Karthika deepam 2 serial: కార్తీకదీపం 2 సీరియల్.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప, కొడుకు ప్రవర్తనను అనుమానించిన కాంచన
Karthika deepam 2 serial today june 6th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. పాప ఆకలి తీర్చినందుకు దీప కార్తీక్ కి థాంక్స్ చెప్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం పారిజాతం చూసి ఏదో ప్లాన్ వేస్తుంది. ఇక కొడుకు ప్రవర్తన చూసి కాంచన కూడా అనుమానపడుతుంది.
Karthika deepam 2 serial today june 6th episode: దీప ఇంటికి వచ్చి కార్తీక్ మీద కూడా అరుస్తుంది. పిల్లకు ఆకలి అవుతుందని తెలియదా అంటూ అనేస్తుంది. నేను తినేశాను కార్తీక్ కారులో బయటకు తీసుకెళ్ళి తినిపించాడని చెప్తుంది. పిజ్జా తిన్నాను చాలా బాగుంది రోజు అదే చేసి పెట్టమని అడుగుతుంది.
శౌర్యకు అలవాటు పడొద్దు
చెప్పకుండానే పాప ఆకలి తీర్చారు చాలా సంతోషం. పిజ్జా ఎంత అయ్యిందని అంటే డబ్బులు చెప్తాడు. రోజు అంత డబ్బులు పెట్టి ఎక్కడ కొనిచ్చాలని అనేసరికి కార్తీక్ ఆశ్చర్యపోతాడు. భలే విడ్డూరంగా మాట్లాడుతున్నారని అంటాడు.
మిమ్మల్ని నా బిడ్డకు దూరంగా ఉండమని చెప్పింది నేనే. కానీ నా టైమ్ బాగోక మీకు అప్పగించి వెళ్ళాను. కానీ మీరు దాన్ని అలవాటు చేసుకోవద్దు. కొత్త కొత్త రుచులు అలవాటు చేయొద్దు. జీతం మీద బతుకుతున్న వాళ్ళం. ఇప్పటికే కాలం కొట్టిన దెబ్బకు మనసు చంపుకుని బతుకుతున్నాను.
ఇప్పుడు నేను మిమ్మల్ని కొప్పడటం లేదు కాస్త పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఇంకొక ఇల్లు చూసుకుని వెళ్లిపోతాను. మీరు దానికి బాగా అలవాటు పడితే మేము ఎంత ఇబ్బంది పడాలో మీకు తెలుసు అర్థం చేసుకోమని చెప్తుంది. శౌర్య వచ్చి కార్తీక్ కి థాంక్స్ చెప్పావా అంటుంది.
కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప
లేదు అంటే నీ పని నా ఫ్రెండ్ చేశాడు తనకు థాంక్స్ చెప్పకపోతే అలుగుతానని అంటుంది. వెళ్లిపోతున్న కార్తీక్ ని ఆపి పాప ఆకలి తీర్చినందుకు థాంక్స్ చెప్తుంది. ఇన్నాళ్ళకు మీతో థాంక్స్ చెప్పించుకోగలిగాను. ఏదో ఒక రోజు మీతో క్షమించాను అని చెప్పించుకోవాలని ఆశిస్తున్నానని అనుకుంటాడు.
పారిజాతం వాళ్ళిద్దరినీ చూసి చిలకా గోరింకల మాదిరిగా ఎంత బాగా మాట్లాడుకుంటున్నారో. నిన్ను దారిలో పెట్టాలని పారిజాతం ఫిక్స్ అవుతుంది. నరసింహ దీప మాటలు తలుచుకుని రగిలిపోతూ ఉంటాడు. శోభ పుల్లవిరుపు మాటలు మాట్లాడుతుంది.
దీప ఎందుకు వచ్చింది ఏం చేశావని శోభ అడుగుతుంది. ఈరోజు స్కూల్ ముందు వదిలేశారు పిల్లల్ని క్యాబ్ లో వదిలేశారు. ఆ క్యాబ్ మన సూరిగాడిది. దాని కూతురు కనిపించలేదని తెగ టెన్షన్ పడింది. అది తెలిసి ఇదంతా నేనే చేశానని కాస్త బిల్డప్ ఇచ్చానని చెప్తాడు.
పారిజాతం కోరిక ఏంటో?
నువ్వు చేయకపోతేనే ఇంత రాద్ధాంతం చేసింది చేస్తే ముగ్గురిని కలిపి చంపేస్తుందని అనసూయ భయపడుతుంది. అలా అని ఊరుకోవద్దు అది ఊరు వెళ్ళేవరకు ఇలాగే చేయాలని శోభ మరింత రెచ్చగొడుతుంది. శివనారాయణ పని చేసుకుంటూ ఉంటే పారిజాతం వచ్చి ఇకిలిస్తుంది.
డబ్బుల కోసమే కదాని ఒక వంద ఇస్తాడు. తాను వచ్చింది డబ్బుల కోసం కాదని మొహం మాడ్చుకుంటుంది. భర్త కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. రేపు నా పుట్టినరోజు అనేసరికి శివ నారాయణ కౌంటర్లు మీద కౌంటర్లు వేసి గాలి తీసేస్తాడు. తన కోరిక తీర్చమని అడుగుతుంది.
ఎవరినీ ఇబ్బంది పెట్టని కోరిక కొరతాను తీరుస్తానని మాట ఇవ్వమని అడుగుతుంది. సరే అయితే అని మాట ఇస్తాడు. దశరథ వచ్చి ఏంటి అని అడుగుతాడు. మీ పిన్ని బర్త్ డే అని చెప్పేసరికి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేద్దామని అంటాడు. నాన్న మాట ఇచ్చాడని ఆమె కోరికకు సరే అన్నాను ఇంతకీ ఆమె ఏం కోరిక కోరుతుందోనని దశరథ ఆలోచిస్తాడు.
దీప కార్తీక్ కి థాంక్స్ చెప్పినందుకు సంతోషంగా ఉందని శౌర్య అంటుంది. నాకు కొట్టాలని ఉంది ఈరోజు నువ్వు చేసిన పనికి అని దీప కన్నీళ్ళు పెట్టుకుంటుంది. నువ్వు ఏమైపోయావో తెలియక ఎంత కంగారుపడ్డానో అంటుంది. నేను వస్తే తప్ప నిన్ను ఎవరు పిలిచినా ఎక్కడికీ వెళ్లకూడదు, తినకూడదని మాట ఇవ్వమని అడుగుతుంది.
కార్తీక్ ని అనుమానించిన కాంచన
శౌర్య అలాగే మాట ఇస్తుంది. నన్ను ఇంట్లో వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావని శౌర్య అడుగుతుంది. నువ్వు కారు ఎక్కడానికి కారణమైన వ్యక్తికి థాంక్స్ చెప్పడానికి వెళ్లానని చెప్తుంది. రేయ్ నరసింహ శౌర్య నా కూతురు ఎవరైనా నా బిడ్డ జోలికి వస్తే వాళ్ళ చావు వాళ్ళు కొనితెచ్చుకున్నట్టేనని అనుకుంటుంది.
కాంచన కార్తీక్ కోసం ఎదురుచూస్తుంది. దీప, కార్తీక్ మధ్య బంధం గురించి అనుమానిస్తుంటే శ్రీధర్ అలా ఎందుకు ఆలోచిస్తున్నావని అడుగుతాడు. తన మాటలు పట్టించుకోవద్దని అంటాడు. రేపు జరగరానిది ఏదైనా జరిగితే తలెత్తుకుని తిరగలేము అంటుంది. అప్పుడే కార్తీక్ ఇంటికి వస్తాడు.
ఇంతకముందు టైమ్ కి ఇంటికి వచ్చేవాడివి. ఇప్పుడు అవుట్ హౌస్ అనేసరికి ఎందుకు అలా ఆలోచిస్తున్నావని కార్తీక్ అడ్డుపడతాడు. నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే పిన్ని చెప్పిన మాటల్లో నిజం ఉందని అనిపిస్తుందని కాంచన అంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్