Karthika deepam august 14th: జ్యోత్స్న కన్నతండ్రి ఎంట్రీ.. శౌర్య విషయంలో దీపకు భరోసా ఇచ్చిన కార్తీక్
Karthika deepam 2 serial today august 14th episode: జ్యోత్స్న కన్నతండ్రి దాసు ఎంట్రీ ఇస్తాడు. కూతురు ఎలా ఉందో చూడాలని అనుకుంటాడు. అటు దీప జరిగింది తలుచుకుని బాధపడుతుంది. శౌర్య చదువు విషయంలో ఎప్పటికీ తాను అండగా ఉంటానని కార్తీక్ భరోసా ఇస్తాడు.
Karthika deepam 2 serial today august 14th episode: శౌర్య తాను అమ్మ దగ్గరే ఉంటానని చెప్పడంతో దీప చాలా ఎమోషనల్ అవుతుంది. నీ కూతురు నీ దగ్గరే ఉంటుంది నువ్వు నిరభ్యంతరంగా తీసుకెళ్లవచ్చు. ఈరోజు ఇచ్చిన తీర్పు మనసుకు చాలా సంతోషంగా ఉందని జడ్జి కూడా తల్లీకూతుళ్లను చూసి ఎమోషనల్ అవుతాడు.
కన్నతల్లిలా నన్ను కాపాడారు
జ్యోత్స్న పారిజాతం షాక్ లో ఉండిపోతారు. నేను చెప్పిందే జరిగింది ఎటొచ్చి నష్టపోయింది మనమేనని జ్యోత్స్న రగిలిపోతుంది. అందరూ కలిసి తనని వెధవను చేశారని నరసింహ చిరాకుగా వెళ్ళిపోతాడు. దీప అనసూయ దగ్గరకు వెళ్తుంది. దీప అనసూయ కాళ్ళు పట్టుకుంటుంది.
నా కన్నతల్లి బతికి ఉన్నా ఏం చేసేదో నాకు తెలియదు. మీరు ఈరోజు నా కన్నతల్లిలాగా నన్ను కాపాడి నా జీవితాన్ని నిలబెట్టారు. నా కూతురిని నాకు దూరం కాకుండా చేశారు. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేనని అంటుంది. అనసూయ వెళ్తానని అంటే ఇంతజరిగిన తర్వాత మీ కొడుకు, కోడలు మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్లగొడతారు.
మీరు నాతో వచ్చెయ్యండి ఊర్లో ఎలా కలిసి ఉన్నామో అలాగే ఉందామని దీప అడుగుతుంది. అనసూయ మాత్రం వెళ్ళిపోతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఇటు కూతురిని, అటు నీ జీవితాన్ని కాపాడుకున్నావని జ్యోతి మెచ్చుకుంటుంది. ఓర్పు, సహనంతో మాత్రమే కాకుండా మంచితనంతో మనుషులను గెలుచుకున్నావని అంటుంది.
జ్యోత్స్న కన్నతండ్రి ఎంట్రీ
సీరియల్ లోకి పారిజాతం కొడుకు దాసు ఎంట్రీ ఇస్తాడు. దీపను కుబేర ఏ బస్టాండ్ నుంచి తీసుకెళ్లాడో అక్కడికి వచ్చి అంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఒక పుట్టుక, ఒక చావు, ఒక బతుకు ఆ సంఘటన జరిగి ఎన్నేళ్ళు అయినా ఇప్పటికీ అది నా కళ్ల ముందే జరిగినట్టు ఉంది.
అది ఇద్దరి తలరాతలను మార్చేసిన రాత్రి. ఒక పని మనిషి కూతురు యజమాని అయ్యింది. ఇక యజమాని కూతురు అనాథ అయ్యింది. ఆ అనాథ ఒక అభ్యాగ్యుడి చేతిలో పడింది. వాడు ఎవడో ఎక్కడ ఉంటాడో తెలియదు. నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టొద్దని శివనారాయణ నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు.
కానీ నా తల్లి అదే శివనారాయణ మనవరాలిని అనాథను చేసి నా కూతురిని యువరాణిని చేసింది. ఇప్పుడు నా కూతురు ఎలా ఉందో అనాథ అయిన ఆ ఇంటి వారసురాలు ఎలా ఉందోనని గతాన్ని తలుచుకుంటాడు. తన కూతురిని ఒక్కసారైనా చూడాలని అనిపిస్తుందని అనుకుంటాడు.
జ్యోత్స్న, పారిజాతం రెస్టారెంట్ కి వస్తారు. జరిగింది మర్చిపొమ్మని పారు సర్ది చెప్తుంది. బావ నాకు దక్కడు అని భయపడటానికి కారణం దీప. బావ దీపను కలవడానికి కారణం శౌర్య, నా ఎంగేజ్ మెంట్ ఆగిపోవడానికి కారణం నరసింహ. విడాకులు రావడానికి కారణం అనసూయ.
ఫ్రస్టేషన్ లో జ్యోత్స్న
వీళ్లలో వీళ్ళకు ఉన్న గొడవలతో బావను పెళ్లి చేసుకోవాల్సిన నన్ను ఇలా చేశారని తిట్టుకుంటుంది. విడాకులు వచ్చాయి కదా దీప దాని దారి అది చూసుకుంటుందిలే . కోర్టు విడాకులు ఇచ్చింది కదా ఇక దీప కార్తీక్ కలవరు కలిసే అవకాశం కూడా లేదని పారిజాతం అంటుంది
అప్పుడే కార్తీక్ దీప వాళ్ళను తీసుకుని అదే రెస్టారెంట్ కి వస్తాడు. వాళ్ళను చూస్తే ఏమనిపిస్తుందని అంటే వీళ్ళు విడాకుల పార్టీ ఇచ్చుకుంటున్నారని అంటుంది. దీప కోర్టులో జరిగింది తలుచుకుని ఏడుస్తూ పక్కకి వెళ్ళిపోతుంది. వెనుకే కార్తీక్ వస్తాడు. జరిగింది తలుచుకుని ఆనందపడాలి బాధపడటం కాదని అంటాడు.
నా కన్నీళ్ళు ఇన్నాళ్ళూ నరసింహ వల్ల నేను అనుభవించిన దానికి వీడ్కోలు. అత్తయ్య కోర్టులో కొడుక్కి అనుకూలంగా మాట్లాడినట్టయితే శౌర్య ఇప్పుడు నరసింహ దగ్గర ఉండేది. నేను ఆ ఇంటి గుమ్మం దగ్గర ఏడుస్తూ ఉండే దాన్ని అంటుంది. మీ అత్తయ్య మనిషిగా ఆలోచించి నిజం చెప్పింది.
ఇది మీ కన్నీటికి వీడ్కోలు. కష్టాలకు ముగింపు. ఇన్ని రోజులు మీరు మోసిన అవమానాల నుంచి విడుదల జరిగిందని అంటాడు. దీనికి కారణం మీరే మీ మేలు మర్చిపోలేను అంటుంది. శౌర్యకు చదువుకు సంబంధించిన ఏ సాయం కావాలన్నా శ్రేయోభిలాషి కార్తీక్ ఉన్నాడని భరోసా ఇస్తాడు.
తరువాయి భాగంలో..
జ్యోత్స్న తండ్రి దాసు చెంప పగలగొడుతుంది. అది చూసి పారిజాతం షాక్ అవుతుంది. ఆవేశంగా వెళ్ళి జ్యోత్స్న దీప ఇంటికి తాళం వేస్తుంది. తాళం ఎందుకు వేశావని సుమిత్ర అడుగుతుంది. కార్తీక్ శౌర్యకు ఫుడ్ తినిపించే వీడియో చూపిస్తుంది. నేనే దాన్ని తీసుకుని రెస్టారెంట్ కి వెళ్ళమని చెప్పానని అంటుంది. జ్యోత్స్న దీప గురించి తప్పుగా మాట్లాడేసరికి సుమిత్ర కూతురి మీదకు చెయ్యి ఎత్తుతుంది. అప్పుడే దీప వస్తుంది.