Sayani Gupta Kiss: డైరెక్టర్ కట్ చెప్పినా అతడు కిస్ ఇవ్వడం ఆపలేదు: బోల్డ్ నటి కామెంట్స్ వైరల్
Sayani Gupta Kiss: డైరెక్టర్ కట్ చెప్పినా ఓ నటుడు తనకు కిస్ ఇస్తూనే వెళ్లాడని చెప్పింది పలు వెబ్ సిరీస్ లలో బోల్డ్ పాత్రలు పోషించిన సయానీ గుప్తా. స్క్రీన్ పై శృంగార సన్నివేశాలు చేయడంపై తన అనుభవాన్ని ఆమె వివరించింది.
Sayani Gupta Kiss: సయానీ గుప్తా.. ఫోర్ మోర్ షాట్స్ లాంటి వెబ్ సిరీస్ లలో రెచ్చిపోయి నటించిన బోల్డ్ నటి. పొట్టి పొట్టి డ్రెస్ లు, లిప్ లాక్ లతో ఆమె చెలరేగిపోయింది. అయితే స్క్రీన్ పై ఇలాంటి సీన్లు చేయడంపై తాజాగా రేడియో నషాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది. ఓ నటుడు డైరెక్టర్ కట్ చెప్పినా తనకు కిస్ ఇవ్వడం ఆపలేదని ఈ సందర్భంగా సయానీ చెప్పడం విశేషం.
అలా చేయడం పద్ధతి కాదు: సయానీ
సయానీ గుప్తా తన కెరీర్లో చాలా శృంగార సన్నివేశాల్లో నటించింది. బోల్డ్ పాత్రలు ఎన్నో పోషించినా.. చెప్పుకోదగిన స్థాయిలో ఆమెకు పేరు రాలేదు. అయితే ఇలాంటి సీన్లు చేస్తున్నప్పుడు సహ నటుల ప్రవర్తన ఒక్కోసారి హద్దు మీరుతుందని రేడియో నషాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సయానీ చెప్పింది.
"శృంగారం గురించి నేను ఓ పుస్తకం రాయగలను. ఇంటిమసీ కోఆర్డినేటర్ అనే ఓ వృత్తి మొత్తానికి ఇండియాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆ వృత్తిలో ఉన్న వారితో కలిసి పని చేశాను. సెక్స్ సీన్లు చేయడం చాలా ఈజీ.. ఎందుకంటే అది టెక్నికల్ విషయం. అయితే కొంతమంది దానిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. నాకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. ఓ నటుడు డైరెక్టర్ కట్ చెప్పిన తర్వాత కూడా కిస్ ఇస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ ఈ ప్రవర్తన సరికాదు" అని సయానీ చెప్పింది.
సెట్‌లో నటుల సేఫ్టీ గురించి..
ఇక సెట్‌లో నటుల సేఫ్టీ గురించి కూడా ఇదే ఇంటర్వ్యూలో సయానీ స్పందించింది. ఫోర్ మోర్ షాట్స్ షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ ఘటనను వివరించింది. బీచ్ లో ఓ పొట్టిడ్రెస్ తో పడుకుని ఉండే సీన్ అది. "నేను చాలా అసౌకర్యంగా ఫీలయ్యాను. ఎందుకంటే నా ముందు 70 మంది వరకూ మగవాళ్లు ఉన్నారు. ఒక్కరు కూడా నా పక్కన లేరు.
సిబ్బంది కూడా ఎక్కువగా లేరు. కనీసం ఒక్కరైనా ఓ శాలువా పట్టుకొని నా పక్కన నిల్చొంటే బాగుంటుందని అనిపించింది. చాలాసార్లు ఎవరికీ నటీనటుల సేఫ్టీ గురించి పట్టదు" అని సయానీ చెప్పింది. సయానీ ఈ మధ్యే రొమాంటిక్ కామెడీ మూవీ ఖాబోంకా ఝమేలా అనే మూవీలో కనిపించింది. ఈ మూవీ జియో సినిమాలో రిలీజైంది.