Karthika deepam august 8th: నరసింహతో విడాకులు ఇప్పించమన్న దీప.. తండ్రి నుంచి కాపాడమని కార్తీక్ ని కోరిన శౌర్య
Karthika deepam 2 serial today august 8th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. నరసింహతో తనకు విడాకులు ఇప్పించమని దీప లాయర్ జ్యోతిని కలుస్తుంది. అది అంత తేలిక కాదని జ్యోతి చెప్పినా కూడా వినిపించుకోదు.
Karthika deepam 2 serial today august 8th episode: దీప జ్యోతిని కలిసేందుకు వస్తుంది. తన పరిస్థితి చూసి ఏమైంది నీకు నిన్ను చూస్తుంటే భయంగా ఉందని అంటుంది. నాకు విడాకులు కావాలి మేడమ్. ఇన్ని రోజులు పోరాడి అలిసిపోయాను. ఇంతకుమించి భరించడం నా వల్ల కాదు. నేను ఏ తప్పు చేయకుండానే చాలా నిందలు భరించాను.
విడాకులు కావాలి
కానీ ఈరోజు పడిన మాటలు నా జీవితంలో మళ్ళీ పడలేనని దీప చెప్తుంది. నేను ఇక ఆ మనిషితో వేగలేను. నాకు విడాకులు కావాలని అడుగుతుంది. అంత తేలికగా రావని జ్యోతి అంటుంది. వస్తాయి అందుకు ఏం చేయాలో నేను చేస్తానని అంటుంది.
విడాకుల కోసం అర్జీ పెట్టండి. నేను చెప్పాల్సింది కోర్టులో చెప్తానని చెప్పి దీప వెళ్ళిపోతుంది. నేను మీ భార్యాభర్తలను కలిపి మీ సంసారం బాగు చేయాలని చూస్తున్నాను కానీ నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావ్ ఏంటని జ్యోతి అనుకుంటుంది.
సుమిత్ర దీప గురించి బాధపడుతుంది. నా ప్రాణాలను కాపాడిన దీపకు ఏ సాయం చేయలేకపోతున్నానని ఫీలవుతుంది. రేపు ఏదైనా జరిగి బిడ్డ దూరం అయితే దీప పరిస్థితి ఏంటని దశరథ కూడా అంటాడు. దీప చచ్చిపోతుంది. తను బతుకుతుంది శౌర్య కోసమని సుమిత్ర అంటుంది.
పారిజాతం దెప్పిపొడుపు
పారిజాతం వచ్చి దీప గురించి కన్నతల్లిలాగా ఆలోచిస్తున్నావ్. అదే నీ కన్న కూతురు జ్యోత్స్న గురించి ఆలోచించి ఉంటే బాగుండేది. జ్యోత్స్నకు తన బావ కార్తీక్ అంటే ప్రాణమని తెలియదు. నిశ్చితార్థం ఆగిపోయినందుకు, బావ మీద నిందలు పడుతున్నందుకు జ్యోత్స్న ఎంత కుంగిపోతుందో మీరు ఆలోచించడం లేదని పారిజాతం దెప్పిపొడుస్తుంది.
నువ్వు నీ అల్లుడి గురించి ఆలోచించడం మానేసి తనకి ఈ గతి పట్టించిన దీప గురించి ఆలోచిస్తుంటే ఆశ్చర్యంగా ఉందని అంటుంది. జ్యోత్స్న నా కన్న కూతురు, కార్తీక్ నా మేనల్లుడు. వాళ్ళిద్దరి మీద ఉన్న ప్రేమ వేరు. దీప మీద ఉన్న అభిమానం వేరు. అనుకున్న ముహూర్తానికి నిశ్చితార్థం జరగలేదని నాకు బాధ ఉంది.
శౌర్య మిస్సింగ్
అలాగని ఏడవాల్సిన అవసరం లేదు. వాడు కావాలని ఆపుకోలేదు. అలాంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు కాకపోతే రేపు జరుగుతుంది. కానీ ఇప్పుడు సమస్యల్లో ఉంది దీప. తన పట్ల కృతజ్ఞత చూపించాలి. నింద పడిన మగాడిని క్షమిస్తుంది కానీ ఆడదాన్ని మాత్రం క్షమించదు.
అమ్మ మనసుతో ఆలోచిస్తే దీప ఎంత దీన స్థితిలో ఉందో అర్థం అవుతుందని సుమిత్ర అంటుంది. దీప దిగులుగా కాళ్ళకు చెప్పులు లేకుండానే ఇంటికి వస్తుంది. శౌర్య కోసం ఇల్లంతా చూస్తుంది కానీ కనిపించదు. సుమిత్ర దగ్గరకు వచ్చింది శౌర్య గురించి అడుగుతుంది.
బయటే ఉందని సుమిత్ర చెప్తుంది. బయట లేదని దీప చెప్పడంతో సుమిత్ర వాళ్ళు కంగారుపడతారు. మీ ఆయనో, మీ అత్త వచ్చి తీసుకెళ్ళి ఉంటారని పారిజాతం అనేస్తుంది. శౌర్య ఇంటి బయట లేకపోయే సరికి కార్తీక్ బాబు తీసుకెళ్లారు ఏమో అనుకుని ఫోన్ చేస్తుంది.
నరసింహ మనకు దేవుడు
పారిజాతం సంతోషంగా జ్యోత్స్న దగ్గరకు వచ్చి శౌర్య కనిపించడం లేదని చెప్తుంది. ఇది నరసింహ పనే అయి ఉంటుందని జ్యోత్స్న చెప్తుంది. ఇంట్లో అందరూ తన కోసం సెర్చింగ్ చేస్తున్నారు. ఈ కథలో నరసింహ విలన్ కానీ వాడు మనలాగే ప్రేక్షకుడి మాదిరిగా చూస్తున్నాడని పారిజాతం అంటుంది.
ఇప్పుడు వాడే మనకు దేవుడు. వాడు చేస్తున్న పనుల వల్ల మనకు ఒక మంచి జరగబోతుంది. కోర్టు నరసింహకు అనుకూలంగా తీర్పు ఇస్తే దీప దుకాణం సర్దేసి వెళ్ళిపోతుంది. వాడు డైరెక్ట్ గా కోర్టుతో పని లేకుండ శౌర్యను తీసుకెళ్లిపోతే ఇప్పుడు తండ్రి ఎవరో తెలిసిపోయింది కాబట్టి దీప కూతురిని వెనక్కి తెచ్చుకోలేదు.
వాళ్ళ అత్త అనసూయ ఇవ్వనివ్వదు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని అనుకుంటారు. దీప కూతురి కోసం నరసింహ దగ్గరకు వెళ్తానని అంటుండగా కార్తీక్ వస్తాడు. ఏమైందని అడుగుతాడు. శౌర్య కనిపించడం లేదు నరసింహ తీసుకుని పోయాడు ఏమోనని దీప అంటుంది.
కార్తీక్ నువ్వు ఎక్కడికి వెళ్లకు
కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు ఇలాంటి పనులు చేయడని కార్తీక్ చెప్తాడు. అప్పుడే శౌర్య ఇంట్లోని కబోర్డ్ లో నుంచి బయటకు వస్తుంది. శౌర్యను చూసి అందరూ ఊపిరి పీల్చుకుంటారు. నన్ను ఎత్తుకుపోవడానికి బూచోడు వస్తాడు కదా నువ్వు ఇంటి దగ్గర లేవు. భయంతో బీరువాలో దాక్కున్నానని చెప్తుంది.
ఎవరూ రారని దీప అంటుంది. కానీ శౌర్య మాత్రం లేదు బూచోడు వస్తాడంట జో చెప్పింది. నాకు బూచోడు వద్దు నేను ఎక్కడికీ వెళ్ళను నీతోనే ఉంటానని దీపతో చెప్తుంది. కార్తీక్ నువ్వు ఎక్కడికి వెళ్లకు. నువ్వు వెళ్లిపోతే బూచోడు పట్టుకుపోతాడు. ఇప్పటి వరకు బూచోడు వస్తాడని భయంతో దాక్కున్నాను. నీ గొంతు విని బయటకు వచ్చానని చెప్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్