Bitter Food Benefits : ఈ చేదు పదార్థాలను ఆహారంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి శ్రీరామరక్ష-you must eat these bitter foods for super health benefits fenugreek turmeric and neem leaves ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bitter Food Benefits : ఈ చేదు పదార్థాలను ఆహారంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి శ్రీరామరక్ష

Bitter Food Benefits : ఈ చేదు పదార్థాలను ఆహారంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి శ్రీరామరక్ష

Anand Sai HT Telugu
Mar 06, 2024 03:30 PM IST

Bitter Food Benefits In Telugu : ఆహారంలో ఏదైనా చేదు పదార్థం ఉంటే మనం అస్సలు ముట్టుకోం. కానీ చేదు పదార్థాలే మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని గుర్తుంచుకోవాలి.

మెంతుల ప్రయోజనాలు
మెంతుల ప్రయోజనాలు (Unsplash)

చేదు అనేది ఆహారంలో ఇష్టపడని రుచి. చేదు ఆహారాలు తరచుగా వంటలలో విస్మరిస్తారు. ఉద్దేశపూర్వకంగానే వాటిని పక్కన పడేస్తారు. వేస్తే ఎవరూ తినరని అనుకుంటారు. ఎందుకంటే మనం సహజంగా ఈ రుచిని ఇష్టపడం. అయితే, చేదు పదార్ధాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మీ రోజువారీ ఆహారంలో ఈ రకం ఫుడ్‌లను జోడించడం వల్ల మీ డైట్‌ హెల్తీగా అవుతుంది. మొత్తం శ్రేయస్సుకు కూడా దోహదపడుతుంది. మీరు మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన కొన్ని సాధారణ చేదు ఆహారాలు ఇక్కడ ఉన్నాయి.

మెంతులతో ప్రయోజనాలు

భారతదేశంలో శతాబ్దాలుగా మెంతులు వంట, ఔషధాలలో ఉపయోగించబడుతున్నాయి. ఇది ఆహారాలకు ప్రత్యేకమైన రుచిని అందించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే దీని చేదు గుణం కారణంగా చాలా మంది దీనిని పక్కన పడేస్తారు. కొందరైతే దీనిని వాడకుంటా ఉంటారు. భారతీయ వంటకాలలో సాధారణంగా ఉపయోగించే మెంతులు చేదు రుచిని కలిగి ఉంటాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యం కోసం విస్తృతంగా ఉపయోగించబడతాయి.

మెంతికూరలోని హైపో-లిపిడెమిక్ పదార్థాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను సమతుల్య స్థాయిలో ఉంచేందుకు ఉపయోగిస్తారు. మెంతిపొడిని తయారు చేసుకుని తింటే మరిన్ని లాభాలు కూడా పొందవచ్చు. 1 గ్లాసు గోరువెచ్చని పాలలో 1 టీస్పూన్ వెండా పొడిని బాగా కలపాలి. తర్వాత 1 టీస్పూన్ నిమ్మరసం వేసి దానికి తేనె కలుపుకోవాలి. కొద్దిగా రుచిగా ఉంటుంది. ఈ పాలలో మెంతిపొడి కలిపి రోజూ ఉదయం తాగడం వల్ల కొలెస్ట్రాల్ త్వరగా తగ్గుతుంది.

పసుపుతో అద్భుతాలు

భారతీయ వంటకాలలో పసుపు ఒక అనివార్యమైన మసాలా. ఆహార పదార్థాల రుచిని పెంచడమే కాకుండా కొంచెం చేదు రుచిని కూడా కలిగి ఉంటుంది. కాస్త ఎక్కువ తింటే మీరు ఆ రుచిని తెలుసుకోవచ్చు. కాస్త చేదు రుచిగానే పసుపు అనిపిస్తుంది. తేలికపాటి చేదు రుచి ఉన్నప్పటికీ, పసుపు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. పసుపులో కర్కుమిన్ అని పిలువబడే సమ్మేళనం ఉంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు విస్తృతంగా ఉపయోగిస్తారు.

ఆయుర్వేదంలో పసుపునకు చాలా ప్రాముఖ్యత ఉంది. పసుపను కచ్చితంగా వంటల్లో చేర్చుకోవాలి. లేదంటే చాలా ప్రయోజనాలు మిస్ అయిపోతారు. మెుత్తం శ్రేయస్సుకు పసుపు చాలా ఉపయోగకరం.

వేప ఆకులతో ఉపయోగాలు చాలా

వేప చెట్టు ఆకులు వాటి చేదు రుచికి ప్రసిద్ధి చెందాయి. అయితే వాటి ఔషధ గుణాలకు ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనవి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వేప ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

వేప ఆకులు నోటి దుర్వాసనను పోగొట్టడం నుండి రక్తపోటును తగ్గించడం వరకు అనేక విధాల ఉపయోగపడుతుంది. వేప ఆకులను ఆయుర్వేదంలోనూ చాలా ఉపయోగిస్తారు. వివిధ రకాల బాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్‌లను నివారించే ఔషధ గుణాలను వేప ఆకులు కలిగి ఉంటాయి.

Whats_app_banner