Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్… గ్రానీ గొంతు నొక్కిన జ్యోత్స్న,గుడ్ న్యూస్ చెప్పిన శోభ,పట్టరాని ఆనందంలో నరసింహ
Karthika deepam 2 serial today june 18th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ఎందుకు ఇలా చేశావ్ అంటూ జ్యోత్స్న పారిజాతం గొంతు పట్టుకుని పిసికేస్తుంది. అటు శోభ తన భర్త నరసింహకు గుడ్ న్యూస్ చెప్తుంది.
Karthika deepam 2 serial today june 18th episode: దీపతో మాట్లాడినా తన దగ్గరకు వెళ్ళినా అన్నీ రౌడీ కోసమేనని చెప్తాడు. స్కూల్ దగ్గర శౌర్య దీప కోసం వెయిట్ చేస్తుంది. తనతో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుంది. వాళ్ళ నాన్న రాగానే ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. అది చూసి శౌర్య కన్నీళ్ళు పెట్టుకుంటుంది. నాకు నాన్న ఉంటే నేను ఇలాగే ఉండేదాన్ని కదా కానీ శౌర్యకు నాన్న లేడని ఏడుస్తుంది.
గ్రానీ పీక పిసికేసిన జ్యోత్స్న
జ్యోత్స్న పారిజాతం గొంతు పట్టుకుని నొక్కేస్తూ ఎందుకు చేశావ్ ఇదంతా అని అడుగుతుంది. విషయం అర్థం అయ్యింది కదా ఏం చేయాలో చెప్తానని పారిజాతం అంటే నీ బ్లాక్ అండ్ వైట్ ఐడియాలు వద్దని చెప్తుంది. భర్త వదిలేసిన ఆడదానిగా దీప మీద బావకు చాలా సింపతీ ఉంది, శౌర్య దగ్గరవడం వల్ల అది మరీ ఎక్కువ అయ్యింది.
వాళ్ళిద్దరూ కలవడానికి శౌర్య కారణం అవుతుంది. స్కూల్ లో గార్డియన్ గా బావకు బదులు నేను ఉన్నానని చెప్తుంది. నీతో ఈ పెళ్లి ఇష్టం లేదని మీ బావ మాటల్లో ఎక్కడైనా అనిపించిందా అని పారిజాతం అడుగుతుంది. ఈ డౌట్ నీకు ఎందుకు వచ్చిందని జ్యోత్స్న అనుమానంగా అడుగుతుంది.
నువ్వు నాకు చాలా స్పెషల్
వచ్చే ముహూర్తానికి మనవడికి మనవరాలికి పెళ్లి చేయాలని తాతయ్యను అడిగావు కదా అది నిజం అవుతుంది. ఇప్పుడు నా టార్గెట్ దీప, శౌర్య అంటుంది. శౌర్య డల్ గా ఉంటుంది. రోడ్డు మీద నడవలేకపోతున్నాను నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి రమ్మని పిలుస్తాను.
నాకోసం కారు వేసుకుని వస్తాడని అంటుంది. దీప వద్దని చెప్పినా కూడా శౌర్య వినిపించుకోదు. అప్పుడే కార్తీక్ వస్తాడు. నీకు ఫోన్ చేయాలని అనుకున్నాను నువ్వే వచ్చేశావని సంతోషంగా అంటుంది. నువ్వు నాకు చాలా స్పెషల్ అని ఎవరేం అనుకున్నా పర్వాలేదని కార్తీక్ అంటాడు.
కార్తీక్ తండ్రి అని చెప్పేస్తుంది
ఈ ముగ్గురిని అనసూయ చూస్తుంది. నా కొడుకు బుడ్డదానికి తండ్రి అని ఈ దీప చెప్పలేదు. ఏదో ఒక రోజు ఈ కార్తీక్ దాని తండ్రి అని చెప్పిన ఆశ్చర్యం లేదని తిట్టుకుంటుంది. దీప శౌర్యను కార్తీక్ తో పంపించేసి హోటల్ కి వెళ్తుంది. ఎంత ప్రయత్నించినా కార్తీక్ బాబుని శౌర్యకు దూరంగా ఉంచలేకపోతున్నాను. ఇంకోసారి గట్టిగా చెప్పాలని అనుకుంటుంది.
శోభ నరసింహను దారుణంగా అవమానిస్తుంది. ఏనాడు నా వాళ్ళతో తన్నులు తినని నేను దీప చేతిలో రెండు చెంపలు వాయించుకున్నాను. నా కళ్ళ ముందే నా మొగుడి పీక మీద కత్తి పెట్టిందని రెచ్చగొడుతుంది. అనసూయ వచ్చి ఎందుకు రోజు ఇలా మాట్లాడి వాడిని రెచ్చగొడుతున్నావని అంటుంది.
గుడ్ న్యూస్ చెప్పిన శోభ
అప్పుడే శోభ సడెన్ గా వాంతులు చేసుకుంటుంది. అనసూయ ఈ వాంతులు తిన్నది అరగక కాదు నా కోడలు నన్ను నానమ్మను చేయబోతుందని చెప్తుంది. నరసింహ శోభను ప్రేమగా దగ్గరకు చూసుకుంటాడు. ఈరోజు నుంచి ఏ పని చేయడానికి వీల్లేదు నిలబడటానికి కూడా వీల్లేదని తెగ హడావుడి చేస్తాడు.
అనసూయ కూడా శోభ మీద తెగ ప్రేమ కురిపించేంస్తుంది. శోభను తీసుకుని హాస్పిటల్ కి వస్తారు. అక్కడ దీప వాళ్ళకు ఎదురుపడుతుంది. అనసూయ సంతోషంగా శుభవార్త చెప్తానని అంటే నరసింహ ఆపుతాడు. కానీ ఇది పది మంది తెలుసుకోవాల్సిన విషయమని శోభ కూడా అంటుంది. తన కోడలు తల్లి కాబోతుందని అనసూయ చెప్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్