Brahmamudi April 12th Episode: బ్రహ్మముడి- దుగ్గిరాల ఇంట్లో కావ్య ఆఖరి రోజు- స్వప్న ఆస్తిపై రుద్రాణి ప్లాన్- అనామిక షాక్-brahmamudi serial april 12th episode kavya last day in duggirala family raj rudrani wicked plan brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi April 12th Episode: బ్రహ్మముడి- దుగ్గిరాల ఇంట్లో కావ్య ఆఖరి రోజు- స్వప్న ఆస్తిపై రుద్రాణి ప్లాన్- అనామిక షాక్

Brahmamudi April 12th Episode: బ్రహ్మముడి- దుగ్గిరాల ఇంట్లో కావ్య ఆఖరి రోజు- స్వప్న ఆస్తిపై రుద్రాణి ప్లాన్- అనామిక షాక్

Sanjiv Kumar HT Telugu
Apr 12, 2024 07:51 AM IST

Brahmamudi Serial April 12th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 12వ తేది ఎపిసోడ్‌లో అందంగా రెడీ అయిన అనామికకు పెద్ద షాక్ ఇస్తాడు కల్యాణ్. అయినా మారదు అనామిక. మరోవైపు స్వప్న ఆస్తి కోసం రుద్రాణి, రాహుల్ ప్లాన్ వేస్తారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 12వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 12వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో అనామికకు కాల్ చేసిన తన తల్లి అక్కడ సమస్యలు పెరిగిపోతున్నాయని, వీలైనంత త్వరగా పని పూర్తి చేయమని చెబుతుంది. దాంతో సరే అని కాల్ కట్ చేస్తుంది అనామిక. కల్యాణ్‌ను తన దారిలోకి తెచ్చుకునేందుకు చాలా అందంగా రెడీ అవుతుంది అనామిక. ఇంతలో కల్యాణ్ వస్తాడు. అనామికను చూసి పెళ్లికి వెళ్తున్నావా అని అడుగుతాడు.

షాక్ అయిన అనామిక

ఇలా ఎవరైనా పెళ్లికి వెళ్తారా. భర్త కోసం కూడా ఇలా రెడీ అవుతారు అని కల్యాణ్‌ భుజాలవైపు రెండు చేతుల వేసి ఇక నుంచి నేనే నీ దగ్గరకు వద్దామనుకుంటున్నా. నేను దూరం పెట్టాను కదా. ఇక నుంచి అలా ఉండను అని అనామిక అంటుంది. అవునా.. ఎందుకు ఈ మార్పు. అదే.. ఇన్నాళ్లు దూరం ఉండటానికి, ఇప్పుడు దగ్గరకావడానికి కారణం ఏంటీ అని కల్యాణ్ అడుగుతాడు. దాంతో అనామిక షాక్ అయి అలాగే ఉండిపోతుంది.

భుజాలపై నుంచి ఉన్న చేతులు తీసి అందుకు కారణం నేను చెప్పనా. నీకు కావాల్సింది నేను కాదు. నాలోని కవి కాదు. నా స్థానం. నీకు కావాల్సింది మంచి స్థాయి ఉన్న బిజినెస్ మ్యాన్. కవితలు రాసుకునే కవి కాదు. కానీ, నాకు కావాల్సింది ఈ అనామిక కాదు. ఆ అనామిక. పాత అనామిక. ఈ అనామిక అక్కర్లేదు అని కల్యాణ్ అంటాడు. ఆ ప్రేయసికి, ఈ భార్యకు మధ్య నా స్థానం వారధిగా మారడం నాకు ఇష్టం లేదు. నీ అంతట నువ్ వచ్చిన రోజే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పాను. కానీ, నా అంతట నాకు రావాలనిపించిన రోజే వస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు కల్యాణ్.

కొడుకును తిట్టిన రుద్రాణి

కల్యాణ్ ఇచ్చిన ట్విస్ట్‌కు షాక్ అయిన అనామిక మల్లెపూలు తీసి విసిరిగొడుతుంది. నిన్ను నా దారిలోకి తెచ్చుకునేందుకు నేను ఎంతదూరమైన వెళ్తాను కల్యాణ్. నిన్ను బొమ్మల చేసి ఎలా ఆడిస్తానో చూడు అని అనామిక అనుకుంటుంది. మరోవైపు రాహుల్ ఆఫీస్ నుంచి వస్తాడు. అది పట్టించుకోకుండా స్వప్న ఉంటే రాహుల్ కోప్పడతాడు. పని చేసి అలసిపోయి వచ్చినవాడికి మంచినీళ్లు, కాఫీ ఇస్తారు. ఇలా బిహేవ్ చేయరు అని అరుస్తాడు.

లిప్ స్టిక్‌లు రుద్ది, పర్ఫ్యూమ్‌లు కొట్టి అలసిపోవడం కాదు. నువ్ ఇలాంటోడివి కాబట్టే నిన్ను ఎండీని చేయడానికి ఒక్క ఓటు పడలేదు. నువ్ ఎప్పుడు ఎండీవి కాలేదు. ప్లాన్ చేసి ఎండీ కావడం కాదు. సిన్సియర్‌గా కష్టపడి ఎండీ కావాలి. వెళ్లవయ్యా అని స్వప్న కూడా గట్టిగానే ఇస్తుంది. దాంతో కోపంతో రుద్రాణి దగ్గరికి వెళ్తాడు రాహుల్. మమ్మీ నేను అలసిపోయి వస్తే అని రాహుల్ అంటే.. ఆగు ఆగు ఏం చేశావ్. ఆఫీస్‌కు వెళ్లి కల్యాణ్‌ను తప్పించేలా చేయిరా అని పంపిస్తా నువ్ అమ్మాయిలమీద పడతావా అని రుద్రాణి తిడుతుంది.

స్వప్న ఆస్తి కోసం ప్లాన్

ఇలా చేస్తే ఎవరైనా గడ్డే పెడతారురా రాస్కెల్ అని రుద్రాణి తిడుతుంది. ఆ స్వప్న మాటలు వింటుంటే చంపేయాలనిపిస్తుంది. ఏదో ఒక రోజు కల్యాణ్‌ను తప్పించి ఎండీ సీటులో నేను కూర్చుని ఆ స్వప్నను మెడపట్టి గెంటేస్తాను అని రాహుల్ అంటే.. హా గెంటేస్తే ఏమవుతుంది. తాతయ్య రాసిచ్చిన ఆస్తి తిని కూర్చుంటుంది. ఆ ఆస్తి పేపర్స్ తీసుకెళ్లి తాకట్టు పెట్టి మనం డబ్బు తెచ్చుకుందాం. అప్పుడు చచ్చినట్లు మన దారికి వస్తుంది అని రుద్రాణి మరో కన్నింగ్ స్కెచ్ వేస్తుంది.

దానికి దాని సంతకం కావాలి కదా అని రాహుల్ అంటే.. అది నేను చూసుకుంటాను. నువ్ కల్యాణ్‌ను తప్పించడం ఎలానో చూడు అని రుద్రాణి చెబుతుంది. అనంతరం రాజ్‌కు శ్వేత కాల్ చేసి టెన్త్ క్లాస్ రీ యూనియన్ గురించి చెప్పి రావాలని అంటుంది. కానీ, రాజ్ రానని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ మాటలు కావ్య వింటుంది. తర్వాత కావ్యకు కాల్ చేసి రాజ్ రానన్న విషయం చెబుతుంది శ్వేత. అయితే, మీ ఫ్రెండ్స్ అందరికీ ఆయన నెంబర్ ఇచ్చి కాల్ చేసి రమ్మనమని చెప్పు. అప్పుడు ఎలా రాకుండా ఉంటాడో చూస్తాను అని కావ్య అంటుంది.

ఒప్పుకున్న రాజ్

మంచి ఐడియా అని శ్వేత చెప్పి కాల్ కట్ చేస్తుంది. తర్వాత ఒక్కొక్కరుగా రాజ్‌కు కాల్ చేసి రీయూనియన్ గురించి విసిగిస్తుంటారు. అందరికీ రానని చెబుతాడు రాజ్. కానీ, సురేష్ అని ఫ్రెండ్ ఇంటికి వస్తాం అని చెప్పడంతో రాజ్ ఒప్పుకుంటాడు. తర్వాత ఒక్కడివే కాకుండా భార్యతో కలిసి రావాలి. అది రూల్ అని చెబుతాడు. ఇప్పుడు ఈ కళావతిని తీసుకెళ్తే నాకు తలంటుపోస్తుంది అని రాజ్ అనుకుంటాడు. మొత్తానికి ఆయన ఒప్పుకున్నాడని కావ్య సంతోషిస్తుంది.

అనంతరం అపర్ణ ఫ్రెండ్ శకుంతల ఇంటికి వస్తుంది. తన అబ్బాయి పెళ్లి అందరూ రావాలని చెప్పి వెడ్డింగ్ కార్డ్ ఇస్తుంది. తర్వాత కావ్యతో రాజ్ ఏడి అని అడుగుతుంది శకుంతల. అప్పుడే రాజ్ బిడ్డను ఎత్తుకుని కిందకు వస్తాడు. శకుంతలను చూసి పైకి వెళ్తాడు. అది చూసిన శకుంతల అలా వెళ్లిపోతున్నావ్ ఏంటీ రాజ్. ఇలా రా అని పిలుస్తుంది. నీకు మనవడు పుట్టాడా. ఈ సంగతి మాకెవరికీ తెలియదు. ఎవ్వరికీ తెలియకుండా బారసాల జరిపించారా వింతగా ఉందా. ఏమ్మా నార్మల్ డెలీవరా, సిజేరియనా అని శకుంతల అడుగుతుంది.

అబద్ధం చెప్పిన కావ్య

దాంతో మధ్యలో దూరిన రుద్రాణి.. నువ్ రాంగ్ పర్సన్‌ను అడుగుతున్నావ్. రాజ్‌ను అడగాలి ఇక్కడ. అదే మ్యాజిక్ అని రుద్రాణి అంటుంది. నాకేం అర్థం కావట్లేదని శకుంతల అంటే.. రుద్రాణి ఏదో చెప్పబోతుంటే.. కావ్య అడ్డుకుంటుంది. మీకు ఇంకా అర్థం కావట్లేదా. రుద్రాణి గారు జోక్ చేస్తున్నారు. మేనల్లుడి గురించి సరదాగా మాట్లాడుతున్నారు. నార్మల్ డెలీవరీనే అని కావ్య చెబుతుంది. దానికి అంతా ఆశ్చర్యపోతారు.

హో.. రుద్రాణి నువ్ ఇంకా మారలేదు అని శకుంతల అంటే.. ఆవిడ మారరు. నాకు డెలీవరీ అయినప్పుడు రాహుల్‌కు సిజేరియన్ చేయిస్తాను. అప్పుడు మారుతుంది అని స్వప్న ఎంట్రీ ఇస్తుంది. సరే.. మీరంతా తప్పకుండా పెళ్లికి రావాలని చెప్పి వెళ్లిపోతుంది శకుంతల. అనంతరం రుద్రాణి‌పై ఫైర్ అవుతుంది అపర్ణ. ఇంటిగుట్టు బయటపెట్టేదాకా నువ్ ఊరుకోవా అని అపర్ణ అంటే.. ఇక్కడే ఉంటున్నావాన్న విశ్వాసం కూడా లేదా అని ఇందిరాదేవి అంటుంది.

స్వప్న కౌంటర్స్

అది రుద్రాణి డిక్షనరీలోనే లేదు అని ప్రకాశం అంటాడు. ఆడపడుచు హోదాలో ఉండి బతికిపోయావ్. లేకుంటే అని అపర్ణ అంటే.. ఏం చేస్తావ్. ఏం చేయగలవు. తప్పు చేసిన నీ కొడుకుని ఏం చేశావ్. తనే నవమాసాలు మోసి కన్నట్లు అబద్ధం చెప్పిన కావ్య సంగతి ఏంటీ అని రుద్రాణి అంటుంది. కావ్య పెట్టిన అన్నం తింటూ కూడా గడ్డి తిన్నవాళ్లలా మాట్లాడుతుంటే.. ఇంటి పరువు పోకుండా అబద్ధం చెప్పడాన్ని తప్పు పడుతున్న మీ నాలుకను కోద్దామని ఉన్న చేయలేక నివ్వేరపోయి చూస్తారు అని స్వప్న అంటుంది.

నిన్ను ఏం అనకుండా సంస్కారం అడ్డొచ్చి అలా చూస్తుండిపోయారు అని గట్టిగా కౌంటర్స్ ఇస్తుంది స్వప్న. దానికి లేచిన ధాన్యలక్ష్మీ.. మీ అక్క ఎలా అబద్ధాలు ఆడుతుందో తెలుసు. ఇంత జరిగినా మీ అక్క ఇక్కడ ఎందుకు ఉంటుంది. బంధాలు, బంధుత్వం కాదు. రాజ్‌పై ప్రేమ కాదు. ఆస్తి కోసం అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇప్పటికే బిడ్డకు అన్ని పనులు చేస్తుంది. తన తల్లి వచ్చిన కూడా అక్కలా చూసుకుంటుంది అని రుద్రాణి అంటుంది.

ఆఖరి రోజు

దాంతో కోపంతో స్టాప్ ఇట్ అని అరుస్తాడు రాజ్. ఇప్పటికే చాలా మాటలు అన్నారు. తప్పు చేసింది నేను. నన్ను అనండి పడతాను. కానీ, కళావతి ఏ తప్పు చేయలేదు అని రాజ్ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో కృష్ణుడి దగ్గర ఇవాళ ఆ వెన్నెల గురించి తెలుసుకుంటాను. నిజంగా ఆయన బిడ్డే అని తెలిస్తే.. ఇదే ఈ ఇంట్లో నాది ఆఖరి రోజు అవుతుంది అని కావ్య అనుకుంటంది.

Whats_app_banner