Raj Tarun: స్వామిరారా తరహాలో రాజ్ తరుణ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌.. హీరోయిన్ ఎవరంటే?-swami rara kind of raj tarun new movie launched ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Raj Tarun: స్వామిరారా తరహాలో రాజ్ తరుణ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌.. హీరోయిన్ ఎవరంటే?

Raj Tarun: స్వామిరారా తరహాలో రాజ్ తరుణ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌.. హీరోయిన్ ఎవరంటే?

Sanjiv Kumar HT Telugu
Apr 13, 2024 01:25 PM IST

Raj Tarun New Movie Launch: ఉయ్యాల జంపాల సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ మరో కొత్త సినిమా చేస్తున్నాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

స్వామిరారా తరహాలో రాజ్ తరుణ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌.. హీరోయిన్ ఎవరంటే?
స్వామిరారా తరహాలో రాజ్ తరుణ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌.. హీరోయిన్ ఎవరంటే?

Raj Tarun New Movie Launch: యంగ్ టాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా మరో కొత్త సినిమా రానుంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో ఈ మూవీ తెరకెక్కనుందని తెలిపారు. గోవిందరాజు సమర్పణలో కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్‌పీ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమం ఏప్రిల్ 12న రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. నూతన దర్శకుడు రమేష్ కడుములు ఈ సినిమాతో పరిచయం కానున్నారు. అలాగే ఈ సినిమాని మురళీధర్ రెడ్డి, కేఐటిఎన్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.

సినిమా పూజ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్, నక్కిన త్రినాధ రావు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక కూచిబొట్ల తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాకు డైరెక్టర్ మారుతి క్లాప్ చేయగా ప్రవీణ్ సత్తార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నక్కిన త్రినాధ రావు ఫస్ట్ షార్ట్ డైరెక్ట్ చేయగా ధీరజ్ మొగిలినేని, వంశీ స్క్రిప్ట్ అందజేశారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా రాజ్ తరుణ్‌కు జోడీగా రాశీ సింగ్ చేస్తోంది. రాశీ సింగ్ ఇటీవలే భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ మూవీ ఓటీటీలో బాగా హిట్ అయింది.

కాగా మూవీ లాంచింగ్ సందర్భంగా దర్శకుడు రమేష్ కడుముల తన అభిప్రాయాలు పంచుకున్నారు. "ఈ సినిమా షూటింగ్ ఈనెల 15 నుంచి ప్రారంభమవుతుంది. కంటిన్యూ షూటింగ్ ఉంటుంది. అక్టోబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అని డైరెక్టర్ చెప్పారు.

ఇది క్రైమ్ కామెడీ మూవీ. స్వామిరారా, అంధధూన్ తరహాలో ఉంటుంది. కథ చాలా అద్భుతంగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు ఎస్‌కేఎన్ గారికి, మారుతి గారికి, నక్కిన త్రినాధరావు రావు గారికి, వంశీ గారికి, అలాగే ధీరజ్ మొగలినేని గారికి ధన్యవాదాలు" అని రమేష్ కడుముల తెలిపారు.

"కథ చాలా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది. ఏప్రిల్ 15 నుంచి షూటింగ్‌కి వెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులకు అలాగే ముఖ్య అతిథులకు పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని నిర్మాత కేఐటీఎన్ శ్రీనివాస్ అన్నారు.

"అందరికీ నమస్కారం. పూజా కార్యక్రమానికి విచ్చేసిన అతిధులందరికీ ధన్యవాదాలు. ఏప్రిల్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. ఇది చాలా మంచి కథ. క్రైమ్ కామెడీ జోనర్. నా ఫేవరట్ జోనర్. మీ అందరికీ ఆశీర్వాదం కావాలి" అని రాజ్ తరుణ్ చెప్పాడు.

"ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. కథ విన్నప్పుడు నా పాత్ర చాలా నచ్చింది. రాజ్ తరుణ్‌తో కలసి నటించడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు" అని హీరోయిన్ రాశీ సింగ్ తెలిపింది.

"దర్శకులు రమేష్ చాలా ప్రతిభావంతుడు. ఈ సినిమా కథ, కథనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా ప్లాట్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాకు హీరోగా రాజ్ తరుణ్, హీరోయిన్ రాశి ఆప్ట్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు" అని నిర్మాత మాధవి అద్దంకి తెలిపారు.