Karthika deepam 2 serial: పెళ్లి గురించి కార్తీక్ తో మాట్లాడమన్న శివనారాయణ.. దీపకు డెడ్ లైన్ పెట్టిన నరసింహ-karthika deepam 2 serial today june 25th episode shivanarayana suggesta kanchana to talk karthik about his marriage ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial: పెళ్లి గురించి కార్తీక్ తో మాట్లాడమన్న శివనారాయణ.. దీపకు డెడ్ లైన్ పెట్టిన నరసింహ

Karthika deepam 2 serial: పెళ్లి గురించి కార్తీక్ తో మాట్లాడమన్న శివనారాయణ.. దీపకు డెడ్ లైన్ పెట్టిన నరసింహ

Gunti Soundarya HT Telugu
Jun 25, 2024 06:52 AM IST

Karthika deepam 2 serial today june 25th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. పెళ్లి గురించి కార్తీక్ తో మాట్లాడి ముహూర్తాలు పెట్టిద్దామని శివనారాయణ కాంచనకు చెప్తాడు. పారిజాతం వాళ్లిద్దరికీ ఎలాగైనా వచ్చే ముహూర్తాలలో పెళ్లి చేసేయాలని ఖరాఖండిగా చెప్తుంది.

కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 25వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 25వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

Karthika deepam 2 serial today june 25th episode: మోసం అనే బరువును మోయడం కంటే చావు చాలా తేలికగా అనిపిస్తుంది. నిన్ను మెచ్చుకోవాలి దీప నీ అంత గుండె నిబ్బరం నాలాంటి బలహీనురాలికి లేదని చెప్తుంది. ఇంతకీ ఆ మోసం చేసిన మనిషి ఎవరు అని దీపను అడుగుతుంది. చెప్పాలనే అనుకున్నాను కానీ మీరు బతికి ఉండరని అర్థం అయ్యిందని అనుకుంటుంది.

నిజం చెప్పకుండా ఆగిపోయిన దీప 

దీప మాత్రం పేరు చెప్పకుండా ఉండిపోతుంది. మోసపోయిన ఆమెకు మనం సాయం చేద్దామని కాంచన అంటుంది. మోసపోవడం కంటే ప్రాణం పోవడం ఇంకా పెద్ద అన్యాయం కదా పైగా ఆవిడకు పిల్లలు కూడ ఉన్నారు వదిలేద్దామని దీప చెప్తుంది. మోసం చేస్తున్న వాళ్ళను అసలు వదిలిపెట్టకూడదని కాంచన అంటుంది.

శివనారాయణ ఇంటికి సాయినాథ్ అనే దంపతులు పెళ్లి పిలుపు చెప్పేందుకు వస్తారు. పారిజాతం మళ్ళీ జ్యోత్స్న పెళ్లి టాపిక్ తీసుకొస్తుంది. నా పుట్టినరోజు మళ్ళీ వస్తుంది. మళ్ళీ మీరు ఇచ్చిన మాట అలాగే ఉంటుందని దెప్పి పొడుస్తుంది. ముందు ఇంట్లో ఉన్న మనవరాలి పెళ్లి గురించి ఆలోచించండి.

పెళ్లి చేయాల్సిందే 

రేపు ఏదైనా జరిగి బాధపడటం కంటే ముందే పెళ్లి చేయడం మంచిది. ముహూర్తాలు అన్నారు వచ్చాయి వచ్చే ముహూర్తంలో పెళ్లి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని కోపంగా చెప్పేసి వెళ్ళిపోతుంది. అత్తయ్య చెప్పిన మాట నిజమే పెళ్లి గురించి మాట్లాడదామని సుమిత్ర కూడా చెప్తుంది.

సుమిత్ర నువ్వు వెళ్ళి పెళ్లి విషయం మాట్లాడి రమ్మని శివనారాయణ దశరథకు చెప్తాడు. ఇంటి పెద్ద మీరు మీరే వెళ్ళి మాట్లాడి రండి అని సుమిత్ర అంట శివనారాయణ అందుకు సరే అంటాడు. స్వప్న ఒంటరిగా కూర్చుని శ్రీధర్ ఇంకొక ఆమెతో ఉండటం గురించి ఆలోచిస్తుంది.

శ్రీధర్ ని అనుమానిస్తున్న స్వప్న 

ఈ విషయం గురించి డాడీని అడగలా? వద్దా అని అనుకుంటుంది. అప్పుడే కావేరి, శ్రీధర్ వస్తారు. స్వప్న ఇన్ డైరెక్ట్ గా కొబ్బరి బొండం అని మాట్లాడుతుంది. సడెన్ గా అది ఎందుకు గుర్తుకు వచ్చిందని శ్రీధర్ అడుగుతాడు. మళ్ళీ కొబ్బరి బొండం గురించి మాట్లాడితే శ్రీధర్ కాంచనకు కొబ్బరి బొండం ఇచ్చిన విషయం గుర్తు చేసుకుంటాడు.

రోడ్డు మీద తనని చూసిందేమోనని టెన్షన్ పడతాడు. ఏ ఆధారం లేకుండా డాడీని అడగడం మంచిది కాదు, అసలు ఆ మనిషి ఎవరని స్వప్న అనుకుంటుంది. శివనారాయణ, పారిజాతం కాంచన ఇంటికి వస్తారు. భోజనం చేస్తూ మాట్లాడుకుంటారు. వంటలు బాగున్నాయని మెచ్చుకుంటే చేసింది నేను కాదు దీప అంటుంది.

పెళ్లి గురించి కార్తీక్ తో చెప్పు 

నాకు ఒంట్లో బాగోలేదని కార్తీక్ చెప్పాడు అందుకే దీప వచ్చి సాయం చేసిందని కాంచన చెప్తుంది. పెళ్ళిళ్ళ సీజ్న్ మొదలైందని పారిజాతం అంటే పెళ్లి గురించి గుర్తు చేయడానికి వచ్చారా అంటుంది. అవును ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారోనని పారిజాతం నోరు జారుతుంది.

నా కొడుకు మీద నాకు పూర్తి నమ్మకం ఉందని చెప్తుంది. పెళ్లి గురించి కార్తీక్ తో మాట్లాడమని శివనారాయణ చెప్తాడు. మాట్లాడటం కాదు ఈ ముహూర్తంలోనే పెళ్లి చేయాలని పారిజాతం గట్టిగా చెప్తుంది. పిన్నీ నువ్వేం టెన్షన్ పడకు పిన్నీ మా అన్నయ్య కూతురే నా ఇంటి కోడలని కాంచన హామీ ఇస్తుంది.

దీపకు డెడ్ లైన్ 

నరసింహ దీపకు ఫోన్ చేసి నా కూతురిని నాకు ఎప్పుడు ఇస్తున్నావని అడుగుతాడు. మమ్మల్ని వదిలేయ్ నరసింహ నీకు బిడ్డను పెంచుకోవాలని అనిపిస్తే ఎవరో ఒక అనాథను తెచ్చి పెంచుకోమని బతిమలాడుతుంది. అయితే ఒక పని చెయ్యి శౌర్య నాకు పుట్టిన కూతురు కాదని చెప్పు అప్పుడు నువ్వు అన్నట్టే అనాథను తెచ్చి పెంచుకుంటానని చెప్తాడు.

రేపు సాయంత్రం వరకు టైమ్ ఇస్తున్నాను ఆలోచించుకో నాకు సంబంధించినది ఏదీ నీ దగ్గర ఉండటానికి వీల్లేదని బెదిరిస్తాడు. నువ్వు ఏ విషయం చెప్పకపోతే ఎల్లుండి పొద్దున్న నేను చేసేది నువ్వు ఊహించను కూడా ఊహించలేవని వార్నింగ్ ఇస్తాడు. దీప ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోతుంది.

రౌడీ జాగ్రత్త 

నా కూతురిని నా నుంచి దూరం కాకుండా ఏ దేవుడు కాపాడతాడని అనుకుంటూ ఉండగా కార్తీక్ వస్తాడు. ఎందుకు బాధపడుతున్నారో చెప్పమని అడుగుతాడు. నా సమస్యను నేను పరిష్కరించుకోగలను నేను పరిష్కరించుకోలేని పరిస్థితి వస్తే తప్పకుండా మీ సాయం తీసుకుంటానని చెప్తుంది.

మీ సమస్య ఏంటో నాకు తెలియదు కానీ రౌడీ జాగ్రత్త. నేను రౌడీతో స్నేహంలో పడ్డాను. అది ఎందుకో నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నేను దీప కూతురు రౌడీ కాదు రౌడీ వాళ్ళ అమ్మ దీప అని గుర్తు పెట్టుకున్నాను. రౌడీకి సంబంధించి సమస్య అయితే నాకు ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే నేను తనకు ఫ్రెండ్ ని తన బాధ్యత తీసుకున్నానని చెప్తాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

WhatsApp channel