Karthika deepam 2 serial today: ప్రమాణం చేసిన కార్తీక్, చొక్కా పట్టుకుని నిలదీసిన జ్యోత్స్న.. పారు గేమ్ స్టార్ట్-karthika deepam 2 serial today june 10th episode karthik is upset as he fails to express his disinterest to marry jyotsn ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial Today: ప్రమాణం చేసిన కార్తీక్, చొక్కా పట్టుకుని నిలదీసిన జ్యోత్స్న.. పారు గేమ్ స్టార్ట్

Karthika deepam 2 serial today: ప్రమాణం చేసిన కార్తీక్, చొక్కా పట్టుకుని నిలదీసిన జ్యోత్స్న.. పారు గేమ్ స్టార్ట్

Gunti Soundarya HT Telugu
Jun 10, 2024 07:21 AM IST

Karthika deepam 2 serial today june 10th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్ననే పెళ్లి చేసుకుంటానని కార్తీక్ తో బలవంతంగా పారిజాతం ప్రమాణం చేయిస్తుంది. దీంతో షాక్ అయిపోతాడు. తనను ఇంత మోసం చేస్తావా అని పారును నిలదీస్తాడు.

కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 10వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 10వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

Karthika deepam 2 serial today june 10th episode: పారిజాతం తన పుట్టినరోజు వేడుకలో కార్తీక్ గురించి మాట్లాడుతుంది. . కార్తీక్, జ్యోత్స్న పెళ్లి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. వీళ్ళ గురించి మీరు అనుకునేది ఎప్పటికీ జరగదు. కార్తీక్ కి జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేస్తుంది. ఈ విషయం చెప్పడంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు.

కార్తీక్ కి జ్యోత్స్నకి పెళ్లి చేయరంట కదా 

థాంక్స్ పారు ఇన్నాళ్ల నా బాధను పోగొట్టావని అనుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ ఇంకొకసారి ఇలా మాట్లాడితే రెండు చెంపలు వాయిస్తానని శివనారాయణ తిడతాడు. నన్ను కాదు వాయించాల్సింది మన చుట్టాలను. ఇలా వాగింది నేను కాదు మన చుట్టాలు.

కార్తీక్, జ్యోత్స్నకి పెళ్లి అనుకున్నారు కానీ చేయరంట కదా అని చుట్టాలు అడుగుతున్నారు. వాళ్ళు అలా అనుకోవడానికి ఏం కారణాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ వాళ్ళు అనుకున్నది నిజం కాదు నేను అనుకున్నది నిజం కావాలంటే మీరు నా కోరిక తీర్చాల్సిందే అంటుంది.

నీకు నిజమని నిరూపించాల్సిన అవసరం లేదు. కానీ మేము ఇచ్చిన మాట నిజమని నిరూపించడానికి ఏం చేయాలో చెప్పమని శివనారాయణ అడుగుతాడు. వచ్చే ముహూర్తంలోనే కార్తీక్, జ్యోత్స్నకి పెళ్లి చేయాలని అదే తన కోరిక అని అడుగుతుంది.

కార్తీక్ కి షాక్ఇచ్చిన పారు 

పారిజాతం కోరిక విని కార్తీక్ షాక్ అవుతాడు. పెళ్లి చేస్తానని చెప్పాలని ఇంట్లో వాళ్ళని నిలదీస్తుంది. పారు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా అని కార్తీక్ అడుగుతాడు. నీ మనసులో మాట నేను అడుగుతున్నాను మనవడా అంటుంది.

వీళ్ళ పెళ్లి చేయాలని మాకు తొందరగా ఉందని సుమిత్ర చెప్తుంది. ఇప్పుడు నా కోరిక ఏంటంటే కార్తీక్ జ్యోత్స్నని పెళ్లి చేసుకుంటానని తన చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేయాలని పారిజాతం అడుగుతుంది. ఇప్పుడు నేను ఏం మాట్లాడిన రెండు కుటుంబాలు విడిపోయే ప్రమాదం ఉందని కార్తీక్ టెన్షన్ పడతాడు.

నేను రెడీ అంటూ జ్యోత్స్న చెయ్యి చాపుతుంది. చేతిలో చెయ్యి వేసి నిన్నే పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చెయ్యి మనవడా అంటుంది. కార్తీక్ పారిజాతం వైపు కోపంగా చూస్తాడు. చిన్న విషయాన్ని చాలా పెద్దది చేస్తున్నావని శివనారాయణ అడుగుతాడు.

నిన్ను కొట్టాలని ఉంది 

వాళ్ళ మనసులో భిన్నాభిప్రాయాలు ఉంటే ఎప్పుడో చెప్పి ఉంటారు కదా. ఇదేమి తీర్చలేని కోరిక కాదు. చాలా చిన్న విషయం. మనవడా మీ పారు కోసం ప్రమాణం చేయమని అడుగుతాడు. నువ్వు చేస్తున్న పనికి నిన్ను కొట్టాలని కోపంగా ఉందని కార్తీక్ తిట్టుకుంటాడు.

ఇష్టం లేని పని బలవంతంగా చేస్తున్నట్టు ఈయన మొహంలో నవ్వు లేదు ఏంటని దీప డౌట్ పడుతుంది. కార్తీక్ నిలబడి చూస్తూ ఉంటే పారిజాతం మనవడి చేతిని జ్యోత్స్న చేతిలో వేస్తుంది. సరిగా అదే టైమ్ కి శౌర్య తుమ్ముతుంది. వెంటనే పారిజాతం తిడుతుంది.

ప్రమాణం చేసిన కార్తీక్ 

చిన్నపిల్లలు దేవుడితో సమానమని అంటారు కదా లెక్కలోకి రాదని శివనారాయణ అంటాడు. వెంటనే పారిజాతం మళ్ళీ కార్తీక్ తో ప్రమాణం చేయిస్తుంది. జ్యోత్స్న చాలా ఎమోషనల్ అవుతుంది. కార్తీక్ మాత్రం చాలా ఇబ్బంది పడతాడు. తన కోరిక తీరిందని సంబరపడుతూ బర్త్ డే కేక్ కట్ చేస్తుంది.

కార్తీక్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీప కూడా టిఫిన్ సెంటర్ లో పని ఉందని వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా నిజం చెప్పమని జ్యోత్స్న కార్తీక్ ని నిలదీస్తుంది. నన్ను పెళ్లి చేసుకుంటానని చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేయడానికి నీ చెయ్యి ఎందుకు ముందురాలేదు.

గ్రానీ ప్రమాణం చేయిస్తే తప్ప నీ అంతట నువ్వు ప్రమాణం చేయలేవా? ఏదో తప్పు చేసినట్టు చేతిలో చెయ్యి వేయగానే వెనక్కి లాగేసుకున్నావ్ ఏంటని అడుగుతుంది. ఇప్పుడు తానెం మాట్లాడలేనని అంటాడు. కానీ ఈరోజు అసలు విషయం ఏంటో తెలియాలని నిలదీస్తుంది.

చొక్కా పట్టి నిలదీసిన జ్యోత్స్న 

నిజం చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదా అని జ్యోత్స్న కార్తీక్ కాలర్ పట్టుకుని అడుగుతుంది. పరిస్థితి ఇంతవరకు వచ్చిన తర్వాత నిజం చెప్పాలని అనుకుంటాడు. మా అమ్మ మీ నాన్న మనం పుట్టకముందే మనకు పెళ్లి చేశారు. అది అనుబంధం అనుకున్నారు కానీ మనకంటూ ఒక జీవితం ఉందని వాళ్ళు ఆలోచించలేదు.

నిన్ను నా భార్య అంటుంటే మరదలు కదా సరదాగా ఆట పట్టిస్తున్నారు అనుకున్నాను. లండన్ వెళ్ళిన తర్వాత పెళ్లి మీద ఒక క్లారిటీ వచ్చింది. నీ మీద ఉంది నాకు అభిమానమే కానీ పెళ్లి చేసుకునే ప్రేమ కాదు. నేను లండన్ నుంచి రాగానే నీకు ఆ విషయం చెప్పాలని అనుకున్నాను కానీ నేను చెప్పలేక నీతో చెప్పమని పారుకు చెప్పాను.

ఎంత పని చేశావ్ మనవడా 

కానీ పారు నీతో చెప్పలేదు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. నువ్వు బాధపడకుండా నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని అని వెనక్కి తిరిగే సరికి జ్యోత్స్న బదులు పారిజాతం ఉంటుంది. ఎంత పని చేశావ్ నువ్వు నిజం చెప్పడం మొదలుపెట్టినప్పుడే దాన్ని ఇక్కడ నుంచి పంపించేశానని చెప్తుంది.

నేను నిన్ను చాలా నమ్మాను కానీ నువ్వు నాకు నమ్మకద్రోహం చేశావు. జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు చాలా తెలివిగా నన్ను ఆపి ఆ బాధ్యత నువ్వు తీసుకున్నావ్. జ్యోత్స్న బర్త్ డేకి గులాబీ ఇచ్చినప్పుడే నీ మాటలు వేరు చేతలు వేరు అని అర్థం చేసుకోలేకపోయాను.

జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని తెలిసి కూడా ఎందుకు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చావు. అందరి ముందు ఎందుకు ప్రమాణం చేయించావని నిలదీస్తాడు. ఎందుకు ఇంత మోసం చేశావని అడుగుతాడు. దీన్ని మోసం అనరు మాట నిలబెట్టడం అంటుంది.

దీప నీకు ముందే తెలుసా లేదా?

నువ్వు జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటే నచ్చజెప్తే వింటావు అనుకున్నాను కానీ నీ మనసులో ఇంకొకరు ఉన్నారని అర్థం అయ్యింది. ఆరోజు నరసింహ ఇంటికి వచ్చి దీప గురించి నీ గురించి మాట్లాడితే నువ్వు ఏం చేశావ్. దీప చెప్పకుండానే దాని మొగుడి మీద కేసు పెట్టావు.

దీప ఇక్కడికి రాకముందే నీకు తనకు పరిచయం ఉందని నాకు తెలుసు. నువ్వు ముత్యాలమ్మ గూడెం జాతరకు గెస్ట్ గా వెళ్ళావా లేదా? దీపకు సైకిల్ ఇచ్చావా లేదా?మరి నీకు దీప ముందే తెలిసినప్పుడు ఈ ఇంటి దగ్గర తనని చూసినప్పుడు ఈమె ముందే తెలుసు అని ఎందుకు చెప్పలేదు?

ఎందుకు చెప్పలేదో నువ్వు చెప్పకపోయినా నేను ఆలోచించగలను అంటుంది. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావ్, ఇలాంటి లేనిపోని ఆలోచనలు మనసులో పెట్టుకుని దీపను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నావని అంటాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

 

Whats_app_banner