Karthika deepam 2: దీపని చూసి వణికిపోతున్న శ్రీధర్.. సన్యాసి చెప్పిన మాటల్లో నిజం ఉందేమోనన్న సుమిత్ర
Karthika deepam 2 serial today may 28th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. సుమిత్ర ఇంటికి వచ్చిన శ్రీధర్ దీపకు ఎదురుపడతాడు. తనని చూసి నిజం ఎక్కడ బయట పెట్టేస్తుందేమోనని వణికిపోతూ ఉంటాడు.
Karthika deepam 2 serial today may 28th episode: దీప ఒంటరిగా కూర్చుని ఉంటే సుమిత్ర వచ్చి పలకరిస్తుంది. ఒకరి లోపాన్ని, బలహీనతను అవకాశంగా మార్చుకున్న వాళ్ళని ఏమని అంటారని అంటుంది. మళ్ళీ నరసింహ గురించి ఆలోచిస్తున్నావా అంటే ఏదేదో మాట్లాడుతుంది.
సన్యాసి చెప్పింది నిజమేనేమో
నాన్న కోసం పెట్టిన పిండం కాకులు ముట్టలేదు. తీరని కోరికతో చనిపోతే పిండం ముట్టవు అనుకున్నాను. కానీ అక్కడికి ఒక సన్యాసి వచ్చి బతికున్న వాళ్ళకి పిండం పెడితే కాకులు ముట్టవు అన్నాడు. మా అమ్మానాన్న చనిపోయారని నాకు తెలుసు కదా సన్యాసి మాటలు వింటే నవ్వు వచ్చిందని చెప్తుంది.
ఇది ఆలోచించాల్సిన విషయం. నువ్వు పెట్టిన పిండం కాకులు ఎందుకు ముట్టలేదు. సన్యాసి నీకే ఎందుకు చెప్పాడు. ఒకవేళ అదే ఎందుకు నిజం కాకూడదని సుమిత్ర అడుగుతుంది. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది, నాన్న నా కళ్ళ ముందే చనిపోయాడు. అలాంటప్పుడు ఆయన మాటలు ఎలా నమ్ముతాను.
ఆలోచనలో పడిన దీప
నువ్వు పుట్టినప్పుడు నీ తల్లిదండ్రులు ఎవరో తెలియదు కదా. నీకు తెలియకుండా ఏదో జరిగి ఉంటుందని సుమిత్ర చెప్తుంది. అలాంటిది ఏమైనా ఉంటే మా అత్తయ్య చెప్పేదని అంటుంది. మీ అత్త నిన్ను ఎప్పుడూ ఏమి అనలేదా అని సుమిత్ర అడిగితే అనసూయ మాటలు గుర్తు చేసుకుంటుంది.
కొడుకు మీద పోలీసు కేసు పెట్టాననే కోపంతో ఒక మాట అంది. కానీ దానికి దీనికి సంబంధం లేదని అంటుంది. ఉందేమో ఆలోచించమని సుమిత్ర చెప్తుంది. కానీ దీప మాత్రం కుబేర తన తండ్రి అంటుంది. సన్యాసి మాటల్లో ఎంతో కొంత నిజం ఉందని అనిపిస్తుందని సుమిత్ర అనేసరికి దీప ఆలోచనలో పడుతుంది.
కాంచన వాళ్ళని బ్రేక్ ఫాస్ట్ కి పిలిచానని సాయం చేయమని దీపని అడుగుతుంది. ఉప్మా బాగా చేస్తావంట కదా శౌర్య చెప్పిందని ఇంట్లో కూడా చేయమని చెప్తుంది. అప్పుడే కార్తీక్ వాళ్ళు వస్తారు. దీప ఉందేమోనని శ్రీధర్ భయం భయంగా వస్తాడు.
దీపని చూసి వణికిపోయిన శ్రీధర్
సుమిత్రని పలకరించడం కోసం శ్రీధర్ కిచెన్ లోకి వెళతాడు. అక్కడ దీపని చూసి తడబడిపోతాడు. హోటల్ దగ్గర నేను చూసింది ఎక్కడ అందరికీ చెప్పేస్తాను ఏమోనని భయపడిపోతున్నారని దీప అనుకుంటుంది.
కార్తీక్ కూడా కిచెన్ లోకి వచ్చి దీపని చూసి వెనక్కి వెళ్లిపోతుంటే ఆపుతుంది. మిమ్మల్ని నా వ్యక్తిగత విషయాల్లో మాత్రమే కలుగజేసుకోవద్దని చెప్పాను. ఇది మీ ఇల్లు నన్ను చూసి వెళ్లిపోవద్దు. మీ ఇంట్లో ఎలా ఉంటారో అలాగే ఉండండి. మీరు నన్ను చూసి వెళ్లిపోతే ఏదోలా అనుకుంటారని అంటుంది.
నేను మిమ్మల్ని చూసి వెళ్ళిపోతుంది మిమ్మల్ని ఎవరూ ఏమి అనకూడదని. అయినా అనే అవకాశం ఎవరో ఎందుకు ఇవ్వాలి. వాస్తవానికి దగ్గరగా ఆలోచించడం మొదలు పెట్టాను. ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అనేసి వెళ్ళిపోతాడు.
దీప వద్దని అంటుంది. బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని చాటుగా మరో భార్యని కట్టుకున్న వాడిని శిక్షించాలా? క్షమించాలా? శిక్షించడానికి దీప ఒప్పుకోవడం లేదు. కానీ వాడు ఆగడాలు ఆగడం లేదని సుమిత్ర అంటుంది. పెళ్ళాం ఉండగా రెండో పెళ్లి చేసుకున్న వాడిని రెండు చెంపలు వాయించాలని పారిజాతం కూడా తిడుతుంది.
అన్నింటికీ కారణం దీప మొగుడు
శ్రీధర్ తడబడతాడు. వాడు రెండో పెళ్లి చేసుకోకపోయి ఉంటే దీప హైదరాబాద్ వచ్చేది కాదు ఇన్ని గొడవలు జరిగేవి కాదు. ఇన్నింటికి కారణం ఆ దరిద్రుడు రెండో పెళ్లి చేసుకోవడమని అంటుంది. ఇన్ని గొడవలకు కారణమైన దీప మొగుడిని వదిలిపెట్టొద్దని చెప్తుంది.
లాయర్ తో మాట్లాడమని సుమిత్ర మళ్ళీ శ్రీధర్ కి చెప్తుంది. దీప మాత్రం వదిలేయమని అంటుంది. దీప అలాగే అంటుంది కానీ వదలిపెట్టకూడదని సుమిత్ర, కాంచన అంటారు.
శ్రీధర్ దీప ముందు ఉండలేక అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. శౌర్య వచ్చి స్కూల్ కి టైమ్ అవుతుందని దింపమని అరుస్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్