The Mother Review: ది మదర్ రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?-jennifer lopez the mother movie review in telugu netflix the mother ott streaming now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Mother Review: ది మదర్ రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

The Mother Review: ది మదర్ రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Apr 13, 2024 11:46 AM IST

The Mother Movie Review In Telugu: ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండ్ అయిన సినిమాల్లో ది మదర్ మూవీ ఒకటి. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకునేలా ఉందా, ప్రేక్షకులను మెప్పించేలా ఉందో అనేది ది మదర్ రివ్యూలో తెలుసుకుందాం.

ది మదర్ రివ్యూ..  నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
ది మదర్ రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

The Mother Review In Telugu: అమెరికన్ సింగర్ అండ్ యాక్టర్ జెన్నిఫర్ లోపెజ్ (Jennifer Lopez) నటించిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది మదర్ (The Mother Movie). నికి కారో దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెన్నిఫర్‌తోపాటు ఒమరి హార్డ్‌విక్, జోసెఫ్ ఫెన్నెస్, గేల్ గార్సియా బెర్నల్, లూసీ పెయిజ్, పాల్ రాసి తదితరులు కీలక పాత్రలు పోషించారు. జెన్నిఫర్ లోపెజ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ది మదర్ (జెన్నిఫర్ లోపెజ్) అనే పేరుతో పిలిచే మహిళ యూఎస్ మిలిటరీలో పని చేస్తుంది. అక్కడ ఎస్ఏఎస్ మాజీ కెప్టెన్ అడ్రియన్ లోవెల్ (జోసెఫ్ ఫెన్నెస్), ఆర్మ్ డీలర్ హెక్టర్ అల్వరేజ్ (గేల్ గార్సియా బెర్నల్) మధ్య ఆయుధాల సరాఫరా విషయంలో బ్రోకర్‌గా ఉంటుంది ది మదర్. ఈ క్రమంలో ఈ ఇద్దరితో రిలేషన్‌షిప్‌లోకి వెళ్తుంది ది మదర్. కట్ చేస్తే, ప్రెగ్నెంట్‌గా ఉన్న ది మదర్ అప్రూవల్‌గా మారి ఆ ఇద్దరి గురించి ఎఫ్‌బీఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది.

అది తెలుసుకున్న అడ్రియన్ ది మదర్‌పై ఎఫ్‌బీఐ సేఫ్ హౌజ్‌లో అటాక్ చేస్తాడు. అక్కడి నుంచి తప్పించుకున్న ది మదర్ జోయి (లూసీ పెయిజ్) అనే పాపకి జన్మనిస్తుంది. కానీ, ఎఫ్‌బీఐ ఆఫీసర్స్ మాత్రం ది మదర్ పేరెటింగ్ రైట్స్ లేకుండా చేస్తారు. జోయిని వేరే ఫ్యామిలీ పెంచుకుంటుంది. మరోవైపు ది మదర్‌పై రివేంజ్ తీసుకోవాలని జోయిని కిడ్నాప్ చేసేందుకు ట్రై చేస్తారు అడ్రియన్, హెక్టర్.

హైలెట్స్

మరి వారి బారి నుంచి తన కూతురుని ది మదర్ కాపాడుకుందా? ఈ క్రమంలో హెల్ప్ చేసిన ఎఫ్‌బీఐ ఏజెంట్ విలియమ్ క్రూజ్ (ఒమరి హార్డ్‌విక్) పాత్ర ఏంటీ? అడ్రియన్, హెక్టర్‌కు ది మదర్ ఎందుకు ఎదురు తిరగాల్సి వచ్చింది? వాళ్లకు ఎలాంటి నష్టం కలిగించింది? అసలు జోయి తండ్రి ఎవరు? తన కూతురుని దేని నుంచి రక్షించాలనుకుంది? అనే విషయాలు తెలియాలంటే ది మదర్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

జెన్నిఫర్ లోపెజ్ సింగర్‌గా చాలా పాపులర్ అని తెలిసిందే. అయితే, ఆమె సినిమాల్లో కూడా చాలా కాలంగా నటిస్తూ వస్తోంది. అలా 2023లో జెన్నిఫర్ లోపెజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమానే ది మదర్. లేడి డైరెక్టర్ నికి కారో దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రారంభంలో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కానీ, ఆ తర్వాత సినిమా అంతా స్లోగా సాగుతుంది. మధ్యలో కొన్ని యాక్షన్ సీన్స్ పర్వాలేదనిపిస్తాయి.

మిస్సయిన డీటెల్స్

ది మదర్ కుమార్తె జోయి కోసం రౌడీలు వెంటపడటం, వారి నుంచి ది మదర్ కాపాడటం వంటి చేజింగ్, యాక్షన్ సీన్స్ పర్వాలేదు. తల్లీ కూతుళ్ల మధ్య బాండింగ్ కొన్ని చోట్ల వర్కౌట్ అయింది. మరికొన్ని చోట్ల ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేం. కూతురుకి ది మదర్ సెల్ఫ్ డిఫెన్స్, గన్ ట్రైనింగ్ సీన్స్ బాగానే ఉన్నాయి. అడ్రియన్, హెక్టర్‌కు ది మదర్ ఎందుకు ఎదురు తిరిగిందో చూపించారు. కానీ, చాలా వరకు అవసరమైన డీటేల్స్ మిస్ చేశారనిపించింది.

యాక్షన్ సీన్స్‌లో అదుర్స్

కొన్ని లొకేషన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, బీజీఎమ్ పర్వాలేదు. కానీ, ది మదర్ బాగా ఆకట్టుకునే యాక్షన్ థ్రిల్లర్ అయితే కాదు. నాలుగు ఫైట్స్, మూడు చేజింగ్ సీన్స్, రెండు ఎమోషనల్ సీన్స్ అన్నట్లుగా సాగుతుంది. కానీ, జెన్నిఫర్ లోపెజ్ యాక్షన్ సీన్స్‌లో మాత్రం అదరగొట్టింది. ముందుగా చెప్పినట్లు ఈ తల్లీకూతుళ్ల ఎమోషన్ కొన్నిసార్లు బాగుంది. మరికొన్ని సార్లు వర్కౌట్ కాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే సుమారు రెండు గంటల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాను టైమ్ పాస్ కోసం ఫ్యామిలీ సహా చూడొచ్చు. ఎలాంటి అభ్యంతరక సీన్స్ లేవు.