Karthika deepam 2: శౌర్యని అడ్డం పెట్టుకుని పగ సాధిస్తానన్న నరసింహ, దీప తన జన్మ రహస్యం తెలుసుకుంటుందా?-karthika deepam 2 serial today may 25th episode narasimha plans to trap shourya to seek revenge against deepa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2: శౌర్యని అడ్డం పెట్టుకుని పగ సాధిస్తానన్న నరసింహ, దీప తన జన్మ రహస్యం తెలుసుకుంటుందా?

Karthika deepam 2: శౌర్యని అడ్డం పెట్టుకుని పగ సాధిస్తానన్న నరసింహ, దీప తన జన్మ రహస్యం తెలుసుకుంటుందా?

Gunti Soundarya HT Telugu
May 25, 2024 07:26 AM IST

Karthika deepam 2 serial today may 25th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..శౌర్యని అడ్డం పెట్టుకుని దీపని తన కాళ్ళ దగ్గరకు రప్పించుకోవాలని నరసింహ ప్లాన్ చేస్తాడు. అటు దీప తన తండ్రి కుబేరుడికి పిండం పెడుతుంది. కానీ ఒక సాధువు వచ్చి నీ తండ్రి బతికే ఉన్నాడని చెప్తాడు.

కార్తీకదీపం 2 సీరియల్ మే 25వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ మే 25వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today may 25th episode: దీప, కార్తీక్ మొగుడు పెళ్ళాలు మాదిరిగా స్టేషన్ కి వచ్చారని నరసింహ రగిలిపోతాడు. నీ ఒంటి మీద దెబ్బల కంటే ఇదే ఎక్కువ మందుతున్నట్టు ఉందని శోభ దెప్పిపొడుస్తుంది. దీప మాములుది కాదని ముందే చెప్పాను కానీ మీ అమ్మ మాత్రం దాని జోలికి మీరు వెళ్లొద్దు అది మీ జోలికి రాదని చెప్పింది.

నరసింహని రెచ్చగొట్టిన శోభ

జోలికి వెళ్ళడం కాదు కేసు వెనక్కి తీసుకోకపోతే నిజంగానే జైలుకి వెళ్ళేవాడివి. ఇప్పుడు నువ్వు నిజంగానే గాజులు వేసుకోవాలి. ఎందుకంటే అది మగాడిలా ధైర్యంగా తిరుగుతుంటే నువ్వు ఆడదానిలా భయంతో చస్తున్నావ్ అని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.

నరసింహ శోభ మీదకు చెయ్యి ఎత్తుతాడు. శోభ మాత్రం తన నోటికి తాళం వేయకుండా మాట్లాడుతూనే ఉంటుంది. బస్తీలో పరువు పోయింది ఈరోజు నీ మీద కేసు పెట్టింది రేపు నా మీద కేసు పెడుతుంది. నన్ను ఈడ్చుకుని పోతుంది. అలాంటి ఖర్మ నాకు పట్టకూడదు అంటే నన్ను మా అమ్మ కాపాడుతుందని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది.

ఈ గొడవకు కారణం దీప. నువ్వు చెప్పిన తర్వాత దాన్ని వదిలేద్దామని అనుకున్నాను. కానీ నా మీద కేసు పెట్టి చాలా పెద్ద తప్పు చేసింది. ఈ బస్తీలో నా ముందు నిలబడి మాట్లాడటానికి చాలా భయపడతారు. అలాంటిది నా పరువు తీసింది. దాన్ని వదిలిపెట్టను.

నోరు జారిన అనసూయ

నా పేరు చెప్తేనే గజగజా వణికిపోయేలా చేస్తాను నా కూతురిని అడ్డం పెట్టుకుని ఎలా ఆడుకుంటానో చూస్తా ఉండు అంటాడు. అదంతా కాదు మీ మావయ్య సంవత్సరికం నువ్వే చేయాలని అనసూయ చెప్తుంది. నేను ఎందుకు ఆ దీప చేసుకుంటుందిలే అంటాడు. అది చేస్తే నా తమ్ముడు ఆత్మ శాంతించదు అసలు ఆ దీప అనేసి చెప్పకుండా ఆగిపోతుంది.

ఆ పనులు ఏదో అదే చూసుకుంటుందిలే అనేసి వెళ్ళిపోతాడు. అది నా తమ్ముడు సొంత కూతురు కాదు ఎక్కడో దొరికింది. నిజం చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాడు. వాడి మీద గౌరవంతో చెప్పకుండా ఆగిపోతున్నానని అనసూయ అనుకుంటుంది.

దీప తండ్రి ఫోటో చూసుకుంటూ తండ్రి సంవత్సరికం గుడికి వెళ్తున్నానని శౌర్యకి చెప్తుంది. తాతయ్య రారా అని శౌర్య అడిగితే రారు ఒక కళ్ళు మూసుకుని కారు నడుపుతున్న వ్యక్తి చంపేశాడని కోపంగా అంటుంది. చచ్చిపోవడం ఏంటని శౌర్య అనేసరికి దీప మాట మార్చేస్తుంది.

బాబోయ్ దెయ్యం

బంటు పారిజాతం కోసం వెతుకుతుంటే శౌర్య ఎదురుపడుతుంది. అమ్మగారి కోసం వెతుకుతున్నానని చెప్తాడు. గదిలోనే ఉందని చెప్పి శౌర్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా పారిజాతం తెల్ల చీర కట్టుకుని మొహానికి మాస్క్ వేసుకుని ఉంటుంది.

దెయ్యం అనేసి శౌర్య పారిపోతుంది. బంటు కూడా చూసి దెయ్యం అనేసి పరుగు పెడతాడు. వాళ్ళిద్దరూ కంగారుగా రావడం చూసి ఏమైందని శివనారాయణ అడుగుతాడు. గదిలో దెయ్యం ఉందని శౌర్య చెప్తుంది. సరేనని చూడటానికి శివనారాయణ కూడా వెళతాడు.

ఇది నువ్వు భయపడే దెయ్యం కాదు నేను భయపడే దెయ్యమని అంటాడు. ఇద్దరూ కాసేపు కామెడీ చేస్తారు. నరసింహ షర్ట్ బటన్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే సాయం చేయకుండా శోభ తన మాటలతో దెప్పి పొడుస్తుంది. పక్కింటావిడ వచ్చి శోభతో మాట్లాడుతుంది.

నువ్వు రెండో పెళ్ళానివి

జాగ్రత్త నువ్వు రెండో పెళ్ళానివి. అసలు మీకు పెళ్లి కాలేదని బస్తీ వాళ్ళు అనుకుంటున్నారు. మొదటి పెళ్ళాం కేసు పెట్టిందట కదా. గవర్నమెంట్ దృష్టిలో రెండో పెళ్లి చెల్లదు అంట కదా నరసింహ వెళ్లిపోతే నీ పరిస్థితి ఏంటి? మొదటి పెళ్ళాం కంచం లాంటిది అయితే రెండో పెళ్ళాం అరటి ఆకు లాంటిది. ఆ దేవుడే నిన్ను కాపాడాలని అనేసి వెళ్ళిపోతుంది.

దీంతో శోభ మళ్ళీ మొదలుపెడుతుంది. అనసూయ కూడా కొడుకునే తిడుతుంది. దీప జోలికి వెళ్లొద్దని అంటే వినకుండా వెళ్ళావని గడ్డిపెడుతుంది. కోపంతో కొట్టడానికి నరసింహ చెయ్యి ఎత్తుతాడు. కానీ శోభ మాత్రం రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.

నీ తండ్రి బతికే ఉన్నాడు

నీ పెళ్ళాం ఏదో అందని రెచ్చిపోకని అనసూయ చెప్తే నరసింహ మాత్రం దాన్ని వదిలిపెట్టనని అంటాడు. దీప నా ముందు మోకాళ్ళ మీద కూర్చుని నన్ను వదిలిపెట్టమని చేతులు జోడించి వేడుకోవాలి అలా చేసి తీరుతానని శపథం చేస్తాడు. దీప తన తండ్రికి సంవత్సరికం కార్యక్రమం చేస్తుంది.

దీప తండ్రికి పిండం పెడుతుంది. పిండం తినేందుకు ఒక్క కాకి కూడా రాదు. అప్పుడే ఒక సాధువు వచ్చి బతికి ఉన్న వాళ్ళకి పిండం పెడితే కాకులు ఎలా ముడతాయని అంటాడు. దీంతో దీప షాకింగ్ గా చూస్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

టీ20 వరల్డ్ కప్ 2024