Karthika deepam 2 serial: తండ్రి గురించి దీపను నిలదీసిన కార్తీక్.. మళ్ళీ ఎందుకు తిరిగొచ్చావన్న జ్యోత్స్న-karthika deepam 2 serial july 23rd episode jyotsna questions deepa about the reason behind return home ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial: తండ్రి గురించి దీపను నిలదీసిన కార్తీక్.. మళ్ళీ ఎందుకు తిరిగొచ్చావన్న జ్యోత్స్న

Karthika deepam 2 serial: తండ్రి గురించి దీపను నిలదీసిన కార్తీక్.. మళ్ళీ ఎందుకు తిరిగొచ్చావన్న జ్యోత్స్న

Gunti Soundarya HT Telugu
Jul 23, 2024 07:02 AM IST

Karthika deepam 2 serial july 23rd episode: తన తండ్రి రెండో పెళ్లి గురించి ఎందుకు నిజం దాచావని కార్తీక్ దీపను నిలదీస్తాడు. కాంచన కోసమే నిజం చెప్పలేకపోయానని ఆవిడ సంతోషం కోసం పెళ్లి చేసుకోమని దీప సలహా ఇస్తుంది.

కార్తీకదీపం 2 సీరియల్ జులై 23వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ జులై 23వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial july 23rd episode: కార్తీక్ దీప దగ్గరకు వస్తాడు. స్వప్న నాకు ఎందుకో బాగా నచ్చింది. అలాంటి అల్లరి పిల్ల నాకు చెల్లిగా ఉంటే బాగుండని అన్నాను. మీరు కూడా నాకు తన బాధ్యత అప్పగించారు. నేను స్వప్నను చెల్లెలిగా దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాను అనేసరికి దీప షాక్ అవుతుంది.

స్వప్నను దత్తత తీసుకుంటా

నీ సలహా అడుగుదామని వచ్చానని అంటాడు. ఈ ఎంగేజ్ మెంట్ చేసుకుంటే కాబోయే భార్య నా జీవితంలోకి వస్తుంది. చెల్లెలుగా స్వప్న కూడా వస్తుందని అంటాడు. దీప నీళ్ళు నములుతుంది. తనకు ఒక కుటుంబం ఉంది కదా అంటే నేను వాళ్ళకు అభ్యంతరం లేదు వాళ్ళ అమ్మానాన్న కూడా ఒప్పుకున్నారు అంటాడు.

ఏంటి నమ్మడం లేద వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూసిన తర్వాతైన నమ్మండి అని కార్తీక్ ఫోటో చూపిస్తాడు. చూశారా వాళ్ళది కూడా మాలాగే చిన్న ఫ్యామిలీ. స్వప్న వాళ్ళ నాన్న కూడా అచ్చం మా నాన్నలాగే ఉన్నాడు. కానీ స్వప్న వాళ్ళ అమ్మ మా అమ్మలాగా లేదు. ఎందుకంటే స్వప్నకు నాకు అమ్మలు వేరైనా నాన్న ఒక్కడే కదా.

ఈ విషయం నాకు ఈరోజే తెలిసింది. కానీ విచిత్రం ఏంటంటే ఈ విషయం నీకు ఎప్పుడో తెలుసు. అందుకే స్వప్న బాధ్యత నాకు అప్పగించారు. అందుకే రెస్టారెంట్ లో మా నాన్నను టేబుల్ దగ్గరకు రానివ్వకుండా చేశారు. మీరు అడగకపోయినా నేను అన్నీ చెప్పాను కదా ఇంత పెద్ద నిజం ఇన్ని రోజులు ఎందుకు దాచారు? అని నిలదీస్తాడు.

మీ అమ్మ చచ్చిపోతుందని

మీ అమ్మ ప్రాణాలు కాపాడటానికి, మీ రెండు కుటుంబాల్లో ఆనందం కాపాడటానికి అంటుంది. ఈ నిజం ఏదో ఒక రోజు బయట పడుతుందని టిఫిన్ సెంటర్ దగ్గర చూసినప్పుడే అనుకున్నాను. అనారోగ్యంతో ఉన్న భార్యను వదిలేసి మీ నాన్న రెండో భార్యతో షికార్లు చేస్తున్నారు.

ఆరోజే కాంచన గారితో నిజం చెప్పాలని అనుకున్నాను. కానీ భర్త మోసం చేసిన భార్య స్థానంలో నేను ఉంటే విషం తాగి చచ్చేదాన్ని అన్నారు. మీ అమ్మ దృష్టిలో మీ నాన్న దేవుడు. ఈ జన్మకు ఇది చాలని బతికేస్తున్నారు. ఇప్పుడు మీ నమ్మకం నిజం కాదు మీ భర్త కూడా నా భర్తలాగే మోసగాడు అంటే తట్టుకొగలరా?

నా మొగుడు నన్ను వదులుకుని వేరే పెళ్లి చేసుకున్నాడు. కానీ శ్రీధర్ పెళ్ళైన భార్యతో ఉంటూనే వేరే ఆవిడను పెళ్లి చేసుకుని కూతురిని కని కట్టుకున్న భార్యకు కన్న కొడుక్కి అనుమానం రాకుండా ఇన్నేళ్ళు మోసం చేస్తున్నారని తెలిస్తే మీ అమ్మ బతుకుతారా?

ఆవిడ కోరిక తీర్చండి

తల్లిని తండ్రి మోసం చేశాడని పిల్లలకు తెలిస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే నా భర్త గురించి నా కూతురికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను. ఇంకా నిజాన్ని దాస్తే నేను మోసం చేసినట్టే కదా అంటాడు. ఏ భార్య వేరే స్త్రీతో సంబంధం ఉందని తెలిస్తేనే తట్టుకోలేరు.

అలాంటిది కూతురు కూడా ఉందని తెలిస్తే ఆవిడ తట్టుకోలేరు చచ్చిపోతారు. ఈ విషయం ఆమెకు చెప్పకండి. మీ అమ్మను ఆనందంగా ఉంచడమే ఇప్పుడు మీరు చేయాలి. మీరు ఈ ఇంటి అల్లుడు అవాలని అన్నదే ఆమె కోరిక. తన అన్న కూతురిని కోడలిని చేసుకోవాలని కోరుకుంటున్నారు.

ఆవిడ కోరిక తీర్చండి. ఇప్పుడు ఈ రెండు కుటుంబాల బాధ్యత మీదే. ముఖ్యంగా మీ అమ్మ బాధ్యత మీదే. వాళ్ళను గౌరవించి పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోమని సలహా ఇస్తుంది. కార్తీక్ మౌనంగా వెళ్ళిపోతాడు. జ్యోత్స్న వాళ్ళ వైపు కోపంగా చూస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఏం మాట్లాడుకుంటున్నారని రగిలిపోతుంది.

తండ్రికి చురకలు వేసిన కార్తీక్

కార్తీక్ ఇంటికి వచ్చేసరికి కాంచనతో శ్రీధర్ నవ్వుతూ మాట్లాడతాడు. అది చూసి కావేరి, స్వప్న వాళ్ళను గుర్తు చేసుకుని రగిలిపోతూ ఉంటాడు. మంచివాడిలా నటిస్తూ మోసం చేశాడు. భర్త, తండ్రి అనే పదానికి విలువ లేకుండా చేశాడని అనుకుంటాడు. గురువారం ఎంగేజ్ మెంట్ ఎక్కడికీ వెళ్లొద్దని శ్రీధర్ కార్తీక్ తో చెప్తాడు.

కార్తీక్ ఇన్ డైరెక్ట్ గా తండ్రికి చురకలు వేస్తూ ఉంటాడు. నిలదీసేందుకు ఇది రైట్ టైమ్ కాదని మనసులో అనుకుంటాడు. శ్రీధర్ ఎప్పటిలాగే నాకు మీరు తప్ప ఎవరు ఉన్నారని డైలాగ్ కొడతాడు. కోపాన్ని అణుచుకుంటూ కార్తీక్ మాట్లాడతాడు. వీడు ఏంటి తేడాగా ఉన్నాడు దీప కావేరి గురించి చెప్పిందా అని శ్రీధర్ డౌట్ పడతాడు. నిజం తెలిసిందా ఏంటని టెన్షన్ పడతాడు.

జ్యోత్స్న దీపతో మాట్లాడుతుంది. నీ భర్త వచ్చి పిలిస్తే వెళ్లని నువ్వు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు. సరే నీ కారణాలు నీకు ఉంటాయి. మళ్ళీ రావడానికి కారణాలు ఏంటి? హోటల్ కి వెళ్ళడం లేదు. నీ భర్తకు భయపడి దాక్కున్నావ్ అనుకుంటాను. మళ్ళీ ఎందుకు వచ్చావ్. ఎవరు పిలిస్తే వచ్చావ్.

ఎవరికోసం మళ్ళీ వచ్చావ్

మా మమ్మీనా? మా బావ? ఇద్దరిలో ఎవరి కోసం వచ్చావ్ అనేసరికి దీప కోపంగా జ్యోత్స్న అంటుంది. మీకు నిశ్చితార్థం అని సుమిత్రమ్మ పిలిస్తే వచ్చానని చెప్తుంది. నిశ్చితార్థం నిజంగా జరుగుతుందా? అని జ్యోత్స్న అడుగుతుంది. ఇది మీ కుటుంబాలకు సంబంధించినది నేనేం చెప్తానని అంటుంది.

నాకు మా బావఅంటే ప్రాణం. ఆ ప్రేమను నిరూపించుకోవడానికి మేడ మీద నుంచి దూకమంటే క్షణం ఆలోచించకుండా దూకుతాను అంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner