Karthika deepam 2 serial today: కార్తీక్ చెల్లెలు ఎంట్రీ.. బావను పెళ్లి చేసుకోవడమే తన జీవిత లక్ష్యమన్న జ్యోత్స్న-karthika deepam 2 serial today june 11th episode karthik takes swapna to the hospital as shets injured ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial Today: కార్తీక్ చెల్లెలు ఎంట్రీ.. బావను పెళ్లి చేసుకోవడమే తన జీవిత లక్ష్యమన్న జ్యోత్స్న

Karthika deepam 2 serial today: కార్తీక్ చెల్లెలు ఎంట్రీ.. బావను పెళ్లి చేసుకోవడమే తన జీవిత లక్ష్యమన్న జ్యోత్స్న

Gunti Soundarya HT Telugu
Jun 11, 2024 07:58 AM IST

Karthika deepam 2 serial today june 11th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ చెల్లెలు ఎంట్రీ ఇస్తుంది. ఇక బావను పెళ్లి చేసుకోవడమే తన జీవిత లక్ష్యమని జ్యోత్స్న పారిజాతానికి తెగేసి చెప్తుంది.

కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 11వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 11వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today june 11th episode: దీప నీకు ముందే తెలుసు అనే విషయం ఎందుకు చెప్పలేదని పారిజాతం కార్తీక్ ని నిలదీస్తుంది. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావ్. ఇలాంటి లేనిపోని ఆలోచనలు మనసులో పెట్టుకుని దీపను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నావ్.

జ్యోత్స్నని పెళ్లి చేసుకోవాల్సిందే 

ఈరోజు పాయసంలో మందు కలిపినట్టు ఆరోజు బంటు గాడితో దీప బ్యాగ్ లో నువ్వే నెక్లెస్ పెట్టించావు. ఇవన్నీ ఆలోచిస్తుంటే జ్యోత్స్న మనసు చెడగొట్టింది కూడా నువ్వే అంటాడు. నేను కాదు నువ్వే అలా చేసింది. అందుకే ఏం జరిగినా మనవడు, మనవరాలికి పెళ్లి చేయాలని అనుకున్నానని చెప్తుంది.

అదే జరిగితే మా ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయని చెప్తాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు చేసిన తప్పు సరిదిద్దుకోమని చెప్తాడు. ఎట్టి పరిస్థితిలో జ్యోత్స్నని పెళ్లి చేసుకుని తీరాల్సిందేనని పారిజాతం ఖరాఖండిగా చెప్తుంది. నువ్వు ఇలాగే ఉంటే జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేస్తానని అంటాడు.

నువ్వు ఎవరిని మనసులో పెట్టుకుని ఆ మాట చెప్తున్నావో నేను అందరికీ చెప్తానని పారిజాతం కార్తీక్ ని బెదిరిస్తుంది. సుమిత్ర కూతురికి, కాంచన కొడుక్కి పెళ్లి జరుగుతుంది. ఇది ఏనాడో రాసిన రాత అని తెగేసి చెప్తుంది. అనసూయ రోడ్డు మీద వెళ్తూ కడియం హోటల్ దగ్గర ఆగుతుంది.

దీప హోటల్ కి అనసూయ 

దీప చేసిన పనికి ఆ శోభ తినడం లేదు ఎవరిని తిననివ్వడం లేదని అనుకుని హోటల్ లోకి వెళ్తుంది. అనసూయ తింటూ ఉండగా దీప వస్తుంది. ఇది దీప చేసిన ఉప్మాలాగా ఉందే అనుకుంటుంది. దీప అనసూయను చూస్తుంది. ఈ ఉప్మా చేసింది ఎవరు అని కడియాన్ని అడుగుతుంది.

దీపను చూసి అనసూయ భయపడుతుంది. దీప కత్తిపీట పట్టుకుని తన వెంట పడుతున్నట్టుగా ఊహించుకుంటుంది. నువ్వు పని చేస్తున్న హోటల్ ఇదనీ తెలియక వచ్చానని వెళ్లిపోతానని అంటే వద్దు కూర్చుని తినమని చెప్తుంది. డబ్బులు ఇవ్వబోతుంటే వద్దని చెప్తుంది.

పారిజాతం జ్యోత్స్న దగ్గరకు వస్తే బావ ఏం చెప్పాడు. నాతో ఏదో చెప్పాలని అనుకునే టైమ్ కి కరెక్ట్ గా నువ్వు వచ్చి నన్ను పంపించావు అని జ్యోత్స్న నిలదీస్తుంది. పెళ్లి ఇప్పుడే వద్దు రెస్టారెంట్ అయిన తర్వాత చేసుకుంటానని చెప్పాడని అబద్ధం చెప్తుంది.

నీది నాది ప్రత్యేక బంధం 

కార్తీక్ కి నువ్వు అంటే ఇష్టం రెస్టారెంట్ కంప్లీట్ అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మీ బావ ఎక్కడ మాట మారుస్తాడోనని భయపడుతున్నావా? మీ ఇద్దరి పెళ్లి ముహూర్తాలు పెట్టించడం కోసమే ఈరోజు నేను పుట్టినరోజు చేసుకున్నాను.

మీ ఇద్దరి పెళ్లి చేయడమే నా జీవిత లక్ష్యం. నేను దీని కోసమే బతుకుతున్నానని పారిజాతం ఆవేశంగా మాట్లాడుతుంది. ఎందుకు ఈ పెళ్ళిని ఇంత సీరియస్ గా తీసుకున్నావని జ్యోత్స్న అడుగుతుంది. ఎందుకంటే ఈ ఇంట్లో నీది నాది ప్రత్యేకమైన బంధం. నువ్వు నా సొంతమని అంటుంది.

నీ సొంతం ఏంటని జ్యోత్స్న అనుమానంగా అడుగుతుంది. మీ ఇద్దరి పెళ్లి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని కవర్ చేస్తుంది. నీకే కాదు నాకు ఈ పెళ్లి జీవిత లక్ష్యమే. దీప రావడానికి ముందు బావ వేరు ఇప్పుడు వేరు. నరసింహ వచ్చిన తర్వాత బావ మీద అనుమానం మొక్కలాగే ఉండేది.

అదే నా జీవిత లక్ష్యం 

దానికి నీళ్ళు పోసి పోసి నువ్వే చెట్టును చేశావు. నేను తెలుసుకోవాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న మబ్బులు విడిపోయాయి. ఏం జరిగినా బావ నా మొగుడు. ఏ చెయ్యి అయితే నా చేతిలో చెయ్యి వేయడానికి ఆలోచించాడో ఆ చేత్తోనే నా మెడలో మూడు ముళ్ళు వేయించుకుంటాను.

ఈ పెళ్ళిని బావ కూడా ఆపలేడని తేల్చి చెప్తుంది. ఇక నీకు తిరుగులేదు. మనవడా మనవరాలు మంచి ఫామ్ లోకి వచ్చింది. నీకు బ్యాండ్ బాజా బారత్ మోగాల్సిందేనని పారిజాతం విజిల్ వేసి మరీ సంబరపడుతుంది. కార్తీక్ పారిజాతం మాటలు తలుచుకుని రగిలిపోతుంది.

నీతో కాకుండా డైరెక్ట్ గా అత్తతో చెప్పి ఉంటే ప్రాబ్లం ఉండేది కాదని అనుకుంటాడు. రోడ్డు మీద ఒక అమ్మాయి ఒకతన్ని ఢీ కొట్టేస్తుంది. అతడు ఆ అమ్మాయిని కావాలని డబ్బులు డిమాండ్ చేస్తాడు. నేను ఇవ్వనని అంటే అతడు బెదిరిస్తాడు. తన కాలు ఇరిగిపోయిందని డ్రామాలు ఆడతాడు.

కార్తీక్ చెల్లి ఎంట్రీ 

కార్తీక్ అతడి నోరు మూయించి పంపించేస్తాడు. అమ్మాయి కాలికి దెబ్బ తగిలి బ్లేడ్ వస్తుంటే కార్తీక్ తన ఖర్చిఫ్ తీసి కడతాడు. తనని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయమని అడుగుతుంది. సాయం చేసినందుకు అందరికీ డబ్బులు ఇస్తాను అంటుంది. ఇంటికి ఫోన్ చేసి జరిగింది మీ డాడీకి చెప్పి హాస్పిటల్ కు రమ్మని కార్తీక్ చెప్తాడు. నవ్వుతుంది.

మా డాడీ వెరీ బిజీ నేను ఫోన్ చేస్తేనే లిఫ్ట్ చేయరు నువ్వు చేస్తే లిఫ్ట్ చేస్తారా అంటుంది. దీప ఇంటికి వస్తుంది. ఫోన్ టేబుల్ మీద పెడితే శౌర్య దాన్ని తీసుకుని కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. శౌర్య ఫోన్ మాట్లాడటం జ్యోత్స్న చూస్తుంది.అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది. 

టీ20 వరల్డ్ కప్ 2024