంట నాకు ఇష్టం లేడు. బూచోడు ఎప్పడూ ఇక్కడికి రాకూడదని శౌర్య కోరుకుంటుంది. గతాన్ని విడిచి పెట్టి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. నాకు మీలాంటి సాయం కావాలి నాన్న అని దీప మనసులో అనుకుంటుంది.
అప్పుడే దాసును చూపిస్తారు. పారిజాతం కొడుకుని తలుచుకుని బాధపడుతుంది. దాసు హైదరాబాద్ ఎందుకు వచ్చాడు నన్ను కలవకుండా ఎందుకు ఉన్నాడని అనుకుంటుంది. గతంలో చేసిన తప్పును గుర్తు చేసుకుంటుంది. అప్పుడే దాసు తల్లి దగ్గరకు వస్తాడు.
నా కూతురిని చూడాలి
కొడుకును చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. ఉన్నట్టుండి ఫోన్ కూడా చేయకుండా ఎందుకు వచ్చావని అడుగుతుంది. నా కూతురు కోసమని చెప్తాడు. నీ కూతురా అంటూ షాక్ అవుతుంది. అవును నా కూతురు అంటాడు. నిజాలన్నీ నేను సమాధి చేసిన తర్వాత ఎలా తెలిసిందని మనసులో అనుకుంటుంది.
నువ్వు బిడ్డలని మార్చిన విషయం నాకు తెలుసని అనుకుంటాడు. నా కంతా తెలుసు కానీ నాకు తెలుసనే విషయం నీకు తెలియదు. నాకు మాత్రమే తెలిసిన నిజం నీకు తెలియదు. దశరథ కూతురు బతికే ఉంది. ఇప్పుడు నేను వచ్చింది నా కూతురు కోసమే అంటాడు.
నీ కూతురు పుట్టినప్పుడే చనిపోయింది కదాని పారిజాతం అంటుంది. నా కూతురు ఇంట్లోనే ఉందని అనేసరికి షాక్ అవుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.