Karthika deepam july 31st: దీపను ఇంటికి తెచ్చిన సుమిత్ర.. నా ఇంటి గడప ఎందుకు తొక్కావ్ పో బయటకన్న జ్యోత్స్న
Karthika deepam serial july 31st episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప వెళ్లిపోతుందని కార్తీక్ చెప్పడంతో సుమిత్ర హాస్పిటల్ కు వస్తుంది. తనని ఒప్పించి మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకొస్తుంది. దీంతో జ్యోత్స్న మాటల యుద్దం చేస్తుంది.
Karthika deepam 2 serial july 31st episode: కార్తీక్ సుమిత్రకు కాల్ చేసి అర్జెంట్ గా హాస్పిటల్ కి రమ్మని పిలుస్తాడు. నువ్వు మాత్రమే దీపను ఆపగలవు లేదంటే తను మనకు దక్కదు అనేసి అంటాడు. దీంతో సుమిత్ర తినే అన్నంలో చెయ్యి కడిగేసి వెళ్లబోతుంటే జ్యోత్స్న కోపంగా ప్లేట్ విసిరికొడుతుంది.
మీకు ఏమైంది?
మీ అందరికీ ఏమైంది. ఈరోజు ఇంట్లో జరగబోయే నిశ్చితార్థం ఆగిపోయింది. దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? మళ్ళీ ఎప్పుడు ముహూర్తాలు పెట్టుకుందామని, వేరే చోట ప్లాన్ చేద్దామని ఆలోచన ఉందా? కనీసం జరిగిన దానికి కొంచెమైన ఫీల్ అవుతున్నారా?
నేను వచ్చి ఇంతసేపు అయ్యింది కనీసం ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేదు. పక్కన ఉన్న కూతురు ఏం చేస్తుందో అవసరం లేదు కానీ ఎక్కడో ఉన్న దీప కావాలి అంటూ కడిగేస్తుంది. ఎందుకు ఎంత తప్పుగా అర్థం చేసుకుంటున్నావని సుమిత్ర అంటుంది.
నీ ప్రేమ ఇద్దరికీ పంచుతానంటే కుదరదు మమ్మీ అంటుంది. దీప మీద నాకు ఉంది జాలి నా ప్రాణాలు కాపాడిన మనిషి ఇప్పుడు ఆపదలో ఉంటే సాయం చేయడం ధర్మం కదా అంటుంది. ప్రాణాలు కాపాడిందనే ఒక్క రీజన్ తో దీప అందరి ప్రాణాలు తీస్తుందణి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది.
శివనారాయణ ఎమోషనల్
శివనారాయణ జ్యోత్స్నను ఆపేందుకు చూస్తాడు. మధ్యలో పారిజాతం కల్పించుకుంటే కాస్త గడ్డి పెడతాడు. అన్నాన్ని ఇలా నేలకేసి కొట్టకూడదని అంటాడు. అన్నం గురించి ఉన్న బాధ కంటే మీరు నా మీద ఇంత ప్రేమ చూపిస్తే బాగుండేదని సీరియస్ అవుతుంది.
సుమిత్రను దశరథ హాస్పిటల్ కి పంపిస్తాడు. జ్యోత్స్న బాధను గుర్తించాలి. కానీ దీప సమస్యలో ఉంది. తను ఎక్కడో ఉండి సమస్యలో ఉంటే పట్టించుకొకపోయిన పరవాలేదు కానీ తనని మనం కోరి ఇంట్లో తెచ్చి పెట్టుకుని ఇప్పుడు తనని పట్టించుకొకపోతే ఎలా అంటాడు.
సుమిత్రకు క్షమాపణలు చెప్పిన కార్తీక్
నిశ్చితార్థం ఆగిపోవడానికి కారణం దీప కాదు తన భర్త. వాడు రాకపోయి ఉంటే శౌర్యకు నిజం తెలిసేది కాదు అది కళ్ళు తిరిగిపడిపోయేది కాదని దశరథ అంటాడు. పరిస్థితులను చూసి ఎవరిని తప్పు పట్టాలో అర్థం కావడం లేదని శివనారాయణ చాలా ఎమోషనల్ అవుతాడు.
సుమిత్ర హాస్పిటల్ కి వస్తుంది. జ్యోత్స్న వచ్చింది ఆ తర్వాత నుంచి దీప వెళ్లిపోతానని అంటుందని చెప్తాడు. నీ కూతురితో ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకున్నందుకు కోపం రావడం లేదా అత్త అని అడుగుతాడు. ఎంగేజ్ మెంట్ ఆపడానికి వేరే కారణం చెప్పి ఉంటే కొట్టేదాన్ని కానీ ఒక తల్లికి బిడ్డను దూరం కాకుండా కాపాడావు అని మెచ్చుకుంటుంది.
థాంక్స్ అత్త అంటాడు. డాక్టర్ తో మాట్లాడదామని దీప వెళ్లబోతుంటే సుమిత్ర ఎదురుపడుతుంది. ఇంటికి వెళ్దాం రమ్మని పిలుస్తుంది. నేను ఇక ఆ ఇంటికి రాలేనని అంటుంది. జ్యోత్స్న కోపంలో ఉంది పైగా మా అత్తయ్య దాని బుర్ర చెడగొడుతుంది. నువ్వు ఇంటికి రావు అప్పుడు జనాలు ఏమని అనుకుంటారు.
తప్పు చేసినట్టే అవుతుంది
నిజంగా తప్పు చేసింది అందుకే వెళ్లిపోయిందని అంటారు కదా అంటుంది. నువ్వు ఎంత ఆత్మాభిమానం కల మనిషివో నా మేనల్లుడు కూడా అంతే ఆత్మాభిమానం కలిగిన మనిషి. చేయని తప్పుకు ఇద్దరు దోషుల్లాగా మిగిలిపోయారు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవడం వల్ల తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కాదు నీకు సాయం చేసిన మనిషిని దోషిగా నిలబెట్టినట్టే.
అదే జ్యోత్స్న, కార్తీక్ పెళ్లి అయిన తర్వాత నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటే మంచిది. నా కూతురు పెళ్లి అయ్యే వరకు నా దగ్గరే ఉండు. ఉంటానని ఇది వరకే మాట ఇచ్చావు అని సుమిత్ర సర్ది చెప్తుంది. మన ఇంటికి వెళ్దాం రా దీప అని ప్రేమగా పిలుస్తుంది. సుమిత్ర శౌర్య దగ్గరకు వచ్చి మన ఇంటికి వెళ్దాం పద అని తీసుకెళ్తుంది.
హాస్పటిల్ కి వెళ్లానని నరసింహ తల్లికి చెప్తాడు. శోభ నోటికి పని చెప్తూ వాగుతూనే ఉంటుంది. మాకు ఈ దరిద్రం రావడానికి కారణం నువ్వే. నీకే పిల్లలు పుట్టి ఉంటే ఆ బుడ్డ దాని కోసం తిప్పలు పడాల్సిన అవసరం ఏముందని అనసూయ శోభను తిడుతుంది. దీంతో శోభ శోకండాలు మొదలుపెడుతుంది.
తండ్రిగా మారమన్న అనసూయ
పెళ్ళాం మీద ఉన్న కోపం కూతురి మీద చూపించకు. బిడ్డ కావాలంటే రాక్షసుడిలా కాదు తండ్రిగా ఉండు అని అనసూయ హితబోధ చేస్తుంది. నేను దాన్ని వదిలిపెట్టను నా కూతురిని ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అంటాడు. సుమిత్ర దీపను తీసుకుని ఇంటికి వస్తుంది.
దీప మాత్రం మళ్ళీ ఇక్కడికి రావడం చాలా కష్టంగా ఉంది. జ్యోత్స్న ఏమనుకుంటుందో ఏమోనని అంటుంది. ఇది వచ్చిన తర్వాత కాదు రాకముందు ఆలోచించాలని జ్యోత్స్న అంటుంది. దీప జ్యోత్స్నకు క్షమాపణలు చెప్తుంది. జరగాల్సిన నిశ్చితార్థం నా కారణంగానే ఆగిపోయింది అంటుంది.
నీకు కష్టమంటే ఇంట్లో పూనకాలే
మా ఇంట్లో నేను మా గ్రాని తప్ప ఇంట్లో అందరూ నీ ఫ్యాన్స్ అని చెప్తుంది. సుమిత్ర జ్యోత్స్నను ఆపేందుకు చూస్తుంది. కానీ జ్యోత్స్న మాత్రం ఆగదు. నా ఇంటి గడప మళ్ళీ ఎందుకు తొక్కావ్ బయటకు పో అని అనలేదు కదా మమ్మీ ఎందుకు నన్ను ఆపుతున్నావ్. నీకు ఏదైనా కష్టం వస్తే చాలు మా ఇంట్లో అందరికీ పూనకాలు వస్తాయి. మా బావ శివతాండవం చేస్తే మా మమ్మీ జాగారం చేస్తుంది.
దీప అంటే చాలు ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నానని కూడా గుర్తు రాదు. అంత ప్రేమ నువ్వంటే తినే బోజనం కూడా వదిలేసి దీపకు ఏమైందోనని మా మమ్మీ పరిగెత్తింది. మనిషిని ఇంతగా ఆకర్షించే ఆ టెక్నిక్ ఏంటో నాకు కూడా చెప్పు దీప అంటుంది. ఇక చాలు జ్యోత్స్న ఆపమని సుమిత్ర అంటుంది.
తన గురించి అపార్థం చేసుకుంటున్నావని దీప చెప్తుంది. కానీ జ్యోత్స్న మాత్రం ఆగదు. శౌర్య పడిపోయినప్పుడు నీకు ఎంత బాధగా అనిపించిందో మా బావ నన్ను నిశ్చితార్థం ముహూర్తాన్ని వదిలేసి వెళ్లిపోయినప్పుడు అంతే బాధగా అనిపించదని జ్యోత్స్న ఆవేశంగా మాట్లాడుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్