Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ సినిమాలు.. రెండు స్థానాల్లో గుంటూరు కారం, ఫస్ట్ ప్లేస్‌లో ఏదంటే?
Trending Movies in Netflix This Week: ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల అవుతూనే ఉంటాయి. విభిన్న జోనర్‌లలో స్ట్రీమింగ్ అవుతోన్న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ ఏంటో చూద్దాం.
Top 10 Trending Movies in Netflix: ఓటీటీలోనే దిగ్గజ సంస్థగా ఎదిగింది నెట్‌ఫ్లిక్స్. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో సగటు ప్రేక్షకులకు నచ్చే రీతిలో సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల చేస్తుంటుంది నెట్‌ఫ్లిక్స్. తెలుగు, హాలీవుడ్, కొరియన్, స్పానిష్ అంటూ ఒక భాష, ప్రాంతీయతతో సంబంధం లేకుండా అన్ని రకాల మూవీస్, సిరీస్ ఉండటం నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేకత. అలాంటి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ వారం టాప్ 10 ట్రెండిగ్‌లో ఉన్న సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
డంకీ (Dunki)
కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, సక్సెస్‌ఫుల్ హిందీ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ డంకీ. గతేడాది డిసెంబర్ 21న సలార్‌కు పోటీగా బాక్సాఫీస్ బరిలోకి దిగిన డంకీ మూవీ పర్వాలేదనిపించుకుంది. కానీ, వసూళ్ల పరంగా కాస్తా నిరాశపరిచింది. ఈ సినిమా ఈ ఏడాది వాలంటైన్స్ డే సందర్భంగా ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోన్న డంకీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ నెంబర్ వన్ ప్లేసులో ఉంది.
భక్షక్ (Bhakshak)
బాలీవుడ్ బ్యూటి భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా భక్షక్. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. సంక్షేమ శాఖ వసతి గృహాల్లో బాలికలపై జరిగే లైంగిక వేధింపుల కథాంశంతో వచ్చిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 2 ట్రెండింగ్‌లో ఉంది. షారుక్ ఖాన్ నటించిన డంకీ మూవీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే.. ఆయన సతీమణి నిర్మించిన భక్షక్ రెండో స్థానంలో ఉండటం విశేషం.
యానిమల్ (Animal)
బోల్డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన మరో బోల్డ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ యానిమల్. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అనంతరం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా పలు విమర్శలకు దారి తీసింది. కానీ, ఏది ఏమైనా ఓటీటీలో యానిమల్ మూవీ మూడో ప్లేస్‌ను సంపాదించుకుని ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరో హీరోయన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఇక ఇందులో తృప్తి దిమ్రికి నటిగా మంచి పాపులారిటీ వచ్చింది.
గుంటూరు కారం (Guntur Kaaram Hindi Version)
సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి వచ్చిన సినిమా గుంటూరు కారం. ఎన్నో అంచనాలతో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మాస్ ప్రేక్షకుల అంచనాలను అంతగా అందుకోలేకపోయింది. కానీ, ఓటీటీలో గుంటూరు కారం మూవీ హిందీ వెర్షన్ టాప్ 4 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంటే తెలుగు వెర్షన్ మాత్రం ఆరో స్థానంలో దూసుకుపోతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల చేయగా.. మీనాక్షి చౌదరి మరో రోల్ పోషించింది.
ఇండియా టుడేలో ఈ వారం టాప్ 10 మూవీస్ అంటూ నెట్‌ఫ్లిక్స్ తన ఫ్లాట్‌ఫామ్ సినిమాల లిస్ట్ ప్రకటించింది. వాటిలో ఐదో స్థానంలో హాలీవుడ్ మూవీ డూన్ (Dune) నిలిచింది. ఇక ఆరో స్థానంలో గుంటూరు కారం తెలుగు వెర్షన్ ఉంది. ఏడో స్థానాన్ని హాయ్ పాప అంటే నాని నటించిన హాయ్ నాన్న హిందీ వెర్షన్ సంపాదించుకుంది. షారుక్ జవాన్ మూవీ 8వ స్థానం, ప్రభాస్ సలార్ 9వ స్థానంలో ఉన్నాయి. అంటే, షారుక్ రెండు సినిమాలు ట్రెండింగ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక పదో స్థానంలో ప్లేయర్స్ మూవీ నిలిచింది.