Karthika deepam 2 serial: కార్తీకదీపం 2 సీరియల్.. శౌర్య సేఫ్, నీ బిడ్డని దక్కకుండ చేస్తానని దీపకు నరసింహ వార్నింగ్-karthika deepam 2 serial today june 4th episode deepa furious as narsimha threatens to distance her from sourya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial: కార్తీకదీపం 2 సీరియల్.. శౌర్య సేఫ్, నీ బిడ్డని దక్కకుండ చేస్తానని దీపకు నరసింహ వార్నింగ్

Karthika deepam 2 serial: కార్తీకదీపం 2 సీరియల్.. శౌర్య సేఫ్, నీ బిడ్డని దక్కకుండ చేస్తానని దీపకు నరసింహ వార్నింగ్

Gunti Soundarya HT Telugu
Jun 04, 2024 07:30 AM IST

Karthika deepam 2 serial today june 4th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప ఇంటి దగ్గరే ఉందని పారిజాతం చెప్పడంతో అందరూ ఇంటికి వచ్చేస్తారు. కూతురిని చూసి దీప ఎమోషనల్ అవుతుంది.

కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 4వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 4వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today june 4th episode: దీప, కార్తీక్ రోడ్డు మీద శౌర్య కోసం వెతుకుతూ ఉంటారు. జ్యోత్స్న మాత్రం ఏం పట్టనట్టు ఉంటుంది. కూతురి కోసం దీప కుమిలి కుమిలి ఏడుస్తుంది. కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని కార్తీక్ అంటాడు.

రెండో భార్యతో శ్రీధర్ ట్రిప్

వద్దు నేను ఇప్పటికే ఒక సాక్షిని ఎప్పుడు పారిపోతానా అని పోలీసులు కాపలా కాస్తున్నారు. ఇది ఒక నాటకమని వాళ్ళు అంటే తట్టుకోలేనని ఏడుస్తుంది. కాంచన, శ్రీధర్ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు రెండు రోజుల నుంచి తేడాగా ఉన్నారు ఏమైనా చెప్పాలా అని కాంచన అడుగుతుంది.

ఏం లేదని అంటాడు. నేను వారం రోజులు బయటకు వెళ్తాను నామీద దిగులు పెట్టుకోకుండా మీ అన్నయ్య ఇంటికి వెళ్ళమని చెప్తాడు. ఎక్కడికని అంటుంది. కావేరీ, అమ్మాయిని తీసుకుని బయటకు వెళ్తున్నాను కానీ ఆ విషయం నీతో చెప్పలేను కదా అని అనుకుంటాడు.

నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారని అంటే ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళడం లేదు ఒకవేళ వెళ్తే బెంగ పెట్టుకోవద్దని చెప్తాడు. అర్జెంట్ గా కార్తీక్ పెళ్లి చేసి తర్వాత కావేరీ విషయం చెప్పాలి. వేరే వాళ్ళ ద్వారా ఈ విషయం తెలిస్తే మంచిది కాదని నిర్ణయించుకుంటాడు.

శౌర్య సేఫ్

మీకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇష్టం లేకపోతే నేనే వెళ్ళి నా బిడ్డ కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తానని కార్తీక్ అనేసరికి జ్యోత్స్న రగిలిపోతుంది. అయిన నాదే తప్పు ఈ ఊరు వచ్చి సరిదిద్దుకోలేని తప్పు చేశాను. వచ్చిన దగ్గర నుంచి అన్నీ అవమానాలు, దారుణమైన నిందలు వేశారు.

అవన్నీ నేను భరించాను భరిస్తాను కానీ ఇప్పుడు నా బిడ్డ అని ఏడుస్తుంది. నేను ప్రామిస్ చేసి చెప్తున్న శౌర్య ఎక్కడ ఉన్న తీసుకొచ్చి అప్పగించే బాధ్యత తనదని కార్తీక్ హామీ ఇస్తాడు. జ్యోత్స్నకి పారిజాతం ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారని అడుగుతుంది.

శౌర్య కనిపించకపోతే నేను దీప కార్తీక్ వెతుకుతున్నామని చెప్తుంది. శౌర్యని మీరు వెతకడం ఏంటి అది ఇంటి గుమ్మం దగ్గర ఉందని ఫోటో తీసి పంపిస్తుంది. వెంటనే బావ శౌర్య ఇంట్లోనే ఉంది ఫోటో కూడా పంపిందని చూపిస్తుంది. దీంతో దీప ఊపిరి పీల్చుకుంటుంది.

కూతురిని చూసి దీప ఎమోషనల్

దీప మేం వెళ్తాం మాకు పని ఉంది ఆటోలో వెళ్తావా అని జ్యోత్స్న అడుగుతుంది. అలాగే అని దీప వెళ్లబోతుంటే కార్తీక్ ఆపుతాడు. ఇప్పుడు తనని వదిలేయడం కరెక్ట్ కాదు నాకు శౌర్యని చూడాలని ఉందని చెప్తాడు. ఇంటి దగ్గర శౌర్య దీప కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.

దీప ఇంటికి రాగానే శౌర్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగలించుకుని ఏడుస్తుంది. నిన్ను తీసుకురావడానికి స్కూల్ కి వస్తానని చెప్పాను కదా నువ్వు ఎందుకు ఇంటికి వచ్చేశావ్ దారిలో నీకేమైన అయితే నువ్వు స్కూల్ దగ్గర కనిపించకపోయేసరికి నీకోసమే వెతుకుతున్నామని దీప కోపంగా అంటుంది.

గంటన్నర ముందే వెళ్లిపొమ్మన్నారు. బయట చాలా సేపు నిలబడ్డాను నీకు ఫోన్ చేద్దామని అంటే నీ దగ్గర ఫోన్ లేదు అంటుంది. కార్తీక్ వస్తే నీకు ఫోన్ చేద్దామని అంటే నీ నెంబర్ నాకు తెలియదు అంటుంది. ఎలా వచ్చావ్ అంటే కారులో అని చెప్తుంది.

బెదిరించిన నరసింహ

అప్పుడే నరసింహ కార్తీక్ కి ఫోన్ చేస్తాడు. నువ్వు నా పెళ్ళాన్ని లాక్కున్నావు. ఎందుకు నాకు ఫోన్ చేశావని కార్తీక్ కోపంగా అడుగుతాడు. బావ ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఫోన్ చేసింది దీప మొగుడు అని జ్యోత్స్న అర్థం చేసుకుంటుంది. నా పెళ్ళాంతో మాట్లాడటానికి నీకు ఫోన్ చేయాల్సి వస్తుంది. ఒకసారి ఫోన్ ఇవ్వు దానితో మాట్లాడి తర్వాత నీతో మాట్లాడతానని అంటాడు.

ఫోన్ ఇవ్వకపోతే ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తానని బెదిరిస్తాడు. ఏమైందని దీప అడుగుతుంది. పాప కనిపించిందా? ఇంటికి వచ్చావు నేనే ఎత్తుకుపోయాను అనుకున్నావా? బాగా టెన్షన్ పడినట్టు ఉన్నావ్. పాపను తీసుకెళ్లిన వ్యక్తి నా ఫ్రెండ్. కావాలనే పాపను ఎక్కించుకోమని చెప్పాను.

నీ బిడ్డ నీకు దక్కదు

నేను పెట్టబోయే టార్చర్ ఎలా ఉంటుందో నీకు రుచి చూపించాను. ఇక నుంచి నీ బలహీనతతో ఎలా ఆడుకుంటానో చూడు. నీ కూతురిని నీకు దూరం చేస్తాను. నువ్వు ఏడుస్తూ చూడటం తప్ప ఏం చేయలేవు. నీ బిడ్డ అయితే నీకు దక్కదు అని దీపకు వార్నింగ్ ఇస్తాడు.

దీప ఫోన్ ఇచ్చేసి కోపంగా వెళ్ళిపోతుంది. శౌర్యకు తోడుగా ఉంటానని కార్తీక్ వచ్చేసరికి జ్యోత్స్న రగిలిపోతుంది. ఎవరికైనా పెళ్లి అయిన తర్వాత పిల్లల బాధ్యతలు వస్తాయి నీకు పెళ్లి కాకుండానే బాధ్యత వచ్చిందని కార్తీక్ ని అవమానంగా మాట్లాడుతుంది.

జ్యోత్స్న రగిలిపోతుంటే పారిజాతం మరింత ఆజ్యం పోస్తుంది. దీప ఎక్కడ తగిలిందని అడుగుతుంది. దీప రోడ్డు పక్కన ఏడుస్తూ ఉంటే చూసి కారు ఆపింది నేనే అని చెప్తుంది. దీంతో పారిజాతం తిడుతుంది. దీప ఇక్కడ ఉన్నన్ని రోజులు నీకు ఈ టార్చర్ తప్పదు.

అంతటికీ కారణం మీ అమ్మే

మనం పంపించాలని అనుకుంటే సరిపోదు మీ అమ్మ పంపించాలి కదా. దీపను సొంత కూతురిలాగా చూసుకుంటుంది. అసలు దీనంతటికీ కారణం మీ అమ్మే అనేసరికి సుమిత్ర కోపంగా అత్తయ్య అని అరుస్తుంది. మీ మనవరాలికి చెప్పాల్సిన మాటలు ఇవేనా? తను అసలే చెడుగా ఆలోచిస్తుంటే తప్పని చెప్పాల్సింది పోయి అవే చెప్తున్నారు ఏంటని నిలదీస్తుంది.

గ్రాని ఏం పిట్ట కథలు చెప్పడం లేదు నా చుట్టూ జరుగుతుంది నాకు చెప్తుంది. బావతో నేను సరదాగా బయటకు వెళ్దామని అనుకున్నాను. శౌర్య కనిపించడం లేదని దీప ఏడుస్తుంటే కారులో ఎక్కించుకుని మేము వెతికాము. గ్రాని ఫోన్ చేస్తే ఇంటికి వచ్చేశాము.

దీపకు శౌర్య దొరికింది కానీ నాకే బావ దొరకడం లేదు. కలిసి కూర్చుని కప్పు కాఫీ తాగాలన్న ఏదో ఒక సమస్య. అన్నింటికీ ఒక్కటే కారణం దీప అని రగిలిపోతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

టీ20 వరల్డ్ కప్ 2024