Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్,ప్రశ్నల దాడితో దీపను ఉక్కిరిబిక్కిరి చేసిన జ్యోత్స్న, శోభ ఆనందం క్షణాల్లో ఆవిరి
Karthika deepam 2 serial today june 19th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న దీప మీద ప్రశ్నలతో దాడి చేస్తుంది. వరుస ప్రశ్నలు వేసి తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇక హాస్పిటల్ కి వెళ్ళిన శోభకు డాక్టర్ బ్యాడ్ న్యూస్ చెప్తుంది.
Karthika deepam 2 serial today june 19th episode: తన కోడలు శోభ తల్లి కాబోతుందని అనసూయ దీపకు చెప్తుంది. నేను నాయనమ్మను కాబోతున్నాను ఇంకో తొమ్మిది నెలల్లో ణా చేతిలో మనవడు ఉంటాడు. వాడే నా కొడుక్కి అసలైన వారసుడు. వాడికి మాత్రమే నా కొడుకు తండ్రి అని చెప్పే అర్హత ఉంటుంది.
అత్తకు వార్నింగ్
అయినా నీకు నా కొడుకు పేరుతో పని ఏముంది? నీ కూతురికి తండ్రిగా ఎవరైనా సంతకం చేస్తారని నోటికొచ్చినట్టు వాగుతుంది. అత్తయ్య నీ కోడలు నీళ్ళు పోసుకుంటే నువ్వు నొప్పులు పడుతున్నావే. పట్టరాని ఆనందంగా ఉంటే పండగ చేసుకో ఇంకా తట్టుకోలేకపోతే ఏదైనా ఎక్కి దూకేసేయ్. నా జోలికి, నాకూతురు జోలికి రావొద్దని వార్నింగ్ ఇస్తుంది.
ఏంటే కొడతావా అని నరసింహ ముందుకు వెళ్లబోతుంటే అనసూయ కొడుకును వద్దని వారించి దీపను వెళ్లిపొమ్మని చెప్తుంది. శోభకు జాగ్రత్త చెప్పేసి దీప వెళ్ళిపోతుంది. శ్రీవాణి జ్యోత్స్నకు ఫోన్ చేసి నీకు మీ బావ మీద అనుమానం ఉందా అని అడుగుతుంది.
శౌర్య మీద మీ బావ ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో తెలియడం లేదు. కార్తీక్ స్కూల్ కి రాకపోయినా టిఫిన్ సెంటర్ కి వెళ్తే ఏం చేస్తావని జ్యోత్స్న మనసులో ఉన్న అనుమానాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. దీప అనసూయ మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంది.
శౌర్యను ఎందుకు దగ్గర చేస్తున్నావ్?
అప్పుడే జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది. శౌర్యను మా బావకు ఎందుకు దగ్గర చేస్తున్నావని జ్యోత్స్న దీపను నిలదీస్తుంది. నీకు చెప్పకుండా శౌర్య ఏ పని చేయదు, అలాంటిది నువ్వు చెప్పకుండా మా బావకు దగ్గర అవుతుందా? పేరెంట్స్ మీటింగ్ కి నేనే నా కూతురిని తీసుకెళ్తున్నానని చెప్పి వెళ్ళావ్ కదా మరి అక్కడికి మా బావ ఎలా వచ్చాడని నిలదీస్తుంది.
మా బావ నాకు కాబోయే భర్త అని తెలుసు కదా. ఇప్పుడు సడెన్ గా మీరు పేరెంట్స్ మీటింగ్ లో ఉండగా ఎవరైనా బయట వ్యక్తి వస్తే ఏమనుకుంటారు. శౌర్యకు మీరిద్దరే అమ్మనాన్న అనుకుంటారా? లేదా అని గట్టిగా అడుగుతుంది. దీప జ్యోత్స్న మీద కోప్పడుతుంది.
నువ్వు అడిగితే సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో లేనని దీప అంటుంది. సరే అవన్నీ వదిలేసేయ్ మా బావ నీకు రోజు ఫోన్ చేస్తూ ఉంటాడా? అనేసరికి దీప కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఏ టైమ్ లో చేస్తూ ఉంటాడని అడుగుతుంది. హద్దులు దాటి మాట్లాడొద్దని దీప అంటుంది.
నాకు ఫోన్ ఇచ్చింది కార్తీక్ బాబే
మంచి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావ్. చిన్నప్పటి నుంచి చూస్తున్న దానివి మీ బావ ఎలాంటి వాడో నీకు తెలియదా? నమ్మకం లేకుండానే పెళ్లి చేసుకుంటున్నావా?అని దీప ఎదురు ప్రశ్నిస్తుంది. నాకు ఫోన్ ఇచ్చింది కార్తీక్ బాబు కానీ నేను ఊరికే తీసుకోలేదు డబ్బులు ఇస్తానని అన్నాను అతను సరే అన్నాడు.
శౌర్య స్కూల్ ఫీజు నువ్వు కట్టలేనంత. నీ నెల జీతం నువ్వు బతికేంత. అయినా శౌర్య పెద్ద స్కూల్ లో చదువుకుంటుంది ఎలా? ఆటో ఛార్జీలకు డబ్బులు ఉండవు కానీ ఫోన్ కొన్నాను అంటున్నావ్ ఎలా? మా బావ నీకు ఫోన్ చేయడు, శౌర్యతో నువ్వు ఫోన్ చేయించవు కానీ మా బావ కలుసుకుంటాడు ఎలా?
జీవితంలో పిల్లలు పుట్టరు
నువ్వు ఉండేది మా ఇంట్లో కానీ మాకంటే ముందు నీ విషయాలు మా బావకు తెలుస్తాయి ఎలా? అని జ్యోత్స్న గట్టిగా నిలదీస్తుంది. కడియం వచ్చేసరికి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శోభ డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుంటుంది. మీ కోడలు మీరనుకున్నట్టు గర్భవతి కాదు అనేసరికి ముగ్గురు మొహాలు మాడిపోతాయి.
తీసుకున్న ఆహారం సరిగా అరగకపోవడం వల్ల వాంతులు వచ్చాయి. మీ కోడలికి పుట్టకపోతే గర్భసంచిలో లోపం ఉంది. ఇక జీవితంలో ఈవిడకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని డాక్టర్ చెప్తుంది. దీంతో శోభ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. నాకు పిల్లలు పుడతారని ఏడుస్తుంది.
శని గ్రహం దీప ఎదురైనప్పుడే అనుకున్నాను ఇలా ఏదో జరుగుతుందని శోభ తిడుతుంది. అప్పుడే నరసింహకు కానిస్టేబుల్ ఫోన్ చేసి ఒకడు నీమీద కేసు పెట్టాడని స్టేషన్ కి రమ్మని పిలుస్తాడు. కార్తీక్ జ్యోత్స్న అడిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
కార్తీక్ మీద అరిచిన దీప
దీప మీద జాలితో నేను మొదట్లో సాయం చేసిన తెలియకుండానే నేను రౌడీకి దగ్గర అయిపోయాను. తనకు బయట ప్రపంచం తెలిసే వరకు నేను వాళ్ళకు అండగా ఉండాలని అనుకుంటాడు. అప్పుడే రోడ్డు మీద నరసింహను కానిస్టేబుల్ తీసుకెళ్లడం చూస్తాడు.
పాప విషయంలో ఏమైనా గొడవ పెట్టుకున్నాడా ఏంటి అనుకుని వెంటనే దీప దగ్గరకు వెళతాడు. ఏం జరిగింది దీప నరసింహ ఇక్కడికి వచ్చాడా? ఏమైనా గొడవ చేశాడా అని కంగారుగా అడుగుతాడు. మీరు ఎందుకు వచ్చారని అడుగుతుంది. దారిలో నరసింహ పోలీస్ తో గొడవ పడుతుంటే చూశానని వాడు ఏమైనా గొడవ పడితే మీరు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా అని అడుగుతాడు. ఇస్తే మీకేంటి? నరసింహ వస్తే మీకేంటి? అని దీప ఎదురు ప్రశ్నిస్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్