Karthika deepam 2 serial: దీప, కార్తీక్ కలవకుండా చేసిన జ్యోత్స్న.. శౌర్యకు నిజం చెప్పాలని ఫిక్స్ అయిన నరసింహ
Karthika deepam 2 serial today june 27th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. స్కూల్ లో జరిగే ఫాదర్స్ డే ఫంక్షన్ కి కార్తీక్ కూడా వస్తున్నాడని సుమిత్ర వాళ్ళ ముందు శౌర్య చెప్పడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. కార్తీక్ ని రాకుండ చేయడం కోసం జ్యోత్స్న ఆ ఫంక్షన్ కి వెళ్తుంది.
Karthika deepam 2 serial today june 27th episode: శౌర్య తాను చేసిన బొమ్మలోనే తన తండ్రిని చూసుకుని మురిసిపోతుంది. అది చూసి దీప కుమిలిపోతుంది. పారిజాతం జ్యోత్స్నకు మరింత ఎక్కిస్తుంది. నువ్వు చెప్పినట్టు వాళ్ళు కొత్త మీటింగ్ పాయింట్ పెట్టుకున్నారు. డైరెక్ట్ గా ఇంట్లోనే పెట్టుకున్నాడు.
దీప పాలు పొంగిస్తదేమో
మీ అత్తకు బాగోలేదని నీకు తెలుసా? కానీ తెలియదు. మీ అత్తకు మేనకోడలు నువ్వో, దీప అర్థం కావడం లేదని నిప్పు రాజేస్తుంది. జ్యోత్స్న పారిజాతం మాటలకు ఫ్రస్టేట్ అవుతుంది. ఇన్నాళ్ళూ నాకు దీప మీద కోపం, చిరాకు ఉండేవి. ఇప్పుడు భయం పట్టుకుంది ఆ ఇంట్లో పాలు పొంగిస్తుందేమోనని అంటుంది.
దీపను వెళ్ళి దులిపేసి రమ్మని చెప్తుంది. అవసరం లేదు దీప ఇప్పుడు ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు అక్కడ కూడా వీళ్ళని కలవకుండా చేయాలి. వాళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటానని జ్యోత్స్న ఏదో ప్లాన్ వేస్తుంది. వచ్చే ముహూర్తాలలో నీ పెళ్లి చేయాలని అనుకుంటున్నట్టు మీ తాతయ్య వాళ్ళు చెప్పారని కాంచన కార్తీక్ తో చెప్తుంది.
ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావ్?
రెస్టారెంట్ దాదాపు కంప్లీట్ అయ్యిందని చెప్పావు కదా ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావ్ అని అడుగుతుంది. ఇప్పుడే వద్దని అంటాడు. అసలు జ్యోత్స్న మీద నీ ఒపీనియన్ ఏంటని అంటుంది. సరిగా చెప్పే టైమ్ కార్తీక్ కి శౌర్య ఫోన్ చేస్తుంది. స్కూల్ లో ఫాదర్స్ డే ఫంక్షన్ ఉంది రమ్మని పిలుస్తుంది.
రావడం కుదరదని అంటే రాకపోతే వెళ్లనని మొండికేస్తుంది. కాంచన కూడా సరే వెళ్ళు పసిదాన్ని ఎందుకు బాధపెట్టడం అంటుంది. దీప ఇంటికి వచ్చి వంట చేసిందని చెప్పడంతో సంతోషంగా ఫీల్ అవుతాడు. జ్యోత్స్న సంగతి అడిగితే తర్వాత చెప్తానని వెళ్ళిపోతాడు.
ఫాదర్స్ డే జరిపిన శౌర్య
శివనారాయణ వాళ్ళు మాట్లాడుకోవడానికి కూర్చుంటే దీప, శౌర్య వెళతారు. తాత దగ్గరకు వెళ్ళి ఇద్దరికీ సర్ ప్రైజ్ అంటుంది. దశరథ దగ్గరకు వెళ్ళి చాక్లెట్ ఇచ్చి ముద్దుల తాతకు ఇచ్చి ఫాదర్స్ డే విసెష్ చెప్పమని చెప్తుంది. దశరథ తండ్రిని మెచ్చుకుని ఆశీర్వాదం తీసుకుంటాడు.
శౌర్య మరొక చాక్లెట్ జ్యోత్స్నకు ఇచ్చి దశరథకు ఫాదర్స్ డే విసెష్ చెప్పమని చెప్తుంది. మా అందరికీ ఫాదర్స్ డే చెప్పమని చెప్తున్నావ్ ఇంతకీ నువ్వు చెప్పావా లేదా అని కావాలని పారిజాతం బాధపడేలా మాట్లాడుతుంది. శౌర్యకు తండ్రి లేడా ఏంటని వెటకారంగా అడుగుతుంది.
నరసింహ తండ్రి అనే నిజం ఎక్కడ చెప్తుందోనని దీప కంగారుపడుతుంది. పారిజాతం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే శివనారాయణ లిమిట్స్ లో ఉండమని హెచ్చరిస్తాడు. ఫాదర్స్ డే మీకేవరికీ గుర్తు లేకపోయినా దానికి తండ్రి అంటే ఎంత ఇష్టమో అర్థం కావడం లేదా? అలాంటి దానికి తండ్రి ఎదురుగా లేకపోవడం బాధగా ఉందని అంటుంది.
నిజం చెప్పాలని ఫిక్స్ అయిన నరసింహ
శివనారాయణ పారిజాతం నోరు మూయించి దీపను పంపించేస్తాడు. హ్యాపీ మదర్ తో హ్యాపీ ఫాదర్స్ డేకి వెళ్ళు అని పారిజాతం అంటే మేము ఇద్దరం కాదు ముగ్గురం కార్తీక్ వస్తున్నాడు. ఫాదర్స్ డే ఫంక్షన్ కి కార్తీక్ ని రమ్మని ఫోన్ చేశాను వస్తానని అన్నాడని శౌర్య చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.
దీప పాపతో ఫోన్ చేయించి ఉంటుందని పారిజాతం అంటుంది. శౌర్యను తండ్రి గురించి అడగడం అవసరమా? నరసింహ ఎలాంటి వాడో మనకి తెలియదా? వీలైతే సాయం చెయ్యి లేదంటే నోరు మూసుకుని కూర్చోమని శివనారాయణ వార్నింగ్ ఇస్తాడు. సుమిత్ర కూడా తిడుతుంది.
దీప మాటలకు లొంగడం లేదు పాపకు తండ్రి నేనే అని అది చెప్పడం లేదు కదా ఆ పని నేనే చేస్తానని నరసింహ అనుకుంటాడు. ఇక కార్తీక్ బదులు జ్యోత్స్న స్కూల్ కి వస్తుంది. శౌర్య దీపను తీసుకుని స్కూల్ ఫంక్షన్ కు వస్తుంది. కార్తీక్ వస్తాడని శౌర్య ఎదురుచూస్తూ ఉంటే జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది.
శౌర్య బాధ్యత నాది కదా అందుకే నేను ఒక్కదాన్నే వచ్చాను అని అంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్