Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. దీపని చావగొడతానన్న నరసింహ, కార్తీక్ మంచివాడన్న శౌర్య, కూతుర్ని ఓదార్చిన దశరథ
Karthika deepam 2 serial april 18th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప, శౌర్య వాళ్ళని ఎలాగైనా ఊరు నుంచి పంపించేయమని శోభ నరసింహకు చెప్తుంది. పంపించకపోతే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తుంది. శౌర్య, కార్తీక్ కలిసి ఉండటం చూసి నరసింహ రగిలిపోతాడు.
Karthika deepam 2 serial april 18th episode షాపింగ్ మాల్ లో శౌర్యని శోభ చూస్తుంది. ఆరోజు మా ఇంట్లో పూలు కోసిన పిల్లవి నువ్వే కదాని దాని వెంట పడబోతుంటే శౌర్య పారిపోతుంది. నరసింహ వచ్చి ఏమైందని అంటే నీ కూతురు కనిపించదని చెప్తుంది.
దీపను జుట్టు పట్టుకుని కొడతా
అది ఇక్కడ ఉందంటే దీప కూడా ఇక్కడికి వచ్చిందనే కదా. దీప ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడ ఉండకూడదని శోభ చెప్తుంది. గుడి దగ్గర అంత గొడవ చేసిన పోలేదంటే దానికి ఎంత పొగరు ఈసారి గట్టిగా ఇవ్వాలని నరసింహ అనుకుంటాడు.
దీపని పంపించకపోతే పుట్టింటికి వెళ్లిపోతానని బెదిరిస్తుంది. దీపని జుట్టు పట్టుకుని నీ ముందుకు లాక్కొచ్చి చావగొడతానని అంటాడు.పిల్ల ఎటు పోయిందని నరసింహ వెతుకుతాడు. కార్తీక్ శౌర్య కనిపించకపోయే సరికి కార్తీక్ కంగారుపడతాడు.
శౌర్య కోసం వెతుకుతూ కార్తీక్, నరసింహ ఒకరికొకరు ఎదురపడతారు. శౌర్య వాళ్ళని చాటు నుంచి చూసి పిలుస్తుంది. తండ్రిని చూసినా శౌర్య దగ్గరకు రాదని కార్తీక్ అనుకుంటాడు. మళ్ళీ నాన్న ఎలా ఉంటాడో తెలియదని చెప్పింది కదా మరి ఇతన్ని చూసి ఎందుకు భయపడుతుందని ఆలోచిస్తాడు.
నీ కూతురు నీ దగ్గరకు ఎందుకు రాలేదు?
జ్యోత్స్న వచ్చి కార్తీక్ ని పిలుస్తుంది. దీంతో శౌర్యని తీసుకుని కార్తీక్ వెళ్ళిపోతాడు. శోభ తల్లి రాకుండా కూతురు వచ్చింది ఏంటి? వాడు ఎవడు వాడు నీకు ముందే తెలుసా? నీ కూతురు నిన్ను చూసి కూడా నీ దగ్గరకు రాలేదు ఏంటి? నువ్వే తండ్రివని తెలియదా అని శోభ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.
అది పుట్టిన తర్వాత నన్ను చూడలేదు. దీప కూడా చెప్పి ఉండదని అంటాడు. వాళ్ళని వదిలేసినట్టు నన్ను వదిలేయవని గ్యారెంటీ ఏంటని పుట్టింటికి పోతానని శోభ అంటుంటే ఆపుతాడు. వాళ్ళని వదిలేసింది నీకోసమే కదా అంటాడు. దీప, దాని కూతురు ఇక్కడ ఉండటానికి వీల్లేదని తెగేసి చెప్తుంది.
దీపని ఓదార్చిన దశరథ
దీప ఎక్కడ ఉందని నరసింహ ఆలోచిస్తాడు. జ్యోత్స్న పుట్టినరోజుకి చేయాల్సిన వంటల గురించి లిస్ట్ రాసుకుంటూ ఉంటుంది. దీప గురించిన వివరాలు దశరథ అడుగుతాడు. మీ నాన్న నిన్ను ప్రేమగా చూసుకునే వాడా అంటే ప్రాణంగా చూసుకునే వాడని కళ్ళ నిండా నీళ్ళతో చెప్తుంది.
తండ్రిని తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఏదో ఒక రూపంలో మీ నాన్న నీకు దగ్గరలో ఉంటాడని చెప్తాడు. అదృష్టాన్ని ఇవ్వకపోయినా ఆనందాన్ని ఇవ్వగలం. దూరమైన మనిషిని కాదు ఎదురుగా ఉన్న మనిషిని గుర్తు చేసుకో అప్పుడు కళ్ళలో నీళ్ళు కాదు నవ్వులు వస్తాయని ధైర్యం చెప్తాడు.
శౌర్యకి తండ్రివి నువ్వేనా?
శౌర్య నరసింహని చూసి ఎందుకు భయపడుతుందని అనుకుంటాడు. కార్తీక్, శౌర్య వాళ్ళు రోడ్డు మీద నిలబడి ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. శౌర్య మూతికి ఐస్ క్రీమ్ అంటుకుంటే కార్తీక్ తుడుస్తాడు. అటుగా వెళ్తున్న శోభ వాళ్ళని చూసి నీ కూతురికి వాడు సేవలు చేస్తున్నాడు ఏంటి? తండ్రివి నువ్వా అతడా అంటుంది.
శౌర్యని జ్యోత్స్న మీ నాన్న ఎక్కడ ఉంటాడని అడుగుతుంది. తెలియదు నేను ఎప్పుడూ మా నాన్నని చూడలేదని బాధగా చెప్తుంది. టాపిక్ డైవర్ట్ చేయడం కోసం అవన్నీ మనకు ఎందుకని కార్తీక్ అంటాడు. అనసూయ పనులు చేసుకుంటూ తనని తాను తిట్టుకుంటుంది.
కార్తీక్ ని మెచ్చుకున్న శౌర్య
మల్లేష్ తో గొడవ పడి బాకీ తీర్చను ఏం చేసుకుంటావో చేసుకోమని చెప్పేసి వెళ్ళిపోతుంది. శౌర్య కొత్త బట్టలు తీసుకుని చూస్తుంటే దీప ఎవరు కొన్నారని అడుగుతుంది. ఇలాంటివి చేస్తాడని నేను ముందే చెప్పాను అని మనసులో తిట్టుకుంటుంది. ఇప్పుడు దీన్ని కొప్పడితే బాధపడుతుందని సైలెంట్ గా ఉండిపోతుంది.
కార్తీక్ చాలా మంచి వాడు. షాపులో ఉన్న బట్టలు కనిపించకపోతే నన్ను ఎత్తుకుని చూపించాడు. కార్తీక్ ఎత్తుకున్నప్పుడు కూడా నువ్వు ఎత్తుకున్నట్టే అనిపించింది. కార్తీక్ తన మూతి కూడా తుడిచాడని చెప్తుంది. నేనంటే కార్తీక్ కి ఎంత ప్రేమ నాన్న ఉంటే ఇలాగే చేసేవాడు కదా అంటుంది.
దీప అలా మాట్లాడకూడదని కోపంగా అంటుంది. నా తండ్రిని దూరం చేసిన మనిషి అతను, మంచోడు నాన్న ఉంటే ఇలాగే చేసేవాడివని అంటే నేనేం చెప్పగలను. నువ్వు రోజురోజుకీ అతడికి దగ్గర అవుతున్నావు. నిన్ను అతనికి దూరంగా ఉంచడమే కాదు అతన్ని కూడా నీకు దూరంగా ఉండమని చెప్పాలని దీప మనసులో అనుకుంటుంది.
తరువాయి భాగంలో..
కార్తీక్ దగ్గరకు వెళ్ళి దీప సీరియస్ గా మాట్లాడుతుంది. ఎందుకు శౌర్యకి దగ్గర అవుతున్నావ్, తనతో ఎందుకు స్నేహం చేస్తున్నావని నిలదీస్తుంది. తనకి తోచిన సాయం చేస్తున్నానని అంటాడు. అయితే నిజంగా చేస్తారా అంటుంది. ఏది అడిగినా చేస్తానని చెప్తాడు.