Karthika deepam 2:కార్తీకదీపం 2 సీరియల్.. బ్యాండ్ మేళంతో కార్తీక్ ఎంట్రీ, టెన్షన్ లో జ్యోత్స్న, దీప.. అసలు ప్లాన్ ఏంటి?
Karthika deepam 2 serial today july 24th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ బ్యాండ్ మేళాన్ని వెంటపెట్టుకుని మరీ సుమిత్ర ఇంటికి తన కుటుంబాన్ని తీసుకుని వస్తాడు. అది చూసి అసలు ఏం జరుగుతుందని అటు దీప, ఇటు జ్యోత్స్న టెన్షన్ పడుతూ ఉంటారు.
Karthika deepam 2 serial today july 24th episode: జ్యోత్స్న దీపను ఇంటికి ఎందుకు తిరిగి వచ్చావని అడుగుతుంది. నాకు నా బావ అంటే ప్రాణం. నిజానికి కార్తీక్ నా బావ కాదు నా భారత్. నేను పుట్టకముందే మా పెళ్లి అయ్యిపోయింది. మాది బావ మరదలు సంబంధం కాదు. భార్యాభర్తల బంధం. పెద్దల సంతోషం కోసం సంప్రదాయం ప్రకారం తాళితో ఒకటి చేస్తున్నారు.
నేను బతకను
ఊహ తెలిసిన దగ్గర నుంచి నా భర్తతో ఎలా బతకాలి అని కాలంతో కోటలు కట్టాను. ఎవరో వచ్చి వాటిని కూలుస్తాను అంటే నేను ఎంతకైనా తెగిస్తాను. నా అదృష్టాన్ని, నా ఆశలు ఎవరు లాక్కోవాలని చూసిన వాళ్ళ అంతు చూస్తానని ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుంది.
నీ అదృష్టాన్ని నీ నుంచి ఎవరూ లాక్కోలేరని దీప అంటుంది. నిశ్చితార్థానికి ముందే నువ్వు రావడం వెనుక ఏ కారణం లేదా అని మరోసారి జ్యోత్స్న అడుగుతుంది. నేను వచ్చింది నీ పెళ్లి చూడటానికే అది తప్ప వేరేది లేదు. ఒక్క మాట గుర్తు పెట్టుకో దీప ఈ నిశ్చితార్థం జరగకపోయిన, ఇంకేదైనా జరిగినా నేను బతకను. నా జీవితంలో నా బావ లేనప్పుడు నాకు ఈ జీవితమే అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోతుంది.
కార్తీక్ నిజం తెలిసిపోయిందని అనుకున్న శ్రీధర్
కార్తీక్ బాబు జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అంటున్నాడు. జ్యోత్స్న ఏమో నిశ్చితార్థం జరగకపోతే చస్తాను అంటుంది. ఏం జరిగినా నింద నామీదే పడుతుంది. హాస్పిటల్ లో జరిగింది వీళ్ళకు తెలిస్తే నా పరిస్థితి ఏంటని దీప చాలా కంగారుపడుతుంది.
కార్తీక్ కావేరి వాళ్ళతో శ్రీధర్ ఉన్న ఫోటో చూసి కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఇన్ని సంవత్సరాలు మాకు తెలియకుండా బాగా నాటకం ఆడావని అనుకుంటాడు. శ్రీధర్ కాంచనకు అన్నం వడ్డించి తినిపించబోతుంటే కార్తీక్ ఆపి తాను తినిపిస్తానని అంటాడు. ఏమైందని అంటే ఇన్నాళ్ళూ మీరు చూపించే ప్రేమ చూసి అసూయ కలిగింది ఇక నేను ప్రేమ చూపిస్తానని చెప్తాడు.
తల్లికి తానే ప్రేమగా తినిపిస్తాడు. కార్తీక్ ప్రవర్తన చూస్తుంటే నిజం తెలిసిపోయినట్టు ఉందని శ్రీధర్ అర్థం చేసుకుంటాడు. దీప జ్యోత్స్న మాటల గురించి ఆలోచిస్తుంది. ఈ పెళ్లి జరగకపోతే జ్యోత్స్న బతకదని అనుకుంటుంది. అటు కార్తీక్ కూడా దీప తన తల్లి గురించి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తాడు.
బ్యాండ్ మేళంతో కార్తీక్ ఎంట్రీ
ఎల్లుండి ఎంగేజ్ మెంట్ గురించి మాట్లాడటానికి రమ్మని తాతయ్య కాల్ చేశారు వెళ్దామని కాంచన కార్తీక్ ని పిలుస్తుంది. తాను రానని అంటాడు. కాంచన కొడుకు మీద పెంచుకున్న ప్రేమను చెప్తుంది. నీ విషయంలో నేను తీర్చుకోలేని కోరికలు నా మేనకోడలి ద్వారా తీర్చుకోవాలి.
మీ ఇద్దరికీ పెళ్లి అయి నలుగురు పిల్లలు పుడితే వాళ్ళు నానమ్మ అంటూ ఇల్లంతా తిరుగుతూ సందడి చేస్తూ ఆట పట్టిస్తుంటే ఈ జీవితానికి ఇది చాలని అనిపిస్తుందని చెప్తుంది. దీంతో కార్తీక్ వస్తానని అంటాడు. నిశ్చితార్థం సింపుల్ గా చేద్దామని శ్రీధర్ అంటున్నాడని సుమిత్ర చెప్తుంది.
అలా ఎందుకు అన్నాడో మాట్లాడదామని శివనారాయణ అంటాడు. అప్పుడే మంగళ వాయిద్యాలతో కార్తీక్ తన కుటుంబాన్ని వెంట పెట్టుకుని సుమిత్ర ఇంటికి వస్తాడు. అది చూసి జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. దశరథ కూడా ఏంటి ఇదంతా అంటాడు. మీ అందరికీ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానని అనడంతో అందరూ కన్ఫ్యూజన్ గా చూస్తూ ఉంటారు.
దీప నా భార్య అంటాడేమో
నేను అనుకున్నదే జరుగుతుందా? శౌర్య నా కూతురు అన్నాడు కదా. ఇప్పుడు దీప నా భార్య అంటాడు ఏమోనని పారిజాతం టెన్షన్ పడుతుంది. తన మాటలతో జ్యోత్స్నను మరింత భయపెడుతుంది. అందరూ హల్లో ఉంటారు. విషయం ఏమిటని శివనారాయణ అడిగితే దీప కూడా ఉండాలని శౌర్యను వెళ్ళి పిలుచుకు రమ్మని పంపిస్తాడు.
దీప నా భార్య శౌర్య నా కూతురు అని బావ అందరి ముందు చెప్తే ఏం చేయాలని జ్యోత్స్న అనుకుంటుంది. ఏం చేప్తాడో తెలియక టెన్షన్ గా ఎదురుచూస్తూ ఉంటే దీప వస్తుంది. తనని ఎందుకు రమ్మని పిలిచారని దీప అడుగుతుంది. తన జీవితానికి సంబంధించిన విషయం చెప్పాలని పిలిపించానని చెప్తాడు.
కార్తీక్ బాబును చూస్తుంటే జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అందరి ముందు చెప్పేసేలా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటని దీప కూడా టెన్షన్ పడుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్