Brahmamudi June 8th Episode: బ్రహ్మముడి- రాజ్ మాయ పెళ్లిలో కావ్య ట్విస్ట్- స్వప్నకు కూడా రెండో పెళ్లి- రుద్రాణిలా అపర్ణ-brahmamudi serial june 8th episode kavya gives twist in raj maya marriage swapna warns rudrani brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi June 8th Episode: బ్రహ్మముడి- రాజ్ మాయ పెళ్లిలో కావ్య ట్విస్ట్- స్వప్నకు కూడా రెండో పెళ్లి- రుద్రాణిలా అపర్ణ

Brahmamudi June 8th Episode: బ్రహ్మముడి- రాజ్ మాయ పెళ్లిలో కావ్య ట్విస్ట్- స్వప్నకు కూడా రెండో పెళ్లి- రుద్రాణిలా అపర్ణ

Sanjiv Kumar HT Telugu
Jun 08, 2024 07:52 AM IST

Brahmamudi Serial June 8th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 8వ తేది ఎపిసోడ్‌లో దొంగ మాయ చిత్రతో రాజ్ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. కావ్యే తనను గట్టెంక్కించాలని రాజ్ అంటాడు. నేను చూసుకుంటాను అని కావ్య అంటుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూన్ 8వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూన్ 8వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రాజ్‌కు దొంగ మాయకు పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటాయి. కల్యాణ మండపం, పూలు, తాళి, పండ్లు అన్ని చూపిస్తారు. కావ్య చేయి పట్టుకుని రాజ్ మాట్లాడుతాడు. నేను ఇప్పటివరకు ఎవరినీ ఏది అడగలేదు. నా జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయం అయినా నేను ఒప్పుకుని తీసుకున్నవే అని రాజ్ అంటాడు.

నేను చూసుకుంటాను

కానీ, ఈసారి మాత్రం నేను ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో నిలబడ్డాను. నువ్ తప్పా నన్ను గట్టెంకించేవాళ్లే లేరు అని రాజ్ ఎమోషనల్‌గా కావ్యతో చెబుతాడు. మీరు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి. ఎవరికీ ఏ అనుమానం రాకుండా మాములుగా ఉండటానికి ప్రయత్నించండి. మిగతాది నేను చూసుకుంటాను అని కావ్య చెబుతుంది. రాజ్ రెండో పెళ్లిలో కావ్య ఏమైనా ట్విస్ట్ ఇస్తుందా, ఇంకా ఏమైనా జరుగుతుందా అనేది చూడాలి.

శుక్రవారం ఎపిసోడ్‌లో ఇంట్లోకి కావ్య వెళ్లేసరికి అంతా చీరలు చూస్తుంటారు. అది చూసి షాక్ అవుతుంది. ఇంతలో రుద్రాణి వచ్చి దొంగ మాయను చూసి నవ్వుతుంది. పెళ్లి పెటాకులు అవుతుంటే ఇప్పటిదాకా షికార్లు కొట్టి వచ్చిందని చిత్ర అనుకుంటుంది. కావ్య వెళ్లిపోతుంటే.. ఆగమని చెప్పిన రుద్రాణి.. నీ భర్త పెళ్లి కదా. నువ్ కూడా ఓ చీర తీసుకో. ఖరీదు ఎంతైనా సరే మా వదిన లెక్కలు వేసే రకం కాదని అంటుంది. నువ్వేంటి ఎడంగా ఉన్నావ్. పెళ్లి నీకే. కల్యాణానికి ఓ చీర, శోభానానికి ఓ చీర తీసుకో అని రుద్రాణి అంటుంది.

నటన ఎందుకు

అంటే, అన్ని యాంటీ క్లాక్ వైస్ జరిగిపోయాయి. కానీ, సాంప్రదాయంగా మళ్లీ జరగాలి కదా అని రుద్రాణి సెటైర్లు వేస్తుంది. పెళ్లి నీకే అక్కడే నిలబడి ఏం చూస్తున్నావ్ అని అపర్ణ ఫైర్ అయితే.. నాకు ఇవన్నీ తెలీదు. మీరే సెలెక్ట్ చేయండని చిత్ర అంటుంది. నీకు అన్ని తెలుసని మాకు తెలుసు. ఇంకా ఎందుకు ఈ నటన వచ్చి తీసుకో అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంతలో రాజ్ వస్తే చిత్ర భయపడుతుంది. అక్కడే ఆగిపోయావ్ ఏంటీ మాయ.. పెళ్లి కొడుకే వచ్చి పెళ్లి చీర సెలెక్ట్ చేయాలని చూస్తున్నావా అని రుద్రాణి అంటుంది.

మా అత్తయ్యకు భయపడుతున్నావా. పెద్దవాళ్లు ఏమైనా అంటే సర్దుకుపోవాలి అని అపర్ణ అంటుంది. రుద్రాణి కూడా మా అమ్మ చాలా మంచిది అని కవర్ చేస్తుంది. ఏంటీ రాజ్‌నే సెలెక్ట్ చేయమంటావా అని రుద్రాణి అంటుంది. ఒసెయ్ దొంగమొహం దానా జరిగింది తెలిస్తే గుండె ఆగి చస్తావ్ అని చిత్ర రుద్రాణిని తిట్టుకుంటుంది. రాజ్ కోపంగా తీసుకో చీర. ఇక్కడిదాకా వచ్చి ఆగిపోవడం ఎందుకు అని అంటాడు. దాంతో కావ్య నువ్ సెలెక్ట్ చేయొచ్చు కదా అని రుద్రాణి అంటుంది.

రెండో పెళ్లి చేసుకుంటాను

ఇంతలో స్వప్న వచ్చి నేను వస్తున్నాను అత్త అని చెప్పి వస్తుంది. రాహుల్ ఎక్కడున్నాడు. నేను రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. రాహుల్ నో ఆబ్జెక్షన్ లెటర్‌పై సంతకం చేయాలి. ఎక్కడ నా మొదటి భర్త.. నా మొదటి అత్త అని స్వప్న అంటుంది. అంతా షాక్ అవుతారు. అప్పుడు నా రెండో పెళ్లికి చీరలు నువ్వు, నా మొదటి భర్త సెలెక్ట్ చేద్దురు అని స్వప్న అంటే.. నీకు నేను ఎలా కనిపిస్తున్నాను అని రుద్రాణి అంటుంది.

మరి నా చెల్లి నీకు ఎలా కనిపిస్తుంది. దాని మొగుడు రెండో పెళ్లి చేసుకుంటే చీర సెలెక్ట్ చేయమంటావా. నువ్ ఆసలు ఆడదానివేనా. నీలాంటి శాడిస్ట్ మొహంది ఉంటుందా. నీలా సిగ్గు లేకుండా పుట్టింటికి వచ్చే రకం కాదు కదా. అందుకే చావైనా బతుకైనా ఇక్కడే అని మనసు చంపుకుని బతుకుతోంది. మీరెంటీ ఏదో పేరంటానికి కొనుక్కున్నట్లు చెరో చీర పట్టుకుని ఉన్నారు. మీకు ఆత్మ సాక్షి లేదా. జరుగుతున్నా అనాచారానికి బాగా రెడీ అవ్వాలనుకుంటున్నారా.. లేవండి అని స్వప్న అరుస్తుంది.

దండం పెట్టిన స్వప్న

దాంతో ధాన్యలక్ష్మీ, అనామిక లేస్తారు. స్వప్న అని గట్టిగా అరుస్తుంది అపర్ణ. నేను మిమ్మల్ని ఏమనట్లేదు. మీ నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఎవరికీ లేదు. రేపు నీ కొడుకు రెండోసారి పెళ్లి కొడుకు అవుతాడు. ఈ మాయలేడి మాయ పక్కన కూర్చుంటుంది. ఆ మండపంలో నా చెల్లెలు రంగు వెలిసిపోయిన బొమ్మలా ఉండిపోతుంది. ఆ హోమగుండంలో బూడిదవుతున్న నా చెల్లి బతుకు చూసి బాధనుంచి వచ్చిన కోపంతో, ఆవేశంతో నాలుగు మాటలు అన్నాను. తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి ఆంటీ దండం పెట్టి ఏడుస్తూ వెళ్లిపోతుంది.

కావ్య కూడా ఏడుస్తుంది. కావ్య వెళ్లిపోతుంటే.. ఒక్క నిమిషం అని అపర్ణ అంటుంది. ఇప్పటిదాకా నీ మీ సానుభూతి వర్షం, వీళ్లపై విమర్శల వర్షం కురిపించి వెళ్లింది. కానీ, జరిగేది అర్థం చేసుకని వెళ్లింది. నువ్ కూడా మనసు గుండెరాయి చేసుకుని ఉండు. ఏ ఆడదికి అయినా సరే తన భర్తకు రెండో పెళ్లి చేస్తే గుండె బద్ధలవుతుంది. కానీ, ఇక్కడ ఓ బిడ్డ ఉన్నాడు. వాడికి ఇంటి వారసత్వం కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకే అగత్యం చేయాల్సి వస్తుంది. మానసికంగా ధైర్యం తెచ్చుకో అని అపర్ణ అంటుంది.

రుద్రాణికి ప్రతిరూపంలా

ఇంటి కోడలి నగలు కూడా మాయకు ఇవ్వమని రుద్రాణి చెప్పడంతో అవును అని అపర్ణ అంటుంది. రాజ్ కోపంగా చూడడంతో నాకొద్దు. నగలు కావ్య దగ్గరే ఉండని అని భయంగా చెబుతుంది మాయ. నా భర్తకంటే నాకు ఏది ఎక్కువ కాదు. నా భర్తనే దారపోస్తున్నాను. ఆ నగలు నాకో లెక్కనా. తెచ్చి ఇస్తాను అని కావ్య అంటుంది. ఆగమని చెప్పిన ఇందిరాదేవి ఈ మందర మాటలు వినడం ఎప్పటి నుంచి వినడం మొదలు పెట్టావ్ అపర్ణ. నువ్వులా నాకు కనిపించడం లేదు. ఈ రుద్రాణికి ప్రతిరూపంలా కనిపిస్తున్నావు అని ఇందిరాదేవి అంటుంది.

చెప్పుడు మాటలు వినేవాళ్లు ఏదో ఒకరోజు మూల్యం చెల్లించాల్సిన దుస్థితిలో పడతారు. అప్పుడు ఎంత పశ్చాత్తాప పడిన లాభం లేదు. నగలు కావ్యను అడిగే ఇవ్వాలా. కావాలంటే కొను అని ఇందిరాదేవి అంటుంది. నాకు వచ్చిన కష్టాన్ని ఎవరు ఆపలేనప్పుడు. త్యాగాన్ని అయినా ఇష్టంగా చేయాలని ఉంది. నాకు నా భర్తకంటే ఏది ముఖ్యం కాదు. ఆ నగలు నాకెందుకు అని కావ్య నగలు తెచ్చి మాయకు ఇస్తుంది. కానీ, మాయ మాత్రం భయపడిపోతుంది.

బలవంతంగా మాయ చేతిలో

దాంతో టేబుల్‌పై నగలు పెడుతుంది కావ్య. ధారపోయి.. మానవత్వాన్ని. మంచి తనాన్ని అపాత్రదానం చేయి అని ఇందిరాదేవి కోపంగా వెళ్తుంది. కావ్య కూడా వెళ్లిపోతుంది. అపర్ణ నగలు ఇస్తుంటే మాయ భయపడిపోతుంటుంది. తీసుకో మాయ. వారసత్వంగా వస్తున్న నగలు ఇస్తుందంటే ఇంటి కోడలిగా ఒప్పుకున్నట్లే అని రుద్రాణి అని బలవంతంగా మాయ చేతిలో పెట్టిపిస్తుంది. పైన ఉన్న కావ్యను బాధగా చూస్తాడు రాజ్. పైకి వెళ్లి కావ్య కూర్చుంటుంది.

హలో ఏంటీ ఇలా ఉన్నావ్. నువ్ బయటకు వెళ్లి ఏం చేస్తున్నావో నాకు తెలియదు. కానీ నేను చేయాల్సింది చేశాను. కంగారుపడకు. ఆ మాయ అసలు మాయ కాదని, చిత్ర అని, డబ్బు కోసం ఇక్కడికి వచ్చిందని తెలుసుకున్నాను. అదే తన దగ్గరికి వెళ్లి చెప్పి మూట ముళ్లే సర్దుకుని వెళ్లమన్నాను అని రాజ్ అంటాడు. అలా వెళ్తే.. మీరే ఏదో చేశారని, పంపించారని అత్తయ్య అనుకుంటే అని కావ్య అడుగుతుంది. మాయ రాసినట్లు నేనే లెటర్ రాసి పెడతాను అని రాజ్ చెబుతాడు.

మీరెప్పుడు కరిచారు

కొన్నాళ్లకు మర్చిపోతారు. బిడ్డ అంటావా వాడు నా కొడుకులాగే పెరుగుతాడు. ఇంకేం మాట్లాడకు. చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను. కంగారుపడకు అని రాజ్ వెళ్లిపోతాడు. మరోవైపు చిత్ర బట్టలు సర్దుకుంటుంది. అది చూసి ఎందుకు సర్దుతున్నావని రుద్రాణి అడుగుతుంది. నేను ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను అని మాయ చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. పిచ్చికుక్క గానీ కరిచిందా అని రుద్రాణి అంటే.. మీరెప్పుడు నన్ను కరిచారు అని మాయ అంటుంది.

మిమ్మల్ని నమ్ముకుంటే నడి వీధిలోకి మెడపట్టి గెంటెసేలా ఉన్నారు. నా గురించి మా నాన్న గురించి రాజ్‌కు తెలిసిపోయింది. మా నాన్నను పోలీసులకు పట్టిస్తానని అంటున్నాడు. నా అంతటా నేను ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోమ్మన్నాడు. అందుకే వెళ్లిపోతున్నాను అని మాయ అంటుంది. గోవిందా గోవిందా ఈ మాయ లాస్ట్ మినట్‌లో బుక్ చేసి వెళ్లిపోతుంది అని రాహుల్ అంటాడు. నా దాకా వస్తే నేను ఎవరినీ పట్టించుకోను అని మాయ అంటుంది. నమ్మనివాళ్లను నమ్మించి ఇంత ప్లాన్ చేస్తే ఎలా వెళ్లనిస్తానని అనుకుంటున్నావ్ అని రాహుల్ అంటాడు.

టీ20 వరల్డ్ కప్ 2024