Karthika deepam 2 serial: కార్తీకదీపం 2 సీరియల్..దీపని విడాకులు ఇవ్వమన్న సుమిత్ర, అవమానంతో రగిలిపోతున్న నరసింహ
Karthika deepam 2 serial today may 24th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. నరసింహకు విడాకులు ఇచ్చేసి తాళి తీసేయమని సుమిత్ర దీపకు చెప్తుంది. కానీ అందుకు దీప అంగీకరించదు.
Karthika deepam 2 serial today may 24th episode: బావ చాలా మారిపోయాడు. మన ఇంట్లో ఉన్న మనిషి ఎక్కడికి వెళ్లిందో మనకంటే ముందు బావకి తెలుసు. దీప భర్త మీద పోలీసు కేసు పెట్టాడని వాళ్ళ అత్త వచ్చి చెప్తే కానీ తెలియదు. ఇవన్నీ బావ మనకి తెలియకుండా మనతో చెప్పకుండా అంత చనువు తీసుకుని చేయాల్సిన అవసరం ఏంటి?
ఎందుకు అంత చనువు?
నరసింహ మన ఇంటికి వచ్చి ఎంత పెద్ద గొడవ చేశాడో బావ అప్పుడే మర్చిపోయాడా? దీపకు కూడా చెప్పకుండా వాళ్ళ భర్త మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏంటి? అని జ్యోత్స్న సుమిత్రను నిలదీస్తుంది.
నేనే పెడదామని అనుకున్నానని సుమిత్ర అంటే నువ్వు పెట్టొచ్చు ఎందుకంటే నువ్వు బాధ్యత తీసుకున్నావ్. అసలు బావకి ఏ మాత్రం సంబంధం లేని దీప విషయంలో ఎందుకు చనువు తీసుకోవాలి. పోనీ ఇలా చేస్తున్నానని నీకేమైన చెప్పాడా? లేదు కదా.
ఇప్పుడు వాళ్ళ అత్త ఎవరికి చీవాట్లు పెట్టింది, ఎవరి పరువు తీస్తానని బెదిరించింది. బావ పూర్తిగా మారిపోయాడు. నాతో సరిగా మాట్లాడటం లేదు నేను మాట్లాడినా రెస్పాండ్ అవడం లేదు. ఇప్పుడు అనిపిస్తుంది బావ మనసులో నా స్థానం ఏంటని అంటుంది.
కూతురికి నచ్చజెప్పిన దశరథ
దశరథ వచ్చి జ్యోత్స్నతో మాట్లాడతాడు. నీకు ఈ ఆలోచన ఎవరు వచ్చేలా చేశారో తెలియదు కానీ నువ్వు ఆలోచించే విధానం తప్పు. నువ్వే కాదు కార్తీక్ కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాడు వాడి మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. మీ బావ ఫోన్ చేసి నాకు జరిగింది అంతా చెప్పాడు. వాడి ప్లేస్ లో నేను ఉన్నా ఇదే పని చేసేవాడిని. కాస్త నిదానంగా ఆలోచించు అన్నీ నీకే అర్థం అవుతాయని నచ్చజెప్తాడు.
నేను దీని మనసు చెడగొట్టి నావైపు తిప్పుకుందామని అనుకునే లోపు ఎవరో ఒకరు వచ్చి దీని మనసు సరిచేసి పోతున్నారని పారిజాతం తిట్టుకుంటుంది. నరసింహ తన ఒంటి మీద ఉన్న దెబ్బలు చూసుకుని రగిలిపోతూ ఉంటాడు. స్టేషన్ బయట శోభ, అనసూయ ఉంటారు.
మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు
గుట్టుగా చేసుకుంటున్న కాపురాన్ని తీసుకొచ్చి స్టేషన్ ముందు పెట్టారని శోభ అరుస్తుంది. అప్పుడే దీప కార్తీక్ ని తీసుకుని స్టేషన్ కి వస్తుంది. కార్తీక్ సీఐ దగ్గరకు వెళతాడు. దీపగారితో అక్కడ సంతకం పెట్టించండి వాడి సంగతి నేను చూసుకుంటానని అంటాడు.
విష్ణు కేసు నేను వెనక్కి తీసుకుంటాను వదిలేయమని కార్తీక్ చెప్తాడు. మరోసారి ఆలోచించండి మళ్ళీ ఇలాంటి అవకాశం రాదని కార్తీక్ దీపని అడుగుతాడు. మంచితనం మోసం ముందు తలదించడం కరెక్ట్ కాదని దీపకు చెప్తూ కార్తీక్ కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు సైన్ చేస్తాడు.
నా తమ్ముడు నీ విషయంలో తప్పు చేశాడు
మీ ఇద్దరి సంబంధం నిలదీసినందుకు నన్ను అరెస్ట్ చేయించి పోలీసులతో కొట్టిస్తావ్ కదా నిన్ను వదిలి పెట్టనని నరసింహ రగిలిపోతాడు. దీప తన తప్పు లేదని చెప్పబోతుంటే అనసూయ వినిపించుకోదు. నీ విషయంలో నా తమ్ముడు చాలా పెద్ద పొరపాటు చేశాడని అంటుంది.
నా భర్త పెట్టె బాధలు తట్టుకోలేకపోతున్నాను సాయం చేయమని వేడుకున్నానా? అని దీప కార్తీక్ ని ప్రశ్నిస్తుంది. నీ జీవితం కాలిపోతుంటే నిలబడి చూడలేను ఆర్పే ప్రయత్నం చేస్తానని అంటాడు. మీరు పెట్రోల్ పోస్తున్నారు ఈ మంటలు ఇంకా పెంచుతున్నారు.
కేసు పెట్టి వాడిని రెచ్చగొట్టారు. ఇక్కడితో ఆగుతాడు అనుకుంటున్నారా? ఈసారి మళ్ళీ వాడు తేడా చేస్తే అని కార్తీక్ అంటే దీప వద్దని అంటుంది. తాళి కట్టించుకున్న పాపానికి మాటలు పడతాను. సాయం చేస్తున్నానని మీరు అనుకునే దానికి జనం ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోండి.
మీ వల్ల ఎక్కువ బాధపడుతున్నా
నిజం చెప్పాలంటే అందరి కంటే మీ వల్ల ఎక్కువ బాధపడుతున్నాను. ఇప్పుడు మీరు మళ్ళీ ఏం చేస్తారోనని భయపడుతున్నాను. ఈ కేసుకు నాకు ఏ సంబంధం లేదని చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఒకసారి ఆలోచించండి మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థం అవుతుంది.
దయచేసి నన్ను సమాధానం చెప్పుకోలేని మనిషిగా నిలబెట్టవద్దని దీప చెప్తుంది. అనసూయ మాటల గురించి దీప ఆలోచిస్తూ ఉంటుంది. సుమిత్ర దీపతో మాట్లాడటానికి వస్తుంది. మీరు అనవసరంగా కేసు వెనక్కి తీసుకున్నారు టిఫిన్ సెంటర్ దగ్గర నీకు జరిగిన అవమానానికి వాడిని జైలుకి పంపించాల్సిందని సుమిత్ర కోపంగా అంటుంది.
విడాకులు తీసుకో
అందుకే నీ విషయంలో నిన్ను అడగకుండా ఒక నిర్ణయం తీసుకున్నాను. నీ భర్తతో నువ్వు విడాకులు తీసుకో అనేసరికి దీప షాక్ అవుతుంది. వాడు కట్టిన తాళి నీ మెడలో ఉందనే హక్కుతోనే కదా నిన్ను ఇన్ని బాధలు పెడుతున్నాడు. విడాకులు తీసుకుని వాడి తాళి వాడి మొహాన కొట్టు. నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పమని చెప్తుంది.
అలా చేయలేనని దీప అంటుంది. దీనితో నా కూతురు భవిష్యత్ కూడా ముడిపడి ఉందని చెప్తుంది. దానికి నాన్న ఎవరో తెలియదు కదా అంటే తెలియకపోయినా నాన్న ఉన్నాడు కదా అంటుంది. వాడు నీ మెడలో కట్టింది పసుపు తాడు కాదు పలుపు తాడు.
తాళి తీయనని చెప్పిన దీప
నచ్చినట్టు ఆడుకోవడానికి బలిపశువు చేశాడు. నువ్వు కళ్ళు తెరవకపోతే నిన్ను చంపుతాడని అంటుంది. నేను చావను నేను నా కూతురు కోసం బతుకుతానని చెప్తుంది. సుమిత్ర ఎన్ని చెప్పినా కూడా తాళి తీయనని అంటుంది. మెడలో తాళి ఉంది కాబట్టే నాన్న ఎప్పుడు వస్తాడని నా కూతురు అడుగుతుంది.
తాళి కూడా లేకపోతే నాన్న ఎవరని అడుగుతుంది. ఎప్పుడు వస్తాడు అనేది సమాధానం ఉన్న ప్రశ్న అదే ఎవరు అనేది నన్ను చంపేసే ప్రశ్న. అందుకే ఈ తాళి ఆభరణంగా అయినా నా మెడలో ఉండాలి. బంధం కోసం కాదు నా కూతురి బాధ్యత కోసమని చెప్తుంది.
తెలియకుండా సాయం చేస్తా
కార్తీక్ దీప గురించి ఆలోచిస్తాడు. నా గురించి ఎవరు ఏమనుకుంటే ఏంటి అనుకున్నాను. కానీ దీప గురించి ఆలోచించలేదు అనే విషయం తను చెప్తే కానీ అర్థం కాలేదు. నా కారణంగా తన జీవితానికి కొంత అన్యాయం జరిగింది. కానీ నేను చేసేది సాయమని అందరూ ఎందుకు అనుకుంటారు.
ఈ సారి నేను ఏం చేసినా తెలియకుండా దీపకు సాయం అందేలా చేయాలి. అప్పుడు తను మాట పడదు, బాధపడదు. దీపకు మంచి జీవితం దొరికే వరకు నేను మాత్రం శ్రేయోభిలాషిలానే ఉంటాను. కానీ నరసింహ దీప జోలికి వస్తే వదిలి పెట్టను. ఈసారి దీప చెప్పినా కూడ వదిలిపెట్టను అనుకుంటాడు.
దీప ఇలాంటిది అని ముందే తెలిసి ఉంటే ఊరు దాటనిచ్చేదాన్ని కాదని అనసూయ అంటుంది. అది ఇక్కడికి వచ్చి సంబంధం పెట్టుకోలేదు సంబంధం పెట్టుకుంది కాబట్టే ఇక్కడికి వచ్చిందని నరసింహ అంటాడు.
వాడు దీపని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం వెనుక ఏదో కథ ఉంది. వాడు చెప్పాడని దీప నా మీద కేసు పెట్టింది. ఇద్దరూ మొగుడు పెళ్ళాలులాగా పోలీస్ స్టేషన్ కి వచ్చారని అంటాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్