Karthika deepam 2 july 22nd: శౌర్య కోసం జీవితాంతం పెళ్లి చేసుకొనన్న కార్తీక్.. కొడుకు కంట పడిన శ్రీధర్ బాగోతం
Karthika deepam 2 serial today july 22nd episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శ్రీధర్ కావేరి, స్వప్నను కార్తీక్ చూసేస్తాడు. స్వప్న తన చెల్లెలు అనే విషయం అర్థం చేసుకుంటాడు. ఈ నిజం దీపకు కూడా తెలుసని కానీ నిజం ఎందుకు దాచిందని రగిలిపోతాడు.
Karthika deepam 2 serial today july 22nd episode: జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కార్తీక్ చెప్పడంతో దీప క్లాస్ పీకుతుంది. అన్ని అనుమానాలకు, ప్రశ్నలకు సమాధానం మీ పెళ్లి. చూపులతో అడిగే చాలామంది ప్రశ్నలకు నోరు తెరవకుండా ఇచ్చే సమాధానం మీ పెళ్లి. అప్పుడే శౌర్య తల్లి బతికే ఉంటుంది. ఎవరి నిందలకో బలి అవ్వాల్సిన అవసరం ఉండదు.
పాప కోసం జీవితాంతం పెళ్లి చేసుకోను
ఈ పెళ్లి జరగాలి కార్తీక్ బాబు అని దీప ఖరాఖండిగా చెప్తుంది. కానీ కార్తీక్ మాత్రం ఈ పెళ్లి జరగదు. నేను అన్న మాట పసిదాని చెవిన పడి దాని జీవితం ఏమైపోతుందనే కదా మీ భయం అవసరం అయితే నేను పాప కోసం జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటాను.
మీరు నన్ను ద్వేషించినా పరవాలేదు నేను మీ శ్రేయోభిలాషినే అంటాడు. వద్దు మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. జ్యోత్స్నకు మీరంటే ప్రాణం. మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళను భర్తగా ఊహించుకోలేదు. ఈ పెళ్లి వద్దు అనడానికి మీదగ్గర కారణాలు లేవు.
మీ అమ్మ కోసమైన పెళ్లి చేసుకోవాలి
కానీ ఈ పెళ్లి చేసుకోవడానికి జ్యోత్స్నకు వంద కారణాలు ఉన్నాయి. ఇది మీ రెండు కుటుంబాలు కొన్నేళ్లుగా కంటున్న కల. మేనల్లుడిని అల్లుడిగా చేసుకోవాలని మీ మావయ్య, మేనకోడలిని కోడలు చేసుకోవాలని మీ అమ్మగారి కల. కొడుకుగా మీ అమ్మను సంతోషపెట్టడం మీ బాధ్యత. ఆవిడ సంతోషం ఈ పెళ్లి. మీరు మరొకరిని ఇష్టపడి ఉంటే నేను ఈ మాటలు చెప్పే దాన్ని కాదు.
ఈ పెళ్లి జరిగితే అపార్థాలు తొలగిపోయి ఎవరిని వేలెత్తి ప్రశ్నించరని మీరు ఎందుకు ఆలోచించడం లేదు. మీరు మరొక సారి తప్పు చేయరని మీ మీద నమ్మకం ఉంది. బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. మీరు తీసుకునే నిర్ణయం మీద చాలా జీవితాలు ఆధారపడి ఉన్నాయి అది గుర్తు పెట్టుకోండి అంటుంది.
గడ్డిపెట్టిన శివనారాయణ
కార్తీక్ మౌనంగా వెళ్ళిపోతాడు. పెళ్లి చేసుకొను అని చెప్తే నా బిడ్డ పరిస్థితి నా పరిస్థితి ఏంటి అని దీప చాలా కంగారుపడుతుంది. దీప రావడం వెనుక ఏదో ఆలోచన మీ బావ మనసులో ఉందేమోనని పారిజాతం జ్యోత్స్న మైండ్ ని పాడు చేస్తుంది. హాస్పిటల్ లో చెప్పిన మాటను నిజం చేస్తాడేమోనని రెచ్చగొడుతుంది.
అన్ని మాటలు నువ్వే చెప్తావా అని జ్యోత్స్న పారిజాతం మీద అరుస్తుంది. బావకు ఎంగేజ్ మెంట్ జరిగేది నాతోనే. ఇప్పుడు ఆట నేను మొదలుపెడతాను. దీప ఏం చేసినా ఇలాంటి నిర్ణయాలు ఇంకో వంద చెప్పిన బావ నా మొగుడు అని జ్యోత్స్న కుండ బద్ధలు కొడుతుంది.
పారిజాతం దీప గురించి అనబోతుంటే శివనారాయణ ఎదురుగా ఉంటాడు. భార్యకు బుద్ధి, సిగ్గు లేదు అని బాగా గడ్డి పెడతాడు. ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడటం చూస్తే మూలన పడేస్తానని వార్నింగ్ ఇస్తాడు. మీ గ్రానికి దూరంగా ఉండమని జ్యోత్స్నకు సలహా ఇస్తాడు.
శ్రీధర్ బాగోతం చూసేసిన కార్తీక్
దీప రావడానికి ఉన్న రీజన్ ఏంటో తెలుసుకోవాలని జ్యోత్స్న అనుకుంటుంది. ఇష్టం లేని పెళ్లి జ్యోత్స్న చేసుకుంటే నేనే కాదు తను కూడా బాధపడుతుంది. ఇప్పటికీ మా నాన్నకు మా అమ్మ అంటే ఎంతో ప్రేమ. పెళ్లి విషయంలో మా నాన్న నాకు ఇన్స్పిరేషన్ అనుకుంటాడు. మా నాన్నలాగా అమ్మను ప్రేమించడం ఎవరికీ సాధ్యం కాదని అనుకుంటాడు.
అప్పుడే రోడ్డు మీద శ్రీధర్ కావేరి కనిపిస్తారు. కాసేపటికి స్వప్న కూడా వస్తుంది. స్వప్న శ్రీధర్ ని డాడీ అని పిలవడం విని కార్తీక్ షాక్ అవుతాడు. స్వప్న ఫాదర్ నా ఫాదర్ ఒక్కరేనా అని చాలా బాధపడతాడు. వాళ్ళను ఫోటో తీసుకుంటాడు. కార్తీక్ స్వప్నకు కాల్ చేసి రమ్మని పిలుస్తాడు.
స్వప్న తన తండ్రి అంటే చాలా ఇష్టమని చెప్తుంది. మీ నాన్న అంటే ఫోటో చూపించవా అని అడుగుతాడు. ఇదే మా ఫ్యామిలీ అంటూ శ్రీధర్ తో కలిసి దిగిన ఫోటో చూపిస్తుంది. అది చూసి కార్తీక్ కోపంతో రగిలిపోతాడు. మీ డాడీ చాలా బాగున్నారని అంటాడు.
దీప నిజం దాచింది
స్వప్న వాళ్ళ జీవితంలోకి శ్రీధర్ ఎలా వచ్చాడో చెప్తుంది. అప్పుడప్పుడూ ఇంటికి వస్తారని చెప్తుంది. క్యాంప్ ల పేరుతో నన్ను మా అమ్మను మోసం చేసి మీ దగ్గరకు వస్తున్నాడని కార్తీక్ అర్థం చేసుకుంటాడు. మీ ఫ్యామిలీ ఫోటో కూడా చూపించమని స్వప్న అడుగుతుంది.
మా నాన్నను లైవ్ లో చూపిస్తానని చెప్తాడు. మీ డాడీతో ఉన్న ఆవిడ ఎవరో అడిగావా అంటే లేదు దీప అడగకని చెప్పింది. కానీ లైఫ్ లో దీపతో నేను మాట్లాడను ఆరోజు రెస్టారెంట్ లో మమ్మల్ని వెళ్లిపొమ్మని చెప్పింది. దానికి మా మమ్మీ చాలా హర్ట్ అయ్యిందని చెప్తుంది.
పిన్నిని గిఫ్ట్ గా ఇస్తాడనుకోలేదు
దీప శ్రీధర్ గురించి దాచిన విషయం గుర్తుపడతాడు. దీపకు స్వప్న నేను అన్నాచెల్లెలు అని ముందే తెలుసు. అందుకే రెస్టారెంట్ లో మా నాన్నను తప్పించిందని అర్థం చేసుకుంటాడు. నీలాంటి చెల్లెలు ఉంటే బాగుంటుంది అనుకున్నాను కానీ మా నాన్న పిన్నిని కూడా గిఫ్ట్ గా ఇస్తాడని అనుకోలేదని కార్తీక్ బాధపడతాడు.
ఎంత మోసం చేశావ్ నాన్న. నీ గురించి దీపకు ఎలా తెలుసు. తెలిసి కూడా నా దగ్గర ఎందుకు దాచిందని అనుకుంటాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్