Karthika deepam 2 serial: నాన్న గురించి అద్భుతంగా చెప్పి చివర్లో ట్విస్ట్ ఇచ్చిన శౌర్య.. ఏమోషనలైన దీప
Karthika deepam 2 serial today june 28th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ఫాదర్స్ డే సందర్భంగా శౌర్య స్కూల్ ఫంక్షన్ లో తండ్రి గురించి చాలా గొప్పగా చెప్తుంది. తన తండ్రి తనకు సూపర్ మెన్, హీరో అంటూ పొగుడుతుంది.
Karthika deepam 2 serial today june 28th episode: స్కూల్ లో జరిగే ఫాదర్స్ డే సెలెబ్రేషన్స్ కి జ్యోత్స్న వస్తుంది. ఇప్పుడు శౌర్య బాధ్యత నాది కదా అందుకే నేను ఒక్కదాన్ని వచ్చానని చెప్తుంది. నరసింహ స్కూల్ దగ్గరకు వస్తాడు.
ఫాదర్స్ డే ఫంక్షన్ లో నరసింహ
ఫాదర్స్ డే రోజు నేనే పాపకు తండ్రి అని పది ముందు చెప్పడం భలే కిక్ ఇస్తుందని అనుకుని ప్రోగ్రామ్ జరిగే దగ్గరకు వెళతాడు. కార్తీక్ కోసం అటు ఇటూ చూస్తాడు కానీ ఎక్కడ కనిపించడు. నరసింహను దీప చూసుకోదు. అప్పుడే కార్తీక ఫంక్షన్ జరిగే చోటుకు వస్తాడు. జ్యోత్స్న, నరసింహను చూసి కార్తీక్ ఆగిపోతాడు.
ప్రోగ్రామ్ లో శౌర్యను మొదటిగా మాట్లాడమని పిలుస్తారు. కార్తీక్ దూరంగా నిలబడి శౌర్యను చూస్తూ ఉంటాడు. తండ్రి గురించి చాలా గొప్పగా రాసిందని ప్రిన్సిపల్ చెప్తాడు. ఏం రాశావో చెప్పమని శౌర్యకు చెప్తాడు. అందరికీ ఉన్నట్టే నాకు నాన్న ఉన్నాడు. నన్ను ప్రేమగా చూసుకుంటాడు. నేను ఆడుకుంటున్నప్పుడు నాన్న బొమ్మ అవుతాడు.
మా నాన్న సూపర్ మెన్
నేను నవ్వితే నన్ను ఊపే ఉయ్యాల అవుతాడు. నేను అలిగితే మా నాన్న నాకంటే చిన్నపిల్లాడిలా మారిపోయి బతిమలాడి బుజ్జగిస్తాడు. నేను ఏదైనా అడిగితే అది ఏదైనా సరే అడిగిన వెంటనే కొనిస్తాడు. నాకు చీకటి అంటే భయం కానీ మా నాన్న చెయ్యి పట్టుకుంటే భయం లేకుండా నడుస్తాడు.
నేను చిన్నగా ఉంటాను కానీ నన్ను భుజాల మీద ఎక్కించుకుంటాడు. మా నాన్న ఎప్పుడు హ్యాపీగా నన్ను నవ్విస్తూ ఉంటాడు. మా నాన్న సూపర్ మెన్, హీరో అంటూ తెగ పొగుడుతూ చెప్తుంది. శౌర్య ఎవరి గురించి మాట్లాడుతుందోనని దీప, జ్యోత్స్న, నరసింహ మనసులో అనుకుంటారు.
మీ నాన్న గురించి నువ్వు చెప్తుంటే చూడాలని ఉందని ప్రిన్సిపల్ అడిగితే ఇక్కడే ఉన్నాడని చెప్తుంది. శౌర్య తన తండ్రిని పరిచయం చేస్తానని నాన్న ఇక్కడికి రా నాన్న అని పిలుస్తుంది. శౌర్య ఎవరిని పిలుస్తుందో అర్థం కాక ముగ్గురూ టెన్షన్ పడతారు. శౌర్య తనే వెళ్ళి తీసుకొస్తానని స్టేజ్ దిగి దీప దగ్గరకు వెళ్తుంది.
మా నాన్న ఎవరో కాదు మా అమ్మే
దీపను స్టేజ్ మీదకు తీసుకెళ్తుంది. మా నాన్న ఎవరో కాదు మా అమ్మే. నా ధైర్యం, నా ఇష్టం, నా సూపర్ మెన్, నా హీరో అన్నీ మా అమ్మే. మా నాన్న ఎలా ఉంటాడో తెలియదు. నాకు నాన్న అయినా అమ్మ అయినా అన్నీ అమ్మే. నేను నాన్న గురించి చెప్పినవన్నీ మా అమ్మ గురించేనని చెప్తుంది.
మా అమ్మ ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. కానీ అదంతా అబద్ధం నవ్వుతున్నట్టు నటిస్తుంది. మా అమ్మ నన్ను చదివించాలని టిఫిన్ సెంటర్ లో పని చేస్తుందని తల్లి గురించి గొప్పగా చెప్తుంది. కూతురు మాటలకు దీప చాలా ఎమోషనల్ అవుతుంది.
నా కోసం మా అమ్మ ఎంతగా కష్టపడుతుందో నాకు తెలుసు కానీ అవేవీ నాకు చెప్పదు నాకు తెలియకూడదు అనుకుంటుంది. కానీ నాకు అవన్నీ తెలుసు. నన్ను ఇంతగా ప్రేమిస్తున్న నువ్వే నా సూపర్ మెన్, నువ్వే నా నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే అని తల్లికి చెప్తుంది.
కార్తీక్ గురించి చెప్పిన శౌర్య
దీప కూతురిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకుంటుంది. ఇవన్నీ నీకు ఎవరు చెప్పారని దీప అడుగుతుంది. కార్తీక్ చెప్పాడని అనేసరికి జ్యోత్స్న, నరసింహ షాక్ అవుతారు. కార్తీక్ నీకు ఏమవుతాడని ప్రిన్సిపల్ అడుగుతాడు. మా అమ్మ తర్వాత నాకు కార్తీక్ ఎక్కువ.
తను నాకు మంచి ఫ్రెండ్. నేనంటే తనకు చాలా ఇష్టం. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. నేను రమ్మన్నాను వచ్చాడో లేదో తెలియదు. కార్తీక్ నువ్వు ఇక్కడికి వచ్చావా అని పిలుస్తుంది. నీలాంటి ఫ్రెండ్ ఉన్నాడని అందరికీ పరిచయం చేయాలి. నాకు అమ్మ నువ్వు తప్ప ఎవరు లేరు కదా. నువ్వు రాకపోతే నేను ఏడుస్తానని అంటుంది.
పాపం శౌర్య
కార్తీక్ రాలేదని దీప చెప్తుంది. శౌర్య మాత్రం కార్తీక్ ని పిలుస్తూనే ఉంటుంది. ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదని అనుకుని వెళ్ళిపోతాడు. కూతురిని అడ్డం పెట్టుకుని బావను చుట్టూ తిప్పుకుంటుందని ముందు వీళ్ళ ఫ్రెండ్షిప్ కట్ చేయాలని జ్యోత్స్న అనుకుంటుంది. స్కూల్ ప్రిన్సిపల్ దీపను మెచ్చుకుంటాడు.
ఒకప్పుడు నిన్ను తక్కువ అంచనా వేసినందుకు క్షమించమని ప్రిన్సిపల్ అడుగుతాడు. అందరూ దీపను మెచ్చుకుంటూ చప్పట్లు కొడతారు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 ఎపిసోడ్ ముగిసింది.