Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్ ..దీపకు అనసూయ వార్నింగ్, నరసింహ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకున్న కార్తీక్-karthika deepam 2 serial today may 23rd episode anasuya cautions to drop her case against narasimha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2: కార్తీకదీపం 2 సీరియల్ ..దీపకు అనసూయ వార్నింగ్, నరసింహ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకున్న కార్తీక్

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్ ..దీపకు అనసూయ వార్నింగ్, నరసింహ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకున్న కార్తీక్

Gunti Soundarya HT Telugu
May 23, 2024 07:20 AM IST

Karthika deepam 2 serial today may 23rd episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. నరసింహని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో అనసూయ దీప దగ్గరకు వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది. తన కొడుకుని బయటకు తీసుకురాకపోతే పరువు తీస్తానని బెదిరిస్తుంది.

కార్తీకదీపం 2 సీరియల్ మే 23వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ మే 23వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today may 23rd episode: బంటుని ఇంటికి తీసుకురావడానికి పారిజాతం ప్లాన్ వేస్తుంది. సుమిత్ర ప్రాణాలు కాపాడిన దీప ఇక్కడే ఉంది కాబట్టి నా ప్రాణాలు కాపాడిన నువ్వు కూడా ఇక్కడే ఉండాలని అంటుంది. వాడు ఇంట్లోకి రావడానికి వీల్లేదని శివనారాయణ అంటాడు.

అనసూయ ఎంట్రీ 

అయితే దీపని పంపించేయండి వీడు కూడా వెళ్లిపోతాడని అంటుంది. మీకు నచ్చకపోతే ఇద్దరినీ పంపించాలి లేదంటే వాడు ఇంట్లోకి రావాలని తెగేసి చెప్తుంది. వీడికి అత్తయ్య మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చిందంటే దీపని ఇంట్లో నుంచి పంపించేయడానికి ఏదైనా ప్లాన్ చేసింది ఏమో జాగ్రత్తగా ఉండాలని సుమిత్ర అనుకుంటుంది.

అనసూయ ఆవేశంగా దీప అని అరుస్తూ ఇంటికి వస్తుంది. ఏమైంది అత్తయ్య అంటే నువ్వు అలా పిలవ్వద్దని అంటుంది. దీపకి సపోర్ట్ గా సుమిత్ర మాట్లాడుతుంది. ఈవిడ దీపకి మేనత్త కొడుక్కి సపోర్ట్ చేస్తూ వెళ్లిపోయిందని సుమిత్ర శివనారాయణకు చెప్తుంది.

నిలదీసిన సుమిత్ర 

నీ కొడుకు రెండో పెళ్లి గురించి తెలియగానే గుండెలు బాదుకుంటూ ఆకాశానికి ఎగిరావు కదా ఏమైంది నీ ఆవేశం. ఎక్కడ చచ్చినది నీ మాటల్లోని పౌరుషం. కొడుక్కి బుద్ధి చెప్పాలనుకున్న నీ బుద్ధి ఏమైంది. నీ కోడలు నీకు అవసరం లేదు నీ మనవరాలి గురించి ఆలోచించాలి కదా.

పసిదాని మొహం చూసి కూడా జాలి కలగలేదంటే ఎంత స్వార్థంగా బతుకుతున్నావో అర్థం అయ్యిందని సుమిత్ర తిడుతుంది. అవును స్వార్థంతోనే బతుకుతున్నా నువ్వేంటి నన్ను బెదిరిస్తున్నావని ఎదురుతిరుగుతుంది. కావాలని వాడిని రెచ్చగొట్టే పనులు చేసి వాడి బతుకు నాశనం చేస్తున్నావని దీపని తిడుతుంది.

నరసింహని అరెస్ట్ చేశారు 

ముందు పోలీస్ స్టేషన్ కి పద అంటుంది. ఏం తెలియక అందరూ మోహమోహాలు చూసుకుంటారు. నీ మొగుడు నీకు అన్యాయం చేశాడని కేసు పెట్టావ్ కదా అని అనసూయ అనేసరికి అందరూ షాక్ అవుతారు. రాత్రి పోలీసులు వచ్చి నీ మొగుడిని తన్నుకుంటూ తీసుకుని వెళ్లారు.

నువ్వు పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటేనే వాడిని వదిలిపెడతారని అంటుంది. తాను కేసు పెట్టలేదని చెప్తుంది. నువ్వు పెట్టకపోతే నీ పేరు చెప్పి వాడిని పోలీసులు ఎందుకు తీసుకెళ్తారని అనసూయ నిలదీస్తుంది. తనకు ఏం తెలియదని దీప అంటుంది. నీకు తెలియకుండా నీ తరపున కేసు ఎవరు పెడతారని అంటుంది.

దీప సుమిత్రని కేసు ఎందుకు పెట్టారని అడుగుతుంది. తాను పెట్టలేదని సుమిత్ర చెప్తుంది. నీకు తెలియకుండా కేసు ఎవరు పెడతారని శివనారాయణ అంటే తనకేమి అర్థం కావడం లేదని దీప అంటుంది. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది కావాల్సిన వాళ్ళు పెట్టి ఉంటారని పారిజాతం చెప్తుంది.

కార్తీక్ పెట్టాడు 

కార్తీక్ కేసు పెట్టాడని పారిజాతం అంటుంది. గ్రాని చెప్పింది నిజమై ఉంటుంది కావాలంటే బావకి ఫోన్ చేసి అడగమని జ్యోత్స్న కూడా అంటుంది. సిఐ దీప బాధ్యత బావకు అప్పగించాడు, ఈ విషయంలో కూడా బాధ్యత తీసుకుని ఉంటాడని సీరియస్ గా చెప్తుంది.

దశరథ వెంటనే కార్తీక్ కి ఫోన్ చేస్తాడు కానీ లిఫ్ట్ చేయడు. సమస్య నాది నేనే పరిష్కరించుకుంటానని దీప అంటుంది. ఏం నాటకాలు ఆడుతున్నావే వీళ్ళ మేనల్లుడితో కేసు పెట్టించిన విషయం వీళ్ళకే తెలియదు. విషయం తెలియకుండా బాగా కవర్ చేస్తున్నావ్ అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది.

మీ పరువు బజారున పెడతా 

నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ కేసు గురించి నాకు తెలీదు. మీ కొడుకుని వదిలేయమని స్టేషన్ కి వచ్చి చెప్తానని అంటుంది. ఎలాగైనా నా కొడుకు గంటలో బయటకు రావాలి లేదంటే నేను మళ్ళీ వస్తాను. కేసు పెట్టిన వాడి సంగతి, నీ వెనుక ఉన్న వీళ్ళ సంగతి తేలుస్తాను. మీ అందరి పరువు బజారుకి ఈడుస్తానని వార్నింగ్ ఇస్తుంది.

అనసూయ వెళ్లిపోగానే పారిజాతం దీప మీద మాటల దాడికి దిగుతుంది. దీప కార్తీక్ ఇంటికి వస్తుంది. నా భర్త మీద పోలీసు కేసు పెట్టింది మీరేనా అని నిలదీస్తుంది. నేనే పెట్టానని అంటాడు. ఎందుకు పెట్టారు, ఎవరిని అడిగి కేసు పెట్టారని నిలదీస్తుంది. వాడు నడి రోడ్డు మీద దీపని కొడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటానని అంటాడు.

కేసు వెనక్కి తీసుకోండి 

ఇలాగే వదిలేస్తే వాడు చంపేస్తాడని అంటే మాటలు పడటం కంటే చచ్చిపోవడం నయమని చెప్తుంది. మా అత్త ఇంటికి వచ్చి గొడవ చేసి గంటలో బయటకు రాకపోతే అందరి పరువు తీస్తానని బెదిరించింది. ఇప్పుడు కేసు వెనక్కి తీసుకోకపోతే మీ అత్తింటి వారి పరువు రోడ్డు మీద ఉంటుందని అంటుంది.

తనతో పాటు వచ్చి కేసు వెనక్కి తీసుకోమని దీప బతిమలాడుతుంది. వాళ్ళ భార్యాభర్తల విషయంలో జోక్యం చేసుకోవడానికి నీకేంటి సంబంధమని కాంచన కూడా తిడుతుంది. కూతురితో సహా రోడ్డు మీదకు లాగాడని కార్తీక్ ఆవేశంగా మాట్లాడతాడు.

మీరు ఏ సాయం చేయొద్దని భర్తని విడిపించమని దీప అడుగుతుంది. దీంతో కార్తీక్ తన వెంట వెళతాడు. జ్యోత్స్న కార్తీక్ విషయంలో సుమిత్రని నిలదీస్తుంది. బావ ఎంతగా మారిపోయాడో అర్థం చేసుకో అంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

టీ20 వరల్డ్ కప్ 2024