Brahmamudi April 18th Episode: బ్రహ్మముడి- కల్యాణ్‌ను కాపాడిన కావ్య- రాహుల్ ప్లాన్ చెడగొట్టిన అనామిక- స్వప్నకు అనుమానం-brahmamudi serial april 18th episode kavya saves kalyan from rahul plan swapna doubts rudrani brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi April 18th Episode: బ్రహ్మముడి- కల్యాణ్‌ను కాపాడిన కావ్య- రాహుల్ ప్లాన్ చెడగొట్టిన అనామిక- స్వప్నకు అనుమానం

Brahmamudi April 18th Episode: బ్రహ్మముడి- కల్యాణ్‌ను కాపాడిన కావ్య- రాహుల్ ప్లాన్ చెడగొట్టిన అనామిక- స్వప్నకు అనుమానం

Sanjiv Kumar HT Telugu
Apr 18, 2024 07:31 AM IST

Brahmamudi Serial April 18th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 18వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్‌ జైలుకు వెళ్లేలా వేసిన రాహుల్ ప్లాన్‌కు అనామిక, రాజ్, కావ్య అడ్డుపడతారు. కావ్య నిజం చెప్పబోతుంటే రాహుల్ వచ్చి అడ్డుకుంటాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 18వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 18వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో పార్టీ తర్వాత కారులో ఇంటికి వెళ్తుంటారు రాజ్ కావ్య. చాలా బాగా ప్లాన్ చేసి వెన్నెల ఎవరో తెలుసుకుందామని ట్రై చేశావ్ కదా అని రాజ్ అడుగుతాడు. నేనేం ప్లాన్ చేశాను అని తెలియనట్లుగా అంటుంది కావ్య. ఏం తెలియనట్లు నటించకు. నువ్ శ్వేత మాట్లాడుకోవడం అంతా విన్నాను. వెన్నెల ఎవరో తెలుసుకునేందుకే కదా ఈ పార్టీ అని రాజ్ అంటాడు.

అమ్మకు పేరు పెట్టాలేమో

దాంతో షాక్ అయిన కావ్య.. తేరుకుని.. హో తెలిసిపోయిందా. అయితే ఏంటీ ఇప్పుడు. మీరు మాత్రం నాకంటే తెలివిగా ప్లాన్ చేయలేదా. చనిపోయిన అమ్మాయి పేరు చెబితే ఎప్పుడు రాదని బాబు తల్లి పేరు వెన్నెల అని చెప్పలేదు అని కావ్య అంటుంది. ఇంతలో బాబు ఏడుస్తుంటే.. ఊరుకో నాన్నా. మీ అమ్మ రాలేదు. మీ నాన్న చెప్పిందంతా అబద్ధం. దొంగ నాన్న. నీకంటే ముందు మీ అమ్మకు పేరు పెట్టాలేమో అని కావ్య అంటుంది. దాంతో రాజ్ కోపంగా చూస్తాడు.

ఏంటీ అలా మింగేసేలా చూస్తున్నారు. కంచికి చేరాల్సిన కథను ఇంటికి పట్టుకొచ్చారు. అసలు ఎవరీ బాబు. ఎందుకు ఇంటికి తీసుకొచ్చారు అని కావ్య అడుగుతుంది. నేను చెప్పను. నువ్ ఏమనుకున్నా సరే ఈ బాబు నా కొడుకే, నా ఇంటి వారసుడే. ఎన్నిసార్లు అడిగినా ఇదే చెబుతాను. ఇంకోసారి దీని గురించి అడక్కు అని రాజ్ గట్టిగా చెప్పేస్తాడు. దాంతో కావ్య చిరాకుగా సైలెంట్ అయిపోతుంది. మరోవైపు రాత్రి బయట కల్యాణ్ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు.

గోల్డ్ డీల్ గురించి

కల్యాణ్‌ను చూస్తూ రుద్రాణితో వాడి రాత్రంతా కష్టపడి కంపెనీకి కోట్లు లాభం తెచ్చిపెట్టేలా ఉన్నాడు అని రాహుల్ అంటాడు. అలా ఎలా తీసుకొస్తాం రా. అలా రాకుండా నువ్ చెడగొట్టవు. స్వప్నతో సంతకం పెట్టించుకున్నాం. కల్యాణ్‌తో సంతకం ఎలా పెట్టించుకోవాలి అని రుద్రాణి అంటుంది. నేను ఉన్నా కదా అని ఫైల్ పట్టుకుని రాహుల్ వెళ్తాడు. గోల్డ్ డీల్ గురించి అడుగుతాడు. అన్నయ్యను అడిగుదామని ఆగాను అని కల్యాణ్ అంటే.. ఇంకెప్పుడురా సొంత నిర్ణయాలు తీసుకుంటావురా అని రాహుల్ అంటాడు.

సరే చూస్తాను అని కల్యాణ్ ఫైల్ పక్కన పెడితే.. రేపటి పని ఇవాళే చేయాలి, ఇవాళ్టి పని ఇప్పుడే చేయాలి అని రాజ్ ఎప్పుడూ చెబుతుంటే వాడు అని రాహుల్ అంటే.. చాలా మారిపోయావురా అని కల్యాణ్ అంటాడు. నేను కూడా బాధ్యతలు నేర్చుకోవాలి కదా అని రాహుల్ అంటాడు. సరే చూస్తాను అని కల్యాణ్ అంటాడు. సరే అని రాహుల్ వెళ్లిపోతాడు. తర్వాత రాహల్ ఇచ్చిన ఫైల్ చూస్తాడు కల్యాణ్. ఇంతలో అక్కడికి అనామిక వస్తుంది.

టైమ్ ఉండట్లేదు

అనామిక చెడగొట్టేలా ఉంది అని రుద్రాణి అంటుంది. మా అమ్మ కాల్ చేసింది. ఇంటికి భజనానికి పిలిచింది. ఇద్దరం వెళ్దాం అని అనామిక అంటుంది. నువ్ వెళ్లు నేను రాను. ఆఫీస్‌కు వెళ్తున్నాను కదా. ఇది కావాలనుకున్నప్పుడు ఆ ఏడుపేదో నువ్వే ఏడు అని కల్యాణ్ అంటాడు. లంచ్ టైమ్‌లో వెళ్లి రావొచ్చు అని అనామిక అంటే.. లంచ్‌కు టైమే ఉండట్లేదు అని కల్యాణ్ బదులిస్తాడు. రావాలనుకుంటే రావొచ్చు. ఏదో ఒక్క రాత్రిలోనే కోట్లు తెచ్చేవాడిలా బిల్డప్ ఇస్తున్నావ్‌గా అని అనామిక అంటుంది.

దాంతో కోపం తెచ్చుకున్న కల్యాణ్.. హే షటప్.. ఇంకోసారి నన్ను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను. గెట్ లాస్ట్.. వెళ్లు ఇక్కడి నుంచి అని అరిచేసి పంపిచేస్తాడు. దాంతో అనామిక వెళ్లిపోతుంది. ఇక చిరాకుతో ఫైల్ పక్కన పడేస్తాడు కల్యాణ్. దాంతో రాహుల్ కల్యాణ్ దగ్గరికి వెళ్తాడు. ఫైల్ చూశావా అని అడుగుతాడు. పూర్తిగా చూడలేదు అని వెళ్లిపోతాడు కల్యాణ్. ఇదేంట్రా ఇలా అయింది అని రుద్రాణి అంటే.. ఆ అనామిక వచ్చి అంతా చెడగొట్టింది. ఎక్కడికీ పోతాడు. ఎలాగైనా సంతకం పెట్టించుకుంటాను అని రాహుల్ అంటాడు.

అంతా అబద్ధమే

మరోవైపు కావ్య కోసం ఇందిరాదేవి ఎదురుచూస్తుంటుంది. అక్కడ ఏం జరిగిందో తెలియలేదే అని అనుకుంటుంది. ఇంతలో రాజ్ బాబుతో వస్తాడు. అది చూసి షాక్ అయిన ఇందిరాదేవి.. వీడొకక్డే వచ్చాడేంటీ. కావ్య రాలేదేంటీ అని కంగారుపడుతుంది. ఇంతలో కావ్య రావడంతో సంతోషిస్తుంది ఇందిరాదేవి. వెన్నెల గురించి తెలిసిందా అని అడుగుతుంది. ఆయన చెప్పిందంతా అబద్ధమే. వెన్నెల అనే అమ్మాయే లేదు. కొన్నాళ క్రితమే చనిపోయింది. ఆ బాబుకు ఆయనకు సంబంధమే లేదు అని కావ్య అంటుంది.

అబ్బా.. ఆ బాబు రాకతో నీ జీవితం ఏమైపోతుందో అని భయపడిపోయాను. ఆ దేవుడు నీవైపే ఉన్నాడు అని ఇందిరాదేవి అంటుంది. అది సరిపోదు. ఆ బిడ్డ ఎవరో. ఆయన ఎందుకు తీసుకొచ్చాడో తెలియకపోతే ఇంట్లో సమస్యలు ఆగవు. ఎలా చేయాలో తెలియదు కానీ. ఆయన మనుసులో దాచుకున్న నిజాలన్నీ బయటకు తీసుకొస్తాను అని కావ్య అంటుంది. మరుసటి రోజు ఉదయం కల్యాణ్ ఫైల్ చూస్తుంటాడు. ఇప్పుడు ఎలాగైనా సైన్ చేయించుకోవాలని రాహుల్ అనుకుంటాడు.

తెలిసి ఎందుకు చేస్తున్నావ్

కానీ, అంతలో రాజ్ కిందకు కల్యాణ్ దగ్గరికి వెళ్తాడు. దాంతో రాహుల్ కంగారుపడిపోతాడు. కల్యాణ్‌ను చూసి నిన్ను ఒక్కన్నే కష్టాల్లో పడేశాను. సారీరా. మీకు ఎలాంటి కష్టం రాకూడదని అనుకున్నాను. కానీ ఇలా జరిగింది అని రాజ్ అంటే.. నాకు కావాల్సింది ఓదార్పు కాదన్నయ్య. నీ మీద నింద తొలగిపోయి మళ్లీ కంపెనీ చూసుకోవడం. ఇబ్బంది పెడితే క్షమించు అన్నయ్య అని కల్యాణ్ అంటాడు. నువ్ కాదురా నేను పెడుతున్నాను అందరిని అని రాజ్ అంటాడు.

మరి తెలిసి కూడా ఎందుకు చేస్తున్నావన్నయ్యా అని కల్యాణ్ అడుగుతాడు. దాంతో రాజ్ వెళ్లిపోతాడు. తర్వాత కిందకు కావ్య వెళ్తుంది. కావ్యను పిలిచి ఎక్కడికి అని అడుగుతాడు. గుడికి అని చెబుతుంది కావ్య. డ్రాప్ చేయనా అని కల్యాణ్ అంటే.. మీరు వర్క్ చేసుకోండి. నేను వెళ్తాను అని కావ్య అంటుంది. కావ్య వెళ్తుంటే.. కల్యాణ్ పిలిచి గోల్డ్ గురించి వచ్చిన డీల్ గురించి చెబుతాడు. దాంతో శకుంతల గ్రూప్ వాళ్ల అని కావ్య అంటుంది.

ప్లేట్ మార్చిన రాహుల్

అవును, మీకెలా తెలుసు అని కల్యాణ్ అంటాడు. అదంతా విన్న రాహుల్ ఇది నేను తీసుకొచ్చానని తెలిస్తే.. కల్యాణ్ నాపై కోప్పడతాడని వెంటనే కిందకు వచ్చి కావ్య చెప్పబోతుంటే.. ఆపేసి.. కల్యాణ్ పెద్ద తప్పు జరిగిపోయేది. నిన్న నేను ఓ ప్రపోజల్ తీసుకొచ్చాను కదా. అది పెద్ద ఫ్రాడ్ కంపెనీ అట. ఇంతకుముందు కూడా ఇలాంటి డీల్ చేద్దామని ట్రై చేస్తే మన కంపెనీ నుంచి వెళ్లగొట్టారట. సారీ కల్యాణ్ నా వల్ల పెద్ద నష్టం వచ్చేది అని రాహుల్ అంటాడు.

పర్లేదు ముందే తెలుసుకున్నావ్ కదా అని కల్యాణ్ అంటే.. రాహుల్ వెళ్లిపోతాడు. తర్వాత కవిగారు రాహుల్‌తో కాస్తా జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. మరోవైపు ఏమైందని రాహుల్‌ను రుద్రాణి అడిగితే.. జరిగింది చెబుతాడు రాహుల్. నువ్ దొరకలేదు అది చాలు. టైమ్ చూసి దెబ్బకొట్టొచ్చు అని రుద్రాణి అంటుంది. ఏదో ఒకటి చేసి దాన్ని కూడా కంపెనీ నుంచి దూరం చేయాలి అని రాహుల్ అంటాడు. ఇంతలో స్వప్న ఎంట్రీ ఇస్తుంది.

బాబుకు ఫీవర్

కోపంగా చూస్తుంది. నిన్న ఏం జరిగింది అని స్వప్వ అంటుంది. అదేంటీ అంతలా డ్యాన్స్ చేశావ్ అని రాహుల్ అంటాడు. తర్వాత ఇంకేదో జరిగింది అని స్వప్న అనుమానిస్తుంది. మాకు ఎక్కడ గుర్తుంది. నువ్ హీరోయిన్‌లా డ్యాన్స్ చేస్తే చూస్తూ ఉండిపోయాం అని రాహుల్ అంటాడు. కదా అని సంతోషంగా వెళ్లిపోతుంది స్వప్న. మరోవైపు బాబు ఏడుస్తుంటాడు. పాలు పట్టిన తాగడు. దాంతో డాక్టర్‌కు కాల్ చేసి చెబుతాడు రాజ్. రెండు గంటలు చూడమని, తగ్గకుంటే ఓ టానికి ఇస్తాను అది వేయండని చెబుతుంది డాక్టర్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో బాబు ఏడుస్తుంటే కావ్య పట్టుకుంటుంది. అంతా హాల్లో ఉంటారు. ఏమైంది బాబుకి అని ఇందిరాదేవి అడుగుతుంది. ఫీవర్ ఉందని, హాస్పిటల్‌కు తీసుకెళ్తారు సుభాష్, కావ్య, రాజ్. ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్‌కు వెళ్లిన ప్రయోజనం లేదు. బాబుకు తల్లి కావాలి. తల్లి స్పర్ష కావాలి. తల్లి పాలు కావాలి. ఇప్పుడు బాబును తల్లికి అప్పజెబుతేనే క్షేమంగా ఉంటాడు అని డాక్టర్ చెబుతుంది. దాంతో రాజ్ ఆలోచనలో పడిపోతాడు. చూస్తుంటే బాబు తల్లి ఎవరో రాజ్ చెప్పే సమయం వచ్చినట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point