Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. దీపకు చుక్కలు చూపిస్తానని శపథం చేసిన జ్యోత్స్న.. మరదలు దగ్గర బుక్కైన కార్తీక్
Karthika deepam 2 serial today june 12th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ దీపకు ఫోన్ కొనిచ్చాడని తెలుసుకుని జ్యోత్స్న రగిలిపోతుంది. ఇక నుంచి దీపకు మిట్ట మధ్యాహ్నమే చుక్కలు చూపిస్తానని శపథం చేస్తుంది.
Karthika deepam 2 serial today june 12th episode: దీప ఫోన్ నుంచి శౌర్య కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. జ్యోత్స్న శౌర్య ఫోన్ మాట్లాడటం వింటుంది. ఫోన్ చాలా బాగుందని అనడం విని షాక్ అవుతుంది. శౌర్య ఫోన్ మాట్లాడుతుంటే వచ్చి లాగేసుకుంటుంది.
మరదలి దగ్గర బుక్కైన కార్తీక్
నీకు మీ అమ్మకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చెయ్యి. మీ అమ్మకు అసలే ఆత్మాభిమానం ఎక్కువ ఏది నాకు చెప్పదు సరేనా అంటుంది. జో కార్తీక్ ఏమంటున్నాడని శౌర్య అడుగుతుంది. దీంతో జ్యోత్స్న ఫోన్ శౌర్యకు ఇచ్చేస్తుంది.
అడుగుతుంటే మాట్లాడవ్ ఏంటని కార్తీక్ అంటే ఏం మాట్లాడావ్ ఇప్పటి వరకు ఫోన్ జో దగ్గర ఉంది ఇప్పుడే నాకు ఇచ్చిందని శౌర్య చెప్పడంతో షాక్ అవుతాడు. ఉన్న సమస్యలు చాలు అన్నట్టు మళ్ళీ కొత్తగా ఇది ఒకటా ఇప్పుడు ఏమనుకుంటుందో ఏమోనని తల పట్టుకుంటాడు.
కార్తీక్ కొనిచ్చాడు
దీప శౌర్యని కోప్పడుతుంది. కొత్త ఫోనా అమ్మ కొన్నాదా అని జ్యోత్స్న అంటే కాదు కార్తీక్ ఇచ్చాడు అని శౌర్య చెప్తుంది. కార్తీక్ బాబు ఇవ్వడం ఏంటి మనమే కొనుక్కున్నామని చెప్తుంది. నీకు కార్తీక్ ఫోన్ ఇవ్వడం నేను చూశానమ్మ అనేసరికి కానీ అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు కదాని సీరియస్ అవుతుంది.
మనలా పిల్లలు అబద్ధాలు చెప్పరని జ్యోత్స్న కోపంగా అంటుంది. దీప నిజం చెప్పడానికి చూస్తే వినిపించుకోదు. నిన్ను చెయ్యి పట్టుకుని నేనే కదా ఇంటికి తీసుకొచ్చాను థాంక్యూ సో మచ్ అనేసి కోపంగా వెళ్ళిపోతుంది. శౌర్యని కోపంగా ఇంట్లోకి తీసుకెళ్ళి ఫోన్ బిల్ చూపిస్తుంది. మీ కార్తీక్ బాబు దగ్గర నేను ఫోన్ కొనుక్కున్నానని చెప్తుంది.
ప్రమాణం చేయించాల్సిన అవసరం ఏంటి?
తప్పు నాదే వెళ్ళి జోకి చెప్తానని అంటే దీప ఆపుతుంది. సుమిత్ర పారిజాతం చేసిన పని గురించి సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటే దశరథ వస్తాడు. మన కూతురు విషయంలో ఆవిడ చొరవ ఏంటో అర్థం కావడం లేదు. ఇప్పుడు వాళ్ళ చేత ప్రమాణం చేయించాల్సిన అవసరం ఏంటి?
పెళ్లి అంటే ఇష్టం లేదని కార్తీక్ గాని జ్యోత్స్న కానీ చెప్పలేదు కదా. ఇప్పుడు కార్తీక్ ని ప్రమాణం చేయమన్నది అంటే నరసింహ కార్తీక్ మీద వేసిన నింద అందరూ నమ్ముతున్నారనే కదా. వచ్చే ముహూర్తంలో వాళ్లిద్దరికీ పెళ్లి చేయాలని ముందే అనుకున్నాం కదా.
ఆవిడ మనసులో కూడా ఇదే ఉంటే మనతో చెప్తే సరిపోతుంది కదా. ఇలా చేయడం వల్ల పిల్లల మనసులు బాధపడ్డాయి. మీరు ఏమైనా అనుకోండి అత్తయ్య చేసిన పని నాకు నచ్చలేదని చెప్తుంది. నాకు నచ్చలేదు కానీ ఏం చేస్తాం ఇలా చేస్తుందని తెలియదు. ఆవిడ పుట్టినరోజు అని రాత్రి నాన్న దగ్గర మాట తీసుకుంది. ఇలా అడుగుతుందని తెలియక నేను మాట ఇచ్చానని చెప్తాడు.
దీపకు దూరంగా ఉండు
జ్యోత్స్న విషయంలో కలగజేసుకోవద్దని అత్తయ్యకు గట్టిగా చెప్పాలని చెప్తుంది. నువ్వు అన్నది నిజమే జ్యోత్స్నను పిన్నికి దూరంగా ఉంచాలని అనుకుంటాడు. ఇక అనసూయ నరసింహను దీపకు దూరంగా ఉండమని చెప్తుంది. అది కనపడితే చాలు కత్తిపీట పట్టుకుని నరకడానికి వస్తున్నట్టు అనిపిస్తుందని చెప్తుంది.
అనసూయ ఎన్ని చెప్పినా కూడా నరసింహ వినిపించుకోడు. అది నా పెళ్ళాన్ని కొట్టిందని అంటాడు. కార్తీక్ దాని వెనుక ఉన్నంత కాలం దాన్ని ఏం చేయలేమని చెప్తుంది. జ్యోత్స్న కోపంగా పారిజాతం దగ్గరకు వచ్చి గట్టిగా అరుస్తుంది. బావకు దీపకు సంబంధం ఉందని చెప్తుంది.
శౌర్య దగ్గర ఫోన్ ఉంది అది బావ కొనిచ్చాడు. నీకు ఎలా తెలుసని అంటే శౌర్య కార్తీక్ మా అమ్మకు సర్ ప్రైజ్ ఇచ్చాడని చెప్పిందని చెప్తుంది. చిన్నప్పటి నుంచి బావ నీ మొగుడు అని సుప్రబాతంలా చెవిలో ఊది బావను నాకు మొగుడిని చేశారు. మీ సంతోషం కోసం ముహూర్తాలు పెట్టుకుని మూడు ముళ్ళు వేయించాలే కానీ నేను మాత్రం తాళి కట్టకుండానే బావకు పెళ్ళాన్ని అయ్యాను.
చుక్కలు చూపిస్తాను
ఇప్పుడు ఎవతో వచ్చి బావను ఎగరేసుకుని పోతాను అంటే ఊరుకుంటానా. మిట్ట మధ్యాహ్నం ఎండలో దానికి చుక్కలు చూపిస్తాను. బావకు నాకు పెళ్లి జరగాలి జరిగి తీరాలి రాసి పెట్టుకో జరిగేది ఇదేనని ఛాలెంజ్ చేస్తుంది. నీ స్పీడ్ చూసి మనవడికి బాండ్ బాజా అనుకున్నా దీప నీకు కూడా బాండ్ బాజా అని పారిజాతం సంబరపడుతుంది.
దీప జ్యోత్స్న పరిచయం గురించి ఆలోచిస్తుంది. అక్క అని ప్రేమగా పిలిచే దానివి ఇప్పుడు శత్రువు అయిపోయాను ఇదంతా పారిజాతం వల్లే అనుకుని దీప బాధపడుతుంది. ప్రమాణం చేయడానికి కార్తీక్ బాబు ఎందుకు అంత ఆలోచించారు. ఆయన మనసులో ఎవరైనా అమ్మాయి ఉన్నారా? లేదంటే జ్యోత్స్న అంటే ఇష్టం లేదా?
దీపకు అనుమానం
ఏది ఏమైనా వాళ్ళ పెళ్లి జరగాలి లేదంటే దానికి కూడా నేనే కారణం అంటుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన మనసు విప్పి మాట్లాడాలి కదాని అనుకుంటుంది. కడియం దీప ఫోన్ చూసి బాగుందని అంటాడు. ఎక్కడిదని అడిగితే ముందు కొనలేదని చెప్పి తర్వాత కొన్నానని చెప్తుంది.
దీప రోడ్డు మీద వెళ్తుంటే నరసింహ తనని ఆపుతాడు. ఇద్దరి మధ్య కాసేపు వాదులాట జరుగుతుంది. తొందర్లోనే నీ కూతురికి నిన్ను దూరం చేస్తానని అంటాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్