తెలుగు న్యూస్ / ఫోటో /
IPL 2025 Mega Auction: ఐపీఎల్ వేలంలో ఈ ఐదుగురు ప్లేయర్స్ పంట పండింది.. అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా..
- IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో కొందరు అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ పంట పండింది. వీళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా.. కోట్లు పలికి ఆశ్చర్య పరిచారు.
- IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో కొందరు అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ పంట పండింది. వీళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా.. కోట్లు పలికి ఆశ్చర్య పరిచారు.
(1 / 8)
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. నేహాల్ వధేరా నుండి నమన్ ధీర్ వరకు చాలా మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కోటీశ్వరులుగా మారారు. మరి వీళ్లలో టాప్ 7 ప్లేయర్స్ ఎవరో చూడండి.
(2 / 8)
రసిక్ సలాందార్ - ఆర్సీబీ: ఐపీఎల్ 2025 వేలంలో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా రసిక్ సలాందార్ నిలిచాడు. రూ.30 లక్షల బేస్ ప్రైస్ ఉన్న రసిక్ ను ఆర్సీబీ రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది.
(3 / 8)
నమన్ ధీర్ - రూ.5.25 కోట్లు (ముంబై ఇండియన్స్) - ఐపీఎల్ లో పెద్దగా అవకాశాలు దక్కని నమన్ ధీర్ పై ముంబై ఇండియన్స్ నమ్మకం ఉంచింది. మెగా వేలంలో బేస్ ప్రైస్ రూ.30 లక్షలు. అతన్ని దక్కించుకోవడానికి ఆర్సీబీ, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ పోటీ పడ్డాయి. కానీ ముంబై అతన్ని రూ.5.25 కోట్లకు కొనుగోలు చేయగలిగింది.
(4 / 8)
అబ్దుల్ సమద్ - రూ.4.20 కోట్లు - ఎల్ఎస్జీ: 2020 నుంచి 2024 వరకు సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన అబ్దుల్ సమద్ ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.4.20 కోట్లకు కొనుగోలు చేసింది.
(5 / 8)
నేహాల్ వధేరా - రూ.4.20 కోట్లు (పంజాబ్ కింగ్స్): గత రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన నేహాల్ వధేరా రెండుసార్లు రూ.20 లక్షలు మాత్రమే పొందాడు. కానీ ఈసారి అతను జాక్ పాట కొట్టాడు. అతన్ని పంజాబ్ కింగ్స్ రూ.4.20 కోట్లకు కొనుగోలు చేసింది.
(6 / 8)
అశుతోష్ శర్మ - రూ.3.80 కోట్లు - ఢిల్లీ క్యాపిటల్స్: పంజాబ్ కింగ్స్ తరఫున 11 మ్యాచ్ లలో 189 పరుగులు చేసిన అశుతోష్ కు 167కు పైగా స్ట్రైక్ రేట్ ఉంది. ఫినిషర్ పాత్రను పోషించిన అశుతోష్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.3.80 కోట్లకు కొనుగోలు చేసింది. బేస్ ప్రైస్ రూ.30 లక్షలు.
(7 / 8)
రఘువంశీ - రూ.3 కోట్లు (కోల్‌కతా నైట్ రైడర్స్): ఐపీఎల్ 2024లో 155కు పైగా స్ట్రైక్ రేట్ తో 163 పరుగులు చేసిన అంగ్‌క్రీష్ రఘువంశీని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇతర గ్యాలరీలు