Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. శౌర్యను తీసుకొచ్చేయమన్న అనసూయ, స్వప్న తన తండ్రి గురించి నిజం తెలుసుకుంటుందా?
Karthika deepam 2 serial today june 20th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శోభకు పిల్లలు పుట్టరని ఏడుస్తుంటే శౌర్యను తీసుకొచ్చేయమని అనసూయ ఐడియా ఇస్తుంది. అది నరసింహ రక్తం దీప దగ్గర ఎందుకు ఉండటం వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తుంది.
Karthika deepam 2 serial today june 20th episode: కార్తీక్ కంగారుగా దీప దగ్గరకు వచ్చి నరసింహ ఇక్కడికి వచ్చాడా అంటాడు. ముందు మీరేందుకు ఇక్కడికి వచ్చారని ఎదురు ప్రశ్నిస్తుంది. రోడ్డు మీద నరసింహ కానిస్టేబుల్ తో మాట్లాడటం చూశాను వాడు ఇక్కడికి వచ్చి గొడవ ఏమైనా చేశాడేమో మీరు కంప్లైంట్ ఇచ్చారేమో అని అనుకున్నానని చెప్తాడు.
ఆవేశపడిన కార్తీక్
ఇస్తే మీకేంటి నరసింహ ఇక్కడికి వస్తే మీకేంటి? నేను మీకు ఫోన్ చేసి సమస్య ఉంది రమ్మని అడిగానా? ఎందుకు వచ్చారు ఎవరు చెప్పారని వచ్చారు? అంటుంది. అయిపోయిందా మీ ఆవేశం ఒక మనిషికి ఏమైందా అని కంగారుగా వస్తే ఇలా మాట్లాడుతున్నారని కార్తీక్ కూడా సీరియస్ అవుతాడు.
రౌడీ కనిపించడం లేదని వెళ్ళి వాడికి వార్నింగ్ ఇచ్చి వచ్చారు. కానీ వాడు సైలెంట్ గా ఉండదు మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడు. మీరు వాడిని ఏం చేయరు నన్ను ఏం చేయనివ్వరు. మీ ఓర్పు సహనం వాడికి శ్రీరామరక్ష మీకు శిక్ష అని అంటాడు. ఎవరు ఎలా ఉన్నా మీరు నా గురించి పట్టించుకోవద్దని చెప్తుంది.
నా జోలికి రావొద్దు
కుదరదు నేను మీ శ్రేయోభిలాషిని. నేను ఇప్పటి నుంచి రౌడీకి సంరక్షకుడిని. మీ జోలికి వస్తే మీరు చూసుకోండి. కానీ రౌడీ జోలికి వస్తే మాత్రం ఊరుకొనని అంటాడు. వద్దు మీరు నాకు నా కూతురు జోలికి రావద్దు. నా తండ్రి చావుకు కారణం మీరే మిమ్మల్ని నేను జీవితంలో క్షమించలేను.
నా మంచితనంతో నరసింహ ఆడుకుంటుంటే మీరు నా బలహీనతతో ఆడుకుంటున్నారు. వదిలేయండి మమ్మల్ని ఇలా బతకనివ్వండి నాకు మీ సాయం వద్దు. నా బిడ్డకు మీ స్నేహం వద్దు. మిమ్మల్ని జ్యోత్స్నతో మాట్లాడమన్నాను మీరు మాట్లాడలేదు.
ఇప్పటి వరకు మీరు చేసిన సాయాలకు శతకోటి వందనాలు. నిజంగా నరసింహ వచ్చి నన్ను ఏదైనా చేసినా బెదిరించినా మీరు కలగజేసుకోవద్దు ఇది నా జీవితం అనేసి వెళ్ళిపోతుంది. నీ జీవితం దారిలో పడెంత వరకు నేను నీకు శ్రేయోభిలాషినే. ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది అప్పుడు మీరు పశ్చాత్తాపపడతారని అనుకుంటాడు.
అసలు నిజం ఏంటి?
దీపతో మాట్లాడిన విషయాల గురించి జ్యోత్స్న చెప్పడంతో పారిజాతం ఫుల్ ఖుషీగా ఉంటుంది. దీప దగ్గర కూడా సమర్థించుకునే సమాధానాలు ఉంటాయని అంటే అవన్నీ నిజాలు కాదు కదా అని పారిజాతం అంటుంది. అసలు నిజం ఏంటో నీకు తెలుసా? అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది.
వాళ్లిద్దరికీ ముందే పరిచయం ఉందని తెలిస్తే జ్యోత్స్న ఊరుకోదు. వీళ్ళకి పెళ్లి అయ్యేంత వరకు దీన్ని కంట్రోల్ చేయడం కష్టమని అనుకుంటుంది. మనకు తెలియనిది వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. ఆ స్ట్రాంగ్ ఎమోషన్ వాళ్ళని కనెక్ట్ చేస్తుందని జ్యోత్స్న డౌట్ పడుతుంది.
అలా ఏం లేదు శౌర్యకు గార్డియన్ గా నువ్వు ఉన్నావ్ కాబట్టి స్కూల్ కి వెళ్లలేదు. టిఫిన్ సెంటర్ దగ్గరకు వెళ్ళి నువ్వు వార్నింగ్ ఇచ్చావ్ కదా అక్కడికి మీ బావ వెళ్లలేడు. ఇంటి దగ్గర కలవలేరు మనం ఉంటాం కదా అంటుంది. వాళ్ళు కలిసేందుకు వేరే మీటింగ్ పాయింట్ వెతుక్కుంటే అని జ్యోత్స్న డౌట్ పడుతుంది.
నాన్న ఎప్పుడు వస్తాడు?
శౌర్య బెత్తం తీసుకుని వచ్చి తనని కొట్టమని దీప దగ్గరకు వస్తుంది. నేను తప్పు చేశాను నన్ను కొట్టు అంటుంది. ఏం చేసిందోనని దీప కంగారుపడుతుంది. రెండు రోజుల్లో ఫాదర్స్ డే ఫంక్షన్ ఉందంట మిస్ చెప్పింది. అంటే ఏంటో తెలియక మా ఫ్రెండ్ అని అడిగితే నీకు నాన్న లేడా అంటుంది.
అందుకని మిస్ దగ్గర ఫోన్ తీసుకుని కార్తీక్ కి ఫోన్ చేశాను. ఫాదర్స్ డే రోజు ఏం చేయాలో కనుక్కుందామని ఫోన్ చేశాను కార్తీక్ వచ్చాడని చెప్తుంది. ఫాదర్స్ డే అంటే ఏంటో నాన్న గురించి మాట్లాడాలి, నాన్న ఏం చేశాడో అందరికీ చెప్పాలని కార్తీక్ చెప్తాడు. మరి నాన్న నాకు లేడు కదా అంటుంది.
కార్తీక్ తండ్రి గురించి గొప్పగా చెప్తాడు. ఆ మాటలు విని దీప కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆ మాటలు విన్న తర్వాత నాకు నాన్న ఉంటే బాగుండని అనిపించింది. కార్తీక్ చెప్పినట్టే మా నాన్న కూడా ఉంటాడు కదాని అమాయకంగా అడుగుతుంది. తొందర్లోనే మీ నాన్న మన కోసం వస్తాడని దీప కూతురిని పట్టుకుని ఏడుస్తుంది.
నీకు అమ్మానాన్న నేనే
నాన్నని తీసుకొస్తానని ఒట్టు వేయమని శౌర్య అడుగుతుంది. సరే ప్రామిస్ అనేసరికి బుడ్డది సంతోషపడుతుంది. ఏం చేయాలో తెలియక దేవుడి మీద భారం వేసి అబద్ధపు ఒట్టు వేశానని దీప కన్నీళ్ళు పెట్టుకుంటుంది. తాతయ్య ఉంటే నువ్వు ఫాదర్స్ డే చేసేదానివి కదా అంటుంది.
తాతయ్య ఉండే వాడు కానీ కార్తీక్ బాబు యముడిలా వచ్చి ఎత్తుకుపోయాదని అనుకుంటుంది. నువ్వు ఎప్పుడు నీకు అమ్మానాన్న నేనే అంటావ్ కదా ఇక నుంచి నీకు అమ్మానాన్న కూడా నేనే అని శౌర్య అనేసరికి దీప ఎమోషనల్ అవుతుంది. శోభ తనకు పిల్లలు పుట్టరని కుమిలి కుమిలి ఏడుస్తుంది.
శౌర్యను తెచ్చేయ్
నువ్వు కనకుండానే నీకు బిడ్డలు వస్తారు. నీతో ఏ సంబంధం లేదని దీప అన్నప్పుడు వెళ్ళి శౌర్యను తెచ్చుకో. కన్నందుకు నువ్వు తండ్రివి అవుతావ్ కనకుండానే ఇది తల్లి అవుతుంది.
ఇక మీకు బిడ్డలు లేరని బాధ ఉందని అనసూయ ఐడియా ఇస్తుంది. బిడ్డ జోలికి వస్తేనే కత్తిపీట మెడ మీద పెట్టింది ఇక బిడ్డను ఇచ్చేయమని అంటే చెయ్యి నరికి చేతిలో పెడుతుందని శోభ భయపడుతుంది.
చట్టప్రకారం కూడా ఆడపిల్లను తల్లికి అప్పగిస్తారని మీరు అన్నది ఏ రకంగా కుదరదని శోభ అంటుంది. కుదురుతుంది కానీ నీ మొగుడు కూతురిని నీ కూతురిగా పెంచగలవా అని అడిగితే పెంచుతానని అంటుంది. దాని కూతురే దాని బలం, బలహీనత. ఏం చేస్తే నువ్వు కొట్టే దెబ్బ దాని గుండె మీద తగులుతుందో ఆలోచించు. దాని దగ్గర నువ్వు వదిలేసింది దాని కూతురిని తెచ్చేసుకోమని చెప్తుంది.
స్వప్న రోడ్డు మీద వెళ్తూ శ్రీధర్ ని చూస్తుంది. కానీ శ్రీధర్ మాత్రం స్వప్నను గమనించుకోడు. డాడీని సర్ ప్రైజ్ చేద్దామని వెళ్దామని అనుకుంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్