Karthika deepam 2:కార్తీకదీపం 2 సీరియల్ ..శౌర్య నాకు పుట్టిన కూతురు అయితే ఇచ్చేయమన్న నరసింహ, ఇప్పుడు దీప పరిస్థితి ఏంటి?
Karthika deepam 2 serial today june 21st episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శోభకు పిల్లలు పుట్టే యోగం లేదు. కానీ నాకు కూతురు ఉంది కదా తనని నాకు ఇచ్చేయ్. నాకు పుట్టిన కూతురు అయితే ఇచ్చేయమని నరసింహ దీపను అడుగుతాడు.
Karthika deepam 2 serial today june 21st episode: స్వప్న రోడ్డు మీద తన తండ్రిని చూస్తుంది. శ్రీధర్ మాత్రం కూతురిని గమనించుకోడు. కారులో కాంచనకు శ్రీధర్ కొబ్బరి బొండం ఇవ్వడం చూసి ఆశ్చర్యపోతుంది. ఎవరు ఆవిడ? ఆమె ఎవరో చూడాలని రోడ్డు క్రాస్ చేసి వెళ్తుండగా కాలు బెణుకుతుంది. శ్రీధర్, కాంచన వెళ్లిపోతారు.
ఆమె ఎవరో తెలుసుకోవాలి?
డాడీ పక్కన ఉన్న మనిషి ఎవరు? బిజినెస్ పనుల్లో బిజీగా ఉన్నారని మమ్మీ చెప్పింది ఏదో జరుగుతుంది అది ఏంటో వెంటనే తెలుసుకోవాలని అనుకుంటుంది. కార్తీక్ దీప హోటల్ దగ్గరకు వస్తాడు. ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు. కడియం చూసి కార్తీక్ బాబు బయటే ఉన్నారు నువ్వు బిజీగా ఉన్నావని వెయిట్ చేస్తున్నారని వెళ్ళి పలకరించమని పంపిస్తాడు.
దీప కోపంగా కార్తీక్ దగ్గరకు వెళ్ళి ఎందుకు వచ్చారని అడుగుతుంది. నీకోసం రాలేదని చెప్తాడు. మరి టిఫిన్ సెంటర్ ముందు ఎందుకు తిరుగుతున్నారని అంటుంది. అప్పుడే స్వప్న వస్తుంది. తనని చూసి అర్థమైందా నేను ఎవరి కోసం వెయిట్ చేస్తున్నానో అంటాడు.
మా డాడీ మమ్మీని మోసం చేస్తున్నారు
స్వప్న కాల్ చేసి కార్తీక్ ని రమ్మని పిలుస్తుంది. మా డాడీ మా మమ్మీని మోసం చేస్తున్నారు. నేను రోడ్డులో వస్తూ ఉంటే మా డాడీ ఒకావిడకు కొబ్బరి బొండం ఇవ్వడం చూశాను. వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వస్తారని అనుకుంటే డాడీ ఇలా చేశారని స్వప్న బాధగా అంటుంది.
ఆవిడ ఎవరో తెలుసా అంటే లేదు ఆవిడ మొహం చూడలేదని చెప్తుంది. మీ డాడీని నిలదీయమని కార్తీక్ చెప్తాడు. అప్పటికే కారు వెళ్ళిపోయింది ఏం చేయాలో అడ్వైజ్ ఇస్తావని నీ దగ్గరకు వచ్చానని చెప్తుంది. బయట రోజులు బాగోలేదు నువ్వు చూసింది నిజమో కాదో తెలియాలంటే మీ మమ్మీ ముందే డాడీని అడగమని చెప్తాడు.
సరే వెంటనే వెళ్ళి మమ్మీని అడిగిస్తానని వెళ్లబోతుంటే దీప ఆపుతుంది. మీరు నన్ను కూడా కారులో తీసుకెళ్లారు కదా మనల్ని చూసిన వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటే మీరు ఒప్పుకుంటారా? స్వప్న ఆవిడ మొహం కూడా చూడలేదు. నిజాలు ఏంటో తెలుసుకోకుండా తొందరపడితే లేనిపోని అనుమానాలు వస్తాయి అది మంచిది కాదని చెప్తుంది.
స్పెషల్ దీప
దీప చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. అదేంటో నేనే కనిపెడతానని స్వప్న అంటుంది. సరేనని చెప్పి స్వప్నకు కార్తీక్ ధైర్యం చెప్తాడు. దీప ఉప్మాని మెచ్చుకుంటుంది. ఉప్మా స్పెషల్ గా ఉంది నిన్ను ఇక నుంచి స్పెషల్ దీప అని పిలుస్తానని చెప్తుంది. ఎందుకు అలా సపోర్ట్ చేసి మాట్లాడావని కార్తీక్ అడుగుతాడు.
శిక్ష తప్పు చేసిన వాళ్ళకు పడాలని దీప అంటుంది. నేను నీ జీవితం దగ్గరుండి చూశాను అందుకే నీలాంటి జీవితం ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నానని చెప్తాడు. దీప స్కూల్ కి వస్తే పాప ఎలా చదువుతుందో తెలుసుకోవడం కోసం శౌర్య తండ్రి ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చాడని అటెండర్ చెప్తాడు. నరసింహ ఎందుకు వచ్చాడని దీప కంగారుగా వెళ్తుంది.
శోభకు పిల్లలు పుట్టరు
ప్రిన్సిపల్ రూమ్ దగ్గరకు వెళ్తే అక్కడ ఉండదు. దీప కంగారుగా వెళ్తుంటే నరసింహ పిలుస్తాడు. తానే అటెండర్ తో అలా చెప్పించానని చెప్తాడు. తానెం గొడవ చేయడానికి రాలేదని మాట్లాడటానికి వచ్చానని చెప్తాడు. కక్షలు పంచాయతీలు మనకు వద్దు నేను జనజీవన స్రవంతిలో కలిసిపోయానని అంటాడు.
దేవుడు నా మీద పగ పట్టాడు. శోభ నీళ్ళు పోసుకుందని త్వరలో మనవడు రాబోతున్నాడని మా అమ్మ ఓవరాక్షన్ చేసింది కదా. సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. శోభ గర్భసంచిలో ఏదో లోపం ఉంది. ఇక జీవితంలో పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పింది. ఇక తనకు పిల్లలు పుట్టరని శోభ ఏడుస్తుంటే మా అమ్మ ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చింది.
నాకు పుట్టిన కూతురు అయితే ఇచ్చేయ్
పిల్లలు లేని దానికి నీకు కాదు. దానికి పిల్లలు పుట్టరు కానీ నాకు కూతురు పుట్టింది కదా. నా కూతురు నీ దగ్గర ఉంటే అది శోభకు కూడా కూతురు అవుతుంది. అందుకే నా కూతురిని నాకు ఇచ్చేయమని అడగటానికి వచ్చాను. నువ్వు ఇస్తావా? నన్ను తీసుకెళ్ళమంటావా? అంటాడు.
ప్రాణాల మీద ఆశ లేకపోతే నా కూతురు జోలికి వెళ్ళు అని అంటుంది. శౌర్య నాకు పుట్టిన కూతురు అయితే నాకు ఇచ్చేయ్ అని నీచంగా మాట్లాడతాడు. నాకు పుట్టలేదు అంటే నాకు వద్దు దాని గురించి గొడవలు వద్దు. లైఫ్ టైమ్ సెటిల్ మెంట్ చేసుకుందాం. పాపను నాకు ఇస్తే జీవితంలో నేను ఇక నీ జోలికి రానని చెప్తాడు. అక్కడితే నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్