Karthika deepam 2 serial: స్వప్న కార్తీక్ చెల్లెలని తెలుసుకున్న దీప.. కొడుకు కూతురిని చూసి పారిపోయిన శ్రీధర్-karthika deepam 2 serial today june 13th episode deepa conceals from karthik that swapna is sridhar and kaveri daughter ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial: స్వప్న కార్తీక్ చెల్లెలని తెలుసుకున్న దీప.. కొడుకు కూతురిని చూసి పారిపోయిన శ్రీధర్

Karthika deepam 2 serial: స్వప్న కార్తీక్ చెల్లెలని తెలుసుకున్న దీప.. కొడుకు కూతురిని చూసి పారిపోయిన శ్రీధర్

Gunti Soundarya HT Telugu
Jun 13, 2024 07:12 AM IST

Karthika deepam 2 serial today june 13th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. స్వప్నకు యాక్సిడెంట్ కావడంతో కార్తీక్ సాయం చేసి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. దీప వాళ్ళ దగ్గర ఉన్న సమయంలోనే శ్రీధర్ హాస్పిటల్ కు వస్తాడు. వాళ్ళని చూసి భయంతో పారిపోతాడు.

కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 13వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 13వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

Karthika deepam 2 serial today june 13th episode: దీపను రోడ్డు మీద ఆపి నరసింహ మళ్ళీ వాదనకు దిగుతాడు. నీ కూతురిని నీకు దూరం చేస్తానని అంటాడు. తెలిసిన పని చేసుకుని కూతురిని చదివించుకుంటున్నాను వదిలేసేయ్ అని దీప చెప్తుంది. నా మీద పోలీస్ కేసు పెట్టకుండా ఉంటే వదిలేసే వాడిని.

నిన్ను నీ కూతురిని వదిలిపెట్టను

నా కూతురి జోలికి వచ్చానని నా కాళ్ళు పట్టుకుని బతిమలాడి ఉంటే వదిలేసే వాడినేమో కానీ పోలీస్ స్టేషన్ లో కొట్టిచ్చావ్ ఇంటికి వచ్చి నా పెళ్ళాన్ని కొట్టావ్. బస్తీలో నన్ను ఐటెం గాడిని చేశావు. నిన్ను నీ కూతురిని వదలిపెట్టనని చెప్తాడు. నువ్వు నన్ను ఏం చేస్తావో చేసుకో ఛీ ఎదవతో నాకు ఏంటి అనుకుంటే నా పెళ్ళానికి సారి చెప్పి వెళ్లిపో. కార్తీక్ బాబుతో ఇక్కడే ఉంటాను అంటే నేను ఇలాగే చేస్తానని బెదిరిస్తాడు.

తప్పు చేసిన నువ్వు ఉంటే తప్పు చేయని నేను ఎందుకు వెళ్ళాలి. నా కూతురు అంటే నాకు ప్రాణం. దాని జోలికి ఎవరైనా వస్తే నా బుర్ర పని చేయదని మొన్న అర్థం అయ్యింది. నీకు ఇంతకుముందే పెళ్లి అయ్యింది కూతురు ఉందనే విషయం మర్చిపో అదే ఇద్దరికీ మంచిదని చెప్పేసి వెళ్ళిపోతుంది.

కార్తీక్ స్వప్నకు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. స్వప్న వాగుతూ ఉంటుంది. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. కాంచన స్వప్న కోసం వస్తుంది. రాగానే కూతురిని తెగ తిడుతుంది. తనని బాస్ సేవ్ చేసి హెల్ప్ చేశారని చెప్తుంది.

స్వప్న కార్తీక్ చెల్లి అని తెలుసుకున్న దీప

అదే హాస్పిటల్ కు దీప టిఫిన్ పట్టుకుని వస్తుంది. వైజాగ్ నుంచి షిఫ్ట్ అయ్యామని కావేరి కార్తీక్ కి చెప్తుంది. కావేరి కార్తీక్ మాట్లాడుకోవడం చూసి దీప షాక్ అవుతుంది. దీపను చూసి నువ్వేంటి ఇక్కడని అడుగుతాడు. టిఫిన్ ఆర్డర్ పెడితే ఇవ్వడానికి వచ్చానని చెప్తుంది. దీపతో గొడవ అయిన విషయం కావేరి చెప్తుంది.

తప్పు ఈవిడదే అంట సారి కూడా చెప్పిందని కావేరి చెప్తుంది. ఏంటి గొడవ అని కార్తీక్ అడుగుతాడు. స్వప్నను చూసి కార్తీక్ చెల్లెలు అని అర్థం చేసుకుంటుంది. దీప అలా గొడవ పడే మనిషి కాదు. ఇక్కడితో ఈ విషయం వదిలేయమని చెప్తాడు. అప్పుడే శ్రీధర్ కంగారుగా హాస్పిటల్ కు వస్తాడు.

పారిపోయిన శ్రీధర్

స్వప్న దగ్గర కార్తీక్ ఉండటం చూసి శ్రీధర్ భయంతో కనిపించకుండా వాళ్ళని గమనిస్తాడు. దీప, కార్తీక్ ఇక్కడ ఉన్నారు అంటే నిజం ఏమైన తెలిసింద ఏంటని కంగారుగా ఇక్కడ ఉంటే మంచిది కాదని వెళ్ళిపోతాడు. ఎక్కడ ఉన్నారని కావేరి ఫోన్ చేస్తే వేరే చోట ఉన్నానని అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు.

గండం నుంచి తప్పించుకున్నానని అనుకుని పారిపోతాడు. స్వప్నకు జాగ్రత్తలు చెప్పి దీప, కార్తీక్ వెళ్లిపోతారు. టిఫిన్ ఎంత అయ్యింది డబ్బులు ఇస్తానని కార్తీక్ అంటే వాళ్ళు మీకు ఏమవుతారని డబ్బులు ఇస్తానని అంటున్నారని దీప అడుగుతుంది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు కారులో వస్తుంటే స్కూటీ మీద ఒకరిని ఢీ కొట్టిందని చెప్తాడు.

కార్తీక్ ని మెచ్చుకున్న దీప

మీకు తెలియకుండానే మీరు మంచి చేశారని దీప కార్తీక్ ని మెచ్చుకుంటుంది. ఇది నేను సెలబ్రేట్ చేసుకోవాల్సిందేనని అంటాడు. ఈ మాట ఎందుకు అన్నారో తర్వాత తెలుస్తుందని అనుకుంటుంది. స్వప్నను చూస్తే అల్లరి పిల్లలా ఉంది మీలాంటి వాళ్ళ స్నేహం అలాంటి వాళ్ళకు అవసరమని చెప్తుంది.

తనని చూస్తే నాకు ఇలాగే అనిపించింది. తన ప్రవర్తన నాకు బాగా నచ్చింది ఎంతగా అంటే నాకు ఇలాంటి చెల్లెలు ఉంటే బాగుండని అనిపించిందని చెప్తాడు. చాలా మంచి మాట అన్నారు తనతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండమని దీప చెప్తుంది.

శ్రీధర్ ఇంటికి వస్తే కార్తీక్ గురించి కాంచన చెప్తుంది. ఎవరో అమ్మాయి రోడ్డు మీద పడిపోతే తనకు సాయం చేసి వాళ్ళ పేరెంట్స్ కి అప్పగించే వరకు అక్కడే ఉన్నాడు అంత అవసరం ఏంటని అంటుంది. అదేంటి ఎప్పుడు నీ సపోర్ట్ ఆడవాళ్లకు కదా ఇప్పుడు ఏమైందని శ్రీధర్ అడుగుతాడు.

స్వప్న గురించి చెప్పిన కాంచన

కార్తీక్ దీపకు సాయం చేశాడు ఏమైంది వాళ్ళ భర్తతో నానా మాటలు పడాల్సి వచ్చింది. కథ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. చివరకు దీప కూడా వీడిదే తప్పు అన్నది. ఇప్పుడు ఈ అమ్మాయి స్వప్న కూడా యాక్సిడెంట్ కేసు ఈ అమ్మాయికి సాయం చేయడం వల్ల కొత్త సమస్య వస్తే ఏంటని కాంచన అడుగుతుంది.

సమస్య వచ్చేసింది. దీపకు కావేరి ఎవరో తెలుసు. స్వప్న మా కూతురని కార్తీక్ కి చెప్తే అని కంగారుపడతాడు. ఈ విషయంలో కొడుకుని గట్టిగా అడగమని చెప్తుంది. అలా అడిగే రోడ్డు మీద పడిపోయిన అమ్మాయికు సాయం చేయొద్దు అంటే మీకు మానవత్వం లేదా అని అంటాడు అసలే నీ కొడుకు వీరేశలింగం కదాని అంటాడు.

దీప వెళ్లిపోతే బాగుండు

మీరు చెప్పింది నిజమే వాడు మంచి పనే చేశాడు. ఆ అమ్మాయి చాలా అల్లరి పిల్ల అంట అందరితో చాలా త్వరగా కలిసిపోయే మనిషి అంట. నాకు చెల్లెలు లేదు కానీ ఉంటే ఇలాగే ఉండేదని అన్నాడని చెప్తుంది.

గాయం తగ్గిపోయిన తర్వాత స్వప్నను మన ఇంటికి లంచ్ కి పిలుస్తానని కాంచన అనేసరికి శ్రీధర్ గట్టిగా వద్దు అని అరుస్తాడు. ఇక ఆ అమ్మాయి సంగతి మర్చిపో అనేసి వెళ్ళిపోతాడు. ఎప్పుడు లేనిది ఇలా ఆవేశపడుతున్నారు ఏంటి మళ్ళీ కార్తీక్ మీద ఏ నింద పడుతుందోనని కంగారుపడినట్టు ఉన్నారు.

అసలు దీని అంతటికీ కారణం దీప. తను కూతురిని తీసుకుని ఎటైన వెళ్లిపోతే బాగుండని కాంచన కూడా అనుకుంటుంది. దీప కూతురు శౌర్యకు పాట నేర్పిస్తుంది. ఆ పాటను కార్తీక్ ఇంటి బయట నిలబడి వింటూ ఆనందిస్తాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

WhatsApp channel