Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్ ..తమ జోలికి రావొద్దన్న దీప, మీరు నా బాధ్యత అంటూ సినిమా డైలాగ్ కొట్టిన కార్తీక్
Karthika deepam 2 serial today july 18th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీపను మళ్ళీ సుమిత్ర ఇంటికి తిరిగి రమ్మని కార్తీక్ పిలుస్తాడు. కానీ దీప మాత్రం రాలేనని తమ జోలికి రావొద్దని చెప్తుంది. కార్తీక్ మాత్రం మీరు నా బాధ్యత అంటూ సినిమా డైలాగ్ కొడతాడు.
Karthika deepam 2 serial today july 18th episode: కార్తీక్ శౌర్య గురించి చాలా బాధపడతాడు. నేను మాత్రమే రౌడీ మీద ఇంత ప్రేమ పెంచుకున్నాను అనుకున్నాను. కానీ గోడ మీద నా పేరు చూస్తే అర్థం కాలేదు. ఆరోజు నేను అక్కడే ఉంటే మిమ్మల్ని వెళ్లిపోనిచ్చే వాడిని కాదు. మరోసారి నరసింహకు రౌడీని ఎత్తుకుపోయే అవకాశం ఇచ్చేవాడిని కాదు అంటాడు.
నరసింహ ఎత్తుకుపోవాలని చూశాడు
దీప షాక్ అవుతూ నరసింహ వచ్చాడా అంటుంది. అవును శౌర్య నా కోసం వస్తుంటే దార్లో నరసింహ కనిపించి పాపను ఎత్తుకుపోవాలని అనుకున్నాడు. శౌర్య వాడి నుంచి తప్పించుకుని కడియానికి కనిపించింది. నాకు ఫోన్ చేశాడు. పాప పది నిమిషాలు కనిపించకపోతేనే అల్లాడిపోయిన మీరు పాప శాశ్వతంగా కనిపించకపోతే మీ పరిస్థితి ఏంటి?
పాప కోసం మీ ఇంటికి రాడని గ్యారెంటీ ఏంటి? అలాంటివి జరగకూడదనే ఆరోజు శౌర్య నా కూతురని చెప్పాను మీరు అర్థం చేసుకోవడం లేదని అంటాడు. ఇక చాలు ఆపండి మీరు చేసిన పని వల్ల నష్టం జరిగింది నాకు, జనం వేసిన నింద నిజం చేసినట్టు అయ్యింది.
తప్పంతా మీరే చేశారు
నేను తలదించుకుని వాడి ముందు నిలబడే పరిస్థితికి తీసుకొచ్చారు. నన్ను నమ్మే సుమిత్రమ్మగారికి మీరు అన్న మాట తెలిస్తే నా కూతురు జీవితంలో నిప్పులు పోస్తావా అని మెడ పట్టుకుని బయటకు గెంటేస్తారు. ఇక మా అత్తతో సహా అందరూ నన్ను మాట అనడం కోసం ఎదురుచూసే వాళ్ళు. వాళ్ళందరికీ నన్ను ప్రశ్నించే అవకాశం ఇచ్చారు.
ఇదంతా ఒక నరకం అంటే ఇంతకుమించి నరకం నేను రోజు ఇంట్లో అనుభవిస్తున్నాను. ఆరోజు మీరు అన్న మాట నా కూతురు విన్నదో లేదో అర్థం కావడం లేదు. తన మాటలు, ప్రవర్తన చూస్తుంటే విన్నట్టే ఉంది. ఇది వరకు నాన్న ఎప్పుడు వస్తాడమ్మా అని అడిగేది.
కార్తీక్ ఎప్పుడు వస్తాడని అడుగుతుంది
హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి కార్తీక్ ఎప్పుడు వస్తాడని అడుగుతుంది. నా కూతురు విన్నదో లేదో తెలియడం లేదు. ఎవరో ఒక పాప కాలికి దెబ్బ తగిలితే వాళ్ళ నాన్న కట్టు కట్టాడు. అది చూస్తే దానికి వాళ్ళ నాన్న గుర్తుకు రావాలి. కానీ అది కార్తీక్ ఎప్పుడు వస్తాడని అడుగుతుంది.
నేను రాత్రిళ్ళు నిద్రపోవడానికి కూడా భయపడే మంచి పని చేశారు. చాలు ఇక మమ్మల్ని వదిలేయండి. ఇలా మీరు ఇంటికి రావడం ఎవరైనా చూస్తే, నా భర్త చూస్తే ఏంటి పరిస్థితి. మమ్మల్ని వదిలేయండి. మేము మా ఊరు వెళ్లిపోతామని ఏడుస్తుంది. వెళ్ళు ఈరోజే పెట్టె సర్దుకుని నరకంలోకి వెళ్లిపో.
నేను అన్న మాటకు విలువ లేదు
శౌర్య నీ కూతురు కాదని చెప్పు నీ జోలికి రానని అన్నాడు ఆ దరిద్రుడు. వాడు మాట మీద నిలబడతాడని నేను ఆ మాట చెప్పాల్సి వచ్చింది. అలా చెప్తే జీవితంలో మీ జోలికి రాడని అనుకున్నాను. కానీ వాడు మాట నిలబడలేదు. నరసింహ నేను చెప్పిన మాట నమ్మలేదు అందుకే పాప జోలికి వచ్చాడు.
అందుకే తనని తీసుకుపోవాలని అనుకుంటున్నాడు. శౌర్య కోసం నేను అన్న మాటకు విలువ లేదు. అలాంటి విలువ లేని మాటను మీరు ఎందుకు పట్టుకుంటున్నారు. మీరు ఇక్కడ ఉంటున్నారని తెలిసిపోయింది. వాడు పాప కోసం ఏ క్షణమైనా రావచ్చు.
పాపకు వాడే తండ్రి అని మీరు చెప్పలేరు అదే వాడి బలం. దాన్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని బలహీనురాలిని చేసి పాపను ఎత్తుకుపోతాడు. మీరు వాడిని బెదిరించగలరు కానీ నిజం తెలియకుండా ఆపలేరు కదా. ఇవన్నీ నాకు అవసరం లేదు. మీ జీవితం మీరు బతకండి అని వదిలేసి ఉండలేను.
మీరు నా బాధ్యత
అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి రౌడీ, రెండోది మీ నాన్న. ఆయన ప్రాణాలు నా చేతిలోనే పోయాయి. ఆయన ఏదో చెప్పాలని అనుకున్నారు కానీ నాకు అర్థం కాలేదు. ఆయన బతికి ఉంటే మీకు ఈరోజు ఈ కష్టం వచ్చేది కాదు. ఆయన చావుకు నేను కాదు అంటాడు.
అది నేను నమ్ముతున్నాను. మా నాన్న చావుకు మీకు ఏ సంబంధం లేదు నాకు ఈ విషయంలో మీ మీద కోపం లేదని చెప్తుంది. అలాగే ఈ విషయంలో కూడా నమ్మండి నేను అన్న మాట నరసింహ నమ్మడం లేదు కదా. మీరు వద్దన్నా సరే నేను రౌడీ బాధ్యత తీసుకుంటాను. నా సాయం మీకు అవసరం లేకపోవచ్చు కానీ రౌడీకి ఉంది.
తనని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. రౌడీకి ఏ ప్రమాదం లేదనుకున్న రోజు నేనే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను. అప్పటి వరకు మీ పక్కన ధైర్యంగా నిలబడతాను. మీరు ఊరు వెళ్ళినా నరసింహ వదిలిపెట్టడు. అత్తయ్య మిమ్మల్ని గుడిలో కలిసినప్పుడు ఇంటికి రమ్మని పిలిచిందంట కదా. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు.
ఇంటికి రాలేను
రౌడీకి మా అత్తయ్య ఇంట్లో తప్ప ఇంకెక్కడ సేఫ్టీ దొరకదు. మీ పరిస్థితి చక్కబడే వరకు అక్కడే ఉండండి. నేను అన్న మాటలు మీరు తప్ప ఇంకెవరు వినలేదు లేదంటే ఇప్పటికే అందరికీ తెలిసిపోయేది. నరసింహ కూడా చెప్పలేదు. మళ్ళీ ఇంటికి వస్తారని అనుకుంటున్నాని చెప్తాడు.
నేను రాలేను. అది మిమ్మల్ని తండ్రి అనుకుంటే నేను కాదని చెప్పలేను. నరసింహ దాని తండ్రి అని చెప్పలేను అని చాలా బాధపడుతుంది. వాళ్ళను చూసి జ్యోత్స్న రగిలిపోతూ ఉంటుంది. కార్తీక్ వెళ్లిపోతుంటే శౌర్య వచ్చి పిలుస్తుంది. ఫోన్ వచ్చింది అర్జెంట్ గా వెళ్లాలని అంటాడు.
మళ్ళీ ఎప్పుడు వస్తావని అడుగుతుంది. పని అయిపోయాక వస్తాను కానీ ఈరోజు వచ్చినట్టు అమ్మకు చెప్పకుండా బయటకు రాకూడదు అలా అని ప్రామిస్ చేయమని అడుగుతాడు. నువ్వు చెప్పినట్టే వింటానని ప్రామిస్ చేస్తుంది. సుమిత్ర జ్యోత్స్న ఎక్కడ కనిపించడం లేదని పారిజాతాన్ని అడుగుతుంది.
నాకంటే నీకు అంత ఇంపార్టెంట్ ఎవరు?
తన కూతురు మనసు చెడగొడుతున్నావని సుమిత్ర అత్తను దెప్పిపొడుస్తుంది. కార్తీక్ దీపను తిట్టుకుంటూ ఉంటాడు. తన జీవితం బాగుపడే వరకు అవుట్ హౌస్ లో ఉండమంటే మాట వినడం లేదు. నరసింహ వచ్చి శౌర్యను ఎత్తుకుపోతే ఏంటి పరిస్థితి అనుకుంటాడు.
జ్యోత్స్న కార్తీక్ కారుకు అడ్డంగా పెట్టి ఆపుతుంది. ఏమి తెలియనట్టుగా మాట్లాడుతుంది. మమ్మీతో మాట్లాడాలని వచ్చావు తనతో ఏదో చెప్పాలని అనుకున్నావ్. ఏంటి అది అని అడుగుతుంది. నాతో మాట్లాడకుండా నన్ను వదిలేసి వచ్చావంటే ఎవరు వాళ్ళు? నాకంటే నీకు ఎవరు అంత ఇంపార్టెంట్ అని అడుగుతుంది.
జ్యోత్స్నకు అబద్ధం చెప్పిన కార్తీక్
నేను చెప్పాల్సిన విషయం ఇంట్లో అందరి ముందు చెప్తానని అంటాడు. సరే దీప ఇల్లు ఎక్కడో నీకు తెలుసా అని జ్యోత్స్న కార్తీక్ ని అడుగుతుంది. ఇద్దరు భుజాలు తడుముకుని తెలియదని చెప్తారు. దీప ఎక్కడ ఉందో పారుకు తెలిస్తే అనవసరంగా తనని ఇబ్బంది పెడతారని అనుకుంటాడు.
నేను కళ్లతో చూసిన దాన్ని నువ్వు నోటితో ఎంత అందంగా అబద్ధం చెప్పావ్. దీప ఎక్కడ ఉందో తెలిసి రోజు కలుస్తున్నావ్. అంటే హాస్పిటల్ లో చెప్పింది నిజం చేయాలని అనుకుంటున్నావా? అని ఆలోచిస్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్