Karthika deepam 2:కార్తీకదీపం 2 సీరియల్..నీ కన్న తల్లిదండ్రులు బతికే ఉన్నారన్న సాధువు, దీపకు అడ్డంగా దొరికిపోయిన శ్రీధర్-karthika deepam 2 serial today may 27th episode deepa taken back after discovering about sridhar kaveri relationship ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2:కార్తీకదీపం 2 సీరియల్..నీ కన్న తల్లిదండ్రులు బతికే ఉన్నారన్న సాధువు, దీపకు అడ్డంగా దొరికిపోయిన శ్రీధర్

Karthika deepam 2:కార్తీకదీపం 2 సీరియల్..నీ కన్న తల్లిదండ్రులు బతికే ఉన్నారన్న సాధువు, దీపకు అడ్డంగా దొరికిపోయిన శ్రీధర్

Gunti Soundarya HT Telugu
May 27, 2024 07:41 AM IST

Karthika deepam 2 serial today may 27th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప తన తండ్రి కుబేరుడికి పిండం పెడితే తినేందుకు ఒక్క కాకి కూడా రాదు. అది చూసిన సాధువు నీ కన్నతల్లిదండ్రులు బతికే ఉన్నారని దీపతో చెప్తాడు.

కార్తీకదీపం 2 సీరియల్ మే 27వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ మే 27వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today may 27th episode: దీప తన తండ్రికి పిండం పెట్టి కాకులను పిలుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సాధువు బతికున్న వాళ్ళకి పిండం పెడితే కాకులు ఎలా ముడతాయని అంటాడు. ఆ మాటలకు దీప ఆశ్చర్యపోతూ బతికి ఉండటం ఏంటి మా అమ్మానాన్న ఎప్పుడో చనిపోయారు అంటుంది.

నీ కన్న తల్లిదండ్రులు బతికే ఉన్నారు

చనిపోలేదు నిన్ను కన్న తల్లిదండ్రులు బతికే ఉన్నారు. ఇంకా ఆ పిండాన్ని కాకులు ముట్టవు అనేసి వెళ్ళిపోతాడు. చనిపోయిన అమ్మానాన్నలను బతికే ఉన్నాడని అంటున్నాడు ఏంటని అనసూయ మాటలు గుర్తు చేసుకుంటుంది. వెంటనే అనవసరమైనవి ఆలోచించడం ఎందుకని మళ్ళీ కాకులను పిలుస్తుంది.

ఏ నాన్న నిన్ను నాకు దూరం చేసిన మనిషిని ఏం చేయలేదని కోపంగా ఉందా? నేను కాదు దేవుడే అతన్ని శిక్షిస్తాడు అని దీప కన్నీళ్ళు పెట్టుకుంటుంది. శ్రీధర్ వాళ్ళు కార్తీక్ ని దీప గురించి అడగాలని అనుకుంటారు. దీప నీకు మీ మావయ్య ఇంటి దగ్గరే పరిచయమా అంతకముందే పరిచయమా అని అడుగుతాడు.

దీప ముందే పరిచయం

ముందే పరిచయం ఉండనిన్ కార్తీక్ చెప్పడంతో కాంచన వాళ్ళు షాక్ అవుతారు. జాతరకు గెస్ట్ గా వెళ్ళినప్పుడు సైకిల్ ప్రజెంట్ చేశానని చెప్తాడు. ముందే ఎందుకు చెప్పలేదని అడుగుతారు. చెప్పడానికి ఏముందని అంటాడు. సైకిల్ ప్రెజెంట్ చేసినందుకు ఇంత చేయాలా అంటే అది సాయమో ప్రాయశ్చిత్తమో సమయం వచ్చినప్పుడు చెప్తానని అంటాడు.

ఒక మనిషి మీద మనకున్న నమ్మకం చేతిలోని గాజు గ్లాసు లాంటిది. అర్థం చేసుకోండి అనేసి వెళ్ళిపోతాడు. దీప గురించి వీడు ఇంత లోతుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటని శ్రీధర్ ఆలోచిస్తాడు. దీప హోటల్ లో పని చేసుకుంటూ ఉంటుంది. హోటల్ లో బోర్డు మీద స్పెషల్ ఉప్మా బిర్యానీ అని రాస్తుంది. అక్కడికి కారులో ముగ్గురు ఆడవాళ్ళు వస్తారు.

కావేరీ పాప ఎంట్రీ

దీప చేస్తున్న ఉప్మా గురించి సోషల్ మీడియాలో చూసి వస్తారు. ఆమె ఎవరో కాదు కావేరీ. హోటల్ లో కూర్చుని తినడానికి కావేరీ చీదరించుకుంటుంది. వాళ్ళతో పొగరుగా మాట్లాడుతుంది. ఉప్మా బిర్యానీ నచ్చకపోతే డబ్బులు ఇవ్వనని కావేరీ అంటుంది.

సరే అయితే ఇవ్వొద్దని దీప అంటే అంటే కావేరీకి ముష్టి వేస్తున్నావా అని నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఇష్టం ఉంటే తినండి లేకపోతే పోండి అని కడియం అంటాడు. దీంతో కడియం మీదకు కావేరీ కోపంగా చెయ్యి చెత్తితే దీప ఆపుతుంది. నేను ఎవరో తెలుసా అని కావేరీ కోపంతో రగిలిపోతుంది.

దీపకు దొరికిపోయిన శ్రీధర్

మీ ఇద్దరి సంగతి తెలుస్తానని కావేరీ వెంటనే శ్రీధర్ కి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. శ్రీధర్ రాగానే బేబీ నాకు చాలా అవమానంగా ఉందని దీప వాళ్ళు తనని చాలా చీప్ గా ట్రీట్ చేశారని చూపిస్తుంది. శ్రీధర్ దీపని చూసి షాక్ అవుతాడు. పోయి పోయి దీని కంట్లో పడ్డాను వెంటనే తప్పించుకోవాలని అనుకుంటాడు.

నేను వాళ్ళ సంగతి చెప్తాను వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపొమ్మని పంపించేస్తాడు. దీప దగ్గర ఎలా కవర్ చేసుకోవాలా అని నీళ్ళు నములుతాడు. మీరు చేసేది తప్పని అనిపించడం లేదాని దీప శ్రీధర్ ని అడుగుతుంది. ఈ విషయం అమ్మగారికి తెలుసా అంటే లేదని చెప్తాడు.

ఎవరికీ చెప్పొద్దు

మీ ఆంటీ నడవలేదు కదా పైగా ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రం ఏదో పాత పరిచయం అలా జరిగిపోయిందని అంటుంది. అమ్మగారి పరిస్థితి మీకు వచ్చి మీరు చేసే పని అమ్మగారు చేస్తే.. వినడానికి కష్టంగా ఉంది కదా. ఇప్పుడు మీ విషయం తెలిసినా అమ్మగారికి కూడా ఇలాగే ఉంటుంది.

నాకే ఇలా జరిగిందని అనుకున్నాను. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. నువ్వు చూసిన విషయం ఎవరికీ చెప్పొద్దు ప్లీజ్ దీప అని శ్రీధర్ బతిమలాడతాడు. కాంచన అమ్మగారు మిమ్మల్ని దేవుడిలా చూస్తాడు. ఈ విషయం తెలిస్తే మొహం మీద ఉమ్మి వేస్తారు. ఆ పరిస్థితి రానివ్వవద్దని చెప్తుంది.

కాంచన ఉరేసుకుంటుందా?

శ్రీధర్ తలదించుకుంటాడు. ఇంటికి వచ్చేసరికి కాంచన టీవీలో వార్త చూసి చిరాకుగా ఉంటుంది. అనవసరంగా దీప ముందు బుక్ అయ్యాను. అలాంటి వాళ్ళతో కూడా నీతులు చెప్పించుకోవాల్సి వచ్చిందని అనుకుంటాడు. కాంచన కోపంగా ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏమైందని అంటాడు.

కాంచన దీప అని పేరు ఎత్తగానే శ్రీధర్ ఉలిక్కిపడతాడు. దీప లాంటి కథ టీవీలో చూశాను. శ్రీధర్ చేస్తున్న పని లాంటిది ఇంకొక వ్యక్తి చేస్తున్నట్టుగా చెప్తుంది. కాంచనకు విషయం తెలిసిపోయిందని భయపడిపోతాడు. నమ్మిన భర్త మోసం చేసేసరికి మొదటి భార్య ఉరేసుకుని చనిపోయిందని చెప్తుంది.

నిజం చెప్పేస్తా

రేపు ఎప్పుడైనా నిజం తెలిస్తే కాంచన కూడా ఉరి వేసుకుంటుందా అని భయపడతాడు. దశరథ కాంచనకు ఫోన్ చేసి బ్రేక్ ఫాస్ట్ కి ఇంటికి రండి బావతో మాట్లాడాలని చెప్తాడు. అక్కడికి వెళ్తే దీపకు ఎదురుపడాల్సి వస్తుందని రానని అంటాడు. అప్పుడే కార్తీక్ వచ్చి ఎక్కడికని అడుగుతాడు.

కాంచన కార్తీక్ కి విషయం చెప్తుంది. పొరపాటున దీప కాంచనకు విషయం చెప్తే ఇబ్బంది అవుతుందని కంగారుపడతాడు. శుభవార్త మాట్లాడటానికి రమ్మని పిలుస్తున్నట్టు ఉన్నాడని కాంచన అంటుంది. ఇదే మంచి సమయం నిజం చెప్పేయాలని కార్తీక్ అనుకుంటాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

టీ20 వరల్డ్ కప్ 2024