Karthika deepam 2 july 27th: జ్యోత్స్నను విదిలించుకుని వెళ్ళిపోయిన కార్తీక్.. ప్రమాదంలో శౌర్య ఆరోగ్యం?
Karthika deepam 2 serial today july 27th episode: నరసింహ శౌర్యను ఎత్తుకుని వెళ్లిపోతుంటే కార్తీక్ వెళ్ళకుండా జ్యోత్స్న తన చేతిని పట్టుకుని ఆపుతుంది. కానీ కార్తీక్ మాత్రం తన చేతిని విదిలించుకుని వెళ్ళి శౌర్యను నరసింహ దగ్గర నుంచి తీసుకుంటాడు.
Karthika deepam 2 serial today july 27th episode: బూచోడే మీ నాన్న అని దీప చెప్పడంతో శౌర్య షాక్ అయిపోతుంది. కార్తీక్ అని పిలుస్తూ నరసింహను చూపిస్తూ స్పృహ తప్పి పడిపోతుంది. దీప వెళ్లబోతుంటే నరసింహ ఆపుతాడు. నేనే తండ్రిని అని చెప్పాను కదా నేను చూసుకుంటానని తీసుకెళ్లబోతుంటే దీప వద్దని బతిమలాడుతుంది.
జ్యోత్స్న చేతిని విదిలించుకున్న కార్తీక్
కార్తీక్ వెళ్ళకుండా జ్యోత్స్న చాలా సేపు ఆపుతుంది. తర్వాత కార్తీక్ తన చేతిని విదిలించుకుని వెళ్ళిపోతాడు. నరసింహ చేతిలో నుంచి శౌర్యను తీసుకుంటాడు. ఎవడు అడ్డు వచ్చినా ఎత్తుకుపోతానని అంటాడు. ఆరోజు హాస్పిటల్ లో కూడా ఇలాగే పాపను ఎత్తుకుపోవాలని చూసేసరికి పాపను కాపాడటం కోసం శౌర్య నా కూతురని అబద్ధం చెప్పాను.
కానీ నువ్వు మారలేదు పశువు కంటే హీనంగా దిగజారావు. పాప కోసం మేము ఎన్నో అవమానాలు భరించామో మాకు తెలుసు. పాపకు ఏమైనా అవాలి మీ సంగతి తేలుస్తానని అనేసి కార్తీక్ పాపను తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళిపోతాడు. అనసూయ నరసింహను తిడుతుంది.
బావ వెళ్ళడం ఏంటి?
దుర్ముహూర్తం వచ్చేసిందని చెప్పి పంతులు కూడా వెళ్ళిపోతాడు. జ్యోత్స్న నిశ్చితార్థం ఉంగరాలు చూసుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది. కార్తీక్ తన చేతిని వదిలించుకుని వెళ్ళిన విషయం తలుచుకుని రగిలిపోతుంది. టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ విసిరేస్తుంది.
సుమిత్ర మాట్లాడబోతుంటే జ్యోత్స్న అడ్డుపడుతుంది. ఇక్కడ ఏం జరగాలి? ఏం జరిగింది?మీ అందరికీ అర్థం అవుతుందా? మన ఇంటితో ఏ మాత్రం సంబంధం లేని మనిషి కోసం దాని భర్త వచ్చి గొడవ చేయడం ఏంటి? దాని కూతురు కోసం బావ వెళ్ళిపోవడం ఏంటి?
చంటిదానికి ఏమైనా అవుతుందేమోనని వెళ్లాడని సుమిత్ర నచ్చ జెప్పడానికి చూస్తుంది. కానీ బావ డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ లేడు. నిశ్చితార్థం రింగ్ తొడగడానికి నా పక్కన ఉన్నాడు. తను వెళ్తుంటే మీరు ఎందుకు ఆపలేదని నిలదీస్తుంది. మీ అందరికీ నా కంటే దీప దాని కూతురు ఎక్కువ అయ్యారని అంటుంది.
ముక్కలైన జ్యోత్స్న హృదయం
ఎంగేజ్ మెంట్ ఆగిపోయిందనే బాధ నాకు గ్రాని మొహంలో తప్ప ఎవరి మొహంలో కనిపించడం లేదు. మీరంతా నా మీద కంటే దీప మీద ఎక్కువ సానుభూతి చూపిస్తున్నారని అర్థం అయ్యింది. దీప ఇంట్లో నుంచి వెళ్లిపోతే ప్రపంచం ఆగిపోయినట్టు అందరూ దీప భజన చేశారు.
ఎవరు చెప్తే వచ్చిందో కానీ వచ్చి పడింది. దీప రాగానే మీ అందరి మొహంలో నేను దీపావళి వెలుగులు చూశాను. దీప రావాలని నువ్వు కోరుకోలేదా అని సుమిత్ర నిలదీస్తుంది. దీప వస్తే బాగుండు అనుకున్నాను. నరసింహ రాగానే దీప, శౌర్యకు ఏమవుతుందోనని నేను చెయ్యి పట్టి ఆపుతున్నాను.
అయినా కూడా వెళ్ళిపోయాడు. శౌర్య విషయంలో నాకు బావ మీద అనుమానం లేదు. కానీ ఇంతవరకు ఎందుకు తెచ్చుకోవాలనేది నా బాధ. ఇక్కడ ఇంతమంది ఉంటే బావకు మాత్రమే ఎందుకు అంత జాలి. జరగబోతున్న నిశ్చితార్థం వదిలేసి వెళ్తుంటే ఎవరూ ఆపకపోవడం ఏంటి?
నేను మీ సొంత కూతురినేనా?
అసలు నేను మీ సొంత కూతురినేనా అని గట్టిగా అడుగుతుంది. దశరథ జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు. బావ వెళ్లిపోయినంత మాత్రాన నిశ్చితార్థం ఆగిపోదు. జస్ట్ పోస్ట్ పోన్ అయ్యింది అంతే. దగ్గర్లోనే మరో మంచి ముహూర్తం పెట్టించండి. ఈసారి ఎవరు ఆపుతారో నేను చూస్తాను. బావ నా భర్త ఇది గుర్తు పెట్టుకోండి అని అంటుంది.
కాంచనకు కళ్ళు తిరిగినట్టుగా అనిపించడంతో అందరూ టెన్షన్ పడతారు. కార్తీక్ కి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పండి అని శ్రీధర్ కి చెప్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి శ్రీధర్ తిడతాడు. కాంచన ఏడుస్తుంది. నిశ్చితార్థం ఆగిపోయినందుకు పారిజాతం రగిలిపోతుంది. శౌర్యను హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు.
బూచోడు నాన్నగా వద్దు
నాకు బూచోడు నాన్నగా వద్దు కార్తీక్ అంటూ శౌర్య కలవరిస్తుంది. పాపకు ముందు టెస్ట్ లు చేయాలని డాక్టర్ చెప్తాడు. బూచోడు నాన్నగా వద్దమ్మా అని శౌర్య కలవరిస్తూనే ఉంటుంది. భయంతో కళ్ళు తిరిగిపడిపోయిన శౌర్యకు ఇన్ని టెస్ట్ లు చేస్తున్నారు ఏంటని దీప టెన్షన్ పడుతుంది.
కాసేపటికి శౌర్య కళ్ళు తెరుస్తుంది. బూచోడు నాన్నగా వద్దు. కార్తీక్ ఇంకా రాలేదు ఏంటని అడుగుతుంది. అప్పుడే సుమిత్ర వస్తుంది. కార్తీక్ వస్తే శౌర్య తనను పిలుస్తుంది. నువ్వు మళ్ళీ రావని అనుకున్నాను అంటుంది. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అంటాడు.
ప్రమాదంలో శౌర్య ఆరోగ్యం?
శౌర్యకు ఏం కాదని సుమిత్ర దీపకు ధైర్యం చెప్తుంది. ఇంటికి వెళ్దామని సుమిత్ర అంటే నేను ఇంటికి రాను మళ్ళీ బూచోడు వస్తాడు నన్ను ఎత్తుకుపోతాడు. నాకు భయంగా ఉందని అంటుంది. ఎవరూ రారు నిన్ను ఎవరైన తీసుకుపోతే ఊరుకోమని సుమిత్ర చెప్తుంది.
డాక్టర్ వచ్చి పాపకు రెస్ట్ అవసరం తనతో మాట్లాడొద్దని చెప్తాడు. కార్తీక్ శౌర్య పాత రిపోర్ట్స్ చూపిస్తే డాక్టర్ తనని పర్సనల్ గా కలవమని మాట్లాడాలని చెప్తాడు. డాక్టర్ ఇలా మాట్లాడుతున్నాడు అంటే శౌర్యకు ఏమైందని కార్తీక టెన్షన్ పడతాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్